తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

జీవితాంతము వరకు నీకే|Jeevithaanthamu Varaku Neeke

జీవితాంతము వరకు నీకే – సేవ సల్పుదునంటిని / నీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాంతము|| / ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గిన / అన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా ||జీవితాంతము|| / అన్ని వేళల నీవు చెంతనె – యున్న యను భవమీయవె / తిన్నగా నీ మార్గమందున – పూనినడచెద రక్షకా ||జీవితాంతము|| / నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్రదృశ్యములున్నను / శత్రువగు సాతాను గెల్వను – చాలు నీ కృప రక్షకా ||జీవితాంతము|| / నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులన్ / చెదర గొట్టుము రూపుమాపుము – శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాంతము|| / మహిమలో నీవుండు చోటికి – మమ్ము జేర్చెదనంటివే / ఇహము దాటినదాక నిన్ను – వీడనంటిని రక్షకా ||జీవితాంతము|| / పాప మార్గము దరికి బోవక – పాత యాశల గోరక / ఎపుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా ||జీవితాంతము||

జీవితమంటే మాటలు కాదు|Jeevithamante Maatalu Kaadu

జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా / (ఇవి) మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా – (2) ||జీవితమంటే|| / నమ్ముకున్నాడు యోసేపు – అమ్ముకున్నారు అన్నలు / నమ్ముకున్నాడు ఏశావు – మోసగించాడు యాకోబు (2) / ఈ అన్నల నమ్మే కంటే… / ఈ అన్నల నమ్మే కంటే / అన్న యేసుని నమ్ముకో / రాజ్యం నీదే మేలుకో / పరలోకం నీదే ఏలుకో ||జీవితమంటే|| / నమ్ముకున్నాడు యేసయ్యా – అమ్ముకున్నాడు శిష్యుడు / పాపుల కొరకై వచ్చాడమ్మా – ప్రాణాలే తీసారమ్మా (2) / ఈ మనుషులలోనే… / ఈ మనుషులలోనే – మమతలు లేవు / మంచితనానికి రోజులు కావు / సమయం మనకు లేదమ్మా / ఇక త్వరపడి యేసుని చేరమ్మా ||జీవితమంటే|| / నమ్మకమైన వాడు – ఉన్నాడు మన దేవుడు / నమ్మదగినవాడు – వస్తాడు త్వరలోనే (2) / యేసుని రాకకు ముందే… / యేసుని రాకకు ముందే / మారు మనస్సును పొందుమా / ప్రభుని చెంతకు చేరుమా / రక్షణ భాగ్యం పొందుమా ||జీవితమంటే||

జుంటె తేనె కన్నా|Junte Thene Kannaa

జుంటె తేనె కన్నా తీయనిది / వెండి పసిడి కన్నా మిన్న అది / పొంగి పొర్లుచున్న ప్రేమ నీది / యేసు నీ నామము / సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది / పండు వెన్నెల కన్నా నిర్మలమైనది / మంచు కొండల కన్నా చల్లనిది / యేసు నీ నామము / యేసూ అసాధ్యుడవు నీవు / మరణాన్నే జయించిన వీరుడవు / సర్వాన్ని శాసించే యోధుడవు / నీకు సాటి లేరెవరు / రక్షకా నీవేగా మా బలము / దేవా మా దాగు స్థలము నీవే / నీవే నిజమైన దేవుడవు / ప్రణమిల్లి మ్రొక్కెదము ||జుంటె|| / ఆకాశము కన్నా విశాలమైనది / విశ్వమంతటిలో వ్యాపించియున్నది / ఊహలకందని ఉన్నతమైనది / యేసు నీ నామము / లోకమంతటికి రక్షణ మార్గము / జనులందరిని బ్రతికించు జీవము / సర్వ కాలములో నివసించు సత్యము / యేసు నీ నామము ||జుంటె||

కాలం సమయం నాదేనంటూ|Kaalam samayam naadenantu

కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా / రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2) / దేవుని ముందు నిలిచే రోజుంది / తక్కెడ తూకం వేసే రోజుంది (2) / జీవ గ్రంథం తెరిచే రోజుంది / నీ జీవిత లెక్క చెప్పే రోజుంది / ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా / ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా (2) ||కాలం|| / ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా / మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా (2) / గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో / ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు (2) ||ఆగవేమయ్యా|| / చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు / పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు (2) / నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు / ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు (2) ||ఆగవేమయ్యా|| / సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు / సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు (2) / అగ్ని ఆరదు పురుగు చావదు / నిత్యం ఏడుపు దుఃఖాలు (2) ||ఆగవేమయ్యా||

కానరావే అలనాటి కన్నీటి|Kaanaraave Alanaati Kanneeti

కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు / కదలవేమి అపవాది చెరసాల పునాదులు / ఇది నీ లోపమా – మరి నా లోపమా / యోచించుమా క్రీస్తు సంఘమా (2) / యోచించుమా క్రీస్తు సంఘమా ||కానరావే|| / సమూయేలుల నందించే హన్నాలేరి / సమర్పణతో ప్రార్ధించే ఎస్తేరులేరి (2) / నీతి కొరకు నిలబడే స్తెపనుల జాడేది (2) / నిండు మనస్సుతో ఆరాధించే కాలేబులెటు పోయిరో / కాలేబులెటు పోయిరో ||ఇది నీ లోపమా|| / అపొస్తలుల ఆదరించే బర్నబాలేరి / ఆత్మలకై పరుగెత్తే ఫిలిప్పులేరి (2) / శ్రమలకే ఎదురు నిలచే పౌలు వారసులేరి (2) / శత్రువుతో పోరాడి గెలిచే దావీదులెటు పోయిరో / దావీదులెటు పోయిరో ||ఇది నీ లోపమా|| / నిద్ర లేవాలి ఓ సంఘమా / అసత్యాన్ని ఖండించే సత్య స్థంభమా / క్రీస్తుకై కదలాలి ఓ సంఘమా / ఉజ్జీవం నీలో నిండాలి / ఓ సంఘమా… నిజ సంఘమా

Most Popular Telugu Songs — Page 46 | UEC Telugu Church