Songs sorted by number of likes. 1604 songs total.
యేసు నామం సుందర నామం / యేసు నామం మధురం మధురం / జుంటి తేనెల కంటె మధురం / పాపములను క్షమియించు నామం / పాపములను తొలగించు నామం / స్వస్థపరచును యేసు నామము / అన్ని నామముల కన్న పై నామము / నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము (2) / సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం|| / అద్వితీయ నామం – అతిశయ నామం / ఆరాధించు నామం – ఆర్భాటించు నామం (4) / సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం||
యేసు నాథా దేవా / వందనాలు రాజా.. వందనాలు / రాజాధి రాజా నీకే వందనాలు / రవి కోటి తేజా నీకే వందనాలు (2) ||యేసు నాథా|| / పాపిని కరుణించి ప్రాణ దానమిచ్చావు / పరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి (2) / పన్నెండు గుమ్మముల… / పట్టణమే నాకు కట్టిపెట్టినావా ||రాజాధి రాజా|| / నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు / నీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు (2) / నీ నీతి నీ రాజ్యం… / నిండైన నా భాగ్యమే ||రాజాధి రాజా|| / హీనుని దీవించి ఘనునిగా చేసావు / నీ రుధిరమే కార్చి నా ఋణము దీర్చావు (2) / నా సల్లనయ్యా… / నా యన్న నీవే నా యేసయ్యా ||రాజాధి రాజా|| / కన్ను మిన్ను గానకుండా నిన్ను మీరిపోయాను / చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు (2) / నీ మనసే వెన్నయ్యా… / నా కన్న తండ్రి నా యేసయ్యా ||రాజాధి రాజా||
యేసూ నన్ ప్రేమించితివి / ఆశ్రయము లేనప్పుడు – నీ శరణు వేడగానే / నా పాప భారము తొలగే (2) ||యేసూ|| / నే తలచలేదెప్పుడు – నా అంతమేమౌనని (2) / నా పాపములచే నేను నిన్ను విసిగించితిని ||యేసూ|| / నిన్ను నే గాంచగానే – నా జీవితము మారెను (2) / నీయందు గృచ్చబడి నిన్నంగీకరించితి ||యేసూ|| / రక్షణ దొరికే నాకు – రక్తముతో నన్ను కడిగి (2) / క్రయముగా నీ చెంతకు రక్షకా తెచ్చితివి ||యేసూ||
యేసూ నన్ను ప్రేమించినావు / పాపినైన – నన్ను ప్రేమించినావు (2) / నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి / దా-నముగా జీవము సిలువపై (2) / ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ / కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ|| / తల్లి గర్భమున నే – ధరియింపబడి నపుడే / దురుతుండనై యుంటిని (2) / నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పు / డేహ్యంబులై యుండగ (2) ||యేసూ|| / మంచి నాలో పుట్ట – దంచు నీ విరిగి నన్ / మించ ప్రేమించి-నావు (2) / ఆహా – యెంచ శక్యముగాని – మంచి నాలో బెంచ / నెంచి ప్రేమించినావు (2) ||యేసూ|| / నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని / మున్నై తెలిసియుంటివి (2) / తెలిసి – నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో / యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ|| / నా వంటి నరుడొకడు – నన్ను ప్రేమించిన / నా వలన ఫలము కోరు (2) / ఆహా – నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితో / కేవలంబేమీ లేక (2) ||యేసూ||
యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవ / మా – దోషములను హరించి మోక్షని / వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన ||యేసు|| / వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవ / యెంతో – కీడు జేసిన పాడు వైరిని / గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి ||యేసు|| / పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవ / నీ – దాపు జేరిన వారి కందరి / కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు ||యేసు|| / అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే (2) దేవ / మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు / రక్షణకు దీక్ష గొని – వీక్షితులమైన మాకు ||యేసు|| / అందమగు నీ మందిరమున – బొందుగా మేము (2) దేవ / నీ – సుందర కరుణామృతము మా / డెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన ||యేసు||
