Songs sorted by number of likes. 1604 songs total.
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా / నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2) / దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా / నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు|| / గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా / మూగవాడినయ్యా నా స్వరమునీయవా (2) / కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు|| / లోకమంత చూచి నను ఏడిపించినా / జాలితో నన్ను చేరదీసిన (2) / ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2) ||దావీదు|| / నా తల్లి నన్ను మరచిపోయినా / నా తండ్రి నన్ను విడచిపోయినా (2) / తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2) ||దావీదు||
నీవు తోడైయుండగా యేసు – భయము లేదు ఇలలో / మేలు చేయు దేవుడా నీకు – సాటి లేరు సృష్టిలో / ఎక్కలేని కొండలెన్నో ఎదురొచ్చిననూ / లెక్కలేని నిందలే నన్ను బాధించిననూ ||నీవు తోడైయుండగా|| / గతం గాయాన్ని చేయగా – గాయం హృదయాన్ని చీల్చగా / శోకం సంద్రంలా ముంచగా – లోకం బంధాలే తెంచగా / పేరు పెట్టి తల్లిలా పిలచి లాలించితివి / నీవే తోడు నీడగా నిలచి కృప చూపితివి ||నీవు తోడైయుండగా|| / ఆశ నిరాశగా మారినా – నిరాశ నిస్పృహ పెంచినా / యుక్తి తెలియక తిరిగినా – శక్తి క్షీణించిపోయినా / వెన్ను తట్టి తండ్రిలా నిలిపి నడిపించితివి / నీవే కొండ కోటగా నిలిచి బలపరచితివి ||నీవు తోడైయుండగా|| / నీవు నాకు అండగా నిలచి – దారి చూపినావయ్యా / నేను నీకు మెండుగా స్తుతులు – అర్పించెదను
నీవు తోడుండగా నాకు దిగులుండునా / నా మంచి యేసయ్యా / మనసారా స్తోత్రమయా (2) ||నీవు తోడుండగా|| / నీవంటి వారెవ్వరు / నీ తోటి సాటెవ్వరు (2) / నా జీవితాన – నీవే ప్రభువా (2) / నాకెవ్వరు లేరు ఇలలో (2) / హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3) / హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా / నీవు తోడుండగా…. / మనుషులలో మహనీయుడా / వేల్పులలో ఘణ పూజ్యుడా (2) / సర్వాధికారి సర్వాంతర్యామి (2) / చేసెద నీ పాద సేవ (2) / హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3) / హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా ||నీవు తోడుండగా||
నీవుంటే నాకు చాలు యేసయ్యా / నీవెంటే నేను ఉంటానేసయ్యా (2) / నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా / నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే|| / ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ / ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట|| / బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ / అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట|| / ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా / ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట|| / నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము / నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ||నీ మాట||
నెమ్మది లేదా నెమ్మది లేదా – ఒంటరివైనావా / చీకటి బ్రతుకులో వెలుగు లేక – తిరుగుచున్నావా / ఆశలు ఆవిరై పోయినా / నీ కలలన్ని చెదరిన / అలసిపోక సాగిపోవుమా (2) ||నెమ్మది|| / నీ వారు నిన్ను హేళన చేసినా / నీ ప్రేమ బంధు నిన్ను విడచిననూ / గాఢాంధ కారం నిన్ను చుట్టిననూ / అవమానం నింద కలచి వేస్తున్నా / నిను విడువని దేవుడే నీ తోడుగా ఉందును / నీదు వేదనలలోనే నీకు ధైర్యము నిచ్చును / నీ కోసమే తను నిలిచెను / నీ బాధను తొలగించును ||నెమ్మది|| / నీ కన్నీరంతా తుడిచి వేయును / నీ గాయాన్నంతా మాన్పి వేయును / విలువైన పాత్రగ నిన్ను మార్చును / నీ వారికే నిన్ను దీవెనగా చేయును / కాపరి వలె నిన్ను తన కృపలతో నడుపును / నిత్య జీవ మార్గం నీకు ఆయనే చూపును / తన ప్రేమకు నువ్వు సాక్షిగా / జీవించుమా ఇల నిత్యము / నెమ్మది పొందు నెమ్మది పొందు – యేసే నీ తోడు / చీకటి బ్రతుకులో వెలుగు చూపే – యేసే నీ మార్గం
నేనంటే నీకెందుకో ఈ ప్రేమా / నన్ను మరచి పొవెందుకు (2) / నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా / నన్ను విడిచిపోవెందుకు / కష్టాలలో నష్టాలలో / వ్యాధులలో బాధలలో / కన్నీళ్ళలో కడగండ్లలో / వేదనలో శోధనలో / నా ప్రాణమైనావు నీవు / ప్రాణమా.. నా ప్రాణమా – (2) ||నేనంటే|| / నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు / నిన్ను వీడిపోయినా – నన్ను వీడిపోలేవు (2) / ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4) / ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి / తాళలేను నీ ప్రేమను ||నేనంటే|| / ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు / మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2) / ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4) / ఏ బలమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి / తాళలేను నీ ప్రేమను ||నేనంటే||
