తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

గాడాంధకారపు లోయలో|Gaadaandhakaarapu Loyalo

గాడాంధకారపు లోయలో / నే సంచరించిన వేళలో / అపాయమేమియు రానీయక / ఉన్నావు తోడుగ నా త్రోవలో (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా ఆశ్రయ దుర్గము నీవే / నా బలమైన శైలము నీవే / నా రక్షణ శృంగము నీవే / నా శిక్షను భరియించితివే ||గాడాంధకారపు|| / పచ్చిక గల చోట్లలో నిలిపావు / శాంతి జలములందు నన్ను నడిపావు (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా ఎత్తైన కోట నీవే / నే నడిచే ప్రతి చోట నీవే / నా రక్షణకర్తా నీవే / నా జీవన దాతా నీవే ||గాఢాంధకారపు|| / నూనెతో నా తలను అంటావు / నా గిన్నెను పొర్లి పారజేసావు (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా మొరను ఆలించావే / నీ వరములు నాకొసగావే / నా పరమ తండ్రివి నీవే / నీ కరమున నను దాచావే ||గాఢాంధకారపు|| / చీకటి బ్రతుకును వెలిగించావు / మరణపు భయమును తొలగించావు (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా త్రోవకు వెలుగు నీవే / నా నావకు చుక్కాని నీవే / నను కావగ ఏతెంచితివే / కొనిపోవగ రానున్నావే ||గాఢాంధకారపు||

గాలించి చూడరా|Gaalinchi Choodaraa

గాలించి చూడరా మేలైనది / నీలోన ఉన్నదా ప్రేమన్నది / ప్రేమన్నది నీ పెన్నిధి (2) / నీలోన ఉన్నదా ప్రేమన్నది (2) / దేవ దూతలా భాషలు దేనికి / కరుణ లేని నీ కఠిన ముఖానికి (2) / పైకి భక్తి కలిగినా చాలదు / ప్రేమ లేని భక్తి అది వ్యర్ధము (2) ||గాలించి|| / బీదలకు ఆస్తినిచ్చి పంచినా / కార్చుటకు శరీరం మార్చినా (2) / రేయి పగలు ఏడ్చుచు ప్రార్ధించినా / రిక్తుడవే నీ శ్రమంతా వ్యర్ధము (2) ||గాలించి|| / కొండలు పెకిలించు విశ్వాసివా / గుండెలు కరిగించు సహవాసివా (2) / ప్రేమలేని విశ్వాసము శూన్యము / చివరికది మరో మృతము తథ్యము (2) ||గాలించి|| / స్వస్థపరచు వరాలున్న దేనికి / స్వస్థతయే లేదు నీకు నేటికీ (2) / ప్రేమలేని వరాలన్ని సున్నా / క్షేమమేదిరా నీకు రన్నా (2) ||గాలించి|| / గణ గణ మ్రోగెడి లోహానివా / కంచువై మ్రోగెడి మేళానివా (2) / డంబమెరుగదు మోగదు మేలిమి / పొంగదు ప్రేమ ఋణము తాలిమి (2) ||గాలించి|| / ధర్మశాస్త్రమంతటికాధారము / దశాజ్ఞలలో గొప్ప సారము (2) / ప్రేమయే అది యేసుని రూపము / లేనిదైతే వచ్చుఁ ఘోర శాపము (2) ||గాలించి|| / ప్రేమ విశ్వాసము నిరీక్షణ / ఓ ప్రియుడా నీకిచ్చును రక్షణ (2) / వీటిలో ప్రేమయే శ్రేష్టము / పాటించితే నీకింక మోక్షము (2) ||గాలించి||

గడచిన కాలము కృపలో మమ్ము|Gadachina Kaalam Krupalo Mammu

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2) / గడచిన కాలము కృపలో మమ్ము / దాచిన దేవా నీకే స్తోత్రము / పగలూ రేయి కనుపాపవలె / కాచిన దేవా నీకే స్తోత్రము (2) / మము దాచిన దేవా నీకే స్తోత్రము / కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన|| / కలత చెందిన కష్టకాలమున / కన్న తండ్రివై నను ఆదరించిన / కలుషము నాలో కానవచ్చినా / కాదనక నను కరుణించిన (2) / కరుణించిన దేవా నీకే స్తోత్రము / కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన|| / లోపములెన్నో దాగి ఉన్నను / ధాతృత్వముతో నను నడిపించినా / అవిధేయతలే ఆవరించినా / దీవెనలెన్నో దయచేసిన (2) / దీవించిన దేవా నీకే స్తోత్రము / దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2) ||గడచిన||

గమ్యం చేరాలని|Gamyam Cheraalani

గమ్యం చేరాలని నీతో ఉండాలని / పగలూ రేయి పరవశించాలని / ఈ నింగి నేలా కనుమరుగైనా / శాశ్వత జీవం పొందాలని / సాగిపోతున్నాను నిన్ను చూడాలని / నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని|| / భువి అంతా తిరిగి జగమంతా నడచి / నీ జ్ఞానముకు స్పందించాలని / నాకున్నవన్ని సమస్తం వెచ్చించి / నీ ప్రేమ ఎంతో కొలవాలని / అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో / అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను|| / అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా / శిరమును వంచి సహించాలని / వేదన బాధలు గుండెను పిండినా / నీదు సిలువనే మోయాలని / నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి / నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని ||సాగిపోతున్నాను||

ఘనమైన వేడుక|Ghanamaina Veduka

కరుణించి కాపాడే యేసయ్యా.. / యేసయ్యా… యేసయ్యా.. / కూడుకొని మనమీవేళ / ఘనమగు వేడుకకు తెర తీయాలా (2) / గడచిన దినముల కలిగిన సుఖముకై / ప్రభు యేసు ఆశీర్వాదాలకై ||కూడుకొని|| / వేసవి వడగాలుల బాధ తీరిపోయే / యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే / విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే / విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే / గానమై గళమున పాడగా / ధ్యానమై మనసుని తాకగా / ప్రభవించె యేసు దివ్య నాద రూపాన ||కూడుకొని|| / పాతవి కడ తేరగ మనసు మారిపోయే / నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే / ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే / సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే / స్తోత్రమే నిలువుగ లేవగా / ధూపమై వరదుని చేరగా / తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన ||కూడుకొని||