Songs sorted by number of likes. 1604 songs total.
దేవునియందు నిరీక్షణ నుంచి / ఆయనను స్తుతించు నా ప్రాణమా (2) / ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2) / ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2) ||దేవుని|| / చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2) / సత్యమగు – జీవమగు – మార్గమేసే (2) ||దేవుని|| / నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2) / ఆధారము – ఆదరణ – ఆయనలో (2) ||దేవుని|| / తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2) / తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2) ||దేవుని|| / నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2) / శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2) ||దేవుని|| / పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2) / కనికర – సంపన్నుడు – నా దేవుడు (2) ||దేవుని|| / స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2) / హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2) ||దేవుని||
ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2) / ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2) / వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2) ||ధన్యము|| / ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2) / ఎవరి పాపములు – మన్నించబడెనో (2) ||వారె ధన్యులు|| / క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2) / క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2) ||వారె ధన్యులు|| / ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు (2) / ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు (2) ||వారె ధన్యులు|| / ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును (2) / అపవాది తంత్రములు – గుర్తించు వారును (2) ||వారె ధన్యులు|| / శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును (2) / శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును (2) ||వారె ధన్యులు||
దయాళుడా నీ కృప నిత్యముండును / మహోన్నతుడా నీ కృప నిత్యముండును / నిత్యముండును నీ కృప నిత్యముండును (4) ||దయాళుడా|| / ఆపదలో చిక్కినప్పుడు / ఆలోచన లేనప్పుడు (2) / అంతా శూన్యంగా మారినప్పుడు (2) / ఆవేదన మదిని నిండినప్పుడు (2) ||నిత్యముండును|| / కన్నీళ్లే ఆగినప్పుడు / దరికెవ్వరు రానప్పుడు (2) / ఓదార్చే వారెవ్వరు లేనప్పుడు (2) / ఒంటరితనమే నాలో మిగిలినప్పుడు (2) ||నిత్యముండును||
ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన – విలువైన నీ మాటలు / ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2) / మోక్షమునకు చేర్చు బాటలు / పరిశుద్ధతలో పరిపూర్ణుడా – ఉన్నత గుణ సంపన్నుడా (2) / శ్రేష్టుడా… ||ధ్యానించుచుంటిమి|| / తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు / వీరిని దయతో క్షమించుము (2) / అని ప్రార్ధన చేసావా బాధించే వారికి (2) / శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) ||పరిశుద్ధతలో|| / నేడే నాతోను పరదైసులో నీవుందువు / నిశ్చయముగ ప్రవేశింతువు (2) / అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి (2) / అధికారముతో పాపిని రక్షించి (2) ||పరిశుద్ధతలో|| / ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు / కష్టము రానీయకు ఎప్పుడు (2) / అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను (2) / తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను (2) ||పరిశుద్ధతలో|| / దేవా నా దేవా నను విడనాడితివెందుకు / చెవినీయవె నా ప్రార్థనకు (2) / అని కేక వేసావా శిక్షననుభవిస్తూ (2) / పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2) ||పరిశుద్ధతలో|| / సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని / వాక్యము నెరవేర్చుచుంటిని (2) / అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు (2) / జీవ జలమును అనుగ్రహించుటకు (2) ||పరిశుద్ధతలో|| / సమాప్తిమయ్యింది లోక విమోచన కార్యం / నెరవేరెను ఘన సంకల్పం (2) / అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి (2) / పని ముగించి నీ తండ్రిని ఘనపరచి (2) ||పరిశుద్ధతలో|| / నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని / నీ యొద్దకు వచ్చుచుంటిని (2) / అని విన్నవించావా విధేయత తోటి (2) / తల వంచి తృప్తిగ విజయము చాటి (2) ||పరిశుద్ధతలో||
దిక్కులన్ని నీవేలే – దిక్కులన్ని నీవేలే (2) / ఎక్కడో నిన్ను వెదక – ఏలనయ్య ఓ స్వామీ (2) / నిత్యమై నాలోన – జీవమై నీవుండ ||దిక్కులన్ని|| / లెక్క మిక్కిలి ప్రాణులెన్నో ఈ జగతినుండగా / లెక్క మాలిన నన్ను నీవు నీ పోలిక చేయగా (2) / నిక్కముగా నర జన్మ – ధన్య చరితాయనే (2) / చక్కనయ్య త్యాగానాన – చావు కూడా సత్తేలే ||దిక్కులన్ని|| / దిక్కులేని దారిలోన నన్ను నీవు నడుప / దిక్కు నీవై ప్రక్కనుండి మొక్కుచుందు దేవా (2) / భాష రాని నా నోట – పాడుకుందు నీ పాట (2) / హీనమైన రూపానాన – గానమై యేసన్న ||దిక్కులన్ని||
దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2) / మనకు దిక్కు ఈ బాల యేసుడే / ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో / ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2) / కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2) / స్థలము లేక తిరిగి వేసారెను / నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2) / కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2) / నేడు నోవాహు ఓడ జోరేబు కొండ / గుర్తుగా ఉన్నాయి చూడండి ||దిక్కులెన్ని|| / దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2) / తన మార్గమందు నడుప బుట్టెను / ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2) / జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2) / నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి / హృదయాలు అర్పించినారయ్యో ||దిక్కులెన్ని||
దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా / అణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా (2) / ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా (2) / పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2) ||దినదినంబు|| / మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా (2) / మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2) ||దినదినంబు|| / ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము (2) / ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము (2) ||దినదినంబు|| / దైవ వాక్యం జీవ వాక్యం అనుదినంబు చదువుతా (2) / ప్రభువు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా (2) ||దినదినంబు|| / పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా (2) / సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా (2) ||దినదినంబు||
దినదినము విజయము మనదే / జయశీలుడైన యేసునిలో / భయమే లేదు మాకు దిగులే లేదు / సైన్యములకు అధిపతి యుండగా / సాతానును ఓడించెను / స్వేచ్చా జీవము మాకిచ్చెను / పాప శాపములు తొలగించెను / పరిపూర్ణ జీవము మాకిచ్చెను (2) / హోసన్నా జయం మనదే (3) / హోసన్నా జయం జయం మనదే ||దినదినము||
దినమెల్ల నే పాడినా కీర్తించినా / నీ ఋణము నే తీర్చగలనా / కొనియాడి పాడి నీ సాక్షిగానే / ఇలలో జీవించనా ||దినమెల్ల|| / గాయపడిన సమయాన మంచి సమరయునిలా / నా గాయాలు కడిగిన దేవా / ఆకలైన వేళలో ఆహారమిచ్చి / నన్ను పోషించినావు దేవా (2) / నిను విడువనూ ఎడబాయననినా (2) / నా యేసయ్య ||దినమెల్ల|| / నా బలహీనతయందు నా సిలువను మోస్తూ / నిన్ను పోలి నేను నడిచెదన్ / వెనుకున్నవి మరచి ముందున్న వాటికై / సహనముతో పరుగెత్తెదన్ (2) / ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2) / నేను పొందాలని ||దినమెల్ల||
దివి నుండి భువికి రారాజుగా / బేత్లెహేము పురముకు ఏతెంచెను (2) / గ్రామమంతా చిరునవ్వు లొలికె / పట్టణమంతా పండుగ చేసె (2) / సర్వలోకము సంబరమాయె (2) / ఆశ్చర్యకరుడు హల్లెలూయ / ఆలోచనకర్త హల్లెలూయ / బలమైన దేవుడు హల్లెలూయ / నిత్యుడగు తండ్రి హల్లెలూయ / సమాధానకర్త హల్లెలూయ / గొల్లలు జ్ఞానులు పరవశులై / బంగారం సాంబ్రాణి బోళమును (2) / సాష్టాంగపడి తమ హృదయములన్ / ప్రభువుకు కానుకలర్పించిరి / మనము కూడా అర్పించెదం / ప్రభువు నామము ఘనపరచెదం / మనము కుడా సాష్టాంగపడుచు / పరవశించుచు పాడెదము ||ఆశ్చర్యకరుడు|| / పాపము శాపము బాపగను / వేదన శోధన తీర్చగను (2) / పరిశుద్ధుడు జన్మించెనని / ఇహమున పరమున కొనియాడెదం / మనము కూడా కొనియాడెదం / ప్రభువు నామం ఘనపరచెదం / మనము కూడా హోసన్నయనుచు / కరములెత్తి పాడెదము ||ఆశ్చర్యకరుడు|| ||గ్రామమంతా||
దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా / దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా / మొదటివాడవు – కడపటివాడవు / యుగయుగములలో ఉన్నవాడవు (2) / మానక నా యెడల కృప చూపుచున్నావు / మారదు నీ ప్రేమ తరతరములకు (2) / మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు / నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు / నీ మాటలు జీవపు ఊటలు / నీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు|| / దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు / దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2) / దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు / దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు / నీ దీవెన పరిమళ సువాసన / నీ ఘనతే స్థిరమైన సంపద (2) ||దివినేలు|| / సీయోను శిఖరముపై నను నిలుపుటకే / జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2) / దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు / సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు / నీ రాజ్యము పరిశుద్ధ నగరము / ఆ రాజ్యమే నిత్య సంతోషము (2) ||దివినేలు||
దివిటీలు మండాలి – సిద్దెలలో నూనుండాలి / ఈనాటి ఓ సంఘమా – యేసయ్య సహవాసమా / ఇది నిదురించగా సమయమా / నీవు వెనుదిరిగితే న్యాయమా / ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడు / ఎన్నికలేని నీదు చెంత నిలిచాడు (2) / ఆ ప్రేమ నీడలో – ఆ యేసు బాటలో (2) / మొదటి ప్రేమను మరువకుమా / నిదురించగా సమయమా / వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు|| / రాకడ కాలపు సూచనలని చూచాయి / ఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయి (2) / పరిశుద్ధత కావాలి – పరివర్తన రావాలి (2) / మొదటి ప్రేమను మరువకుమా / నిదురించగా సమయమా / వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు||