Songs sorted by number of likes. 1604 songs total.
నీ వాక్యమే నా పాదాలకు దీపము / నీ చిత్తమే నా జీవిత గమనము (2) / కృప వెంబడి కృపతో – నను ప్రేమించిన దేవా (2) / వందనాలయ్యా నీకే – వేలకొలది వందనాలయ్యా / స్తోత్రాలయ్యా – కోట్లకొలది స్తోత్రాలయ్యా ||నీ వాక్యమే|| / నీ భారము నాపై వేయుము / ఈ కార్యము నే జరిగింతును (2) / నా కృప నీకు చాలును / అని వాగ్దానమిచ్చావయ్యా (2) ||వందనాలయ్యా|| / పర్వతములు తొలగిననూ / మెట్టలు తత్తరిల్లిననూ (2) / నా కృప నిన్ను వీడదు / అని అభయాన్ని ఇచ్చావయ్యా (2) ||వందనాలయ్యా||
నీ వాక్యమే నన్ను బ్రతికించెను / బాధలలో నెమ్మదినిచ్చెను (2) / కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా / వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే|| / జిగటగల ఊభినుండి లేవనెత్తెను / సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2) / నా పాదములకు దీపమాయెను (2) / సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే|| / శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై / యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2) / అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2) / ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2) ||నీ వాక్యమే|| / పాలవంటిది జుంటి తేనె వంటిది / నా జిహ్వకు మహా మధురమైనది (2) / మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2) / రత్న రాసులకన్నా కోరతగినది (2) ||నీ వాక్యమే||
నీ వాక్యమే శ్రమ కొలిమిలో / నను బ్రతికించుచున్నది (2) / నా బాధలో అది బహు నెమ్మది / కలిగించుచున్నది (2) ||నీ వాక్యమే|| / శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము / సంతోషమీయని యెడల (2) / బహు కాలము క్రితమే నేను – నశియించియుందునయ్యా / నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతున్ (2) ప్రభు ||నీ వాక్యమే|| / నీ శాసనములే ఆలోచన- / కర్తలై నన్ను నడుపుట వలన (2) / నా శత్రువుల మించిన జ్ఞానము – నాకిలను కలిగెనయ్యా / నీ ఆజ్ఞలను నేను తలదాల్తును (2) ప్రభు ||నీ వాక్యమే|| / వేలాది వెండి బంగారు నాణెముల / విస్తార ధన నిధి కన్నా (2) / నీ ధర్మశాస్త్రము యెంతో – విలువైన నిధి ప్రభువా / నీ ఆజ్ఞలను బట్టి నిను పొగడడం (2) ప్రభు ||నీ వాక్యమే||
నీ జీవితం నీటీ బుడగా వంటిది / ఎప్పుడూ ఆగునో మనకూ తెలియదూ (2) / నేడే తెలుసుకో నిజమైన దేవుని / నిత్య జీవముకై వెంబడించు యేసుని ||నీ జీవితం|| / ఎన్నాళ్ళూ ఈ వ్యర్ధపు ప్రయాసము / మనకై మరణించిన ప్రభుని చూడు (2) / ఈ క్షణమే వెదుకూ నీ హృదయముతో (2) / మనదగునూ.. ఆయన క్షమా రక్షణ (2) ||నీ జీవితం|| / ఎన్నాళ్ళు ఈ వ్యర్ధపు ప్రయాణము / త్వరగా రానైయున్నాడు ప్రభువూ (2) / ఆయనతో పరమునకేగుటకూ (2) / నిరీక్షణ గలవారమైయుందుము (2) ||నీ జీవితం||
నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో / అది నిర్దేశించును జీవిత గమ్యమును / ఈనాడే యేసుని చెంతకు చేరు (2) ||నీ నిర్ణయం|| / లోకం దాని ఆశలు గతించిపోవును / మన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2) / మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు / క్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2) ||నీ నిర్ణయం|| / పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే / శాపంతో నీవుండిన తప్పదు మరణము (2) / భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే / ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2) ||నీ నిర్ణయం||
