Songs sorted by number of likes. 1604 songs total.
చిట్టి పొట్టి పాపను నేను / చిన్నారి పాపను నేను (2) / యేసయ్యా నిన్ను చూడాలని / నాకున్న చిన్ని ఆశ / యేసయ్యా నిన్ను చేరాలని / నాకున్న చిన్ని ఆశ ||చిట్టి|| / నీ సన్నిధిలోనే ఉండాలని / నాకున్న చిన్ని ఆశ / నీ సన్నిధిలో పాట పాడాలని / నాకున్న చిన్ని ఆశ ||చిట్టి|| / నీకై నేను జీవించాలని / నాకున్న చిన్ని ఆశ / నిన్నే నేను సేవించాలని / నాకున్న చిన్ని ఆశ ||చిట్టి||
నాకున్నది నీవేనని / నను కన్నది సిలువేనని (2) / నీవున్నది నాలోనని / నేనున్నది నీకేనని / సాక్ష్యమిచ్చెద యేసయ్యా / నీ సాక్షిగా బ్రతికించుమయ్యా ||నాకున్నది|| / గుడ్డివాడను నేనేనని / నీ చూపు ప్రసాదించేవని (2) / చెవిటి వాడను నేనేనని / నీ వినికిడి నేర్పించేవని ||సాక్ష్యమిచ్చెద|| / మూగవాడను నేనేనని / నీ మాటలు పలికించేవని (2) / అవిటివాడను నేనేనని / నీ నడకలు నేర్పించేవని ||సాక్ష్యమిచ్చెద||
నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం / మాలాంటి వారిదే పరలోక రాజ్యం (2) / మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే / పరలోక రాజ్యమని యేసు చెప్పెను (2) ||నాలాంటి|| / నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని / ముద్దాడి ముచ్చటించి దీవించెను (2) ||నాలాంటి||
నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమా / నాలోని సమస్తమా / అంధకారమైన లోకమునకు వెలుగై యుంటివి / నను వెలిగించే నా దీపమా / యేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. (2) / ఆకాశమునుండి వర్షింపజేయువాడవు / ఎండిన నేలను చిగురింపజేయువాడవు (2) / సృష్టికర్తా సర్వోన్నతుడా / మహోన్నతుడా నా యేసయ్యా (2) / కోతకాలములో పంటనిచ్చేవాడవు / భూమినుండి ఆహారం పుట్టించువాడవు (2) / సృష్టికర్తా సర్వోన్నతుడా / మహోన్నతుడా నా యేసయ్యా (2)
నాలో ఉన్న ఆనందం / నాకున్న సంతోషం / నా జీవన ఆధారం నీవే కదా (2) ||నాలో|| / నా ఆశ్రయము నా దుర్గము / నా కోట నీవే యేసు / నా బలము… నా యేసుడే (2) / గాఢాంధకారములో నే సంచరించిననూ / ఏ అపాయమునకు నే భయపడను (2) / నీ దుడ్డు కర్రయు నీ దండమును / నన్నాదరించును నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము|| / నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును / నన్నాదరించును నా వెంట వచ్చుఁను (2) / చిరకాలము నేను నీ మందిరావరణములో / నివాసము చేసెదను నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము||
నాలో ఉన్న ఆశలన్నియు / నాలో ఉన్న ఊహలన్నియు / నాలో ఉన్న ప్రాణమంతయు – నీవే యేసయ్యా (2) / యేసయ్యా నీవే నా మార్గం / యేసయ్యా నీవే నా సత్యం / యేసయ్యా నీవే నా జీవం / నీవే నా ప్రాణం / నాకున్నవన్ని నీకే యేసయ్యా / నాలోన నిన్ను దాచానేసయ్యా (2) / నీ చేతులలో నా రూపమునే ముద్రించితివి / నా పాపముల కొరకై నీవు బలి అయిపోతివి (2) / పరిశుద్ధమైన రక్తము ద్వారా / పాపాలన్ని కడిగివేసితివి ||యేసయ్యా|| / నా కోసమే ఈ భువికి వచ్చితివి / నా కోసమే నీ ప్రాణం ఇచ్చితివి (2) / నా హృదయములో నీ వాక్యమునే నే ఉంచితిని / నీ రాకకై నేను వేచి ఉంటిని (2) / పరిశుద్ధమైన నీ చేతులలో / నీ రూపములో నన్ను చేసితివి ||యేసయ్యా||
నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని / నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని / దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని / దేవా… యేసయ్యా నిన్ను చేరాలని / జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ / జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2) / మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ / మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్ / శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప / వేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి (2) / ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా / తరతరాలు మారినా మారని దేవుడా ||జీసస్|| / విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా / మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2) / తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద / నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును ||జీసస్||
