తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

నేనున్నా నేనున్నా|Nenunnaa Nenunnaa

పాపానికి నాకు ఏ సంబంధము లేదు / పాపానికి నాపై ఏ అధికారము లేదు / పాపానికి నాకు ఏ సంబంధము లేదు / పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు / నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా / మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట ఇచ్చాడుగా / నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింద / నే లేను నే లేను ధర్మ శాస్త్రం క్రింద (2) ||పాపానికి|| / కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు / కృప ఉందని నీతిని విడువొచ్చా – అట్లనరాదు / కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు / కృప ఉందని నీతిని విడువొచ్చా – నో / కృప అంటే లైసెన్స్ కాదు / కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు / కృప అంటే దేవుని శక్తి / కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు / గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్ / ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4) ||నేనున్నా|| / కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా / కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం – నే పొందితినయ్యా / కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా / కృప వలెనే క్రీస్తులో స్వాతంత్య్రం / క్రియల మూలముగా కాదు / కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది / కృప నను మార్చేసినది / నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది / గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి / అండ్ టాట్ టు మి లివ్ రైటియస్లీ (4) ||నేనున్నా|| / పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా / కృప వలెనె ఇది నాకు సాధ్యం – అయ్యిందిరా భయ్యా / పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా / కృప వలెనె ఇది నాకు సాధ్యం / కృపను రుచి చూచిన నేను / దేవునికే లోబడుతాను – పాపానికి చోటివ్వను / పరిశుద్ధత పొందిన నేను / నీతి సాధనములుగానే – దేహం ప్రభుకర్పింతును / యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్ / యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2) / యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్ / యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2) ||నేనున్నా|| / ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు / ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – అట్లనరాదు / ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు / ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – నో / ధర్మశాస్త్రం కొంత కాలమేగా / ధర్మశాస్త్రం బాలశిక్షయేగా – ప్రభు నొద్దకు నడిపేందుకు / క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా / ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా – మనలను విడిపించేందుకు / లా హాస్ లెడ్ ది పీపుల్ టు క్రైస్ట్ / నౌ గ్రేస్ విల్ మేక్ హిస్ కాన్క్వరర్స్ (4) ||నేనున్నా||

నేనునూ నా ఇంటి వారును|Nenunu Naa Inti Vaarunu

నేనునూ నా ఇంటి వారును / యెహోవాను సేవించెదము / ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2) / సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని ||నేనునూ|| / శ్రమలో శోధనలో మరణ బంధకంలో / శాంతి సమాధానం దయచేసి దేవుడు (2) / ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో (2) / ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2) ||నేనునూ|| / ఏ పాపము నన్ను ఏలనీయని వాడు / ఏ అపాయమును రాకుండా కాపాడును (2) / కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2) / నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2) ||నేనునూ|| / దీర్ఘాయువు చేత దీవించు దేవుడు / దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును (2) / మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు (2) / మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును (2) ||నేనునూ||

నిబంధనా జనులం|Nibandhanaa Janulam

నిబంధనా జనులం / నిరీక్షణా ధనులం / ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం / మేము నిబంధనల జనులం / యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే / మోక్షమందు చేరెదము (2) ||నిబంధనా|| / అబ్రాహాము నీతికి వారసులం / ఐగుప్తు దాటిన అనేకులం (2) / మోషే బడిలో బాలురము (2) / యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / విశ్వాసమే మా వేదాంతం / నిరీక్షణే మా సిద్ధాంతం (2) / వాక్యమే మా ఆహారం (2) / ప్రార్ధనే వ్యాయామం – అనుదినము / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / అశేష ప్రజలలో ఆస్తికులం / అక్షయుడేసుని ముద్రికులం (2) / పునరుత్తానుని పత్రికలం (2) / పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / నజరేయుని ప్రేమ పొలిమేరలో / సహించుటే మా ఘన నియమం (2) / క్షమించుటే ఇల మా న్యాయం (2) / భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / క్రీస్తేసే మా భక్తికి పునాది / పునరుత్తానుడే ముక్తికి వారధి (2) / పరిశుద్ధాత్ముడే మా రథ సారథి (2) / ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / ఎవరీ యేసుని అడిగేవో / ఎవరోలే యని వెళ్ళేవో (2) / యేసే మార్గం యేసే జీవం (2) / యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం / నిబంధనా జనులం ||యేసు రాజు||

