Songs sorted by number of likes. 1604 songs total.
నీవే ఆశ్రయదుర్గం – నీవే నా సహాయం / నీవే కేడెము బలము – యేసూ నీవే నా దాగు స్థలము / నీవే మార్గం సత్యం / నిత్యజీవం యేసయ్యా (2) / నీవే ఆదియు అంతం – నీవే మారని దైవం / నీవే జీవాహారం – యేసూ నీవే జీవనాధారం / నీవే మార్గం సత్యం / నిత్యజీవం యేసయ్యా (2) / నీవే రక్షణశృంగం – నీవే పునరుత్థానం (2) / పునరుత్థానుడా యేసయ్యా / నాకొరకు బలియైన రక్షకుడా (2) / నీవే మార్గం సత్యం / నిత్యజీవం యేసయ్యా (2) / నీవంటి వారే లేరు యేసయ్యా / నీవు లేని చొటే లేదు యేసయ్యా (2) / నీవే హృదయధ్యానం / యేసూ నీవే నా స్తోత్రగానం
నీవే నా దేవుడవు ఆరాధింతును / నీవే నా రాజువు కీర్తించెదను (2) / మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే / మరణమునుండి జీవముకు నను దాటించావు / పరలోకమునుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి / చీకటినుండి వెలుగునకు నను నడిపించావు / హోసన్నా మహిమా నీకే / హోసన్నా ప్రభావము రాజునకే (2) / నీవే నీవే నీవే నీవే (2) / పాపిని నను కరుణించిన కరుణామయుడవు నీవే / విలువైన నీ కృపచే నను రక్షించావు / కలువరిలో మరణించి నీ ప్రేమను చూపితివి / పాపమును క్షమియించి నను విడిపించావు / హోసన్నా మహిమా నీకే / హోసన్నా ప్రభావము రాజునకే (2) / నీవే నీవే నీవే నీవే (2)
నీవే నా సర్వము నీవే నాకున్నావు / నీవే నా సర్వము అన్నిటిలో / నీ జీవం నా కొరకు ఇచ్చినందున / నీవే నా సర్వము అన్నిటిలో (2) / తేనె కంటే మధురము (2) / యేసయ్యే నాకు మాధుర్యము / రుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమును / యేసయ్యే నాకు మాధుర్యము ||తేనె|| / నీవే నా రక్షణ నీవే నిరీక్షణ / నీవే కదా నా ఆధారము / నీ పాదములకు మ్రొక్కెదను / నీ నామం పాడి స్తుతించెదను (2) ||తేనె|| / నీవే పరిహార నీవే పరమౌషధం / నీవే నా శక్తివి నా యేసయ్యా / కల్వరి సిలువపై బాలి అయితివే / నే బాగుపడితిని గాయములచే (2) ||తేనె|| / నీవే నా కీర్తివి నీవే నా అతిశయం / నీవే నా మేలులు నా యేసయ్యా / నీ పాద సేవయే చేయుటయే / నా హృదయములున్న వాంఛయేగా (2) ||తేనె||
నీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము / నీవే ఆధారము – నీవే నా ఆనందము / నీ ప్రేమ నాలో పదిలము / నీలోనే సాక్ష్యమే సంతోషము (2) / సర్వోన్నతుడా నీకే మహిమ / పరమ తండ్రి నీకే ఘనత (2) ||నీవే|| / నా జీవితాంతం నిన్నే పొగడెదను / నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే (2) / నా దేవుని మందిరములో నివసించెదను / నా స్తుతి నైవేద్యం నీకే అర్పించెదను – (2) ||సర్వోన్నతుడా|| / నా బలహీన స్థితిలో గతివి నీవైతివే / నా కన్నీరు నాట్యముగా మార్చినది నీవే (2) / కృంగిన నా హృదయమును లేవనెత్తితివి / అసాధ్యమైనది నీకు ఏదియు లేదయా – (2) ||సర్వోన్నతుడా||
నీవే నన్ను కోరుకున్నావు / నీవే నన్ను చేరుకున్నావు / నీవే నన్ను విడిపించావు / నీవే నన్ను విడువనన్నావు / ఎంత ప్రేమ యేసయ్యా / వింత ప్రేమ నీడయ్యా (2) ||నీవే|| / నీ అరచేతిలో నను చెక్కుకున్నావు / నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు / నీ రాజ్యములో నను దాచి ఉంచావు / నీ నామములో నను రక్షించావు ||ఎంత|| / నీ వాక్యముతో నను శుద్ధి చేసావు / నీ రక్తముతో నను కడిగివేసావు / నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు / నీ ఆత్మతో నను నింపివేసావు ||ఎంత||
నీవే నీవే కావాలి ప్రభువుకు / నేడే నేడే చేరాలి ప్రభువును (2) / ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది / నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2) ||నీవే|| / నీ సృష్టికర్తను నీవు విడచినా / నీకిష్టమైన రీతి నీవు నడచినా (2) / దోషివయినా ద్రోహివయినా / దేవుని చెంత – చేరిపుడైనా (2) ||ఈ కాలం|| / పాపాలతో నీవు పండిపోయినా / ప్రేమించువారు లేక కృంగిపోయినా (2) / యేసుని చరణం – పాప హరణం / యేసుని స్నేహం – పాపికి మోక్షం (2) ||ఈ కాలం|| / నీటి బుడగలాంటిది నీ జీవితం / గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2) / అధికుడవైనా అధముడవైనా / ఆయన ప్రేమ – కోరిపుడైనా (2) ||ఈ కాలం||
