తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

నా మార్గమందు|Naa Maargamandu

నా మార్గమందు నా కంటె ముందు / నడిచావయ్యా నా యేసయ్యా / పరలోకమందు నేనుండాలని / ఒక స్థలమును సిద్ధపరిచావయ్యా (2) / నిందలు అవమానములెన్నో సహియించి – సహియించి / సిలువలో నా శాపములన్ని భరియించి – భరియించి / అడ్డుగా ఉన్న పాపములన్ని క్షమియించి – క్షమియించి / మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసి… / (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు / నన్ను… నీ సాక్షిగా నిలిపినావు (2) / నీ ప్రేమను – ప్రకటించుటకు / నీ చిత్తము – నెరవేర్చుటకు / నీ సేవలో – కొనసాగుటకు / నీ మహిమలో – నేనుండుటకు / (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు / నన్ను… నీ సాక్షిగా నిలిపినావు (2) / నా యేసయ్యా – నీ సాక్షిగా నిలిపినావు – (2)

నా నాథుడా|Naa Naathudaa

నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2) / అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని (2) / పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్ ||నా నాథుడా|| / దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ (2) / యావత్తు పెంటయనుచు (2) నిదిగో ||నా నాథుడా|| / ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా (2) / ఆశ కల్గించు నాలోన (2) నీవే ||నా నాథుడా|| / పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా (2) / కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు ||నా నాథుడా|| / భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి (2) / పాతకుడ నేనైతిని (2) మహా ||నా నాథుడా|| / ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ (2) / సదయుడా నన్ను చూడుమా (2) యిపుడు ||నా నాథుడా|| / హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను (2) / ఉల్లమందానంద ధ్వని (2) యిదియే ||నా నాథుడా||

నా నీతి సూర్యుడా|Naa Neethi Suryudaa

నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా / నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా / సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని / నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా / సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని / రాజులకే మహారాజువు – కృప చూపే దేవుడవు / నిడిపించే నజరేయూడ – కాపాడే కపరివి / నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా / సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని / రాజులకే మహారాజువు – కృప చూపే దేవుడవు / నిడిపించే నజరేయూడ – కాపాడే కపరివి / శ్రమలలో బహుశ్రమలలో – ఆదరణ కలిగించేను / వాక్యమే కృపావక్యమే – నను వీడని అంబంధమై / శ్రమలలో బహుశ్రమలలో – ఆదరణ కలిగించేను / వాక్యమే కృపావక్యమే – నను వీడని అంబంధమై / ని మాటలే జలధరలై – సంప్తృప్తి నిచ్చెను / ని మాటలే ఔషదమై – గాయములు కట్టెను / నీ మాటే మధురం… / రాజులకే మహారాజువు – కృపాచూపే దేవుడవు / నడిపించే నజరేయూడ – కాపాడే కాపరివి / నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా / సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని / మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు / ఏదియు కోడువచేయవు నిన్నశ్రయించినా వారికి / మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు / ఏదియు కోడువచేయవు నిన్నశ్రయించినా వారికి / భీకరమైన కార్యములు చేయుచున్నవాడా / సజీవుడావై అధికస్తోత్రము పొందుచున్నవాడా / ఘనపరతును నిన్నే… / ప్రేమించే యెసయ్యా నివుంటే చలునయ్యా / నడిపించే నజరేయూడ – కాపాడే కాపరివి / నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా / సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని / సంఘమై నీ స్వాస్థ్యమై – నన్ను ని యెదుట నిలపాలని / ఆత్మతో మహిమాత్మతో – నన్ను ముద్రించియున్నావు నీవు / సంఘమై నీ స్వాస్థ్యమై – నన్ను ని యెదుట నిలపాలని / ఆత్మతో మహిమాత్మతో – నన్ను ముద్రించియున్నావు నీవు / వరములతో ఫలములతో నీకై బ్రతకాలని / తిదిశ్వాస నీ సన్నిదిలో విజయం చూడాలని / ఆశతో ఉన్నానయా… / కరుణించే యెసయ్యా నీ కోసమే నా జీవితం / నిను చేరే ఆశయం తీరాలయ్యా / నిను చూసే ఆ క్షణం రావాలయ్య / నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా / సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని / రాజులకే మహారాజువు – కృపాచూపే దేవుడవు / నడిపించే నజరేయూడ – కాపాడే కాపరివి

నా ప్రాణ నాథా|Naa Praana Naathaa

నా ప్రాణ నాథా – నా యేసు నాథా / స్తుతించెదన్ నిన్నే దేవా / స్తుతి స్తుతి స్తుతి – స్తుతి ఆరాధన / స్తుతించెదన్ దేవ దేవా / ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్… / ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్… / ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్… / ఓహ్.. ఓహ్.. / ఓహ్ ద గాడ్ ఆఫ్ ఎబ్రహామ్ / ఓహ్ ద గాడ్ ఆఫ్ జేకబ్ / నా ద్రాక్ష వల్లి – నా గొర్రెపిల్ల / నా ద్వారమైయున్న దేవా ||ఓహ్.. ఓహ్..|| / నా జీవా-హారమా – నా సత్య మార్గమా / నా పునరుత్తానమైన దేవా ||ఓహ్.. ఓహ్..|| / నా జీవ జలమా – నా ప్రాణ ప్రియుడా / నా నిత్య వెలుగైన దేవా ||ఓహ్.. ఓహ్..|| / ఐ లిఫ్ట్ మై అయిస్ ఇన్ ద టైం ఆఫ్ మై నీడ్ / ఐ ఆస్క్ మై నీడ్ ఆన్ మై నీస్ / ఐ వర్షిప్ యు ఇన్ ద స్పిరిట్ అండ్ ద ట్రూత్ / ఐ అడోర్ యు, మై ఫాదర్. ||ఓహ్.. ఓహ్..||

నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా|Naa Praana Priyudaa Naa Yesayyaa

నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా / నను గన్న తండ్రి నా యేసయ్యా / పూజింతును ఓ పూజార్హుడా / భజియింతును ఓ భవదీయుడా / నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా (2) / నీవే నీవే నా ప్రాణము / నీవే నీవే నా సర్వము ||నా ప్రాణ|| / ఒంటరినై తోడులేక దూరమైతిని / ఓదార్చే వారు లేక భారమైతిని (2) / తండ్రీ… నీ తోడు లేక మోడునైతిని (2) / నీ తోడు దొరికాక చిగురించితిని (2) ||నీవు గాక|| / శత్రువుల చేతులలో చిక్కుకొంటిని / సూటిపోటి మాటలకు నలిగిపోతిని (2) / తండ్రీ… నీ వైపు నేను చూసిన క్షణమే / కష్టమంతయు తీరిపోయెను / బాధలన్నియు తొలగిపోయెను ||నీవు గాక|| / క్షణమైన నీ నామం మరువకుంటిని / మరణమైన మధురంగా ఎంచుకుంటిని (2) / తండ్రీ… నీవున్నావని బ్రతుకుచుంటిని (2) / నా కొరకు నీవు నీ కొరకు నేను (2) ||నీవు గాక||

నా ప్రాణమా ఏలనే|Naa Praanamaa Aelane

నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమా / సంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమా / ఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు (2) / నెమరేసుకుంటూ ప్రాణమా / స్తుతిపాడుమా – స్తుతిపాడుమా ||నా ప్రాణమా|| / నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడు / నీ కొరకు సిలువలోన తాను మరణించాడు (2) / నా ప్రాణమా ఈ సత్యం గమనించుమా / నీవు కూడా తన కార్యం పాటించుమా (2) / అలనాటి యేసు ప్రేమ మరువకు సుమా / మరువకు సుమా – మరువకు సుమా ||నా ప్రాణమా|| / నీ శత్రుసేననంతా మిత్రులుగ మార్చాడు / నీ వ్యాధి బాధలందు నిన్ను ఓదార్చాడు (2) / నా ప్రాణమా నాలో కరిగిపోకే / నీ గతం ఏమిటో మరచిపోకే (2) / దినమెల్ల దేవుని దయ కోరుమా / దయ కోరుమా – దయ కోరుమా ||నా ప్రాణమా|| / నీ చదువులోన నీకు విజయాన్ని ఇచ్చాడు / నీ వయసులో నీకు తోడుగా ఉన్నాడు (2) / నా ప్రాణమా నాలో కృంగిపోకే / నీ గతం ఏమిటో మరచిపోకే (2) / దినమెల్ల దేవుని కృప కోరుమా / కృప కోరుమా – కృప కోరుమా ||నా ప్రాణమా||

నా ప్రాణమా దిగులెందుకు|Naa Praanamaa Digulenduku

నా ప్రాణమా దిగులెందుకు – నీ రక్షకుని స్మరియించుకో / మహిమోన్నతుడు బలవంతుడు – నీ పక్షమునే నిలిచెను చూడు / లేవరా వీరుడా – నిరాశను వీడరా / నీ రాజు నిన్ను పిలిచెను – కదులు ముందుకు కదులు ముందుకు / అసాధ్యుడే నీకుండగా – అసాధ్యము నీకుండునా / భయము వీడి నడవరా – జయము నీదే జయము నీదే ౹౹నా ప్రాణమా|| / యేసులో విశ్వాసమే నీ చేతిలోని ఆయుధం / విడువకుండ పట్టుకో ఎన్ని శ్రమలు నీకు కలిగినా / లేమిలో కొలిమిలో ఒంటరివి కావు ఎన్నడూ / యేసు నీతో ఉండును నీ సహాయమాయనే / నీవు వెంబడించువాడు నీవు నమ్మదగిన దేవుడు / నీ శ్రమలు దూరపరచును నిన్ను గొప్పగా హెచ్చించును (2) ||నా ప్రాణమా|| / గర్జించు సింహమువలె సాతాను వెంటపడినను / ఎదురు తిరిగి నిలబడు వాడు నిలువలేకపోవును / జయించెనేసు ఎన్నడో సాతాను ఓడిపోయెను / నీ ఎదుటనున్న శత్రువు ప్రభావము శూన్యమే / నీలోన ఉన్నవాడు లోకములనేలువాడు / నిర్భయముగా సాగిపో నిన్ను ఆపలేరు ఎవ్వరు (2) ||నా ప్రాణమా|| / నీవు ఎక్కలేని కొండను ఎక్కించును నీ దేవుడు / నీవు చేరలేని ఎత్తుకు నిన్ను మోయునాయనే / నీ ప్రయాస కాదు వ్యర్థము యేసు గొప్ప ఫలము దాచెను / తన తండ్రి ఇంట నీకును సిద్ధపరచెను నివాసము / ఊహించలేని మహిమతో ప్రభువు నిన్ను నింపివేయును / ఆశ్చర్యమైన స్వాస్థ్యము నీ చేతికప్పగించును (2) ౹౹నా ప్రాణమా||

Most Popular Telugu Songs — Page 66 | UEC Telugu Church