తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

నీవే నా సంతోషగానము|Neeve Naa Santhosha Gaanamu

నీవే నా సంతోషగానము / రక్షణశృంగము మహాశైలము (2) / బలశూరుడా యేసయ్యా నా తోడై / ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా|| / ఓ లార్డ్! యు బి ద సేవియర్ / షో మి సం మెర్సీ / బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ / సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ / ఐ విల్ సరెండర్ / యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ / త్యాగము ఎరుగని స్నేహమందు / క్షేమము కరువై యుండగా / నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి / నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2) / నిరంతరం నిలుచును నాపై నీ కనికరం / శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా|| / వేదన కలిగిన దేశమందు / వేకువ వెలుగై నిలిచినావు / విడువక తోడై అభివృద్ధిపరచి / ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2) / మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం / అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా|| / నిర్జీవమైన ఈ లోయయందు / జీవాధిపతివై వెలసినావు / హీనశరీరం మహిమ శరీరముగ / నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2) / హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు / హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||

సోలిపోవలదు – మెడ్లి|Solipovaladu Medley

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2) / నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) / సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2) / ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను – చుట్టుముట్టిననూ / శోధనలను జయించినచో – భాగ్యవంతుడవు / ప్రియుడు నిన్ను చేరదీసిన – ఆనందము కాదా (2) / జీవ కిరీటము మోయువేళ – ఎంతో సంతోషం / సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2) / సమానులెవరు ప్రభో / నీ సమానులెవరు ప్రభో / సమానులెవరు ప్రభో / సమస్త మానవ శ్రమానుభవమును (2) / సహించి వహించి ప్రేమించగల నీ.. / సమానులెవరు ప్రభో / నీ సమానులెవరు ప్రభో / సమానులెవరు ప్రభో / సమాన తత్వము – సహోదరత్వము (2) / సమంజసముగను మాకు దెలుప నీ.. / సమానులెవరు ప్రభో / నీ సమానులెవరు ప్రభో / సమానులెవరు ప్రభో / భజియింతుము నిను జగదీశా శ్రీ / యేసా మా రక్షణ కర్తా (2) / శరణు శరణు మా దేవా యెహోవా (2) / మహిమాన్విత చిర జీవనిధి / శరణు శరణు మా దేవా యెహోవా / మహిమాన్విత చిర జీవనిధి / భజియింతుము నిను జగదీశా శ్రీ / యేసా మా రక్షణ కర్తా (2) / కొండలలో లోయలలో / అడవులలో ఎడారులలో (2) / నన్ను గమనించినావా / నన్ను నడిపించినావా (2) / తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2) / నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) / శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప / అనుక్షణం నను కనుపాపవలె – కాచిన కృప / శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప / నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన (2) / నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన (3) / యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. ఓ… (2) / నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన (2) / యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. (2) / నా యేసయ్యా.. నా రక్షకుడా / నా యేసయ్యా.. నా యేసయ్యా.. / నా యేసయ్యా.. నా యేసయ్యా..

అలంకరించును|Alankarinchunu

నా మనస్సా ఆయన మరచునా / దేవుడు నిన్ను మరచిపోవునా (2) / ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే / ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2) / స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే / కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2) / నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో / సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే (2) / తరిగిపోను నేను – అణగార్చబడను నేను (2) ||స్తుతింపజేయునే|| / సరిచేయు వాడే – ఓ ….స్థిరపరచినాడే / బలపరచినాడే – పూర్ణుణ్ణి చేయునే / సరి చేసి నిన్ను – హెచ్చించిన ప్రభువు / ఈ నూతనవత్సరములో – అలంకరించునే… / విచారించే వారు లేక – ఒంటరైయున్న నీకు / ఆరోగ్యము దయచేసి – పరిపాలన నిచ్చునే (2) / కూలిన కోటను – రాజగృహముగా మార్చును (2) ||స్తుతింపజేయునే|| ||నా మనస్సా||

