తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

అమ్మ కోసం|Amma Kosam

ఏ భాషకందని భావం నీవు / వెలకట్టలేని ముత్యం నీవు / దేవుడిచ్చిన వరమే నీవు – తీర్చలేని ఓ ఋణం / ఎదలో దాగిన పలుకే నీవు – నా ప్రేమకు తొలిరూపం / అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరాలేదే / నవ మాసాలు నీలో నన్ను దాచావు / నా ఊపిరికై నీ ప్రాణం పణంగా పెట్టావు / రేయి పగలంతా నాకై శ్రమపడినా / తీరని అనురాగం నీలో చూసానే / నీ సుఖ సంతోషం విడచిన నాకై / తరగని మమకారం నీలో దాచావే / యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే / అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరానే లేదే / భయ భక్తులే ఉగ్గి పాలగ పోసావు / దేవుని మాటలే గోరు ముద్దగ చేసావు / తప్పటడుగులే నాలో సరి చేసి / ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగ నిలిపావు / ప్రతి వేకువలో నాకై నీవు / చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే / నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే / అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరానే లేదే

అమ్మల్లారా ఓ అక్కల్లారా|Ammallaara o akkallaara

అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) / ఈ వార్త వినరండే / యేసయ్యను నమ్ముకొండే (2) / మానవ జాతి పాపము కొరకై (2) / కన్నీరు విడుస్తుండు / ప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా|| / లోకమంతటా యేసు రక్తము (2) / ఎరువుగ జల్లిండే / మరణపు ముల్లును విరిచిండే (2) / అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) / ఓ పల్లె చెల్లెల్లారా / ఓ పట్నం అక్కల్లారా (2) / బట్టలు మార్చితే బ్రతుకు మారదు / గుండు కొడితే నీ గుణం మారదు / బతుకు మారడం బట్టల్ల లేదు / గుణం మారడం గుండుల లేదు / నీ మనసు మారాలన్నా / నీ బుద్ది మారాలన్నా / నీ మనసు మారాలక్కా / నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా|| / పాపం లేని యేసు దేవుణ్ణి / నమ్ముకుందామమ్మా / దేవుడు మంచి దేవుడమ్మా (2) / అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) / ఈ సత్యమినరండే / ఇది కల్ల కాదు చెల్లె / ఇది కల్ల కాదు తమ్మి / ఇది కల్ల కాదు తాత / ఇది కల్ల కాదు అవ్వ / ఇది కల్ల కాదు అన్న / ఇది కల్ల కాదు అక్క

అమూల్య రక్తం|Amoolya Raktham

అమూల్య రక్తం – ప్రశస్త రక్తం / విలువైన రక్తం – శక్తి గల రక్తం (2) / యేసు రక్తమే జయము / క్రీస్తు రక్తమే విజయము (2) / పాప క్షమాపణ యేసు రక్తములోనే / శాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య|| / తండ్రి చిత్తము నెరవేర్చ / గెత్సేమనేలో ప్రార్ధింప (2) / చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే / ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2) ||యేసు|| / శాపానికి ప్రతిఫలము ముళ్ళు / ముండ్ల కిరీటముతో చెల్లు (2) / ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు / ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2) ||యేసు|| / నీ చేతుల పనిని ఆశీర్వదింప / ప్రభు చేతులలో మేకులు గొట్ట (2) / కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే / బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2) ||యేసు||

అమూల్య రక్తము ద్వారా|Amoolya rakthamu dwaaraa

అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా / సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము / ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము / మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి (2) / చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా (2) ||అమూల్య|| / చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము (2) / నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి (2) ||అమూల్య|| / నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక (2) / స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి (2) ||అమూల్య|| / కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను (2) / ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను (2) ||అమూల్య|| / తన రక్త ధారలలో – మన పాపములను కడిగి (2) / మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో (2) ||అమూల్య|| / పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ (2) / కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము (2) ||అమూల్య|| / మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా (2) / మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను (2) ||అమూల్య||

అందాల బాలుడు|Andaala Baaludu

అందాల బాలుడు ఉదయించినాడు / లోకాలు వెలిగించు నీతి సూరీడు (2) / రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను / ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల|| / భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి / ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2) / గొల్లలము మేము కల్లలు ఎరుగము (2) / కళ్లారా జూసాము తేజోమయుని మోము (2) ||రండయ్యో|| / తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి / లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2) / దారి చూపే తార రారాజునే జేర (2) / మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2) ||రండయ్యో|| / తనలోని వెలుగంత పంచేటి పావనుడు / మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2) / చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2) / నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2) ||రండయ్యో||

అందాల తార|Andaala Thaara

అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో / అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ / ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో / ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార|| / విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ దోచెను / వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున / విశ్వాలనేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో / విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార|| / యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు / ఎరిగిన దారి తొలగిన వేళ యెదలో కృంగితి / యేసయ్యతార యెప్పటివోలె యెదురాయె త్రోవలో / ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు యేగితి స్వామి కడకు ||అందాల తార|| / ప్రభు జన్మ స్ధలము పాకయేగాని పరలోక సౌధమే / బాలుని జూడ జీవితమంత పావనమాయెను / ప్రభుపాదపూజ దీవెనకాగ ప్రసరించె పుణ్యము / బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్థన ||అందాల తార||

అందమైన క్షణము|Andamaina Kshanamu

అందమైన క్షణము ఆనందమయము / యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము / యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము (2) / బంగారు సొగసు కన్నా బహు అందగాడు (2) / బోళము సాంబ్రాణి కన్నా బహు సుగంధుడు / సంబరమే సంబరము శ్రీ యేసు జననము / సర్వ జగతికి మహా సంతోషము / సర్వ సృష్టికి ముందే దేవుడేర్పరిచిన / శాశ్వత జీవం ఈ ప్రభు యేసే / శాశ్వత జీవం ఈ ప్రభు యేసే / బలమైన యోధుడు దేవాది దేవుడు / దీన నరుడై మనకై పుట్టాడు / మన గాయములకు కట్టు కట్టి / మన బ్రతుకులను వెలుగుతో నింపిన / దైవతనయుని కొలువ రావా / సందేహించకు ఓ సోదరా / రక్షణ మార్గము కోరి రావా / సంశయమెందుకు ఓ సోదరా… ఓ సోదరీ… ||సంబరమే|| / పాప విమోచన నిత్య జీవం / సిలువలోనే మనకు సాధ్యం / సిలువ భారం తాను మోసి / మన దోషములను తుడిచేసాడు / సిలువ చెంతకు చేర రావా / జాగు ఎందుకు ఓ సోదరా / యేసు నామము నమ్మ రావా / జాగు ఎందుకు ఓ సోదరా… ఓ సోదరీ… ||సంబరమే||

Most Popular Telugu Songs — Page 14 | UEC Telugu Church