Songs sorted by number of likes. 1604 songs total.
నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా / నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2) / మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా / కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా ||నీకంటె|| / కొట్టబడిన వేళ / నా గాయం కట్టినావే (2) / బాధించినా స్వస్థపరిచేది నీవే (2) ||నీకంటె|| / అణచబడిన వేళ / నా తలను ఎత్తినావే (2) / శిక్షించినా గొప్ప చేసేది నీవే (2) ||నీకంటె|| / విడువబడిన వేళ / నను చేరదీసినావే (2) / కోపించినా కరుణ చూపేది నీవే (2) ||నీకంటె||
నీకసాధ్యమైనది ఏదియు లేదు / సమస్తము సాధ్యము నీకు (2) / ప్రభువా ప్రభువా / సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది|| / వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం / బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం (2) / నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా / నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2) / బలవంతుడా మహోన్నతుడా / స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| / పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం / శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం (2) / నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా / నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) / బలవంతుడా మహోన్నతుడా / స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| / దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం / నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం (2) / నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా / నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) / బలవంతుడా మహోన్నతుడా / స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| / సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం / పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం (2) / నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా / నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2) / బలవంతుడా మహోన్నతుడా / స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
నీకే నా ఆరాధన / నీకే నా ఆలాపన (2) / నిన్ను కీర్తింతును నా హృదయముతో / నిన్ను సేవింతును నా మనసుతో (2) / ఆరాధన ఆరాధన / ఆరాధన నీకే (2) / క్రీస్తే నా నిరీక్షణ / క్రీస్తే నా రక్షణ (2) / నిన్ను స్తుతియింతును నా స్వరముతో / నిన్ను ప్రేమింతును నా హృదయముతో (2) ||ఆరాధన|| / యేసే నా విశ్వాసము / యేసే నా విమోచన (2) / నిన్ను పూజింతును నా హృదయముతో / నిన్ను ప్రణుతింతును నా పూర్ణాత్మతో (2) ||ఆరాధన||
నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా.. (2) / యుగయుగములకు తరతరములకు / మహిమా ప్రభావము (2) / నీకే యేసయ్యా.. నీకే యేసయ్యా.. ||నీకే|| / నిన్న నేడు రేపు కూడ మారని వాడవు (2) / ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు (2) ||నీకే|| / ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును (2) / ఎప్పటికిని నిన్ను మాత్రమే నే సేవింతును (2) ||నీకే|| / నీ రాజ్యములో నేను చేరు భాగ్యం నాకు దయచేయుమా (2) / ఎప్పటికిని నీ అరచేతిలో చెక్కియుంచుమా (2) ||నీకే||
నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా / నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా (2) / నీవు చేసినవి చూపినవి వింటే / హృదయం తరియించి పోతుంది దేవా / నీవు చూపినవి చేసినవి చూస్తే / హృదయం ఉప్పొంగి పోతుంది దేవా / దేవా… యేసు దేవా – నాధా… యేసు నాధా / నా మార్గమంతటిలో నను కాపాడినావు (2) / నా చేయి పట్టుకొని నను నడిపించినావు (2) / ఏమేమి మారినా నీ మాట మారదు (2) / అదియే నాకు బలమైన దుర్గము (2) ||దేవా|| / మా కష్ట కాలంలో మమ్ము కరుణించినావు (2) / ఏ రాయి తగలకుండా మము ఎత్తి పట్టినావు (2) / ఏమేమి మారినా నీ మాట మారదు (2) / అదియే నాకు బలమైన దుర్గము (2) ||దేవా||
నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా) / ఇలలో నీవే ఏకైక దేవుడవు (2) / ఆత్మతో సత్యముతో ఆరాధింతును / నీదు క్రియలు కొనియాడెదను (2) / అత్యున్నతుడా నా యేసయ్యా / నీవే నాకు నిజ రక్షకుడవు (2) ||నీకు|| / పరమందు దూతలు నిను పొగడుచుందురు / నీవే ప్రభువుల ప్రభువని (2) / నీ ఘన కీర్తిని వివరించగలనా / నా ప్రియుడా నా యేసయ్యా (2) ||అత్యున్నతుడా|| / ఆకాశమనాడు ఆసీనుడైనవాడా / నీ తట్టు కన్నులెత్తుచున్నాను (2) / ఊహించువాటి కంటే అత్యధికముగా / దయచేయువాడవు నీకే స్తోత్రం (2) ||అత్యున్నతుడా||
