Songs sorted by number of likes. 1604 songs total.
నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా / నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా / యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును / నా దేహమే యాగముగా అర్పించిన చాలునా ||నా జీవిత|| / నా బాల్యమంతా నా తోడుగ నిలిచి / ప్రతి కీడు నుండి తప్పించినావు / యవ్వనకాలమున నే త్రోవ తొలగిన / మన్నించి నాతోనే కొనసాగినావు / ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో / నను దైర్యపరిచి నను ఆదుకున్నావు / యేసు నీవే నీవే యేసు… నీవే నా సర్వస్వమూ ||నా జీవిత|| / కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే / సంతోష ఉదయాలు నాకిచ్చినావు / హృదయాశలన్ని నెరవేర్చినావు / యోగ్యుడను కాకున్న హెచ్చించినావు / ఎంతో ప్రేమ మితిలేని కృపను / నాపై చూపించి నను హత్తుకున్నావు / యేసు నీవే నీవే యేసు… నీవే నా ఆనందమూ ||నా జీవిత||
నా జీవిత వ్యధలందు యేసే జవాబు / యేసే జవాబు – ప్రభు యేసే జవాబు (2) ||నా జీవిత|| / తీరని మమతలతో ఆరని మంటలలో / ఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే (2) / నను గని వచ్చెను – తన కృప నిచ్చెను / కరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత|| / చీకటి వీధులలో నీటుగా నడచితిని / లోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని (2) / నను గని వచ్చెను – తన కృప నిచ్చెను / కరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత|| / హంగుల వేషముతో రంగుల వలయములో / నింగికి నేనెగిరి నేలను రాలితిని (2) / నను గని వచ్చెను – తన కృప నిచ్చెను / కరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత||
నా జీవిత యాత్రలో / ప్రభువా నీ పాదమే శరణం / ఈ లోకమునందు నీవు తప్ప / వేరే ఆశ్రయం లేదు (2) ||నా జీవిత|| / పలు విధ శోధన కష్టములు / ఆవరించియుండగా (2) / కలత చెందుచున్న హృదయమును / కదలక కాపాడుము (2) ||నా జీవిత|| / నీ సన్నిధిలో సంపూర్ణమైన / సంతోషము కలదు (2) / నీదు కుడి హస్తములో నిత్యమున / నాకు సుఖ క్షేమముగా (2) ||నా జీవిత|| / ఈ లోక నటన ఆశలన్నియు / తరిగిపోవుచుండగా (2) / మారని వాగ్ధానములన్నియు / నే నమ్మి సాగెదను (2) ||నా జీవిత|| / ముందున్న సంతోషము తలంచి / నిందలను సహించి (2) / నీ సిలువను నే మోయుటకై / నీ కృప నాకీయుము (2) ||నా జీవిత|| / సీయోను యొక్క ఆలోచనతో / సదా నడిపించుము (2) / మహిమలో నీతోనే నిల్చుటకు / నా తండ్రి దయచూపుము (2) ||నా జీవిత||
నా జీవితాంతము / నీ సేవ చేతునంటిని / నే బ్రతుకు కాలము / నీతోనే నడుతునంటిని / నా మనవి వింటివి / నన్నాదుకొంటివి (2) ||నా జీవితాంతము|| / నీ ప్రేమ చూపించి / నన్ను నీవు పిలిచితివి / నీ శక్తి పంపించి / బలపరచి నిలిపితివి (2) / నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| / రోగముతో పలుమార్లు / పడియుండ లేపితివి / ఘోరమై పోకుండా / స్థిరపరచి కాచితివి (2) / నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| / దూషించు దుష్టులకు / సిగ్గును కలిగించితివి / వేలాది ఆత్మలకు / మేలుగ నన్నుంచితివి (2) / నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| / సంఘములు కట్టుటకు / సామర్ధ్యమిచ్చితివి / ఉపదేశమిచ్చుటకు / దేశములు తిప్పితివి (2) / నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||
నా జీవితం ప్రభు నీకంకితం / నీ సేవకై నే అర్పింతును (2) / నీ మహిమను నేను అనుభవించుటకు / నను కలుగజేసియున్నావు దేవా (2) / నీ నామమును మహిమ పరచు / బ్రతుకు నాకనుగ్రహించు (2) ||నా జీవితం|| / కీర్తింతును నా దేవుని నే / ఉన్నంత కాలం (2) / తేజోమయా నా దైవమా / నీ కీర్తిని వర్ణించెద (2) ||నా జీవితం||
నా కలవరములన్ని కనుమరుగు చేసినావు / నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు – (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| / నీ చేయి నన్ను సంరక్షించెను / నా శత్రువులు కీడు చేయలేకపోయిరి (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| / యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివి / శాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| / బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు / జీవిత కాలమంతా నాకు కీడే లేదు (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| / నిన్ను నమ్మువారు సీయోనులో చేరి / నిత్యానందపు భాగ్యమును పొందెదరు (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||
నా కన్నులెత్తి వేచియుందును / నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తుని / నా ప్రాణముతో సన్నుతింతును / కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తుని ||నా కన్నులెత్తి|| / మహిమా ఘనతా – యేసు నీ నామముకే / ఉత్సాహ ధ్వనులతో / స్తుతి నిత్యము చేసెదన్ (3) ||నా కన్నులెత్తి||