నీ పాదాలే నాకు శరణం / యేసయ్యా నీవే ఆధారము (2) / నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా (2) / నా దాగు చాటు నీవే యేసయ్యా (2) ||నీ పాదాలే|| / అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి (2) / నా ఆశ్రయుడా నీ కన్నా నాకు / కనిపించదు వేరొక ఆశ్రయము (2) / కనిపించదు వేరొక ఆశ్రయము / శరణం శరణం శరణం / నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే|| / ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను (2) / నా పోషకుడా నీ కన్న నాకు / కనిపించరే వేరొక పోషకుడు (2) / కనిపించరే వేరొక పోషకుడు / శరణం శరణం శరణం / నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే|| / సాతాను శోధనలో పరుగెత్తితిని నీ వాక్కు కొరకు (2) / నా జయశీలుడా నీకన్న నాకు / కనిపించరే జయమును ఇచ్చే వేరొకరు (2) / కనిపించరే జయమునిచ్చే వేరొకరు / శరణం శరణం శరణం / నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే||
నీ సన్నిధిలో సంతోషము / నీ సన్నిధిలో సమాధానము (2) / నలిగియున్న వారిని బలపరచును / చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము / యేసయ్యా యేసయ్యా.. (3) ||నీ సన్నిధిలో|| / నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను / విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను (2) ||యేసయ్యా|| / నాలో నీవు – నీలో నేను / నా కొరకే నీవు – నీ కొరకే నేను (2) / ఇక భయమే లేదు – దిగులే లేదు / నీ సన్నిధిలో నేనుంటే చాలు (2)
నీదెంతో కరుణా కరుణామయా / నీదెంతో జాలి నజరేయా (2) / మా పాపమంతా గాయాలుగా / దాల్చావు నీ మీన పూమాలగా (2) / మా కర్మమంతా ఆ సిలువగా / మోసేవు తండ్రి నీ మోపున ||నీదెంతో|| / ప్రభువా మా పాప ప్రక్షాళనముకై / వెలపోసినావు నీ రుధిరమే (2) / దేవా మా ఆత్మ పరిశుద్ధికై / బలి పెట్టినావు నీ ప్రాణమే ||నీదెంతో||
నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు / నీదు రూపమే నాలో ఉంచి నన్ను చేసావు / మంటివాడను నన్ను నీవు మహిమపరిచావు / మరణపాత్రుడనైన నన్ను పరము చేర్చావు / ఎంత ప్రేమ యేసయ్యా – నీకెంత నాపై కరుణయో / మరువగలనా నీ కృప – బ్రతుకంతయు (2) / తోడువైనావు నా నీడవైనావు / నీవు నాకు ఉండగా నాకు ఈ దిగులెందుకు / మంచి కాపరి నీవేనయ్యా నా యేసయ్యా / ఎంచలేనయ్యా నీ వాత్సల్యం ఓ మెస్సయ్యా / జీవితమంతా మరువలేనయ్యా ||నీదు ప్రేమ|| / ప్రాణమైనావు నీవే ధ్యానమైనావు / అన్నీ నీవై చేరదీసి ఆశ్రయమైనావు / నీతిసూర్యుడా పరిపూర్ణుడా నిత్య దేవుడా / కీర్తనీయుడా కృపాపూర్ణుడా సత్యజీవుడా / నేను నిన్ను విడువలేనయ్యా ||నీదు ప్రేమ||
నీదు ప్రేమకు హద్దు లేదయా / నీదు ప్రేమకు కొలత లేదయా / నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు / పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు|| / తల్లి తండ్రులు చూపలేని ప్రేమ / తనయులివ్వని తేటనైన ప్రేమ (2) / పేదలకు నిరు పేదలకు / విధవలకు అనాథలకు (2) / బంధు మిత్రులు చూపలేని ప్రేమా (2) / కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు|| / నరులకై నర రూపమైన ప్రేమ / పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ (2) / దొంగలకు వ్యభిచారులకును / కౄరులకు నర హంతకులకు / మనుజులివ్వని మధురమైన ప్రేమా (2) / కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు / అంతరిక్షము నధిగమించెను (2) / నిను ప్రేమించి నీ ఆజ్ఞలను / అనుసరించు మానుజావళికి (2) / నిబంధనను స్థిరముగ జేసి (2) / నిరతము నలరారెడు మా ప్రభువా (2) ||నీదు|| / వేయి తరముల వరకు సరిగా / విలసిల్లేటి వెలలేని మా (2) / వింతల కృపాంబుధి యగు దేవా (2) / యెంతయో నిను స్తుతియింతుము కోరి (2) ||నీదు|| / నీ సత్య సంధత్వ మహిమ / నిరతము నిలయం సంస్తుతులకు (2) / మెరసెను నా మదిలోన దేవా (2) / మరువగ లేమి మధుర ప్రేమ (2) ||నీదు|| / ఎంతైనను నమ్మదగిన / వింతైన నీ విశ్వాస్యత (2) / వాత్సల్యత వెలసెను మాపై (2) / క్రొత్తగా ప్రతి దినము యేసు ప్రభు (2) ||నీదు|| / మన ఆత్మను జీవము దేహమును / మన ప్రభు యేసు రాకడ వరకు (2) / వొనరుగ కాపాడును పదిలముగా (2) / దిన దినమును నిందారహితముగా (2) ||నీదు|| / తండ్రి కుమార శుద్ధాత్మకును / తర తరములకు మహిమ ఘనత (2) / పరిపూర్ణముగా ప్రబలును గాక (2) / పరి పరి విధముల ప్రభు సంఘములో (2) ||నీదు||