తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

ఘనమైన నా యేసయ్యా|Ghanamaina naa yesayyaa

ఘనమైన నా యేసయ్యా / బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు (2) / (నా) శిరము వంచి స్తుతియింతును / నీ – కృపా సత్యములను ప్రకటింతును (2) ||ఘనమైన|| / నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము / నీ – ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము (2) / ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా (2) / తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా (2) / ఏమని వర్ణించెదను నీ ప్రేమను / నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2) ||ఘనమైన|| / మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము / నీ – శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము (2) / మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా (2) / మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా (2) / ఏమని వర్ణించెదను నీ ప్రేమను / నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2) ||ఘనమైన|| / సంఘ క్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము / అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు (2) / పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా (2) / స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా (2) / ఏమని వర్ణించెదను నీ ప్రేమను / నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2) ||ఘనమైన||

ఘనమైనవి నీ కార్యములు|Ghanamainavi Nee Kaaryamulu

ఘనమైనవి నీ కార్యములు నా యెడల / స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) / కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి / స్తుతులర్పించెదను అన్నివేళలా (2) / అనుదినము నీ అనుగ్రహమే / ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| / యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక / ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) / నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి / ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి|| / నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే / ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే (2) / నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు / ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి|| / నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా / బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే (2) / నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ / ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||

గొంతు ఎత్తి చాటెదాను|Gonthu Etthi Chaatedaanu

గొంతు ఎత్తి చాటెదాను / నడుము కట్టి పయనింతును / నా యేసు గొప్పవాడు (4) / నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు / నీ కొరకే నేనన్నాడు (2) / నా యేసు గొప్పవాడు (4) ||గొంతు|| / ఎంత గొప్ప కార్యము చేసినాడు / ఎర్ర సంద్రమునే చీల్చినాడు / ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు / యెరికో గోడలు కూల్చినాడు (2) / ఎంతాటి కార్యమైనా చేయగలడు / శక్తివంతుడు అసాధ్యుడు (2) / నా తండ్రి గొప్పవాడు (4) ||గొంతు|| / ఎంత గొప్ప కార్యము చేసినాడు / నిషేధించిన రాయి స్థానం మార్చాడు / పనికిరాని పాత్రను వాడగలడు / గొప్పదైన దానిగా చేయగలడు (2) / ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడు / ఎంత గొప్ప దేవుడు నా యేసుడు (2) / నా యేసు గొప్పవాడు (4) ||గొంతు|| / కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది / నా యేసు తండ్రి చూపుతాడు / ఈ లోక స్నేహం ఇవ్వలేనిది / నా యేసు ప్రాణం ఇచ్చినాడు (2) / ఎన్నాడు విడువని గొప్ప దేవుడు / లోకమంతా విడిచినా నిన్ను విడువడు (2) / నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||

గూడు లేని గువ్వనై|Goodu Leni Guvvanai

గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై (2) / నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై (2) / దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను / సహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను (2) / అప్పుడొక మెల్లని స్వరము నాతో / మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని (2) / ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను / నా జీవితమంత ప్రకాశింప సాగింది (2) ||గూడు|| / అప్పుడొక తియ్యని స్వరము నాతో / మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని (2) / ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను / నా పాప జీవితము పారిపో సాగింది (2) ||గూడు|| / అప్పుడొక అద్భుత స్వరము నాతో / మాట్లాడి చెప్పెను రాజైన యేసుని (2) / ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను / నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి (2) / గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై (2) / నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై (2) / దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను / సేవలోని మాధుర్యము ననుభవిస్తున్నాను (2) / యేసుని నమ్ముకో – యేసుని చేరుకో / యేసుని కోరుకో – యేసుతో చేరిపో (4)

గొర్రెపిల్ల వివాహోత్సవ|Gorrepilla Vivaahotsava

గొర్రెపిల్ల వివాహోత్సవ / సమయము వచ్చెను రండి (2) / సర్వాధికారియు సర్వోన్నతుండైన (2) / మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల|| / సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2) / నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల|| / పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2) / గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల|| / తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2) / నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల|| / దేవుని వాక్యమను నామము గలవాడు (2) / రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2) ||గొర్రెపిల్ల|| / ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు (2) / పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల|| / శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు (2) / వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2) ||గొర్రెపిల్ల||