నీలాంటి ప్రేమ ఈ లోకాన / ఎవరైనా చూపారా? – (2) / నా పాపభారం ఆ సిలువపైన / ఎవరైనా మోశారా? – (2) / యేసయ్యా.. యేసయ్యా.. / యేసయ్యా.. ఓ యేసయ్యా (2) ||నీలాంటి|| / చెలికాడే నిన్ను సిలువకు పంపగా / పరిసయ్యులే నిన్ను పరిహసించగా (2) / నోరు తెరువని ప్రేమ / బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా|| / దొంగలే నిన్ను దూషించగను / నా అనువారే అపహసించగా (2) / నోరు తెరువని ప్రేమ / బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా|| / తండ్రి వీరు చేయునదేమో / ఎరుగరు కనుక క్షమియించుమని (2) / ప్రార్ధన చేసితివయ్యా / మము క్షమియించితివయ్యా (2) ||యేసయ్యా|| / నీ దివ్య ప్రేమను ప్రకటింతునయ్యా / ఆ ప్రేమ మార్గములో నడిచెదనయ్యా (2) / నీదు ప్రేమే నా గానం / నీ ప్రేమే నా భాగ్యం (2) ||యేసయ్యా||
నీలి ఆకాశంలో (2) / నీ నీతి రాజ్యంలో / నేనుండ గోరితి ప్రభువా ఆ… / నేనుండ గొరెద ప్రభువా (2) ||నీలి ఆకాశంలో|| / నా ప్రియుడు నా చెంతనున్నాడు / గోప రసమంత సువాసన కలవాడు / నా ప్రియుడు ఏదేను వనమాలి / కర్పూరాల పుష్పాల సమానుడు / అతని ఎడమచేయి నా తల క్రింద నుండగా / అతని కుడిచేయి నన్ను ఆదరించుచుండగా / ప్రేమతిశయముతో నేను మూర్చిల్లెద – (2) ||నీలి ఆకాశంలో|| / నా ప్రియునికి తలుపు తీయ నే లేవగా / నా ప్రాణప్రియుడు నాకే ఎదురాయెను / నా ప్రియుడు ధవళవర్ణుడేతెంచగా / ఆ రత్నాల వర్ణుడు నను తాకగా / నేను నిదురించిన మనసు మేలుకొన్నది / నా మనసంతా యేసుతో నిండగా / రక్షించి నను చేర్చె ఆ ప్రేమ పురమున – (2) ||నీలి ఆకాశంలో||
నీలో జీవించాలని / నీలోనే బ్రతకాలని (2) / యుగయుగాల నీతోనే ఉండాలని (2) / తుది శ్వాస వరకు నీలోనే నా గమ్యం (2) / యేసూ నువ్వే కావాలి / నా యేసూ నీతో ఉండాలి (2) ||నీలో|| / మిగిలింది నాకు నిత్య శోకము / ఈ నా జీవిత యాత్రలో / కన్నీళ్లే నాకు అన్న పానములై / భుజియించుచుంటిని నిత్యము ప్రభువా (2) / నీవు నాకు ప్రత్యక్షము అయిన వెంటనే (2) / నా దుఃఖ దినములన్ని సమాప్తమాయెను (2) ||యేసూ|| / కటిక చీకటే నాకు స్నేహమాయెను / అంధకారమే నాలో నాట్యమాడెను / ఎటు వైపు చూసినా వెలుగు కాన రాలేదు / మార్గమే తెలియక మతి చెలించెను (2) / నీ వైపు చూడగానే వెలుగు కలిగె దేవా (2) / నీ నామమే నాకు మార్గమాయెను (2) ||యేసూ||
నీలో సమస్తము సాధ్యమే (2) / మహొన్నతుడా యేసయ్యా / బలవంతుడా యేసయ్యా (2) / ఆరాధింతును – నిన్నే స్తుతియింతున్ (4) ||నీలో|| / అలసియున్న నా ప్రాణమును సేదదీర్చువాడవు / జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు (2) / ప్రార్థనలన్ని ఆలకించువాడవు నీవు / అడిగినవన్ని ఇచ్చేవాడవు నీవు (2) ||మహొన్నతుడా|| / శోధన వేదనలలో జయమిచ్చువాడవు / బుద్దియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు (2) / నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు / మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు (2) ||మహొన్నతుడా||
నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా / నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2) / వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా / నీ ప్రియమైన స్వాస్థ్యమును / రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను / నీ రాజ్య దండముతో ||నీతి|| / ప్రతి వాగ్ధానము నా కొరకేనని / ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2) / నిత్యమైన కృపతో నను బలపరచి / ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2) ||నీతి|| / పరిమళ వాసనగ నేనుండుటకు / పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు (2) / ప్రగతి పథములో నను నడిపించి / ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు (2) ||నీతి|| / నిత్య సీయోనులో నీతో నిలుచుటకు / నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు (2) / మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు / ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు (2) ||నీతి||
నీతి సూర్యుడా యేసు / ప్రాణ నాథుడా.. రావయ్యా / నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా / హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా / హల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా / యుగయుగములకు ప్రభువా / తరతరములకు రాజువా (2) / శరణటంచు నిన్ను వేడ / కరములెత్తి నిన్ను పిలువ (2) / పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న|| / వేల్పులలోనే ఘనుడా / పదివేలలో అతిప్రియుడా (2) / కృపా సత్య సంపూర్ణుడా / సర్వ శక్తి సంపన్నుడా (2) / పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న||