Songs sorted by number of likes. 1604 songs total.
యేసే నా ఊపిరి – యేసే నా కాపరి / నీ సేవే నాకు భాగ్యం / నీ సన్నిధే నాకు శరణం (2) / ఆరాధన ఆరాధన / ఆరాధన ఆరాధన / పాపపు ఊబి నుండి / పైకెత్తిన నా ప్రభువా / చీకటి బ్రతుకునకు / వెలుగైన నా దేవా (2) / నీ ఆత్మయే నాకాదరణ / నిత్య జీవం నా నిరీక్షణ (2) ||ఆరాధన|| / పక్షి రాజు యవ్వనం వలె / నన్ను బలపరచిన దేవా / నూతన దర్శనము / నాకు కనపరచిన ప్రభువా (2) / విశ్వాసమే నాదు సూత్రం / ప్రార్ధనే నాకు విజయం (2) ||ఆరాధన||
యేసే నీ మదిలో ఉండగా / కలతే దరి చేరగ రాదుగా (2) / సోదరా సోదరీ.. యేసులో నెమ్మది / ఓ సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ మది ||యేసే|| / తీరిపోని బాధలెన్నో నిన్ను బంధించినా / ఓర్వలేని మనుజులంతా నిన్ను నిందించినా (2) / నీ చెంతకు చేరి నిలుపును / నీ చింతను తీర్చి నడుపును (2) / సోదరా సోదరీ.. యేసే నీ మాదిరి / సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ గురి (2) ||యేసే|| / సిలువపైన బలిగా మారి నిన్ను ప్రేమించెగా / సహింపలేని శోధనలను నీకు దయచేయునా (2) / శోధనలను గెలిచే మార్గము / తప్పక నీకొసగును తథ్యము (2) / సోదరా సోదరీ.. యేసులో విజయము / సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నమ్మకం (2) ||యేసే||
అత్యున్నతమైన సింహాసనంపై / ఆసీనుడవైన గొప్ప దేవుడా / తేజోమయుడా రక్షణకర్తా / నీవే నా దేవుడని కీర్తింతును / తేజోమయుడా రక్షణకర్తా / నీవే నా దేవుడని ఘనపరతును / యేసే మార్గం యేసే సత్యం / యేసే జీవం యేసే సర్వం (2) / సాధ్యం కానిది ఏమున్నది / నీ యందే విశ్వాసం నాకున్నది (2) / నన్నెన్నడు ఎడబాయవు / నీ ప్రేమే నాకు నిత్య జీవము / నన్నెన్నడు ఎడబాయవు / నీ వాక్యమే నాకు ఆధారం.. యేసే.. / ది హోల్ వరల్డ్ మైట్ నాట్ సి మై / స్ట్రగ్గుల్స్ అండ్ అబ్స్టాకుల్స్ బట్ / గాడ్ సీస్ దెం ఆల్ అండ్ హి నెవర్ / హెసిటేట్స్ టు కం టు మి / గివ్ ఎవ్రిథింగ్ వి హావ్ టు హిం / ఈవెన్ పెయిన్ అండ్ హార్ట్ బ్రేక్స్ / గాడ్ ఈస్ అవర్ రీసన్ టు లివ్ / గ్లోరీ టు మై గాడ్ యెహోవా ||యేసే మార్గం||
యేసే సత్యం యేసే నిత్యం / యేసే సర్వము జగతికి / యేసే జీవం యేసే గమ్యం / యేసే గమనము (2) / పాత పాడెదం ప్రభువునకు / స్తోత్రార్పణ చేసెదం (2) ||యేసే|| / పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన / మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా (2) / యేసులోనే నిత్య జీవం / యేసులోనే రక్షణ (2) ||యేసే|| / బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు / కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు (2) / యేసులోనే నిత్య రాజ్యం / యేసులోనే విడుదల (2) ||యేసే||
యేసే నా పరిహారి / ప్రియ యేసే నా పరిహారి / నా జీవిత కాలమెల్ల / ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| / ఎన్ని కష్టాలు కలిగిననూ / నన్ను కృంగించె భాదలెన్నో (2) / ఎన్ని నష్టాలు వాటిల్లినా / ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| / నన్ను సాతాను వెంబడించినా / నన్ను శత్రువు ఎదిరించినా (2) / పలు నిందలు నను చుట్టినా / ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| / మణి మాన్యాలు లేకున్ననూ / పలు వేదనలు వేధించినా (2) / నరులెల్లరు నను విడచినా / ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| / బహు వ్యాధులు నను సోకినా / నాకు శాంతి కరువైనా (2) / నను శోధకుడు శోధించినా / ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| / దేవా నీవే నా ఆధారం / నీ ప్రేమకు సాటెవ్వరూ (2) / నా జీవిత కాలమంతా / నిన్ను పాడి స్తుతించెదను (2) ||యేసే నా||
యేషు మసీహ్ / తేరే జైసా హై కోయి నహీ / తేరే చరణో మే ఝుకే ఆస్మాన్ / ఔర్ మహిమా గాయే జమీన్ (2) / హమ్ గాయే హో-స్సనా / తూ రాజావో కా హై రాజా / తేరీ మహిమా హోవే సదా / తూ హై ప్రభు, హమారా ఖుదా (2) / ప్యారే పితా / తూనే హమ్ సే కిత్నా ప్యార్ కియా / హమే పాపోన్ సే చుడానే కో / అప్నే బేటే కో కుర్బాన్ కియా (2) / హమ్ గాయే హో-స్సనా / తూ రాజావో కా హై రాజా / తేరీ మహిమా హోవే సదా / తూ హై ప్రభు, హమారా ఖుదా (4)
యేసు దేవా నను కొనిపోవా / నీ రాజ్యముకై వేచియున్నా (2) / శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యింది / శాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యింది / నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను / అంత వరకు నీదు శక్తినిమ్మయా / నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను / అంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము ||యేసు|| / ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది / ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది (2) / నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా / నీ రాక వరకు నను నిలబెట్టుము దేవా (2) ||యేసు|| / నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను / నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను (2) / నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము / నీ ఆత్మ శక్తితో నను బలపరచుము / నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు / కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను ||యేసు||
