Songs sorted by number of likes. 1604 songs total.
ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా / యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా / ఓ సంఘమా వినుమా / రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో / వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో / ఆనంద తైల సుగంధాభిషేకము (2) / పొందితినే యేసునందు (2) ||ఓ సంఘమా|| / క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెనని / స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ / మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2) / సహియింతువా తీర్పునాడు (2) ||ఓ సంఘమా|| / చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు / శ్రీకర గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని / గుర్తించుచుంటివా క్రియలను గంటివా (2) / సజీవముగా నున్నావా (2) ||ఓ సంఘమా|| / చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగును / నులివెచ్చని స్థితి నీకుండిన – బయటకు ఉమ్మి వేయబడుదువేమో / నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో (2) / ఆసక్తితో రక్షణ పొందుమా (2) ||ఓ సంఘమా||
ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా / బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా.. / ఓ బాటసారి ఓహో బాటసారి / జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా / గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుంది / నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| / పుట్టగానే తొట్టెలో వేస్తారు / గిట్టగానే పెట్టెలో మూస్తారు / జాగు చేయక కాటికి మోస్తారు / ఆరడుగుల గుంటలో తోస్తారు ఆ అ ఆ. ఆ.. (2) / బ్రతుకు మూల్యమింతే – మనిషికి ఉన్న విలువంతే (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| / ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు / ఏడిపిస్తూ సమాధికి పోతావు / కూడబెట్టినవి మోసుకు పోలేవు / ఆశించినవేవి నీ వెంటారావు ఓ ఒ ఓ..ఓ.. (2) / జీవిత సారము ఇంతే – మనిషి బ్రతుకు భావము అంతే (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| / మరణము ఒక నిద్ర యేసునందు / అంతము అది కాదు క్రీస్తునందు / మృతులు లేచుట స్థిరము యేసునందు / నిత్య జీవము వరము క్రీస్తునందు ఆ అ ఆ.. ఆ.. (2) / నేడే రక్షన సమయము – ఇక ఆలసించిన నరకము (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా||
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము / ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు|| / అగమ్య ఆనందమే హృదయము నిండెను / ప్రభుని కార్యములు గంభీరమైనవి / ప్రతి ఉదయ సాయంత్రములు / స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు|| / సంకట సమయములో సాగలేకున్నాను / దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా / వింటినంటివి నా మొర్రకు ముందే / తోడునుందునంటివి (2) ||ఓ యేసు|| / కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు / పచ్చిక బయలులో పరుండ జేయును / భోజన జలములతో తృప్తి పరచు / నాతో నుండునేసు (2) ||ఓ యేసు|| / దేవుని గృహములో సదా స్తుతించెదనూ / సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ / స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు / హల్లేలూయా ఆమేన్ (2) ||ఓ యేసు||
ఓ మానవా.. నిజమేదో ఎరుగవా / ఓ మానవా.. ఇకనైనా మారవా / మన పాపములను క్షమియించుటకే / సిలువ మరణము పొందెనని (2) / గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2) / ఈ దినమే అనుకూలం… / లేదిక వేరే ఏ సమయం (2) / నిజమేదో తెలియకనే / చనిపోతే నీ గతి ఏమి? (2) ||ఓ మానవా|| / సిలువను గూర్చిన శుభ వార్త / వెర్రితనముగా ఉన్నదా? / దేవుని శక్తని తెలుసుకొని / ప్రభు మార్గమును చేరెదవా (2) ||ఈ దినమే|| / ప్రయాసముతో భారము మోసే / నిన్నే దేవుడు పిలిచెనుగా / ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద / వేగిరమే పరుగిడి రావా (2) ||ఈ దినమే|| / నీ ధనము నీ ఘనము / నీ సర్వస్వము చితి వరకే / అర్పించుము నీ హృదయమును / (నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2) ||ఈ దినమే||
ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు / చెయి దాటిపోయిన స్థితులైననూ – అసలోడిపోనివ్వడు / ఓడిపోనివ్వడు – ఓడిపోనివ్వడు (2) / ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు / చెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు|| / పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగా / ధైర్యం ప్రభు మనలో నింపెగా / పౌలు లాగా సాగాలిగా (2) / గురి యొద్దకే నీ ప్రయాణము / ఉన్నత పిలుపునకు బహుమానము (2) / సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు|| / నా అన్న వారే కాదనగా / రక్త సంబంధులై వెల కట్టారుగా / బానిసలుగా చేసి అమ్మారుగా / యోసేపును చూసాడుగా (2) / తోడుండెనన్న వాగ్ధానము / రాజుల యెదుటే తనకు సన్మానము / మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2) / దాటిపోడెన్నడు – దాటిపోడెన్నడు (2) / దీన స్థితిలో మనమున్ననూ – దాటిపోడెన్నడు / నవ్వుల పాలైన రోజైననూ – దాటిపోడెన్నడు (2) ||ఓడిపోనివ్వడు||
