తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

నీవేయని నమ్మిక|Neeveyani Nammika

నీవేయని నమ్మిక / యేసు నాకు.. నీవేయని నమ్మిక / నీవే మార్గంబు – నీవే సత్యంబు / నీవే జీవంబు – నీవే సర్వంబు ||నీవే|| / పెడదారిని బోవగ / నా మీదికి.. ఇడుమలెన్నియో రాగ / అడవిలో బడి నేను – ఆడలుచు నుండగ / తడవకుండ దొరుకు – ధన్యమౌ మార్గంబు ||నీవే|| / కారు మేఘము పట్టగ / నా మనస్సులో.. కటిక చీకటి పుట్టగ / ఘోరాపదలు చేరి – దారియని భ్రమపడగ / తేరి చూడగల్గు – తేజోమయ మార్గంబు ||నీవే|| / లేనిపోని మార్గంబు / లెన్నోయుండ.. జ్ఞానోపదేశంబు / మానుగ జేయుచు – వానిని ఖండించి / నేనే మార్గంబన్న – నిజమైన మార్గంబు ||నీవే|| / నరలోకమునుండి / పరలోకంబు.. వరకు నిచ్చెనగా నుండి / నరులకు ముందుగా – నడుచుచు ముక్తికి / సరిగా కొనిపోవు సు-స్థిరమైన మార్గంబు ||నీవే||

నీవు లేని చోటేది|Neevu Leni Chotedi

నీవు లేని చోటేది యేసయ్యా / నే దాగి క్షణముండలేనయ్యా / నీవు చూడని స్థలమేది యేసయ్యా / కనుమరుగై నేనుండలేనయ్యా (2) / నీవు వినని మనవేది యేసయ్యా / నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2) / నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని|| / కయీను కౄర పగకు బలియైన హేబేలు / రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు / అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు / మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2) / చెవి యొగ్గి నా మొరను / యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే|| / సౌలు ఈటె దాటికి గురియైన దావీదు / ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు / సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును / గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2) / నీ తోడు నీ నీడ / యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||

నీవు లేని క్షణమైనా|Neevu Leni Kshanamainaa

నీవు లేని క్షణమైనా ఊహించలేను / నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2) / నీవే నా కాపరి – నీవే నా ఊపిరి / నీవే నా సర్వము యేసయ్య / నీతోనే జీవితం – నేనే నీకంకితం / గైకొనుమో నన్ను ఓ దేవా… ||నీవు లేని|| / శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినా / నను ధైర్యపరిచె నీ వాక్యం / సంద్రాలే పొంగినా – అలలే ఎగసినా / నను మునగనీయక లేవనెత్తిన (2) / నీవే నా కండగా – నాతో నీవుండగా / భయమన్నదే నాకు లేదూ / సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా / వందనము నీకే ఓ దేవా… ||నీవు లేని|| / శత్రువులే లేచినా – అగ్ని ఆవరించినా / అవి నన్ను కాల్చజాలవుగా / దుష్టులే వచ్చినా – సింహాలై గర్జించినా / నాకేమాత్రం హాని చేయవుగా (2) / వెన్నుతట్టి బలపరచిన – చేయిపట్టి నడిపించిన / వేదనలే తొలగించిన యేసయ్యా / సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా / వందనము నీకే ఓ దేవా… ||నీవు లేని||

నీవు ప్రార్థన చేయునప్పుడు|Neevu Praardhana Cheyunappudu

నీవు ప్రార్థన చేయునప్పుడు / అడుగుచున్న వాటిని / పొందియున్నాననే నమ్మకమున్నదా నీకు (2) / నమ్మిక లేకయే నీవు చేసే ప్రార్థన / తండ్రి సన్నిధి చేరదని గుర్తెరుగుమా నేడు (2) / నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి అన్నియు / సాధ్యమేనని చెప్పిన మాట మరచితివా (2) / ప్రభు మాట మరచితివా ||పొందియున్నాననే|| / బాధలు ఇబ్బందులు నిన్ను చుట్టిన వేళలో / విశ్వాస ప్రార్థనా బలము మరచితివా (2) / సింహాల బోనులోన ప్రార్థించిన దానియేలు / నమ్మి పొందిన భయము లేని జయము మరచితివా (2) / ఆ జయము మరచితివా ||పొందియున్నాననే|| / గెత్సేమనే తోటలో కన్నీటి ప్రార్థన / ఆంతర్యమును గ్రహియించుమా నేడు (2) / సొంత చిత్తము కాకయే తండ్రి చిత్తము నెరవేర్చి / ప్రభువు మనకు నొసగెను రక్షణానందం (2) / ఈ రక్షణానందం ||పొందియున్నాననే||

నీవు తడితే తలుపు తీయనా|Neevu Thadithe Thalupu Theeyanaa

నీవు తడితే తలుపు తీయనా ప్రభు / నాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2) ||నీవు|| / పాపముతో నిండియున్న నా బ్రతుకును / పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా / పాపములో జీవించుచున్న నాపై / ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2) / నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి / నన్ను నడిపించగ వచ్చావయ్యా (2) ||నీవు|| / తెరిచాను నా తలుపులు రావా ప్రభు / ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను / నాలోన నీవుండి పోవాలి / నీతోనే నడవాలి ఇక మీదట (2) / రక్షణనే కేడెము చేత పట్టి / ప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ పరచెద (2) ||నీవు|| / విలువలేని నన్ను నీవు ఎంచుకొంటివి / వాక్యమనే ధ్యానముతో నన్ను నింపుమా / స్వస్థతనే వరముల దయచేయుమా / కడ వరకు పరుగెడుదును నీ బాటలో (2) / ఎల్లవేళలా నాతో ఉండి నన్ను / చేయి పట్టి నడిపించు నా యేసయ్యా (2) ||నీవు||