నాతో మాట్లాడుమయ్యా – నన్ను దర్శించుమయ్యా / నీ మందిరాన – నీ సన్నిధాన – నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా / నాతో మాట్లాడుమయ్యా.. / యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా….. / కన్నీళ్ళైనా కష్టాలెదురైనా – కడవరకూ నను చేర్చుమయ్యా / కరువు తోడైనా – కలిమి వేరైనా – కరుణించి కాపాడుమయ్యా / నా వేదనలో నీ జాలితో – నా శోధనలో నీ చేతితో / నిత్యము నను నడిపించుమయ్యా.. / యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా….. / నావారే నన్ను నిందించు వేళ – నను విడిచి పోబోకుమయ్యా / ఆదరణ నాకు – కరువైన వేళ – దరి చేరి ఒదార్చుమయ్యా / నా నిందలలో నా తోడువై – అపనిందలలో నా చేరువై / నిత్యము నను నడిపించుమయ్యా.. / యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా….. / నా కాలు జారి తొట్రిల్లు వేళ – చేజార్చి నిలబెట్టుమయ్యా / సాతాను నన్ను – బంధించు వేళ – నను చేరి విడిపించుమయ్యా / నీ చేతితో నను పట్టుకో – నీ సేవలో నను వాడుకో / నిత్యము నను నడిపించుమయ్యా.. / యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా…..
నాతో నీవు మాటాడినచో / నే బ్రతికెదను ప్రభు (2) / నా ప్రియుడా నా హితుడా / నా ప్రాణ నాథుడా నా రక్షకా ||నాతో|| / యుద్ధమందు నేను మిద్దె మీద నుంచి / చూడరాని దృశ్యం కనుల గాంచినాను (2) / బుద్ధి మీరినాను హద్దు మీరినాను / లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం / ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు / ఒక్క మాట చాలు ప్రభు ||నాతో|| / కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను / వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము (2) / గ్రుడ్డి వాడనైతి గానుగీడ్చుచుంటి / దిక్కు లేక నేను దయను కోరుచుంటి / ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు / ఒక్క మాట చాలు ప్రభు ||నాతో||
నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ / నీ ప్రేమలోతు చవిచూపించు నిన్నే సేవించెదన్ / నీ ప్రేమనుండి నన్నెవ్వరు వేరుచేయరూ / నీ ప్రేమయందే నేను సంతసించెదన్ / యేసయ్యా నీవే నా ఆధారం (4) / శ్రమయైనా బాధయైనా వ్యధయైనా ధుఖఃమైనా / కరువైనా ఖడ్గమైనా హింసయైనా యేదైనా / క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా / క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్ / యేసయ్యా నీవే నా ఆధారం (4) / జీవమైనా మరణమైనా దూతలైనా ప్రధానులైనా / ఉన్నవియైనా రాబోవునవైనా యెత్తైనా లోతైనా / క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా / క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్ / యేసయ్యా నీవే నా ఆధారం (4) ||నాతో నీవు||
నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా (2) / నీవు పలికితే నాకు మేలయ్యా (2) / నీ దర్శనమే నాకు చాలయ్యా (2) ||నాతో|| / నీ వాక్యమే నన్ను బ్రతికించేది / నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు పలికితే|| / నీ వాక్యమే స్వస్థత కలిగించేది / నా వేదనలో ఆదరణిచ్చేది (2) ||నీవు పలికితే|| / నీ వాక్యమే నన్ను నడిపించేది / నా మార్గములో వెలుతురునిచ్చేది (2) ||నీవు పలికితే||
నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ / నావన్ని కృపచేత నీవలన నొందిన (2) / భావంబునను నేను బహుదైర్యమొందెద ||నావన్ని|| / నీకు నా ప్రాణము నిజముగా నర్పించి (2) / నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని|| / సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని (2) / నిత్యంబు గరముల నీ సేవ జేసెద ||నావన్ని|| / నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు (2) / ఆశచే నడిపించు మరల నా పదములు ||నావన్ని|| / పెదవులతో నేను బెంపుగ నీ వార్త (2) / గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి ||నావన్ని|| / నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ (2) / యావంత యైనను నాశింప మదిలోన ||నావన్ని|| / నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే (2) / సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు ||నావన్ని|| / చిత్తము నీ కృపా యత్తంబు గావించి (2) / మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము ||నావన్ని|| / హృదయంబు నీకిత్తు సదనంబు గావించి (2) / పదిలంబుగా దాని బట్టి కాపాడుము ||నావన్ని||