తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

నా దేవుని గుడారములో|Naa Devuni Gudaaramulo

నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో (2) / ఎంతో సంతోషం – ఎంతో ఆనందం (2) / నా యేసుని నివాసములో (2) ||నా దేవుని|| / సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదా / రాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా (2) / నా కొండ నీవేగా – నా కోట నీవేగా (2) / నా యేసు రక్షకా నీవే కదా (2) ||నా దేవుని|| / నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదను / నా యేసు స్వరమును వినుచు – నేను కాలము మరచెదను (2) / నా గానమాయెనే – నా ధ్యానమాయెనే (2) / నాదు స్వరము నా ప్రభువే (2) ||నా దేవుని|| / ఆనంద తైలము నందు – నన్ను అభిషేకించెనుగా / నాదు వస్త్రము నందు – అగరు వాసన నింపెనుగా (2) / నా ప్రాణ నాథుడా – నా ప్రేమ పాత్రుడా (2) / నా యేసు నాథుడా నీవే కదా (2) ||నా దేవుని||

నా గీతారాధనలో|Naa Geethaaraadhanalo

నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే / నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2) ||నా గీతా|| / నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే / చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2) / నీ కృప నాలో అత్యున్నతమై / నీతో నన్ను అంటు కట్టెనే (2) ||నా గీతా|| / చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా / సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే (2) / నిశ్చలమైన రాజ్యము కొరకే / ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) ||నా గీతా|| / ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే / ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే (2) / ఆత్మతో సత్యముతో ఆరాధించుచు / నే వేచియుందునే నీ రాకడకై (2) ||నా గీతా||

నా గుడారము క్షేమమని|Naa Gudaaramu Kshemamani

నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి (2) / నా ఇంటి వస్తువులు లెక్క చూడగా (2) / ఏదియు నాకు నష్టముండదు (2) ||నా గుడారము|| / కంచె వేసితివి నా చుట్టు నీవు / ఘనముగా చెప్పితివి నా విషయమై (2) / రాజ్యములు జయించితిని విశ్వాసముతో (2) / కృప వెంబడి కృప చూపుచుండగా (2) / నా కుటుంబీకులు పచ్చిక వలెను / విస్తారమగును నా సంతానము (2) / ఆకు వాడక తన కాలమందున (2) / ఫలమిచ్చుఁ చెట్టు వలె నేనుందును (2) / పితరులు చూడని వాగ్ధాన ఫలమును / అనుభవించుచుంటిని నీ దయతో (2) / విశ్వాస వీరుడనై నీ ముఖము చూచుచు (2) / మరి శ్రేష్ఠమైన దేశము చేరెదను (2) / ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు / పూర్ణ వయస్సుతో నేను నిన్ను చేరెద (2) / నా చేతి పనులన్ని సఫలము చేసి (2) / ఆశీర్వాదము నా సొత్తు చేసితివి (2) / యాత్రికుడనై పరదేశిగా నేను / నివసించుచుంటిని గుడారాలలో (2) / మరి శ్రేష్ఠ పునరుత్తానం పొందుటకై (2) / మరచిపోతిని నా జన్మ భూమిని (2) ||నా గుడారము||

నా హృదయాన కొలువైన|Naa Hrudayaana Koluvaina

నా హృదయాన కొలువైన యేసయ్యా / నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా / నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే / నీ సన్నిధిలో పూజార్హుడా (2) ||నా హృదయాన|| / అగ్ని ఏడంతలై – మండుచుండినను / అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను (2) / అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే (2) / నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే / నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2) ||నా హృదయాన|| / అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో / నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే (2) / నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2) / నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే / నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2) ||నా హృదయాన|| / విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు / ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా (2) / సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే (2) / నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే / నా సర్వము నీకే అర్పింతును (2) ||నా హృదయాన||

నా హృదయములో నీ మాటలే|Naa Hrudayamulo Nee Maatale

నా హృదయములో నీ మాటలే / నా కనులకు కాంతి రేఖలు (2) / కారు చీకటిలో కలువరి కిరణమై / కఠిన హృదయమును కరిగించిన / నీ కార్యములను వివరింప తరమా / నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2) ||నా హృదయములో|| / మనస్సులో నెమ్మదిని కలిగించుటకు / మంచు వలె కృపను కురిపించితివి (2) / విచారములు కొట్టి వేసి / విజయానందముతో నింపినావు / నీరు పారేటి తోటగా చేసి / సత్తువ గల భూమిగా మార్చినావు ||నీ కార్యములను|| / విరజిమ్మే ఉదయ కాంతిలో / నిరీక్షణ ధైర్యమును కలిగించి (2) / అగ్ని శోధనలు జయించుటకు / మహిమాత్మతో నింపినావు / ఆర్పజాలని జ్వాలగా చేసి / దీప స్తంభముగా నను నిలిపినావు ||నీ కార్యములను|| / పవిత్రురాలైన కన్యకగా / పరిశుద్ధ జీవితము చేయుటకు (2) / పావన రక్తముతో కడిగి / పరమానందముతో నింపినావు / సిద్ధపడుచున్న వధువుగా చేసి / సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు ||నీ కార్యములను||

నా జీవం నీ కృపలో|Naa Jeevam Nee Krupalo

నా జీవం నీ కృపలో దాచితివే / నా జీవిత కాలమంతా / ప్రభువా నీవే నా ఆశ్రయం / నా ఆశ్రయం ||నా జీవం|| / పాపపు ఊబిలో పడి కృంగిన నాకు / నిత్య జీవమిచ్చితివే (2) / పావురము వలె నీ సన్నిధిలో / జీవింప పిలచితివే (2) ||నా జీవం|| / ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము / అడ్డురానే వచ్చెనే (2) / నీ బాహు బలమే నన్ను దాటించి / శత్రువునే కూల్చెనే (2) ||నా జీవం|| / కానాను యాత్రలో యొర్దాను అలలచే / కలత చెందితినే (2) / కాపరివైన నీవు దహించు అగ్నిగా / నా ముందు నడచితివే (2) ||నా జీవం|| / వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము / నన్ను వెంటాడెనే (2) / వాక్యమైయున్న నీ సహవాసము / ధైర్యము పుట్టించెనే (2) ||నా జీవం|| / స్తుతుల మధ్యలో నివసించువాడా / స్తుతికి పాత్రుడా (2) / స్తుతి యాగముగా నీ సేవలో / ప్రాణార్పణ చేతునే (2) ||నా జీవం||

నా జీవిత భాగస్వామివి|Naa Jeevitha Bhaagaswaamivi

నా జీవిత భాగస్వామివి నీవు / నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2) / నాకే సమృద్దిగా నీ కృపను పంచావు / నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా (2) / నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి / నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి (2) / నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి / నీ సైన్యములో నన్ను చేర్చితివి (2) ||నా జీవిత|| / నీ దయగల మాటలే చేరదీసినవి / నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి (2) / నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి / నీ విందుశాలకు నను చేర్చితివి (2) ||నా జీవిత|| / నీ దయగల తలంపులే రూపునిచ్చినవి / నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి (2) / నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు / నీ అంతఃపురములో నను చేర్చుదువు (2) ||నా జీవిత||