తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

నాదు జీవమాయనే|Naadu Jeevamaayene

నాదు జీవమాయనే నా సమస్తము / నా సర్వస్వమేసుకే నాదు జీవము / నాదు దైవము – దివి దివ్య తేజము (2) ||నాదు|| / కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెను / చుక్కాని లేని – నావ వలె నేనుండ – అద్దరికి చేర్చెను / ఆత్మతో నింపెను – ఆలోచన చెప్పెను (2) ||నాదు|| / సాతాను బంధీనై – కుములుచున్న వేళ – విడిపించెను శ్రీ యేసుడు / రక్తమంత కార్చి – ప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెను / సాతానుని అణగద్రొక్కన్ – అధికారం బలమిచ్చెను (2) ||నాదు|| / కారు మేఘాలెన్నో – క్రమ్మిన వేళ – నీతిసుర్యుడు నడుపును / తూఫానులెన్నో – చెలరేగి లేచిననూ – నడుపును నా జీవిత నావ / త్వరలో ప్రభు దిగివచ్చును – తరలి పోదును ప్రభునితో (2) ||నాదు||

నాదు జీవితము|Naadu Jeevithamu

నాదు జీవితము మారిపొయినది / నిన్నాశ్రయించిన వేళ / నన్నాదుకుంటివి ప్రభువా ||నాదు|| / చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2) / పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా / నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| / కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2) / నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా / నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| / లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే (2) / ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా / నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| / జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా (2) / చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా / నే పాపినయ్యా ప్రభువా.. ||నాదు|| / ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై (2) / ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి / నన్నెంతగా ప్రేమించితివి.. ||నాదు||

నాకెన్నో మేలులు చేసితివే|Naakenno melulu chesithive

నాకెన్నో మేలులు చేసితివే / నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును (2) / హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే (2) ||నాకెన్నో|| / కృప చేత నన్ను రక్షించినావే / కృప వెంబడి కృపతో – నను బలపరచితివే / నన్నెంతగానో ప్రేమించినావే / నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే (2) ||హల్లెలూయా|| / నాకిక ఆశలు లేవనుకొనగా / నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే / నలుదిశల నన్ను భయమావరింప / నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే (2) ||హల్లెలూయా|| / నా కాడి మోసి నా తోడు నీవే / నీ చేతి నీడలో – నను దాచియున్నావే / ఏ కీడు నాకు రాకుండ చేసి / నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2) ||హల్లెలూయా|| / నీ రాజ్యమందు నను చేర్చుకొందువు / రానున్న రారాజువు – నా రాజువు నీవు / నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు / నను కొన్నవాడవు – నా వరుడవు నీవు (2) ||హల్లెలూయా||

Most Popular Telugu Songs — Page 70 | UEC Telugu Church