Songs sorted by number of likes. 1604 songs total.
ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో / నేరములెంచని వాడా – నాదు నజరేయుడా / తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా / ఏ రీతి స్తుతియింతునో… / నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి / నేను నీ వాడనో యేసువా (2) ||ఏ రీతి|| / మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి / సకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి (2) ||నా ప్రాణ|| / వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి / రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి (2) ||నా ప్రాణ|| / ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా / ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు పాడెదను (2) ||నా ప్రాణ||
ఏ సమయమందైనా ఏ స్థలమందైనా / ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2) / ఆరాధనా ఆరాధనా / నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా / ఆరాధనా ఆరాధనా / గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా ||ఏ సమయమందైనా|| / చెరసాలలో నేను బంధీగా ఉన్నా / సింహాల బోనులో పడవేసినా / కరువు ఖడ్గము హింస ఏదైననూ / మరణ శాసనమే పొంచున్ననూ / యేసు నామమే ఆధారము కాదా / యేసు రక్తమే నా విజయము / పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో / కునుకక కాపాడు యేసు దేవునికే ||ఆరాధనా|| / నా జీవనాధారం శ్రీ యేసుడే / నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే / తన చేతులతో నన్ను నిర్మించెగా / నా సృష్టికర్తను కొనియాడెదన్ / యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను / యెహోవ షమ్మా నాకు తోడుగా / యెహోవ నిస్సీ నా ధ్వజముగా / అల్ఫా ఒమేగా ఆది దేవునికే ||ఆరాధనా||
ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా / అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2) / లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా / లలల్లాలాలల్లా లలల్లా (2) / ఉన్నతమైన దేవుని నీవు / నివాసముగా గొని / ఆశ్చర్యమైన దేవుని నీవు / ఆదాయ పరచితివి (2) ||ఏ తెగులు|| / గొర్రెపిల్ల రక్తముతో / సాతానున్ జయించితిని / ఆత్మతోను వాక్యముతో / అనుదినము జయించెదను (2) ||ఏ తెగులు|| / మన యొక్క నివాసము / పరలోక-మందున్నది / రానైయున్న రక్షకుని / ఎదుర్కొన సిద్ధపడుమా (2) ||ఏ తెగులు||
ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా / ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా / నీకేమి చెల్లింతును / నీ ఋణమెలా తీర్తును (2) ||ఏ యోగ్యతా|| / కలుషితుడైన పాపాత్ముడను / నిష్కళంకముగా నను మార్చుటకు (2) / పావన దేహంలో గాయాలు పొంది (2) / రక్తమంత చిందించినావా ||నీకేమి|| / సుందరమైన నీ రూపమును / మంటివాడనైన నాకీయుటకు (2) / వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి (2) / నీ సొగసును కోల్పోయినావా ||నీకేమి|| / పాపము వలన మృతినొందిన / అపరాధినైన నను లేపుటకు (2) / నా స్థానమందు నా శిక్ష భరించి (2) / మరణించి తిరిగి లేచావా ||నీకేమి||
ఏడానుంటివిరా – ఓరన్న / వేగి ఉరికి రారా – ఓరన్న (2) / యాదికొచ్చెరా యాదన్న / యేసు సిత్ర కథ వినరన్న (2) / ఏలియాలో ఏలియాలో ఏలియాలో / యేసే నా రక్షకుడు ఏలియాలో / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా / యేసే నా రక్షకుడు హల్లెలూయా (2) / యూదా దేశమందు – ఓరన్న / బెత్లెహేమునందు – ఓరన్న / పశువుల శాలయందు – ఓరన్న / ప్రభు యేసు జన్మించె – ఓరన్న / చుక్కల రెక్కలు ఎగుర వేయుచు / చల్లని దూతలు పాట పాడిరి (2) / చల్ల చల్లని చలిలోన – ఓరన్న / గొల్ల గొల్లలు మ్రొక్కిరి – ఓరన్న (2) ||ఏలియాలో|| / పెద్ద పెద్దని వాడై – యేసన్న / ఇంత ఇంతింత ఎదిగె – యేసన్న / వింత వింతలు చేసె – యేసన్న / ఐదు రొట్టెలు రెండు చేపలు / ఐదు వేల మందికి పంచెను (2) / తుఫాను నణిచెను – యేసన్న / సంద్రాన నడిచెను – యేసన్న (2) ||ఏలియాలో|| / ఏ పాపమెరుగని – ఓరన్న / యేసయ్య తండ్రిని – ఓరన్న / సిలువ వేయమని – ఓరన్న / కేకలు వేసిరి – ఓరన్న / సిలువ మోసెను శ్రమల నోర్చెను / మూడవ నాడు తిరిగి లేచెను (2) / పరలోకమెళ్లాడు – యేసన్న / త్వరలోనే వస్తాడు – యేసన్న (2) ||ఏలియాలో||
అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2) / పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2) / అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2) / ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని|| / అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2) / ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2) ||అగ్ని|| / అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2) / నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2) ||అగ్ని|| / ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2) / నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2) ||అగ్ని||
ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ / ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతియించుడీ…హల్లేలూయ ||ఆకాశ|| / ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా / సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడీ..హల్లేలూయ ||ఆకాశ|| / సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా / వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతియించుడీ హల్లేలూయ ||ఆకాశ||
నా మనస్సా ఆయన మరచునా / దేవుడు నిన్ను మరచిపోవునా (2) / ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే / ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2) / స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే / కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2) / నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో / సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే (2) / తరిగిపోను నేను – అణగార్చబడను నేను (2) ||స్తుతింపజేయునే|| / సరిచేయు వాడే – ఓ ….స్థిరపరచినాడే / బలపరచినాడే – పూర్ణుణ్ణి చేయునే / సరి చేసి నిన్ను – హెచ్చించిన ప్రభువు / ఈ నూతనవత్సరములో – అలంకరించునే… / విచారించే వారు లేక – ఒంటరైయున్న నీకు / ఆరోగ్యము దయచేసి – పరిపాలన నిచ్చునే (2) / కూలిన కోటను – రాజగృహముగా మార్చును (2) ||స్తుతింపజేయునే|| ||నా మనస్సా||
అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా / అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2) / రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా / ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా / నాతో స్నేహమై నా సౌఖ్యమై / నను నడిపించే నా యేసయ్యా (2) ||అల్ఫా|| / కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే / ఉన్నతముగా నిను ఆరాధించుటకు / అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి / నూతన వసంతములు చేర్చెను (2) / జీవించెద నీ కొరకే / హర్షించెద నీలోనే (2) ||అల్ఫా|| / తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే / ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు / ఆశ నిరాశల వలయాలు తప్పించి / అగ్ని జ్వాలగా నను చేసెను (2) / నా స్తుతి కీర్తన నీవే / స్తుతి ఆరాధన నీకే (2) ||అల్ఫా|| / నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే / శుభ సూచనగా నను నిలుపుటకు / అంతులేని అగాధాలు దాటించి / అందని శిఖరాలు ఎక్కించెను (2) / నా చెలిమి నీతోనే / నా కలిమి నీలోనే (2) ||అల్ఫా||
అంబరానికి అంటేలా / సంబరాలతో చాటాలా (2) / యేసయ్య పుట్టాడని / రక్షింప వచ్చాడని (2) / ప్రవచనాలు నెరవేరాయి / శ్రమ దినాలు ఇక పోయాయి (2) / విడుదల ప్రకటించే / శిక్షను తప్పించే (2) ||యేసయ్య|| / దివిజానాలు సమకూరాయి / ఘనస్వరాలు వినిపించాయి (2) / పరముకు నడిపించే / మార్గము చూపించే (2) ||యేసయ్య|| / సుమ వనాలు పులకించాయి / పరిమళాలు వెదజల్లాయి (2) / ఇలలో నశియించే / జనులను ప్రేమించే (2) ||యేసయ్య||
లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2) / అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం (2) / సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2) ||లాల|| / దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు / దీనులను రక్షించే దేవ తనయుడు (2) / దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె / విజయ వీరుడై ఉద్భవించెనే (2) / పశుల పాకలో పరుండియుండెనే ||లాల|| / ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే / లోకానికి రక్షకుడు వెలిసెనని (2) / తార వెంబడి వెళ్లి వారు / కానుకలర్పించి ఆరాధించారు (2) / ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి ||లాల|| / ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త / సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే (2) / పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు / దూత గణములే జోల పాడగా (2) / సృష్టికి బహు సంబరమాయెగా ||లాల||
అంబరాన్ని దాటే సంబరాలు నేడు / నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2) / రండయ్యో రండి రండి దావీదు పురముకు (2) / రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని|| / దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము / ఏకైక తనయుని పంపెను ఈ దినము (2) / పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2) / అవతరించే నేడు లోక రక్షకునిగా (2) ||రండయ్యో|| / దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ / శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2) / లోకాల కారకుడు లోకమున పుట్టెను (2) / మనిషి మరణము ఆయువు తీరెను (2) ||రండయ్యో||