నిబ్బరం కలిగి|Nibbaram Kaligi

నిబ్బరం కలిగి ధైర్యముగుండు / దిగులు పడకు జడియకు ఎప్పుడు (2) / నిన్ను విడువడు నిన్ను మరువడు / ప్రభువే నీ తోడు / హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా / ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము / నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు / హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ||నిబ్బరం|| / పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా (2) / ప్రభు కృప మమ్మును విడువడుగా (2) / ఎక్కలేని ఎత్తైన కొండను / ఎక్కించును మా ప్రభు కృప మమ్మును / ప్రభువే మా బలము ||హల్లెలూయా|| / మునుపటి కంటెను – అధికపు మేలును (2) / మా ప్రభు మాకు కలిగించును (2) / రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును / శత్రువు ఎదుటనే భోజనమిచ్చును / ప్రభువే మా ధ్వజము ||హల్లెలూయా|| / మా అంగలార్పును – నాట్యముగా మార్చెను / బూడిద బదులు సంతోషమిచ్చెను (2) / దుఃఖ దినములు సమాప్తమాయెను / ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను / ప్రభునకే స్తోత్రం ||హల్లెలూయా|| / స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును (2) / మా ప్రభు మమ్మును మరువడుగా (2) / చూడుము నా అరచేతిలనే / చెక్కితి నిను అన్నాడు ప్రభువు / ప్రభువే చూచుకొనును ||హల్లెలూయా|| / రాబోవు కాలమున – సమాధాన సంగతులే (2) / మా ప్రభు మాకై ఉద్దేశించెను (2) / ఇదిగో నేనొక నూతన క్రియను / చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను / ఇప్పుడే అది మొలుచున్ ||హల్లెలూయా|| / మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను (2) / మా ప్రభు మాకు అందించును (2) / ప్రాకారముగల పట్టణములోనికి / ప్రభువే మమ్మును నడిపింపచేయును / ప్రభువే మా పురము ||హల్లెలూయా||

నిబ్బరముతో నా యేసుకే|Nibbaramutho Naa Yesuke

నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా / వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2) / యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా / యేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2) ||నిబ్బరముతో|| / కష్టకాలమందు నాకు – కనికరము చూపెను / కాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను (2) / కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెను / కన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెను / కఠినమైన కాలములో – నా చెంత నిలిచెను ||యేసయ్యా|| / దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెను / ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను (2) / దిక్కుతోచని వేళ – నా దిక్కై నిలిచెను / దుష్ట శక్తులన్నిటిని – నాకు దూరపరచెను / దీవెనలు కుమ్మరించి – ధన్యునిగా చేసెను ||యేసయ్యా||

నిజ స్నేహితుడా|Nija Snehithudaa

నా చెలిమి కోరి – నీ కలిమి వీడి / నా చెంత చేరావు శ్రీమంతుడా / నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది / బలియాగమైన నిజ స్నేహితుడా ||నా చెలిమి|| / ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితిని / గమ్యమే ఎరుగనైతిని – మరణమే శరణమాయెను / ఎంతో ప్రేమించితివి – నా స్థానమందు నిలిచితివి / కృపతో నన్ రక్షించితివి – నా దోషశిక్ష భరించితివి ||నా చెలిమి|| / నిందలు అవమానములు – హేళనలు చీత్కారములు / కఠిన దెబ్బలు ముళ్లపోటులు – సిలువ భారం కాయమంతా గాయం / హృదినే బాధించినా – భరియించావు వేదన మౌనముగా / తనువే తల్లడిల్లినా – తృప్తినొందావు నను తలచుకొని ||నా చెలిమి|| / ఏ రీతి నిన్ను – కీర్తించగలను / నా నీతి నీవే ఓ యేసుదేవా / నీ సాక్షిగ నిలిచి – నీ ప్రేమను చాటి / ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా

నిజమైన ద్రాక్షావ|Nijamaina Draakshaavalli

నిజమైన ద్రాక్షావల్లి నీవే / నిత్యమైన సంతోషము నీలోనే (2) / శాశ్వతమైనది ఎంతో మధురమైనది / నాపైన నీకున్న ప్రేమ / ఎనలేని నీ ప్రేమ – (2) ||నిజమైన|| / అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో / జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2) / శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి / నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2) ||నిజమైన|| / నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో / అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2) / వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు / జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2) ||నిజమైన|| / షాలేము రాజా రమ్యమైన సీయోనుకే / నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2) / అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి / ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2) ||నిజమైన||

Most Popular Telugu Songs — Page 86 | UEC Telugu Church