Songs sorted by number of likes. 1604 songs total.
జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్ / వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్ / రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్ / మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2) / ఈ రాత్రిలో కడు దీనుడై / యేసు పుట్టెను బెత్లెహేములో (2) / తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై / నీ కోసం నా కోసం పవళించే పాకలో (2) ||జగతికి|| / ఇమ్మానుయేలుగా అరుదించెను / దైవ మానవుడు యేసు దేవుడు (2) / నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడు / ఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2) ||జగతికి||
హ్యాప్పీ క్రిస్మస్... మెర్రి క్రిస్మస్... / జై జై జై యేసయ్యా / పూజ్యుడవు నీవయ్యా / ఈ లోకానికొచ్చావయ్యా / సంతోషం తెచ్చావయ్యా / మాకు సంతోషం తెచ్చావయ్యా (2) / కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా / పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2) / పశుల పాకలో పశుల తొట్టిలో / పసి బాలుడుగా ఉన్నావయ్యా (2) / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జై జై జై|| / దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను / నిశీధి రాత్రియందు ఆ గొల్లలకు (2) / లోక రక్షకుడు జన్మించెనని / సంతోషముతో ఆనందముతో (2) / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జై జై జై||
జై జై యేసు రాజా జై జై / రాజాధిరాజా నీకే జై జై – (2) ||జై జై|| / పాపకూపములో బడియున్న (2) / నన్ను జూచి చేయి జాచి (2) / చక్కగ దరికి జేర్చితివి (2) ||జై జై|| / సిలువ రక్తములో నన్ను కడిగి (2) / పాపమంతా పరిహరించిన (2) / పావనుడగు నా ప్రభుయేసు (2) ||జై జై|| / నీతి హీనుడనైన నాకు (2) / నీతి రక్షణ వస్త్రములను (2) / ప్రీతితో నొసగిన నీతి రాజా (2) ||జై జై|| / మంటి పురుగునైన నన్ను (2) / మంటి నుండి మింట జేర్చిన (2) / మహాప్రభుండా నీకే జై జై (2) ||జై జై|| / పాపశాపగ్రస్తుడనై యుండ (2) / నన్ను గూడ నీ స్వకీయ (2) / సంపాద్యముగా జేసితివి (2) ||జై జై|| / రాజులైన యాజక గుంపులో (2) / నన్ను గూడ నీ సొత్తైన (2) / పరిశుద్ధ జనములో జేర్చితివి (2) ||జై జై|| / తల్లియైన మరచిన మరచును (2) / నేను నిన్ను మరువననిన (2) / నమ్మకమైన నా ప్రభువా (2) ||జై జై|| / అధిక స్తోత్రార్హుడవైన (2) / ఆది యంతము లేని దేవా (2) / యుగా యుగములకు నీకే జై జై (2) ||జై జై||
జన్మించె జనంబులకు ఇమ్మానుయేలు / జన్మించె జనంబులను రక్షింపను (2) / జననమొందె బేత్లెహేము పురమున / జనంబులారా సంతసించుడి – సంతసించుడి ||జన్మించె|| / లేఖనములు తెల్పినట్లు దీనుడై / లోకేశుడు జన్మించెను ప్రసన్నుడై (2) / లాకమందు దూతలు బాక నాదంబుతో (2) / ఏక స్వరము తోడ పాడిరి (2) ||జన్మించె|| / నీతి సూర్యుడుదయించె నుర్విలో / పాతకంబులెల్ల వీడెను కాంతికి (2) / నీతి న్యాయ తీర్పును నూతన శక్తియు (2) / సంతసమప్పె దీన ప్రజలకు (2) ||జన్మించె||
జన్మించె జన్మించె – రారాజు జన్మించె / చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే / అరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచె / పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే / ఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెనని / నమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2) / హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ / విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్ / హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ / విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ / దూతకు భయపడి వణికిరి గొల్లలు / శుభవార్తను విని వేగిరమే పరుగిడిరి (2) / సంతోషముతో ఆనంద గానముతో / యేసే ప్రభువని నమ్మిరి పూజించిరి (2) ||ఊరూ వాడా|| / తారను కనుగొని వచ్చిరి జ్ఞానులు / యేసే రాజని అర్పించిరి కానుకలు (2) / ఆరాధించి హృదయములను అర్పించి / భువినేలే రారాజును కీర్తించిరి (2) ||ఊరూ వాడా|| / యేసే మార్గము యేసే సత్యము / యేసే జీవము ఇదియే నిత్యము (2) / మన పాపాలన్నీ క్షమియించేదేసయ్యే / విశ్వసించి నీ హృదయమునే అర్పించుము (2) ||ఊరూ వాడా||
జన్మించె.. జన్మించె.. / యేసయ్యా పశువుల పాకలోనా.. ఓ.. ఓ .. / హల్లెలూయ.. హల్లెలూయ.. / హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ.. / రాత్రివేళ గొల్లలు గొర్రెలు కాయుచుండగా / దేవదూత వచ్చి శుభవార్తను తెల్పెను (2) / సంతోషించి ఆనందించి / యేసును చూచి పరవశించి (2) / లోకమంతా శుభవార్తను ప్రకటించిరి / హల్లెలూయ.. హల్లెలూయ.. / హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ.. / ఆకాశములో ఒక తార జ్ఞానుల కొరకు వెలసెను / యేసు పుట్టిన స్థలమునకు నడిపించెను (2) / బంగారు సాంబ్రాణి బోళం / బాల యేసునికి అర్పించి (2) / మనసార పూజించి కొనియాడిరి / హల్లెలూయ.. హల్లెలూయ.. / హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ.. / సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు / తన కిష్టులకు సమాధానము కల్గును గాక (2) / పశువుల పాకలో జన్మించిన యేసయ్యా / మన హృదయంలో జన్మించుటే క్రిస్మస్ పండుగా (2) / హల్లెలూయ.. హల్లెలూయ.. / హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..