నా కనుచూపు మేర – యేసు నీ ప్రేమ / పొంగి పారెనే – పొంగి పారెనే (2) / నే ప్రేమింతును – నా యేసుని మనసారా (2) / ఆరిపోవు లోక ప్రేమల కన్నా / ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) ||నా కనుచూపు|| / నా కన్నీటిని తుడిచినా ప్రేమ / నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ (2) / ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ / నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| / నా దీన స్థితిని చూచిన ప్రేమ / తన శాశ్వత ప్రేమతో (నను) పిలిచిన ప్రేమ (2) / ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ / నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| / నా భారంబును మోసిన ప్రేమ / సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ (2) / ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ / నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు||
నా కనుల వెంబడి కన్నీరు రానీయక / నా ముఖములో దుఖమే ఉండనీయక / చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2) / ఆరాధనా ఆరాధనా నీకే (4) ||నా కనుల|| / అవమానాలను ఆశీర్వాదముగా / నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2) / నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2) ||చిరునవ్వుతో|| / సంతృప్తి లేని నా జీవితములో / సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2) / నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2) ||చిరునవ్వుతో||
నా కొరకై అన్నియు చేసెను యేసు / నాకింకా భయము లేదు లోకములో (2) / నా కొరకై అన్నియు చేసినందులకు (2) / నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2) ||నా కొరకై|| / క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను / క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2) / క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2) / ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2) ||నా కొరకై|| / ఆకాశ పక్షులను గమనించుడి / విత్తవు అవి పంట కోయవు (2) / వాటిని పోషించునట్టి పరమ పితా (2) / మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును (2) ||నా కొరకై|| / ఏమి ధరింతుమని చింతపడకు / అడవి పువ్వులను తేరి చూడుము (2) / అడవి పువ్వుల ప్రభు అలంకరింప (2) / తానె – నిశ్చయముగా అలంకరించును (2) ||నా కొరకై|| / రేపటి దినము గూర్చి చింత పడకు / ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు (2) / రేపు దాని సంగతులనదే చింతించున్ (2) / ఏ – నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2) ||నా కొరకై|| / ఆశీర్వదించెడి యేసు అరణ్యములో / పోషించెను ఐదు వేల మందిని కూడా (2) / తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2) / యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై (2) ||నా కొరకై||
నా కొరకు బలియైన ప్రేమ / బహు శ్రమలు భరియించె ప్రేమ (2) / కడు ఘోర కఠిన శిక్ష సహియించె ప్రేమ (2) / తుది శ్వాసనైన నాకై అర్పించె ప్రేమ (2) / క్రీస్తేసు ప్రేమ ||నా కొరకు|| / నా హృదయ యోచనే జరిగించె పాపము / నా క్రియల దోషమే నడిపించె పతనముకై (2) / ఏ మంచి యుందని ప్రేమించినావయ్యా / నా ఘోర పాపముకై మరణించినావయ్యా / ఉన్నత ప్రేమ చూపి రక్షించినావయ్యా (2) / నా మంచి యేసయ్యా (2) ||నా కొరకు|| / నీ సిలువ త్యాగము నా రక్షణాధారం / నీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం (2) / అర్హతే లేని నాకై మరణించినావయ్యా / నీ మరణ త్యాగమే బ్రతికించె యేసయ్యా / ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలనయ్యా / ప్రాణాత్మ దేహముతో స్తుతియింతు యేసయ్యా / ఘనపరతు యేసయ్యా (2) ||నా కొరకు||
నా కృప నీకు చాలని / నా దయ నీపై ఉన్నదని / నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని / నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని / నాతో మాట్లాడిన మహోన్నతుడా / నన్నాదరించిన నజరేయ (2) ||నా కృప|| / నేను నీకు తోడైయున్నానని / పొంగే జలములు నిన్నేమి చేయలేవని (2) / నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును (2) / పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2) ||నాతో|| / పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని / ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని (2) / నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని (2) / జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని (2) ||నాతో||