Songs sorted by number of likes. 1604 songs total.
ఒకే ఒక మార్గము – ఒకే ఆధారము / ఒకే పరిహారము / లేదు వేరే మార్గం – క్రీస్తేసే మార్గం – (2) / విడువుము నీ మార్గం ||ఒకే ఒక|| / లోకం మాయరా – పాపం వీడరా (2) / నీ హృదయమెంతో బలహీనమంతా / పెడ దారి చూపురా (2) / పరికించి చూడుమా ||ఒకే ఒక|| / రక్తం చిందెరా – సిలువలో చూడరా (2) / నీ పాపములకు ప్రభు యేసు రక్తం / పరిహారమాయెరా (2) / క్షమ భిక్ష వేడరా ||ఒకే ఒక|| / సమయం లేదురా – సత్యమే సోదరా (2) / రారాజు త్వరలో రాబోవుచుండె / రక్షణను కోరుమా (2) / రయముగను చేరుమా ||ఒకే ఒక||
ఒక్కడే యేసు ఒక్కడే / ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే (2) / మహాదేవుడు మహిమోన్నతుడు / లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| / పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే / పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే (2) / జీవమార్గమై సత్యదైవమై / మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| / అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే / అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే (2) / ఆదరించి ఆశ్రయమిచ్చి / అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| / నిత్యమూ ప్రేమించువాడు యేసు ఒక్కడే / నిత్యా శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే (2) / నీ వేదనలో నీ బాధలలో / నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| / మరణము గెలిచినవాడు యేసు ఒక్కడే / మరల రానున్నవాడు యేసు ఒక్కడే (2) / పరిశుద్దులను ఆ పరమునకు / కొనిపోవువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||
ఒంటరితనములో తోడువై / నాతో నడచిన నా స్నేహమై / ఎడారిలో మార్గమై / చీకటి బ్రతుకులో వెలుగువై / మరువగలనా నీ ప్రేమ నేను / విడువగలనా నీ తోడు నేను / లోకముతోనే ఆనందించిననూ / నీ ప్రేమతో నను మార్చినావు / నా యేసయ్యా.. నా రక్షకా / నను కాచిన వాడా నీవేనయ్యా (2) / ఓటమిలో నా విజయమై / కృంగిన వేళలో ఓదార్పువై / కొదువలో సమృద్ధివై / నా అడుగులో అడుగువై
ఒంటరివి కావు ఏనాడు నీవు / నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2) / ఆలకించవా ఆలోచించావా / ఆనందించవా (2) ||ఒంటరివి|| / వెలివేసారని చింతపడకుమా / ఎవరూ లేరని కృంగిపోకుమా / ఒంటరితనమున మదనపడకుమా / మంచి దేవుడు తోడుండగా (2) / ఆత్మహత్యలు వలదు / ఆత్మ ఆహుతి వలదు (2) ||ఆలకించవా|| / బలము లేదని భంగపడకుమా / బలహీనుడనని బాధపడకుమా / ఓటమి చూచి వ్యసనపడకుమా / బలమైన దేవుడు తోడుండగా (2) / నిరాశ నిస్పృహ వద్దు / సాగిపోవుటే ముద్దు (2) ||ఆలకించవా||
ఊహకు అందని కార్యముల్ / ఊహించని రీతిలో నాకై చేసిన దేవా / ఊహకు అందని వేళలో / ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా / ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ / నీదు నామ గీతము నాదు జీవితాంతము / కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ||ఊహకు|| / కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకు / ఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2) / అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెను / అద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యము / అసాధ్యమైనదేది నీకు లేనే లేదు / ఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2) ||ఉత్సహించి|| / బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగా / ఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగా / కనుపాప లాగ నన్ను కాచే దైవం నీవు / నడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు (2) ||ఉత్సహించి||
ఊహించలేనయ్యా వివరించలేనయ్యా / ఎనలేని నీ ప్రేమను (2) / నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2) / తరియించు వరమే దొరికెను (2) ||ఊహించ|| / నా మనసు వేదనలో – నాకున్న శోధనలో / ఉల్లాసమే పంచెను / ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో / మధురామృతమునే నింపెను (2) / అనాథయిన నను వెదకెను / ప్రధానులలో ఉంచెను (2) ||ఊహించ|| / నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో / నీ ప్రేమ రుజువై నిలిచెను / వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో / నా హృదయమే కరిగెను (2) / ఇది నీ ప్రేమకే సాధ్యము / వివరించుట నాకసాధ్యము (2) ||ఊహించ||
ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు / కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2) / దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు / ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు / ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే / కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము ||ఊహించలేని|| / ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం / ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2) / కలవాలి హృదయాలు ఒకటై / పండాలి నూరేళ్లు ఇకపై (2) / వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ ||ఊహించలేని|| / దేవుని సముఖములో బ్రతకాలి మీరు / మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2) / లోబడి ఉండాలి వధువు / ప్రేమను పంచాలి వరుడు (2) / దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి ||ఊహించలేని||