యేసు దేవుని ఆశ్రయించుమా / సోదరా సోదరీ ఈ క్షణమే / విశ్వసించుమా తండ్రిని వేడుమా / గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే / స్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా? / యేసు నామములోనే స్వస్థత – యేసు కృపలోనే భద్రత / యేసు రక్తములోనే విమోచన – యేసే నడిపించును జీవమార్గాన / రోగియైన దాసుని కొరకు / శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను / మాట మాత్రం సెలవిమ్మనగా / విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను / విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2) / యేసు నందు విశ్వాసముంచుము (2) ||యేసు నామములోనే|| / దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను / దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను / మొక్కుబడి చేసి ప్రార్థించెను / దీవింపబడెను కుమారుని పొందెను / నీవు అడుగుము నీకివ్వబడును (2) / యేసుని ప్రార్థించుము (2) ||యేసు నామములోనే|| / శోధనలనైనా సమస్తమును కోల్పోయిన / యోబువంటి విశ్వాసం గమనించుమా / యధార్ధతతో నిరీక్షించెను / రెండంతల దీవెనలు పొందుకొనెను / సహనము చూపుము సమకూడి జరుగును (2) / యేసు నందు నిరీక్షించుము (2) ||యేసు నామములోనే||
యేసు గొరియ పిల్లను నేను / వధకు తేబడిన గొరియ పిల్లను (2) / దినదినము చనిపోవుచున్నాను / యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ|| / నా తలపై ముళ్ళు గుచ్చబడినవి / నా తలంపులు ఏడుస్తున్నవి (2) / నా మోమున ఉమ్మి వేయబడినది / నా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ|| / నా చేతుల సంకెళ్ళు పడినవి / నా రాతలు చెరిగిపోతున్నవి (2) / నా కాళ్ళకు మేకులు దిగబడినవి / నా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ||
యేసు జననము లోకానికెంతో వరము / ఆనంద గానాల క్రిస్మస్ దినము (2) / ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా (2) / బెత్లెహేములో పశులపాకలో / పొత్తిళ్ళలో మరియ ఒడిలో (2) / పవళించినాడు ఆనాడు / నీ హృదిని కోరాడు నేడు (2) ||ఆహాహహా|| / గొల్లలంతా పూజించిరి / జ్ఞానులంతా ఆరాధించిరి (2) / అర్పించుము నీ హృదయం / ఆరాధించుము ప్రభు యేసున్ (2) ||ఆహాహహా||
యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం / యేసుని పోలి నడిచే సాక్షులం / యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం / లోకములో యేసుని ప్రతినిధులం / శోధనలెదురైనా అవరోధములెన్నున్నా / విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు / ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా / లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా ||యేసు కోసమే|| / నిందారహితులుగా జీవించుట మన పిలుపు / నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు / యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము / లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే / ప్రేమయు సహనము యేసుని హృదయము / కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము ||యేసు కోసమే|| / యేసు స్వభామును ధరించిన వారలము / మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము / సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను / రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము / రాజులు జనములు యేసుని చూచెదరు / విశ్వాసులు విశ్వాసములో స్థిరముగ ఉన్నప్పుడు ||యేసు కోసమే||
యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో / మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2) / ఇది పండుగ – క్రిస్మస్ పండుగ / జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2) ||యేసు క్రీస్తు|| / పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2) / కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2) ||ఇది పండుగ|| / సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2) / నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2) ||ఇది పండుగ|| / శరీర ధారిగా – కృపగల దేవునిగా (2) / పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2) ||ఇది పండుగ||