తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

జీవము గల దేవుని సంఘం|Jeevamugala Devuni Sangham

జీవము గల దేవుని సంఘం – ఎంతో ఎంతో రమ్యము / మనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠము / సంకల్పమందున మనముండినా / ఆ సంఘమందున వసియించినా / ఎంతో ఎంతో ధన్యము – (2) ||జీవము|| / యేసే స్వరక్తమిచ్చి – సంపాదించిన సంఘము / సత్యమునకు స్థంభమును – ఆధారమునైయున్నది (2) / పాతాళలోక ద్వారములు / దాని ఎదుట నిలువవు (2) ||జీవము|| / యేసే శిరస్సైయున్న – శరీరము మనమందరము / పరిశుద్ధాత్మ మనలో – నివసించుచున్నాడు (2) / ఏ నరుడు దేవుని నిలయమును / పాడు చేయకూడదు (2) ||జీవము|| / యవ్వన ప్రాయము మనలో – భవ్యానికి భయపడక / సవ్వడి చేయుచు నిరతం – కవ్వించు చుండును (2) / ప్రభు యేసు దివ్య మాదిరిలో / గమ్యము చేరగా సాగుదాం (2) ||జీవము|| / ఏ ప్రాంతీయుల మైన – మనమందరము సోదరులం / శాశ్వత రాజ్యపు గురిలో – శ్రీ యేసుని సహ వారసులం (2) / లోకాన యేసుని త్యాగమును – సాహసముతో చాటుదాం / లోకాన క్రీస్తుని మహిమను – సహనముతోనే చాటుదాం ||జీవము||

జీవించుచున్నావన్న|Jeevinchuchunnaavanna

జీవించుచున్నావన్న పేరు ఉన్నది / మృతుడవే నీవు మృతుడవే (2) / ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు / జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది / ఆ మొదటి క్రియను చేయుము రన్నా (2) ||జీవించు|| / సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు / నులివెచ్చని స్థితి ఏల సోదరా / సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు / నులివెచ్చని స్థితి ఏల సోదరీ / నా నోటి నుండి ఉమ్మి వేయ దలచి ఉన్నాను (2) / యేసు అన్న మాటను మరువబోకుము రన్నా (2) ||జీవించు|| / అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము / పరిశుద్దుడైనవాడు పరిశుద్దునిగుండ నిమ్ము (2) / వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు (2) / యేసు అన్న మాటను మరువబోకుము రన్నా (2) ||జీవించు|| / ఏ ఘడియో ఏ క్షణమో ప్రభు రాకడ తెలియదురా / దొంగ వలె వచ్చెదనని అన్నాడు (2) / గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా (2) / అంతము వరకు నిలిచి యుండుమా (2) ||జీవించు||

జీవింతు నేను|Jeevinthu Nenu

జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు / యేసు కొరకే జీవింతును (2) / నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే / నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే / జీవింతును జీవింతును / జీవింతును జీవింతును (2) ||జీవింతు|| / నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే / బహుమానము పొందగ పరుగిడుదున్ / వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి / కొరకే నే వేగిరపడుదును (2) / నన్ను ప్రేమించిన యేసుని చూతును / నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును / గురి వైపుకే – పరుగెడుదును / వెనుదిరుగను – వెనుదిరుగను (2) ||జీవింతు|| / శ్రమయైనా బాధైననూ – హింసయైనా / కరువైనా ఎదురైననూ / ఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా / ఎతైనా లోతైననూ (2) / నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి / నేను విడిపోదునా ప్రభు నీడనుండి / జీవింతును – నా యేసుతో / జయమిచ్చును – నా యేసుడే (2) ||జీవింతు||

జీవితాంతము నే నీతో|Jeevithaanthamu Ne Neetho

జీవితాంతము నే నీతో నడవాలని / ఎన్నడూ నీ చేయి నేను విడువరాదని / నీ సన్నిధిలో నిత్యము నే ఉండాలని / నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని / నా మనసంతా నీవే నిండాలని / తీర్చుమయ్యా నా ప్రభు ఈ ఒక్క కోరిక / పడితినయ్యా పడితిని నీ ప్రేమలోనే పడితిని / యేసయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా (2) / దారి తప్పి ఉన్న నన్ను వెదకి రక్షించినావయ్యా (2) / నే కన్న పగటి కలలన్ని కల్లలాయెను / నీవు లేని నాస్వానికి వ్యర్థమాయెను (2) / నరుని నమ్ముటే నాకు మోసమాయెను / భయముతోటి నా కన్ను నిద్ర మరచెను (2) / మనసులోన మానిపోని గాయమాయెను (2) / నీ ప్రేమ ఇచ్చె నాకు ఓ కొత్త జీవితం (2) ||పడితినయ్యా|| / లోక పొగడ్తలకు నే పొంగిపోతిని / దాని కనుసైగలోన నేను నడచుకొంటిని (2) / చెడ్డదైన బ్రతుకు సరి జేయ జూసితి / ప్రయాసము వ్యర్ధమై నే నిరసిల్లితి (2) / ముగిసిపోయెననుకుంటి నా ప్రయాణము (2) / నీ ప్రేమ ఇచ్చె నాకు ఓ కొత్త జీవితం (2) ||పడితినయ్యా||

Most Popular Telugu Songs — Page 45 | UEC Telugu Church