Songs sorted by number of likes. 1604 songs total.
వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ / అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2) / దివ్య తార దివ్య తార / దివి నుండి దిగి వచ్చిన తార (2) / వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది (2) / పశుల పాక చేరినది క్రిస్మస్ తార (2) ||దివ్య|| / జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం (2) / మధురమైన పాటలతో మారుమ్రోగెను / క్రీస్తు జన్మమే పరమ మర్మమే / కారు చీకట్లో అరుణోదయమే (2) / తార తార క్రిస్మస్ తార / తార తార దివ్య తార (2) ||దివ్య|| / ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది (2) / అవనిలో క్రీస్తు శకము అవతరించినది / క్రీస్తు జన్మమే మధురమాయెనే / శాంతి లేని జీవితాన కాంతి పుంజమే (2) / తార తార క్రిస్మస్ తార / తార తార దివ్య తార (2) ||దివ్య|| / పాపలోక జీవితం – పటాపంచలైనది (2) / నీతియై లోకంలో వికసించినది / క్రీస్తు జన్మమే ప్రేమామయమే / చీకటి హృదయాలలో వెలుగు తేజమే (2) / తార తార క్రిస్మస్ తార / తార తార దివ్య తార (2) ||దివ్య||
దూరపు కొండపై శ్రమలకు గుర్తగు / కౄరపు సిలువయే కనబడె / పాపలోకమునకై ప్రాణము నొసగిన / ప్రభుని సిలువను ప్రేమింతున్ / ప్రియుని సిలువను ప్రేమింతున్ / ప్రాణమున్నంత వరకును / హత్తుకొనెదను సిలువను / నిత్యకిరీటము పొందెదన్ / లోకులు హేళన చేసిన సిలువ / నా కెంతో అమూల్యమైనది / కల్వరిగిరికి సిలువను మోయను / క్రీస్తు మహిమను విడచెను ||ప్రియుని|| / రక్తశిక్తమైన కల్వరి సిలువలో / సౌందర్యంబును నే గాంచితిని / నన్ను క్షమించను పెన్నుగ యేసుడు / ఎన్నదగిన శ్రమ పొందెను ||ప్రియుని|| / వందనస్తుడను యేసుని సిలువకు / నిందను ఈ భువిన్ భరింతు / పరమ గృహమునకు పిలిచెడు దినమున / ప్రభుని మహిమను పొందెద ||ప్రియుని||
దొరకును సమస్తము యేసు పాదాల చెంత / వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2) / యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా / యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా ||దొరకును|| / మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి / కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2) / పాదాలను ముద్దు పెట్టుకొని / పూసెను విలువైన అత్తరు (2) / చేసెను శ్రేష్టారాధన / దొరికెను పాప క్షమాపణ (2) ||దొరకును|| / యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి / బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2) / చిన్నదాన లెమ్మని చెప్పి / బ్రతికించెను యేసు దేవుడు (2) / కలిగెను మహదానందం / దొరికెను రక్షణ భాగ్యము (2) ||దొరకును|| / పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి / పాదాలపై పడెను పరవశుడై యుండెను (2) / పరలోక దర్శనం / చూచెను తానే స్వయముగా (2) / దొరికెను ప్రభు ముఖ దర్శనం / దొరికెను ఇల మహా భాగ్యం (2) ||దొరకును||
సర్వమానవ పాపపరిహారార్థమై / సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా – (2) / దోషివా…. ప్రభూ…. నువు దోషివా / నీ విధేయతకు నా అవిధేయతకు / మధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా (2) / దోషివా…. ప్రభూ…. నువు దోషివా / ఘోరంబుగా నే చేసిన నేరాలకు / నువు పొందిన మరణ శిక్ష / నే నడచిన వక్ర మార్గాలకు / నువు పొందిన సిలువ యాతన (2) / కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర (2) / నే పొందిన రక్షణా పాత్ర (2) / నే వేసిన తప్పటడుగులకు / నీవు కార్చిన రక్త పు మడుగులూ / నే చేసిన కపటంబులకు / నీవు పొందిన కొరడా దెబ్బలు (2) / సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు (2) / ప్రేమించితివే నన్ను (2) / తులువలలో ఓ తులువగా నున్న / నా పై నీ దయగల చూపు / పరలోకములో నీతో నుండ / భాగ్యంబును నాకు నిచ్చినదే (2) / తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ (2) / నీ తుది శ్వాస వీడనంటివే (2)
ద్రాక్షావల్లివి నీవైతే / తీగెగ నేను ఎదిగితిని (2) / తండ్రి తోటలో నే నాటబడితి / ఎంత ధన్యత ఈ మహిలో – (2) ||ద్రాక్షా|| / చల్ల గాలులు వీచగా / కాంతి కిరణాలు ప్రసరించగా (2) / నీతి సూర్యుని నిజ కాంతిలోన / తేజరిల్లెడి బ్రతుకు తోడ / రక్షణ తోటలో విరివిగ పెరిగి / నీటి యోరన నిలిచితిని – (2) ||ద్రాక్షా|| / కొమ్మ కొమ్మను చూడగా / తీగలెన్నో అగుపించెనే (2) / ఆకు మాటున తీగె గావున / మొలవనున్నవి ఫలములెన్నో / నిలిచె అందులో ఫలితము కొరకై / కలిగె స్నేహము యేసునితో – (2) ||ద్రాక్షా||
దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే / అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2) / స్మరియించు రక్షకుని అనుకూల సమయమున / చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు|| / సాగిపోయిన నీడవంటి జీవితం / అల్పమైనది నీటి బుడగ వంటిది (2) / తెరచి ఉంది తీర్పు ద్వారం / మార్పులేని వారికోసం (2) / పాతాళ వేదనలు తప్పించుకొనలేవు / ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు|| / రత్నరాసులేవి నీతో కూడ రావు / మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2) / యేసు క్రీస్తు ప్రభువు నందే / ఉంది నీకు రక్షణ (2) / తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని / విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) ||దుర్దినములు||
దుష్టుల ఆలోచన చొప్పున నడువక (2) / పాపుల మార్గములయందు నిలిచి యుండక (2) / అపాహసించునట్టి ప్రజలు కూర్చుండెడు (2) / ఆ చోట కూర్చుండక యుండువాడే ధన్యుడు (2) / యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు (2) / ఎల్లప్పుడు ధ్యానము చేయువాడే ధన్యుడు (2) / కాలువ నీటి యోర నతడు నాటబడి తన (2) / కాలమున ఫలించు చెట్టు వలె యుండును (2) / ఆకు వాడని చెట్టువలె నాతడుండును (2) / ఆయన చేయునదియెల్ల సఫలమగును (2) / దుష్ట జనులు ఆ విధముగా నుండక (2) / పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు (2) / న్యాయ విమర్శ సభలయందు దుష్ట జనులు (2) / నీతిమంతుల సభలో పాపులును నిలువరు (2) / నీతిమంతుల మార్గము యెహోవ ఎరుగును (2) / నడుపును దుష్టుల దారి నాశనమునకు (2) ||దుష్టుల||
ఎడబాయని నీ కృప / నను విడువదు ఎన్నటికీ (2) / యేసయ్యా నీ ప్రేమానురాగం / నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని|| / శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో / కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2) / అర్ధమేకాని ఈ జీవితం / ఇక వ్యర్థమని నేననుకొనగా (2) / కృపా కనికరముగల దేవా / నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని|| / విశ్వాస పోరాటములో – ఎదురాయె శోధనలు / లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2) / దుష్టుల క్షేమమునే చూచి / ఇక నీతి వ్యర్థమని అనుకొనగా (2) / దీర్ఘశాంతముగల దేవా / నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని|| / నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో / నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2) / భారమైన ఈ సేవను / ఇక చేయలేనని అనుకొనగా (2) / ప్రధాన యాజకుడా యేసు / నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||
ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ (2) / నన్నెంతగానో బలపరచెను / నన్నెంతగానో స్థిరపరచెను (2) / నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను / నన్నెంతగానో స్థిరపరచెను (2) ||ఎడబాయని|| / కన్నీటి లోయలలో నుండి / నన్ను దాటించిన దేవా / సింహాల బోనులలో నుండి / నన్ను విడిపించిన ప్రభువా (2) ||నన్ను బలపరచెను|| / నేనున్నతమైన స్థితిలో / ఉండాలని ఆశించితివా / ఏ అర్హత నాకు లేకున్నా / నా కృప నీకు చాలునంటివే (2) ||నన్ను బలపరచెను|| / నేనెదుర్కొనలేని పరిస్థితులు / నా ఎదుట ఉన్నవి దేవా / నీ శక్తిని నేను కోరెదను / నన్ను విడిపించు నా దేవా (2) ||నన్ను బలపరచెను||
ఏడుస్తున్నాడేమో యేసయ్య / ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో (2) / (నిను) రక్షించినందుకు క్షమియించినందుకు (2) / ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో ||ఏడుస్తున్నాడేమో|| / నాడు నరుని సృష్టించినందుకు / వారు పాపము చేసినందుకు (2) / దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2) / నిను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో|| / సౌలును రాజుగా ఏర్పరచినందుకు / సౌలు హృదయము గర్వించినందుకు (2) / దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2) / నిను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో||
ఈ దినం క్రీస్తు జన్మ దినం / శుభకరం లోక కళ్యాణం / పరమును విడచి ఇలకు చేరిన / మహిమ అవతారం (2) / ఆడుము పాడుము ప్రభుని నామము / నూతన గీతముతో / రక్షణ పొందుము ఈ సమయము / నూతన హృదయముతో (2) ||ఈ దినం|| / దేవ దూతలు పలికిన ప్రవచనం / జ్ఞానులకొసగిన దివ్య మార్గం (2) / ధన్యత కలిగిన దావీదు పురము / కన్య మరియకు ప్రసవ తరుణం ||ఆడుము|| / పాప దుఃఖములన్నియు పారద్రోలును / కృపయు క్షేమము కలుగజేయును (2) / రక్షణ నొసగెడి పరమ సుతునికి / ఇమ్మానుయేలని నామకరణము ||ఈ దినం||
ఈ దినం సదా నా యేసుకే సొంతం / నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2) / రానున్న కాలము – కలత నివ్వదు (2) / నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును ||ఈ దినం|| / ఎడారులు లోయలు ఎదురు నిలచినా / ఎన్నడెవరు నడువని బాటయైనను (2) / వెరవదెన్నడైనను నాదు హృదయము (2) / గాయపడిన యేసుపాదం అందు నడచెను (2) ||ఈ దినం|| / ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా / యుద్ధకేక నా నోట యేసు నామమే / విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు / యెహోవా నిస్సియే నాదు విజయము ||ఈ దినం||