Songs sorted by number of likes. 1604 songs total.
నడవాలని యేసు నడవాలని / నడవాలని నీతో నడవాలని / నాకున్న ఆశ నీపైనే ధ్యాస (2) / నిరంతరం నీతోనే నడవాలని (2) / హానోకు నీతో నడిచాడు దేవ / పరలోకపు నడకతో చేరాడు నిన్ను ||నడవా|| / నోవాహు నీతో నడిచాడు దేవ / రక్షణనే ఓడలో రక్షింప బడెను ||నడవా|| / అబ్రాహాము నీతో నడిచాడు దేవ / విశ్వాసపు యాత్రలో సాగాడు నీతో ||నడవా|| / నా జీవితమంతా నీతో నడవాలని / నా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా ||నడవా||
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు (2) / అడుగులు తడబడినా – అలసట పైబడినా (2) / చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి (2) ||నడిపిస్తాడు|| / అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా (2) / తన చిత్తం నెరవేర్చుతాడు / గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు|| / కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా (2) / తన చిత్తం నెరవేర్చుతాడు / గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు|| / నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన (2) / తన చిత్తం నెరవేర్చుతాడు / గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||
నజరేతు పట్నాన నగుమల్లె దరని లొ / యొసేపు మరియమ్మ నగుమల్లె దరని లొ / హల్లెలుయ (x4) / మేము వెల్లి చూచినాము స్వామి యెసు నాదుని / ప్రెమ మ్రొక్కి వచినాము మామనమ్బు లల్లరగ / బెతలెము పురములొన బీద కన్య మరియకు / పేదగ సురూపు దాల్చి వెలసె పశుల పాకలొ / పేద వడ్ల వారి కన్య మరియమ్మ / ప్రెమ గల యేసు తల్లి మరియమ్మ / ప్రెమ గల్ల యెసు తల్లి / పెరెల్లిన దేవ దేవుడె యెసయ్య / ప్రెమ గల అవతారం / స్వర్గ ద్వరాలు తెరిచిరి యెసయ్య / స్వర్గ రాజు పుట్ట గనె యెసయ్య / స్వర్గ రాజు పుట్ట గనె / సరుగున దూతల్ వచిరి యెసయ్య / చక్కని పాటల్ పాడిరి / నువు బొయె దారి లొ యెరుశలెము / గుడి కాడ అచం మల్లె పూల తొట యెసయ్య / దొడ్డు దొడ్డు బైబిలు దొసిట్లొ పెట్టుకొని / దొరొల్లె బయిలెల్లి నాడె యెసయ్య / రాజులకు రాజు పుట్టన్నయ్య / రా రె చూడ మనం ఎల్లుదం అన్నయ్య / తారన్ జూచి తూర్పు గ్యనుల్ అన్నయ్య / తరలి నారె బెత్లహెమ్ అన్నయ్య / పద ర పొదాము రన్న / శ్రి యెసుని చూడ / పద ర పొదము రన్న / శ్రి యెసన్న నట లొక రక్షకుడట / శ్రి యెసన్న నట లొక రక్షకుడట / లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట / లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట / పద ర హెయ్ పద ర హెయ్ / పద ర పొదము రన్న / శ్రి యెసుని చూడ / పద ర పొదాము రన్న
నజరేయుడా నా యేసయ్య / ఎన్ని యుగాలకైనా / ఆరాధ్య దైవము నీవేనని / గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా|| / ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2) / శూన్యములో ఈ భూమిని / వ్రేలాడదీసిన నా యేసయ్య (2) / నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| / అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) / జలములలోబడి నే వెళ్ళినా / నన్నేమి చేయవు నా యేసయ్యా (2) / నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| / సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2) / సీయోనులో నిను చూడాలని / ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2) / నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
ఎర్రాటి సూరీడు పడమటికి పయణమైయ్యిండు / తెల్లాటి జాబిల్లి మల్లెవోలె వికసించింది / ఓరి ఐజాకు…. ఓఓ ఓఓ / లై లై లై .. లై లై లై / నల్లా నల్లాని చీకటి / ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2) / నల్లా నల్లని నీ హృదయము / యేసుకిస్తే తెల్లగ మారును (2) / తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె / దూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసె / తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె / దూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి (2) / సీకట్ల సుక్క బుట్టెరో / ఓరి ఐజాకు.. బెత్లెహేము ఎలిగి పాయెరో (2) / నీ మనస్సులో యేసు బుడితే / నీ బతుకే ఎలిగి పొవును (2) ||తూర్పున చుక్క|| / చల్లా చల్లాని చలిరో / ఓరి ఐజాకు.. ఎచ్చా ఎచ్చాని మంటారో / చల్లగుంటే సల్లారి పొతవ్ / ఎచ్చగుంటే యేసుతో ఉంటవ్ (2) ||తూర్పున చుక్క|| / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే (2) / నల్లా నల్లాని చీకటి / ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2) / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే (2)
నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా / కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా (2) / ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా / ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా (2) ||నలుగకుండ|| / పగలని బండనుండి జలములు హోరులు / విరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా (2) / పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా (2) / విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా (2) ||నలుగకుండ|| / రక్తము చిందకుండ పాపములు పోవునా / కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా (2) / అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా (2) / ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయా / బహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా ||నలుగకుండ||