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు / ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా (2) / ఎడారి దారిలోన – కన్నీటి లోయలోన (2) / నా పక్షమందు నిలిచే నా ముందురే నడిచే / నీ శక్తినే చాట నన్నుంచెనే చోట / నిన్నెరుగుటే మా ధనం / ఆరాధనే మా ఆయుధం / ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుచున్నా / ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా (2) / నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా / నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా (2) ||ఊరుకో|| / ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు / అన్యాయము చేయుట అసంభవమేగా (2) / వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు / దుష్కార్యము చేయుట అసంభవమేగా (2) ||ఊరుకో|| / అవరోధాలెన్నో నా చుట్టు అలుముకున్నా / అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా (2) / యెహోవా సెలవిచ్చిన ఒక్కమాటయైనను / చరిత్రలో ఎన్నటికీ తప్పియుండలేదుగా (2) ||ఊరుకో||
ఓరన్న… ఓరన్న / యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న / యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా / యేసే ఆ దైవం చూడన్నా ||ఓరన్న|| / చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా / పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2) / అద్వితీయుడు ఆదిదేవుడు / ఆదరించును ఆదుకొనును (2) ||ఓరన్న|| / పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా / నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా (2) / పరిశుద్దుడు పావనుడు / ప్రేమించెను ప్రాణమిచ్చెను (2) ||ఓరన్న|| / సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా / మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న (2) / మహిమ ప్రభూ మృత్యుంజయుడు / క్షమియించును జయమిచ్చును (2) ||ఓరన్న||
పాడనా మౌనముగానే స్తుతి కీర్తన / చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2) / యేసయ్యా నీతో సహజీవనము / నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే (2) ||పాడనా|| / ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే / నీ రక్తాభిషేకము కడిగెనే / నా ప్రాణాత్మ శరీరమును (2) / నా విమోచన గానము నీవే / నా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా|| / దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే / నీ ప్రశాంత పవనాలు అణచెనే / నా వ్యామోహపు పొంగులన్నియు (2) / నా ఓదార్పు నిధివి నీవే / నా ఆనంద క్షేత్రము నీవే (2) ||పాడనా|| / నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని / నీ తైలాభిషేకము నిండెనే / నా అంతరంగమంతయును (2) / నా మానస వీణవు నీవే / నా ఆరాధన పల్లకి నీవే (2) ||పాడనా||
పాడెద దేవా – నీ కృపలన్ / నూతన గీతములన్ / స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2) / భూమి పునాదులు వేయకముందే / యేసులో చేసితివి (2) / ప్రేమ పునాదులు వేసితివి / దీనుని బ్రోచితివి – ఈ దీనుని బ్రోచితివి (2) ||పాడెద|| / ప్రవిమల రక్తము కలువరి సిలువలో / కలునకు నిచ్చితివి (2) / ప్రేమ కృపా మహదైశ్వర్యములతో / పాపము తుడిచితివి – నా పాపము తుడిచితివి (2) ||పాడెద|| / పాపము శాపము నరకపు వేదన / మరి తొలగించితివి (2) / అపరాధములచే చచ్చిన నన్ను / ధర బ్రతికించితివి – నన్ను బ్రతికించితివి (2) ||పాడెద|| / దేవుని రాజ్యపు వారసుడనుగా / క్రీస్తులో చేసితివి (2) / చీకటి రాజ్యపు శక్తుల నుండి / నను విడిపించితివి – చెర నను విడిపించితివి (2) ||పాడెద|| / ముద్రించితివి శుద్ధాత్మతో నను / భద్రము చేసితివి (2) / సత్యస్వరూప నిత్యనివాసి / సొత్తుగా చేసితివి – నీ సొత్తుగా చేసితివి (2) ||పాడెద|| / అన్యుడనై నిను ఎరుగక యున్నను / ధన్యుని చేసితివి (2) / ప్రియ పట్టణ పౌరుల సేవింపను / వరముల నొసగితివి – కృప వరముల నొసగితివి (2) ||పాడెద||
పాపానికి నాకు ఏ సంబంధం లేదు / పాపానికి నాపై ఏ అధికారము లేదు / పాపానికి నాకు ఏ సంబంధం లేదు / పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు / నా పాపములు అన్ని – నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా / మరి వాటినెన్నడును – జ్ఞాపకము చేసికొనెను / అని మాట ఇచ్చాడుగా / నేనున్నా నేనున్నా – నా యేసుని కృప క్రింద / నే లేను నే లేను – ధర్మశాస్త్రం క్రింద (2) ||పాపానికి|| / కృప ఉందని పాపం చెయ్యొచ్చా – అట్లనరాదు / కృప ఉందని నీతిని విడువోచ్చా (అట్లనరాదు) / కృప అంటే లైసెన్స్ కాదు / కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు / కృప అంటే దేవుని శక్తి / కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు / గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్ / ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4) ||నేనున్నా|| / కృప ద్వారా ధర్మశాస్త్రముకు – మృతుడను అయ్యా / కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం (నే పొందితినయ్యా) / క్రియల మూలముగా కాదు / కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది / కృప నన్ను మార్చేసినది / నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది / గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి / అండ్ టాట్ మి టు లివ్ రైటియస్లీ (4) ||నేనున్నా||