ఒక చేతిలో కర్ర / ఒక చేతిలో గొర్రె (2) / చేసేటి చేతులలోన / మేకులు నాటిరి నరులు (2) / కారింది నీదు రక్తం కాలువలై పారే / చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే ||ఒక చేతిలో|| / నడిచేటి కాళ్ళలలోన / మేకులు నాటిరి నరులు (2) ||కారింది|| / కిరీటంబు తెచ్చిరి / తలపైన పెట్టిరి (2) ||కారింది|| / సిలువను తెచ్చిరి / భుజం పైన పెట్టిరి (2) ||కారింది|| / బల్లెంబు తెచ్చిరి / ప్రక్కలోన పొడచిరి (2) ||కారింది||
ఒక దివ్యమైన సంగతితో / నా హృదయము ఉప్పొంగెను (2) / యేసు రాజని నా ప్రియుడని / ప్రియ స్నేహితుడు క్రీస్తని ||ఒక దివ్యమైన|| / పదివేల మందిలో నా ప్రియుడు యేసు / దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2) / తన ప్రేమ వేయి నదుల విస్తారము (2) / వేవేల నోళ్లతో కీర్తింతును (2) ||ఒక దివ్యమైన || / పండ్రెండు గుమ్మముల పట్టణములో / నేను నివాసము చేయాలని (2) / తన సన్నిధిలో నేను నిలవాలని (2) / ప్రభు యేసులో పరవశించాలని (2) ||ఒక దివ్యమైన ||
ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా / కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా (2) / ఒంటరైన వేళలో – జంటగా నేనుందునని / అండ లేని వేళలో – కొండగా నిలుతునని (2) / అభయమునిచ్చిన నా యేసయ్యా / అండగ నిలిచిన నా యేసయ్యా / యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా.. ||ఒక క్షణమైన||
ఒక క్షణమైనా నిన్ను వీడి / ఉండలేనయ్య నా యేసయ్యా (2) / యేసయ్యా యేసయ్యా / యేసయ్యా యేసయ్యా (2) ||ఒక క్షణమైనా|| / నశియించిపోతున్న నన్ను / బ్రతికించినావయ్యా యేసు / కృశించిపోతున్న నాలో / వేంచేసినావయ్యా యేసు (2) / నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా / నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా ||యేసయ్యా|| / మతిలేక తిరిగిన నన్ను / నీ దరి చేర్చినావయ్యా యేసు / శ్రమ చేత నలిగిన నాకు / వరమిచ్చినావయ్యా యేసు (2) / నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా / నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా ||యేసయ్యా||
ఒక వరమడిగితిని యేసయ్యా / నీలా ఉండాలని – మండుచుండాలని / నీలా ఉండాలని – మండుచుండాలని (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఒక వరమడిగితిని|| / నాలో నేరము స్థాపించగలరా / ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో (2) / నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు / నీ మార్గములలో నడిపించవా (2) ||ఒక వరమడిగితిని|| / సర్వ సృష్టికి సర్వాధికారి / తల వాల్చుటకును స్థలమింత లేదా (2) / నేను లోకాశ విడచి పైనున్నవాటి / గురి కలిగి వెదకి పొందాలని (2) ||ఒక వరమడిగితిని|| / తండ్రిని విడచి పారమును వీడి / నన్ను సమీపించినావు (2) / నేను కలిగున్నదంత నీ పాదాల చెంత / అర్పించి నీ చెంత చేరాలని (2) ||ఒక వరమడిగితిని|| / దేవుని చిత్తము సంపూర్తి చేయగ / సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు (2) / నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో / నీ సాక్షిగా జీవించాలని (2) ||ఒక వరమడిగితిని||
ఒకని తల్లి ఆదరించునట్లు / నను ఆదరించిన నా దేవుడు (2) / హీనుడనైనా బలహీనుడనైనా / కురూపినైనా కఠినుడనైనా (2) ||ఒకని|| / ఒకసారి నేను నీ మందనుండి / నే తప్పిపోయిన వేళ (2) / నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2) / నీ చంకపెట్టితివా యేసయ్యా (2) ||ఒకని|| / నీ సన్నిధినుండి నే దూరమవగా / చిక్కాను దొంగ చేతిలోన (2) / నను దోచిపోగా నను దాటిపోగా (2) / బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2) ||ఒకని||
ఒకసారి నీ స్వరము వినగానే / ఓ దేవా నా మనసు నిండింది / ఒకసారి నీ ముఖము చూడగానే / యేసయ్య నా మనసు పొంగింది (2) / నా ప్రతి శ్వాసలో నువ్వే / ప్రతి ధ్యాసలో నువ్వే / ప్రతి మాటలో నువ్వే / నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి|| / నీ సిలువ నుండి కురిసింది ప్రేమ / ఏ ప్రేమ అయినా సరితూగునా (2) / నీ దివ్య రూపం మెరిసింది ఇలలో / తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి|| / ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా / బ్రతికించు మమ్ములను నీ కోసమే (2) / తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం / నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి||