తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

నీ ప్రేమలో నుండి నన్ను|Nee Premalo Nundi Nannu

నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2) / శ్రమలైనను శత్రువైనను / నిన్ను నన్ను వేరు చేయలేవు / యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా / యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2) / క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో|| / జీవించుచున్నది నేను కాదు / క్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2) / ఏదేమైనా నాకు యేసే కావాలి / ఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా|| / నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం / నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2) / ఏమిచ్చినా నీకు స్తోత్రాలే / ఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా|| / ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను / నీ కోసమే నీ ప్రేమ కోసమే (2) / నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే / చావైననేమి అది లాభమే (2) ||యేసయ్యా||

నీ ప్రియ ప్రభుని సేవకై|Nee Priya Prabhuni Sevakai

నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే / పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2) / అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే (2) / ఆ వెలుగు ద్వారానే – నూతన మార్గము కలిగె (2) / సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే (2) ||నీ ప్రియ|| / తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి (2) / తన ప్రేమా హస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను (2) / యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్ (2) ||నీ ప్రియ|| / ఓ ప్రియుడా తలచితివా – నీ జన్మమే పాపమని (2) / ప్రభువే తన రక్తముతో – నీ పాపము క్షమియించె (2) / నీ యుల్లము ఆయన కాలయమే – జ్ఞాపకముంచుకొనుము (2) ||నీ ప్రియ|| / యెవరతని సేవించెదరో – ఫలమొందెదరంతమందు (2) / ఇతరులకు లేనట్టి – ఆ ఘనతను నీ కిచ్చె (2) / కృతజ్ఞుడవై కొనియాడు – ప్రభు పాద సన్నిధిని (2) ||నీ ప్రియ||

నీ రూపం నాలోన|Nee Roopam Naalona

నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీ / నీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ (2) / రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా (2) / ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2) / నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం|| / నా ముందు నీవు ఎడారులన్ని / నీటి ఊటలుగా మార్చెదవే (2) / దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2) / ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం|| / నా పాప స్వభావం తొలగించుమయ్యా / నీ మంచి ప్రేమ నాకీయుమా (2) / నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2) / హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం|| / అంధకారము వెలుగుగా మార్చి / శాంతి మార్గములో నడిపెదవే (2) / భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2) / భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం||

నీ సన్నిధిలో నేనున్న|Nee Sannidhilo Nenunna

నీ సన్నిధిలో నేనున్న చాలు – చాలు / నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలు / శ్రమ కాలమైనా తోడుగ నీవుండ / నీ నామ ధ్యానం నే చేతునయ్యా / నీతోనే నేను ఉంటానయ్యా (2) / నా జీవితాన నీవున్న చాలు – చాలయ్యా / నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలయ్యా ||నీ సన్నిధిలో|| / అర్పించినావు నా కొరకు నీ ప్రాణం / నా పాప భారం తొలగింప గోరి / నాతోనే నీవు ఉండాలని (2) / ఆశించినది నా రక్షణేగా – నీవు / నీతోనే నేను ఉంటాను ప్రభువా – యేసు ||నీ సన్నిధిలో|| / నను చంపబోయి సాతాను రాగా / నీ చేతి గాయం రక్షించునయ్యా / నీ ప్రేమయే నన్ను బ్రతికించునయ్యా (2) / నమ్మాను ప్రభువా నీదైన లోకం – లోకం / నీతోనే ఉన్నా అది నాకు సొంతం – సొంతం ||నీ సన్నిధిలో||

నీ స్నేహము|Nee Snehamu Entho Sathyamu

నీ స్నేహము ఎంతో సత్యము / ఆద్యంతము నా హృదిలో పదిలము (2) / నా సఖుడా ప్రియ యేసయ్య / నా హితుడా స్నేహితుడా (2) / నీవెంత గొప్ప వాడివయ్యా / నను ఆదరించినావయ్యా (2) / సింహాల బోనులో నా ప్రాణానికి / ప్రాణమైన నా విభుడవు / చెరసాలలోన సంకెళ్ళు విరచి / విడుదల నిచ్చిన రక్షక (2) / కన్న తల్లి కూడా నన్నెరుగక మునుపే / నన్నెరిగిన నా తండ్రివి ||నా సఖుడా|| / గొల్యాతయినా ఏ యుద్ధమైనా / విజయము నిచ్చిన వీరుడవు / పదివేలమంది నా వైపు కూలినా / నాతో నిలచిన ధీరుడవు (2) / నా దోశములను నీదు రక్తముతో / తుడిచివేసిన పరిశుద్ధుడవు ||నా సఖుడా|| / ఏ ఎన్నిక లేని నను ప్రేమించిన కృపామయుడవు / అందరు విడిచిన నన్నెన్నడు విడువని కరుణామయుడవు (2) / నిస్సారమైన నా జీవితములో / సారము పోసిన సజీవుడవు (2) ||నా సఖుడా||

నీ స్వరము|Nee Swaramu

నీ స్వరము వినిపించు ప్రభువా / నీ దాసుడాలకించున్ (2) / నీ వాక్యమును నేర్పించు / దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము|| / ఉదయమునే లేచి – నీ స్వరము వినుట / నాకు ఎంతో మధురము / దినమంతటి కొరకు – నను సిద్ధపరచు / రక్షించు ఆపదలనుండి – (2) ||నీ స్వరము|| / నీ వాక్యము చదివి – నీ స్వరము వినుచు / నేను సరి చేసికొందు / నీ మార్గములో – నడుచునట్లుగా / నేర్పించుము ఎల్లప్పుడూ – (2) ||నీ స్వరము|| / భయ భీతులలో – తుఫానులలో / నీ స్వరము వినిపించుము / అభయము నిమ్ము – ఓ గొప్ప దేవా / ధైర్య పరచుము నన్ను – (2) ||నీ స్వరము|| / నాతో మాట్లాడు – స్పష్టముగా ప్రభువా / నీ స్వరము నా కొరకే / నీతో మనుష్యులతో – సరిచేసికొందు / నీ దివ్య వాక్యము ద్వారా – (2) ||నీ స్వరము|| / నేర్చుకున్నాను – నా శ్రమల ద్వారా / నీ వాక్యమును ఎంతో / నన్నుంచుము ప్రభువా – నీ విశ్వాస్యతలో / నీ యందు నిలచునట్లు – (2) ||నీ స్వరము|| / నా హృదయములోని – చెడు తలంపులను / చేధించు నీ వాక్యము / నీ రూపమునకు – మార్చుము నన్ను / నీదు మహిమ కొరకేగా – (2) ||నీ స్వరము||