నమ్మదగిన దేవుడా / నెమ్మదినిచ్చే యేసయ్యా (4) / నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా (2) / నీ తోడుంటే చాలయ్యా / భయమే నాకు లేదయ్యా (2) ||నీ తోడుంటే|| / శ్రమ అయినా బాధ అయినా / కరువైనా ఖడ్గమైనా (2) ||నీ తోడుంటే|| / కష్టమైనా కన్నీరైనా / కలతలైనా కలవరమైనా (2) ||నీ తోడుంటే|| / సాగరాలే ఎదురు నిలిచినా / శత్రువులంతా నన్ను తరిమినా (2) ||నీ తోడుంటే|| / భరువైనా భారమైనా / బాధ అయినా వేదనైనా (2) ||నీ తోడుంటే|| / ఎవరున్నా లేకున్నా / కలిమి అయినా లేమి అయినా (2) ||నీ తోడుంటే||
నమ్మదగిన దేవుడవు యేసయ్యా / నిత్య జీవమిచ్చు దేవుడవు నీవయ్యా (2) / నా తేజోమయుడా నాదు రక్షకా / నను విడిపించిన నా విమోచకా (2) / నీ శరణు జొచ్చితి ఆదరించుము / సేదదీర్చి నీ అక్కున చేర్చుము / యేసయ్యా… సేదదీర్చి నీ అక్కున చేర్చుము ||నమ్మదగిన|| / నా ప్రాణము దప్పిగొని ఆశపడెనే / నీ కృపా వార్తను వినిపించుము (2) / నా పూర్ణ హృదయముతో ఆత్మతో / కృతజ్ణతా స్తుతులు చెల్లించెదన్ (2) ||నీ శరణు|| / నా ప్రాణము ఆపదలో చిక్కుబడెనే / నను రక్షించుటకై చేయి చాచితివే (2) / పదితంతుల సితారతో గానముతో / స్తుతి గానం చేసి కీర్తించెదన్ (2) ||నీ శరణు||
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2) / నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2) / ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన|| / ఆప్తులైన వారే హాని చేయచూసినా / మిత్రులే నిలువకుండినా (2) / న్యాయము తీర్చే నీవు నాకుంటే (2) / చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| / జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా / నష్టమే మిగులుచుండినా (2) / శాపము బాపే నీవు నాకుంటే (2) / చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| / కష్ట కాలమందు గుండె జారిపోయినా / గమ్యమే తెలియకుండినా (2) / సాయము చేసే నీవు నాకుంటే (2) / చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
నమ్మకమైన నా ప్రభు / నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును || నమ్మకమైన || / కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడిన / స్థిరపరచి కాపాడిన / స్థిరపరచిన నా ప్రభున్ / పొగడి నే స్తుతింతును (2) || నమ్మకమైన || / ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభు / విడచియుంటినో ప్రభు / మన్ననతోడ నీ దరిన్ / చేర్చి నన్ క్షమించితివి (2) || నమ్మకమైన || / కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివి / పైకి లేవనెత్తితివి / భంగ పర్చు సైతానున్ / గెల్చి విజయమిచ్చితివి (2) || నమ్మకమైన || / నా కాశ్రయశైలమై – కోటగా నీవుంటివి / కోటగా నీవుంటివి / ప్రాకారంపు ఇంటివై / నన్ను దాచియుంటివి (2) || నమ్మకమైన || / సత్య సాక్షివై యుండి – నమ్మదగినవాడవై / నమ్మదగినవాడవై / నిత్యుడౌ మా దేవుడా / ఆమేనంచు పాడెద (2) || నమ్మకమైన ||
నమ్మకమైన నా స్నేహితుడు / నా ప్రభు యేసుడు (2) / ఎడబాయనివాడు విడువనివాడు (2) / నిన్న నేడు ఒకటిగనున్నవాడు ||నమ్మకమైన|| / ఆపదలో ఆనందములో నను వీడనివాడు (2) / వ్యాధిలో భాధలో (2) / నను స్వస్థపరచువాడు / అనుక్షణం నా ప్రక్కన నిలచి / ప్రతిక్షణం నా ప్రాణం కాచి (2) / అన్నివేళలా నన్నాదరించువాడు (2) / నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు (2) ||నమ్మకమైన|| / కలిమిలో లేమిలో నను కరుణించువాడు (2) / కలతలలో కన్నీళ్ళలో (2) / నను ఓదార్చువాడు / కన్నతల్లిని మించిన ప్రేమతో / అరచేతిలో నను దాచినవాడు (2) / ఎన్నడు నన్ను మరువనివాడు (2) / నా ప్రియ స్నేహితుడు నా ప్రాణ హితుడు (2) ||నమ్మకమైన||
నమ్మకు ఇలలో ఎవరిని / సాయం చేస్తారనుకొని (2) / నమ్ముకో రక్షకుడేసుని (2) / కార్యం చూడు నిలుచొని (2) ||నమ్మకు|| / సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు / చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు / అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు (2) / శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు (2) ||నమ్మకు|| / నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనే / మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే / నీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు (2) / దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు (2) ||నమ్మకు|| / నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి / జవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటి / సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు (2) / రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు (2) ||నమ్మకు||