తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

గుండె బరువెక్కిపోతున్నది|Gunde Baruvekkipothunnadi

గుండె బరువెక్కిపోతున్నది / ప్రాణము సొమ్మసిల్లుచున్నది (2) / నా మనసేమో కలవరపడుచున్నది (2) / యేసయ్యా.. ఆదరించ రావా / యేసయ్యా.. బలపరచ రావా ||గుండె|| / ప్రాకారము లేని పురముగా నేనుంటిని / ఆదరణ లేక దిగులుతో నేనుంటిని (2) / నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే (2) / యేసయ్యా.. ఆధారం నీవే కదా / యేసయ్యా.. నా కాపరి నీవే కదా ||గుండె|| / అంధకారంలో నా దీపము ఆరిపోయెనే / అరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే (2) / దినదినము నేను కృంగుచున్నాను (2) / యేసయ్యా.. వెలిగించగ రావా / యేసయ్యా.. లేవనెత్త రావా ||గుండె|| / ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనే / ఎవరిలో చూసిననూ ప్రేమ కరువాయెనే (2) / ఆత్మల భారముతో మూల్గుచున్నానయ్యా (2) / యేసయ్యా.. దర్శించ రావా / యేసయ్యా.. ప్రేమతో నింపుమయా ||గుండె||

హల్లెలూయా యేసు ప్రభున్|Hallelooya Yesu Prabhun

హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి / వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి / బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి / ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి / రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ / హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి / తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి / పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి / బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి / నిరంతరము మారని యేసుని స్తుతియించుడి ||రాజుల|| / సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి / హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి / అగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతియించుడి / హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి ||రాజుల|| / యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి / జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి / పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి / ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి ||రాజుల|| / అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి / అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి / దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి / పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి ||రాజుల||

హల్లెలూయ పాట|Hallelooyaa Paata

హల్లెలూయ పాట – యేసయ్య పాట / పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4) ||హల్లెలూయ|| / కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా (2) / స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| / చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా (2) / స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| / నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు (2) / స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| / శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా (2) / స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| / సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా (2) / ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా (2) ||హల్లెలూయ||

హల్లేలూయా యని పాడి|Hallelooyaa Yani Paadi

హల్లేలూయా యని పాడి స్తుతింపను / రారే జనులారా మనసారా ఊరూరా / రారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా|| / పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2) / కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2) / తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2) / పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| / బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2) / అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2) / కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2) / పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| / రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2) / నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2) / నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2) / పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||