అంటరాని వాడవంటు|Antaraani Vaadavantu

అంటరాని వాడవంటు నన్ను / ఊరు బైటకు త్రోసి వేసిరి / దేహమంతా కుళ్లిపోయి – దుర్వాసనతో నిండిపోయే / అయిన వారు కానరాక – భుజము తట్టే వారు లేక / కంటి నిండా నిదుర పొక – ఒంటరిగ జీవించలేక / మరణమును బ్రతిమాలుకున్నా… / మరణమును బ్రతిమాలుకున్నా – అదియు నన్ను ముట్టలేదు / చావలేక బ్రతుకలేక విసికిపోయాను – నేను అలసిపోయాను / నీ దరికి చేరాను – నిన్నే నమ్ముకున్నాను / యేసు.. యేసు.. యేసు నా తట్టు తిరగవా / యేసు.. యేసు.. యేసు నా గోడు వినవా ||అంటరాని|| / నిలిచిపోయావు నా కేక వినగానే / కదలిపోయావు నా స్థితిని చూడగనే / నీ కడుపులోని దుఖమును నీ ముఖముపై చూసి / నేను కరిగిపోయాను / నీ కనికరము చూసి – కన్నీటితో తడిసిపోయాను / యేసు.. యేసు.. యేసు నీకెంత జాలి / చాలు.. చాలు.. చాలు నీ దయయే చాలు ||అంటరాని|| / నన్ను తాకావు నీ చేతులను చాపి / కుష్టు రోగము నా దేహము పైన ఉండగనే / నా గుండె లోపల మండుచున్న కోరికను చూసి / నన్ను ముట్టుకున్నావు / ఆ స్పర్శకొరకే కదా నే తపియించి పోయాను / యేసు.. యేసు.. యేసు నీలా ఉందురెవరు / చాలు.. చాలు.. చాలు నీ స్పర్శ చాలు ||అంటరాని|| / స్వస్థపరిచావు శుద్దునిగా చేసావు / మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు / నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు / నాకు బ్రతుకు నిచ్చావు / నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరు / యేసు.. యేసు.. యేసు దండములు నీకు / చాలు.. చాలు.. నాకింక నీవే చాలు ||అంటరాని||

క్రిస్మస్ మెడ్లీ 3|Christmas Medley 3

దూత పాట పాడుడీ – రక్షకున్ స్తుతించుడీ / ఆ ప్రభుండు పుట్టెను – బేత్లెహేము నందున / ఓ బేత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు / నీవొంద గాఢనిద్రపై – వెలుంగు తారలు / ఓ సద్భక్తులారా! లోక రక్షకుండు / బేత్లెహేమందు నేడు జన్మించెన్ / శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము / ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను / నమస్కరింప రండి నమస్కరింప రండి / నమస్కరింప రండి యుత్సాహముతో / ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు / పొలములలో తమ మందలను కాయుచునున్నప్పుడు / భూనివాసులందరు – మృత్యు భీతి గెల్తురు / నిన్ను నమ్మువారికి – ఆత్మ శుద్ధి కల్గును / జ్ఞానులారా మానుడింక యోచనలన్ జేయుట / మానుగాను వెదకుడేసున్ చూచుచు నక్షత్రమున్ / సద్దేమి లేక వచ్చెగా! ఈ వింత దానము / ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి / రండి నేడు పుట్టినట్టి / రాజునారాధించుడి (2) / నీకు నమస్కరించి నీకు నమస్కరించి / నీకు నమస్కరించి పూజింతుము / యేసు పుట్టగానే వింత – (2) / ఏమి జరిగెరా దూతలెగసి వచ్చెరా – (2) / నేడు లోక రక్షకుండు – (2) / పుట్టినాడురా ఈ పుడమి యందున – (2) / పశువుల పాకలో పచ్చగడ్డి పరుపులో – (2) / పవళించెను… పవళించెను… / పవళించెను నాథుడు మన పాలిట రక్షకుడు – (2) / దూతల గీతాల మోత విను బేతలేమా / పరమ దూతల గీతాల మోత విను బేతలేమా / ఎన్నెన్నో యేడుల నుండి నిరీక్షించినట్టి – (2) / పరమ దూతల గీతాల మోత విను బేతలేమా – (2)