నీవే నీవే / నా తోడున్న దేవుడవు (2) / నీ వెంటే వస్తానయ్యా (2) ||నీవే|| / కష్టాల కడలిలోనైనా / కన్నీటి బాధలోనైనా (2) / యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును (3) ||నీవే|| / ఏ ఘోర పాపము అయినా / మరణకర వ్యాధి అయినా (2) / యెహోవా రాఫా స్వస్థపరచును (3) ||నీవే||
నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరము / నన్ను కలిసిన వరము (2) / స్తుతి గాన సంపద నిన్ను చేరాలని / నా దీన మనస్సు నీవే చూడాలని / ప్రయాసతో ప్రయాణమైతిని ||నీవే|| / నీ తోడు నాకుండగా – ఏ దిగులు నాకుండదు / నీ చెలిమి నాకుండగా – కన్నీరే నాకుండదు (2) / ప్రతి కీడు తప్పించు – పరిశుద్ధ గ్రంథం / నా కొరకే పంపావయ్యా / ఏ చోటనైనా – ఏ పల్లెనైనా / నీ పలుకే బంగారమాయెనయా ||నీవే|| / నోవాహును నడిపిన – నావికుడు నీవేనయ్యా / సంద్రాన్ని చల్లార్చిన – ఆ శక్తి నీదేనయ్యా (2) / దావీదు ప్రార్ధన – ఆ యోబు వేదన / కనిపెట్టి చూసావయ్యా / నా దుఃఖ భారం – నా శాప భారం / నీలోనే కరగాలయ్యా ||నీవే||
నీవే నా ప్రాణం సర్వం / నీవే నా ధ్యానం గానం / యేసయ్యా నీవే ఆధారం (2) / నీవేగా నా ప్రాణం – యేసయ్యా నీవే జీవితం / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా.. / హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2) ||నీవే|| / నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది / నీ రాకకే కదా నేనెదురు చూచునది (2) / నీవలె ఉందును నీలో వసించెదను (2) / అండా దండా కొండా నీవయ్యా / నాకున్న లోకం అంతా నీవయ్యా / అండా దండా కొండా నీవయ్యా / నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా|| / నా కాపరి నీవే నా ఊపిరి నీవే / నా దారివి నీవే నా మాదిరి నీవే (2) / నీవలె ఉందును నీ వెంట సాగెదను (2) / అండా దండా కొండా నీవయ్యా / నాకున్న లోకం అంతా నీవయ్యా / అండా దండా కొండా నీవయ్యా / నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా||
నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ / నీవే నా దీవెన – నీవే క్షమాపణ (2) / యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా / యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా (2) ||నీవే నా|| / గతమును మన్నించి గుణవంతునిగా చేసి / నన్ను మలచి నన్నే మరిపించి (2) / మనిషిగా మార్చినావు / నీ మనసు నాకిచ్చినావు (2) ||యేసయ్యా|| / కన్నీరు తుడచి కష్టాలు తీర్చి / అండగ నిలిచి అడ్డులన్ని తొలగించి (2) / మనిషిగా మార్చినావు / మాదిరిగ చేసినావు (2) ||యేసయ్యా||
నీవేగా యేసు నీవేగా / నీవేగా క్రీస్తు నీవేగా ||నీవేగా|| / పాపమునుండి విడిపించింది నీవేగా / పరిశుద్దునిగా మార్చినిది నీవేగా (2) / (నా) ఘోరపాపము మన్నించినిది / రోతబ్రతుకును మార్చినిది (2) ||నీవేగా|| / బలహీనతలో బలపరిచింది నీవేగా / దుఃఖములో నను ఓదార్చినిది నీవేగా (2) / (నా) ఓటములను ఓడించింది / బాధలన్నియు బాపినది (2) ||నీవేగా||
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో / కుంటి కుంటి నడిచెదవీవు / యెహోవాయే నీ దేవుడా / లేక వేరే దేవతలున్నారా (2) / మనం తీర్మానించెదమిప్పుడే / మన నోట వంచన లేకుండా (2) / మరుగైన పాపములన్నిటిన్ / హృదయమునుండి తొలగించెదం (2) ||నీవెన్నాళ్ళు|| / మారు మనస్సు పొందెదమిప్పుడే / జీవిత మోసములనుండి (2) / పరిశుధ్ధులమై నిర్దోషులుగా / ప్రభు దినమందు కనబడెదం (2) ||నీవెన్నాళ్ళు|| / నేను నా ఇంటివారలము / యెహోవానే సేవించెదము (2) / నీవెవరిని సేవించెదవో / ఈ దినమే తీర్మానించుకో (2) ||నీవెన్నాళ్ళు||