జన్మించెను ఒక తార / తూర్పు దిక్కున కాంతిమయముగా / దివి నుండి భువికి వెడలిన / రారాజును సూచిస్తూ (2) / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జన్మించెను|| / ఇదిగో జనులందరికి / సంతోషకరమైన సువార్తమానము (2) / దేవాది దేవుండు / ఒక శిశువై పుట్టెను (2) ||హ్యాప్పీ|| / సర్వోన్నత స్థలములలో / దేవునికి మహిమ ఆయనకిష్టులకు (2) / భూమియందు / సమాధానము (2) ||హ్యాప్పీ|| / మనలను పాపాలనుండి / రక్షించు దేవుడు ఆయనే యేసు (2) / నీ కొరకే అరుదించే / తన ప్రాణం నిచ్చుటకై (2) ||హ్యాప్పీ||
జన్మించినాడురా రాజు జన్మించినాడురా (2) / బెత్లహేములోన పశుల పాకలోన (2) / జన్మించినాడురా… / ఆనందం ఆనందం జగమంతా ఆనందం / సంతోషం సంతోషం ఇంటింటా సంతోషం (2) / ధనవంతుడై యుండియు / భువికి దీనుడై వచ్చాడురా / ఎంతో ప్రేమించాడురా / లోకమును రక్షింప వచ్చాడురా / పాపమంత బాపి జీవమే ఇచ్చే – (2) / యేసే వచ్చాడురా… ||ఆనందం|| / దుఃఖమే ఇక లేదురా / మనకు విడుదలే వచ్చిందిరా / మెస్సయ్య వచ్చాడని / ఈ వార్త లోకమంతా చాటాలిరా / లోక రక్షకుడు ఇమ్మానుయేలు – (2) / యేసే వచ్చాడురా.. ||ఆనందం||
జయ జయ యేసు – జయ యేసు / జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) / జయ జయ రాజా – జయ రాజా (2) / జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ || / మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2) / పరమ బలమొసగు జయ యేసు (2) / శరణము నీవే జయ యేసు || జయ జయ || / సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు (2) / సమరము గెల్చిన జయ యేసు (2) / అమరముర్తివి జయ యేసు || జయ జయ || / సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు (2) / పాతవి గతియించె జయ యేసు (2) / దాతవు నీవే జయ యేసు || జయ జయ || / బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు (2) / బండలు తీయుము జయ యేసు (2) / అండకు చేర్చుము జయ యేసు || జయ జయ || / ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2) / ముద్రలు తీయుము జయ యేసు (2) / ముద్రించుము నను జయ యేసు || జయ జయ || / కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు (2) / సేవలో బలము జయ యేసు (2) / జీవము నీవే జయ యేసు || జయ జయ || / దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2) / కయ్యము గెల్చిన జయ యేసు (2) / అయ్యా నీవే జయ యేసు || జయ జయ ||
జయం జయం జయం జయం / యేసులో నాకు జయం జయం (2) / విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా / ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా (2) / నీ వాక్యమే నా హృదయములో / నా నోటిలో నుండినా ||జయం జయం|| / గొప్ప కొండలు కదిలిపోవును / సరిహద్దులు తొలగిపోవును (2) / అసాధ్యమైనది సాధించెదా / విశ్వాసముతో నేను ||జయం జయం||
జయం జయం మన యేసుకే / మరణం గెలిచిన క్రీస్తుకే (2) / స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము (2) / పునరుత్ధానుడైన క్రీస్తుని / మహిమపరచెదము (2) ||జయం జయం|| / పాపములేని యేసుడు / సిలువలో పాపికై మరణించి (2) / మూడవదినమున – తిరిగి లేచెను (2) / మరణపు ముల్లును విరిచెను (2) ||జయం జయం|| / పాపము చేసి మానవుడు / కోల్పోయిన అధికారమును (2) / సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను (2) / సాతాను బలమును గెలిచెను (2) ||జయం జయం|| / పాపము విడిచి సోదరా / ప్రభు సన్నిధికి రారమ్ము (2) / పునరుత్ధాన శక్తితో నింపి (2) / పరలోకమునకు చేర్చును (2) ||జయం జయం||
జయం జయం జయం జయం / జయం జయం జయం జయం (2) / మనకూ జయం మనకూ జయం / నాకూ జయం నీకూ జయం ||జయం|| / యేసు ప్రభువు రక్తమే పాపముపై జయం / క్రీస్తు యేసు నామమే సాతనుపై జయం (2) / సిలువ పైన మరణమే మరణముపై జయం / కల్వరిలో త్యాగమే నరకముపై జయం (2) ||జయం|| / ఆ కొరడా దెబ్బలే శ్రమలపై జయం / ఆ ముండ్లకిరీటమే బంధకముపై జయం (2) / గాయ పడిన హస్తమే కన్నీటిపై జయం / దప్పిగొన్న ప్రాణమే నిరాశలపై జయం (2) ||జయం|| / ఆ మధుర ప్రేమయే ద్వేషముపై జయం / ఆ దివ్య వాక్యమే లోకముపై జయం (2) / పరిశుద్ధాత్మ తోడుయే భయముపై జయం / ప్రార్ధనశక్తి వరములే బలహీనతపై జయం (2) ||జయం||