క్రిస్మస్ మెడ్లీ – 5|Christmas Medley 5

నా నా నా న న న / నా నా నా న న న / నా నా నా న న న.. / న న న న నా (3) / రారండి జనులారా / మనం బేతలేం పోదామా / యూదుల రాజు జన్మించినాడు / వేవేగ వెళ్లుదమా / జన్మ తరియింప తరలుదమా.. / సర్వోన్నత స్థలములలోన / దేవునికి మహిమ అమెన్ ఆమెన్ / ఆయనకు ఇష్టులైన వారికి / సమాధానమెల్లపుడూ / రారండి జనులారా / మనం బేతలేం పోదామా / యూదుల రాజు జన్మించినాడు / వేవేగ వెళ్లుదమా / జన్మ తరియింప తరలుదమా.. / నా నా నా న న న / నా నా నా న న న / నా నా నా న న న.. / న న న న నా (2) / పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ / మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ (2) / యేసు మనల ప్రేమిస్తూ పుట్టాడండోయ్ / మన పాపం కొరకు పుట్టాడండోయ్ (2) / యేసుని చేర్చుకో రక్షకునిగ ఎంచుకో (2) / పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ / మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ (2) / పాడుడి గీతములు హల్లేలూయ / మీటుడి నాదములు హల్లేలూయ / పాప రహితుడు హల్లేలూయ / పాప వినాషకుడు హల్లేలూయా / ఆకశమున వింత గొలిపెను / అద్భుత తారను గాంచిరి (2) / పయణించిరి జ్ఞానులు ప్రభు జాడకు (2) / పాడుడి గీతములు హల్లేలూయ / మీటుడి నాదములు హల్లేలూయ / పాప రహితుడు హల్లేలూయ / పాప వినాషకుడు హల్లేలూయా / రాజులకు రాజు యేసయ్య / పశువుల పాకలో పుట్టాడయ్యా / రాజులకు రాజు యేసయ్య / నీ కొరకు నా కొరకు పుట్టాడయ్యా / గొల్లలు జ్ఞానులు వచ్చిరయ్యా / దూతలు పాటలు పాడిరయ్యా (2) / ఈ వార్తను చాటింప పోదామయ్యా (2) / పోదాము… అహా పోదాము… / పద పోదాము… మనం పోదాము… / పోదాము పోదాము పయణమవుదాము / శుభవార్త చెప్ప పోదాము (2) / అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము / శుభవార్త చాటి చెప్ప సాగిపోదాము (2) / పోదాము పోదాము పయణమవుదాము / శుభవార్త చెప్ప పోదాము (2) / శ్రీ యేసన్న నట రాజులకు రాజు అట (2) / రాజులందారికయ్యో యేసే రాజు అట (2) / పదరా హే పదరా హే / పదరా పోదాము రన్న / శ్రీ యేసుని చూడ / పదరా పోదాము రన్న (4) / నా నా నా న న న / నా నా నా న న న / నా నా నా న న న.. / న న న న నా (2)

దేవుడు చూస్తున్నాడు|Devudu Choosthunnaadu

ఓ ఓ ఓ ఓ ఓ… / ఓ ఓ ఓ ఓ ఓ… / పైకి కిందికి నీవు ఎగిరేటప్పుడు / చుట్టూ చుట్టూ నీవు తిరిగేటప్పుడు / చేసే ప్రతిదీ చూస్తూ ఉన్నాడు.. హేయ్ / దేవుడు నిన్ను గమనిస్తున్నాడు.. హేయ్ / దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్ / ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్ / నీ జీవితము తన చేతిలో ఓ ఓ.. / నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు / ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ / ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ / గాల్లో చేతులు నీవు ఊపేటప్పుడు / ఎక్కడైనా నీవు అరిచేటప్పుడు / చేసే ప్రతిదీ చూస్తూ ఉన్నాడు.. / దేవుడు నిన్ను గమనిస్తున్నాడు.. హేయ్ / దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్ / ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్ / నీ జీవితము తన చేతిలో ఓ ఓ.. / నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు / ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ / ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ / దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. / ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. / దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. / ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్.. / దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్ / ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్ / నీ జీవితము తన చేతిలో ఓ ఓ.. / నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు / దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్ / ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్ / నీ జీవితము తన చేతిలో ఓ ఓ.. / నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు / ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ / ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్

దూత పాట పాడుడి|Dootha Paata Paadudi

దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి / ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున / భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను / ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి / దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి / ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులు / అంత్య కాలమందున – కన్య గర్భమందున / బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో / ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా / దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి / రావే నీతి సూర్యుడా – రావే దేవా పుత్రుడా / నీదు రాక వల్లను – లోక సౌఖ్య మాయెను / భూ నివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు / నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును / దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

ఈస్టర్ మెడ్లీ|Easter Medley

యూదా రాజ సింహం తిరిగి లేచెను / తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను (2) / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) / హల్లెలూయా హల్లెలూయా / ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ (2) / మరణము జయించి లేచెన్ / మరణపు ముల్లును విరచెన్ (2) / మధురం యేసుని నామం / మరువకు యేసుని ధ్యానం (2) / హే ప్రభు యేసు – హే ప్రభు యేసు / హే ప్రభు దేవా సుతా / సిల్వ ధరా, పాప హరా, శాంతి కరా / హే ప్రభు యేసు – హే ప్రభు యేసు / ఖాళీ సమాధిలో మరణమును / ఖైదీగా జేసిన నీవే గదా (2) / ఖాలమయుడగు సాతానుని గర్వము (2) / ఖండనమాయె గదా / సిల్వధరా పాపహరా శాంతికరా / హే ప్రభు యేసు – హే ప్రభు యేసు / గీతం గీతం జయ జయ గీతం / చెయ్యి తట్టి పాడెదము (2) / యేసు రాజు లేచెను హల్లెలూయా / జయ మార్భటించెదము (2) / చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను / అందు వేసిన ముద్ర కావలి నిల్చెను / దైవ సుతుని ముందు / జయ జయ యేసు – జయ యేసు / జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) / జయ జయ రాజా – జయ రాజా (2) / జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం / సమాధి గెల్చిన జయ యేసు / సమాధి ఓడెను జయ క్రీస్తు (2) / సమరము గెల్చిన జయ యేసు (2) / అమరముర్తివి జయ యేసు / జయ జయ యేసు – జయ యేసు / జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు / పరమ జీవము నాకు నివ్వ / తిరిగి లేచెను నాతో నుండ (2) / నిరంతరము నన్ను నడిపించును / మరల వచ్చి యేసు కొనిపోవును (2) / యేసు చాలును – యేసు చాలును / యే సమయమైన యే స్థితికైన / నా జీవితములో యేసు చాలును / ముక్తినిచ్చె యేసు నామం / శాంతినిచ్చె యేసు నామం (2) / జై జై ప్రభు యేసుకు / జై జై క్రీస్తు రాజుకే / మరణమును గెల్చి మము రక్షించి / విజయము నిచ్చెనుగా / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా / ప్రాణము పెట్టిన దేవుడు / రక్షణనిచ్చిన దేవుడు / మరణము గెల్చిన దేవుడు / మృతులను లేపిన దేవుడు / దేవుడు దేవుడు యేసే దేవుడు / మన దేవుడు దేవుడు యేసే దేవుడు / సిలువలో ప్రాణం పెట్టాడన్నా / మరణం గెలిచి లేచాడన్నా (2) / మహిమ ప్రభు మృత్యుంజయుడు / క్షమియించును జయమిచ్చును (2) / ఓరన్న… ఓరన్న / యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న / యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా / యేసే ఆ దైవం చూడన్నా (2) / యేసే ఆ దైవం చూడన్నా – (2)

ఎబినేజరే|Ebinejare

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు / మానక స్తుతించెదము (2) / నీ కనుపాప వలె నన్ను కాచి / నేను చెదరక మోసావు స్తోత్రం (2) / ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే / ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2) / స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం / స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను|| / ఎడారిలో ఉన్న నా జీవితమును / మేలుతో నింపితివే (2) / ఒక కీడైన దరి చేరక నన్ను / తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే|| / నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును / నీ కృపతో నింపితివే (2) / నీవు చూపిన ప్రేమను పాడగా / పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే|| / జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే / ఆశ్చర్యమాశ్చర్యమే (2) / నీ పాత్రను కానే కాను / కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||