నేనంటే నీకు ఎంతిష్టమో / నా మంచి యేసయ్యా (2) / నా మీద నీకు ఎనలేని ప్రేమ (2) / ప్రతి క్షణము నీకే నా ఆరాధనా (2) / ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా / ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా (2) / నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో / మరి దేనిని ప్రేమించలేదు / నాకిచ్చిన స్థానం పరమందున / దూతలకు ఇవ్వలేదు (2) / ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి / మదిలో నిలచిన మంచి దేవుడా (2) / నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే / క్రయ ధనముగా ఇచ్చి / బంధింపబడిన నా బంధకాలు / సిలువ యాగముతో తెంచి (2) / మరణించవలసిన నాకై నిత్య జీవం / ప్రసాదించిన మంచి దేవుడా (2)
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2) / నిత్యము నా కీర్తి నా నోట నుండును (2) / మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా / చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు|| / కలిమి చేజారి నను వంచినా / స్థితిని తలకిందులే చేసినా (2) / రెండింతలుగా దయచేసెదవని (2) / నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| / పరుల ఎగతాళి శృతి మించినా / కలవరము గుండెనే పిండినా (2) / నా మొఱ విని కృప చూపెదవని (2) / నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| / శ్రమలు చెలరేగి బెదిరించినా / ఎముకలకు చేటునే తెచ్చినా (2) / ఆపదలలో విడిపించెదవని (2) / నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను / నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2) / నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2) / నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా|| / లేక లేక వృద్ధాప్యమందు / ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2) / ఇచ్చిన నీవే బలి కోరగా (2) / తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా|| / సర్వము పోయి శరీరము కుళ్ళిన / నా అనువారే వెలివేసినా (2) / ఆప్తులంతా శత్రువులైనా (2) / అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా|| / నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే / చావైనా అది నాకెంతో మేలే (2) / ఇదిగో నేను ఉన్నానయ్యా (2) / దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||
నేనెరుగుదును ఒక స్నేహితుని / అతడెంతో పరిశుద్ధుడు / ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ / కారణ భూతుడు (2) / అతడే యేసుడు… అతడే యేసుడు (2) ||నేనెరుగుదును|| / చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు (2) / వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే (2) ||నేనెరుగుదును|| / చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు (2) / శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే (2) ||నేనెరుగుదును||
నేను కూడా ఉన్నానయ్యా / నన్ను వాడుకో యేసయ్యా (2) / పనికిరాని పాత్రనని / నను పారవేయకు యేసయ్యా (2) / జ్ఞానమేమి లేదుగాని / నీ సేవ చేయ ఆశ ఉన్నది (2) / నీవే నా జ్ఞానమని (2) / నీ సేవ చేయ వచ్చినానయ్య (2) ||నేను|| / ఘనతలొద్దు మెప్పులొద్దు / ధనము నాకు వద్దే వద్దు (2) / నీవే నాకు ఉంటే చాలు (2) / నా బ్రతుకులోన ఎంతో మేలు (2) ||నేను|| / రాళ్లతో నన్ను కొట్టిన గాని / రక్తము కారిన మరువలేనయ్యా (2) / ఊపిరి నాలో ఉన్నంత వరకు (2) / నీ సేవలో నేను సాగిపోదునయా (2) ||నేను|| / మోషే యెహోషువాను పిలిచావు / ఏలీయా ఎలీషాను నిలిపావు (2) / పేతురు యోహాను యాకోబులను (2) / అభిషేకించి వాడుకున్నావు (2) ||నేను||
నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా – (2) / నేను ఓడిపోనయా – నా పక్షానుండగా / నేను కృంగిపోనయా – నీవు నా తోడుండగా (2) / నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా (2) / నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా (2) ||నేను ఓడిపోనయా|| / అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే / వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే (2) / ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) / శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా|| / నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే / నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే (2) / ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) / శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా|| / నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే / నన్ను దూషించిన చోటే దీవించినావే (2) / ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) / శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా||