తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

ఎల్ షమా|El Shamaa

దేవా చెవియొగ్గుము.. దృష్టించుము.. నిన్నే వెదకుచున్నాను / దేవా సెలవియ్యుము.. బదులీయము.. నిన్నే వేడుచున్నాను / ప్రతి ఉదయం – నిను నమ్మి / ప్రతి రాత్రి – నిను వేడి / ప్రతి ఘడియ – నిను కోరి.. నహాళ్ / ఆశతో వేచి ఉన్నా – నీవే నా నమ్మకం / ఓర్పుతో కాచి ఉన్నా – నీవేగా నా ధైర్యం (2) / ఎల్ షమా (3) / నా ప్రార్ధన వినువాడా (2) / ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను (వేచి వేచి యున్నాను) / నీ తట్టు నా కరముల్ నే చాపుచున్నాను (2) / ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు / పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము / ఆత్మ వర్షం కురిపించి నను బ్రతికించుము / నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు ||ఎల్ షమా|| / విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను / అడుగడుగు నా తోడై ఒడ్డుకు నను చేర్చవా (2) / యెహోవా నా దేవా నీవే నాకున్నది / బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2) ||ఎల్ షమా|| / నీ శక్తియే విడిపించును / నీ హస్తమే లేవనెత్తును / నీ మాటయే నా బలము / నీ మార్గము పరిశుద్ధము (2) ||ఎల్ షమా||

గతకాలమంత నీ నీడలోన|Gathakaalamantha Nee Needalona

గతకాలమంత నీ నీడలోన / దాచావు దేవా వందనం / కృప చూపినావు – కాపాడినావు / ఎలా తీర్చగలను నీ ఋణం / పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – (2) / వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత|| / ఎన్నెన్నో అవమానాలెదురైననూ / నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా / ఇక్కట్లతో నేను కృంగిననూ / నీ చేయి నను తాకి లేపెనయ్యా / నిజమైన నీ ప్రేమ నిష్కళంకము / నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) / వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత|| / మాటలే ముళ్ళుగ మారిన వేళ / నీ మాట నన్ను పలకరించెనయా / నిందలతో నేను నిండిన వేళ / నీ దక్షిణ హస్తం నను తాకెనయా / నీ మాట చక్కటి జీవపు ఊట / మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2) / వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) / గతకాలమంత నీ నీడలోన – దాచావు దేవా వందనం / కృప చూపినావు – కాపాడినావు / ఎలా తీర్చగలను నీ ఋణం / పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – (2) / వందనం యేసయ్యా – విభుడవు నీవయ్యా (2) ||గతకాలమంత||

ఇదిగో నేనొక నూతన క్రియను|Idigo Nenoka Noothana Kriyanu

ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను (2) / ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా (2) ||ఇదిగో|| / అడవిలో త్రోవనుజేసి – ఎడారిలో నదులను నేను (2) / ఎల్లప్పుడు సమృద్ధిగా – ప్రవహింప జేసెదను (2) ||ఇదిగో|| / నాదు ప్రజలు త్రాగుటకు – నేనరణ్యములో నదులు (2) / సమృద్ధిగా పారునట్లు – సృష్టించెదను నేను (2) ||ఇదిగో|| / అరణ్యములో జంతువులు – క్రూరపక్షులు సర్పములు (2) / ఘనపరచును స్తుతియించును – దీని నాలోచించుడి (2) ||ఇదిగో|| / నూతన సృష్టిగ నినుజేసి – నీ శాంతిని నదివలెజేసి (2) / ననుజూచి మహిమపరచి – స్తుతిబాడ జేసెదను (2) ||ఇదిగో|| / నేనే దేవుడనని దెలసి – నా కార్యములను నెరవేర్చి (2) / ముందున్న వాటికన్న – ఘనకార్యములను జేతున్ (2) ||ఇదిగో|| / మరుగైన మన్నానిచ్చి – మరితెల్లని రాతినిచ్చి (2) / చెక్కెదనా రాతిమీద – నొక క్రొత్త నామమును (2) ||ఇదిగో|| / పరలోక భాగ్యంబులు – నరలోకములో మనకొసగెన్ (2) / కరుణాసంపన్నుడగు – మన ప్రభువునకు హల్లెలూయ (2) ||ఇదిగో||

జుంటె తేనె ధారల కన్నా|Junti thene dhaarala kannaa

జుంటె తేనె ధారల కన్నా / యేసు నామమే మధురం / యేసయ్య సన్నిధినే మరువజాలను (2) / జీవితకాలమంతా ఆనందించెదా / యేసయ్యనే ఆరాధించెదా (2) ||జుంటె తేనె|| / యేసయ్య నామమే బహు పూజనీయము / నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2) / నన్నెంతగానో దీవించి / జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటె తేనె|| / యేసయ్య నామమే బలమైన దుర్గము / నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2) / నన్నెంతగానో కరుణించి / పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2) ||జుంటె తేనె|| / యేసయ్య నామమే పరిమళ తైలము / నాలో నివసించే సువాసనగా నను మార్చి (2) / నన్నెంతగానో ప్రేమించి / విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2) ||జుంటె తేనె||

మహాఘనుడవు మహోన్నతుడవు|Mahaa Ghanudavu Mahonnathudavu

మహాఘనుడవు మహోన్నతుడవు / పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2) / కృపా సత్య సంపూర్ణమై / మా మధ్యలో నివసించుట న్యాయమా / నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2) / వినయముగల వారిని / తగిన సమయములో హెచ్చించువాడవని (2) / నీవు వాడు పాత్రనై నేనుండుటకై / నిలిచియుందును పవిత్రతతో (2) / హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా|| / దీన మనస్సు గలవారికే / సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2) / నీ సముఖములో సజీవ సాక్షినై / కాపాడుకొందును మెళకువతో (2) / హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా|| / శోధింపబడు వారికి / మార్గము చూపించి తప్పించువాడవని (2) / నా సిలువ మోయుచు నీ సిలువ నీడను / విశ్రమింతును అంతము వరకు (2) / హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||

మేలు చేయక|Melu Cheyaka

మేలు చేయక నీవు ఉండలేవయ్యా / ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) / యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| / నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా / నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) / నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) / క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| / ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను / పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2) / నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2) / నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| / పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను / క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2) / నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2) / అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||

నా ప్రాణమా నా సమస్తమా|Naa Praanamaa Naa Samasthamaa

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు / నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది / నా ప్రాణమా నా సమస్తమా / ప్రభుని స్తుతియించుమా / నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా – (2) ||నా ప్రాణమా|| / పనికిరాని నను నీవు పైకి లేపితివి / క్రీస్తని బండపైన నన్ను నిలిపితివి (2) / నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి / నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు / నే వెంబడింతు ప్రభు ||నా ప్రాణమా|| / అంధకారపు లోయలలో నేను నడచితిని / ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2) / కంటిపాపగా నీవు నన్ను కాచితివి / కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను / నిన్ను కొలిచెదను ||నా ప్రాణమా|| / నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు / ఆత్మ ఫలమును దండిగా నీకై ఫలియింతును (2) / నీవు చేసిన మేళ్లను నేను ఎట్లు మరతు ప్రభు / నీ కొరకు సాక్షిగా ఇలలో జీవింతును / నే ఇలలో జీవింతును ||నా ప్రాణమా||

నడిపించు నా నావా|Nadipinchu naa naavaa

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా / నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| / నా జీవిత తీరమున నా అపజయ భారమున / నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు / నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప / నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు|| / రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము / రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము / రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో / రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు|| / ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి / అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి / ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే / ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు|| / ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని / ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని / ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది / ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు|| / లోతైన జలములలో లోతున వినబడు స్వరమా / లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి / లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు / లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు|| / ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని / ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ / పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో / ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||

Most Popular Telugu Songs — Page 3 | UEC Telugu Church