యేసు నీకే జయం జయము (2) / నీవే లోక పాలకుడవు (2) / సర్వ సృష్టికి సృష్టికర్తవు / సర్వలోక రక్షకుడవు (2) / జై జై అనుచు నీకే పాడెదం (2) / జన్మించె జగమున మానవ రూపములో / ప్రాయశ్చిత్తముకై తానే బలియాయె (2) / పాపియైన మాన-వుని రక్షింప / సిలువ నెక్కి తన ప్రాణము నిచ్చెన్ (2) / హల్లెలూయా భువిపైన (2) ||యేసు|| / మరణము ద్వారా – అంతమాయె బలులు / తన సమాధి సర్వం కప్పెన్ (2) / తిరిగి లేచుటచే సర్వం నూతనమాయె / సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి (2) / హల్లెలూయా భువిపైన (2) ||యేసు|| / స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతమొందెన్ / తండ్రి కుడిప్రక్కన ఆయన కూర్చుండెన్ (2) / రాజుల రాజై ప్రభువుల ప్రభువై / పొందె అధికారము – పరలోకముపై (2) / హల్లెలూయా భువిపైన (2) ||యేసు|| / తన రూపమునకు మార్పు నిష్ట-మాయె / సృష్టికంటె ముందు తానే సంకల్పించె (2) / లోక దుఃఖము నుండి – మనం తప్పించుకొని / తన రూపము నొంది – తనతో నుండెదం (2) / హల్లెలూయా భువిపైన (2) ||యేసు||
యేసూ… నీకు కావాలని / నన్ను కోరుకున్నావా (2) / నే ఘోర పాపిని ప్రభువా / ఆ.. ఆ.. ఎందుకయ్యా నాపై నీ ప్రేమ (2) / కలుషాల్ని కడిగిన కరుణామయుడా / కన్నీటి గాథను మలిచావా ప్రభువా (2) / ఈ పేద బ్రతుకును అరచేతులలో / చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా (2) / నేను నేనే కానయ్యా / నాలో నీవే యేసయ్యా (2) / నీ ప్రేమకుప్పొంగిపోనా / ఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా (2) ||యేసూ|| / దాహముతో ఉన్న నా యేసు ప్రభువా / నీ దాహం తీర్చే భాగ్యమునిమ్మయా (2) / నశియించు ఆత్మల దాహముతో / నను చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా (2) / నేను నేనే కానయ్యా / నాలో నీవే యేసయ్యా (2) / నీ ప్రేమకుప్పొంగిపోనా / ఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా (2) ||యేసూ||
యేసు నీవే చాలు నాకు – వేరెవ్వరు అక్కరలేదు / నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము / మనుషులు నను మరచినా – నా వారే విడిచినా ||యేసు|| / నింగి నేల మారినా – స్థితి గతులు మారినా (2) / ఎన్నడెన్నడు మారానిది యేసు నీ ప్రేమ / ఎన్నడైనను వీడనిది క్రీస్తు నీ ప్రేమ / కంటి పాపవలె కాయు నీవుండగా ||యేసు|| / దారి తొలగి యుండగా – మార్గమును చూపించిన (2) / ముళ్ల కిరీటము శిరముగ ధరియించినా – మారని ప్రేమ / రక్తము నాకై చిందించినా – రక్షకుని ప్రేమ / నిత్య జీవమొసగె నీవుండగా ||యేసు||
యేసు నిన్ను నేను చూడలేను / చూడకుండా బ్రతుకలేను / ప్రభువా నీతో నేను నడువలేను / నిన్ను విడచి సాగలేను / యేసు రాజా రాజుల రాజా / నా కనులు తెరిచి కనిపించయా (2) / ఎత్తైన కొండపై నీవు పొందిన / రూపాంతర అనుభవము / నన్ను పొందనిమ్ము (2) / పేతురు యాకోబు యోహానులు / చూచినట్లు నను చూడనిమ్ము (2) ||యేసు నిన్ను|| / తిన్నని వీధిలో పౌలు భక్తునికి / దర్శనమిచ్చిన దేవా / నాకు నువ్వు కనబడుము (2) / ఆది అపోస్తలుల ఆత్మానుభవము / పొందినట్లు నను పొందనిమ్ము (2) ||యేసు నిన్ను||
యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు / క్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు – (2) / నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు (2) / ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడు / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా (2) ||యేసు|| / పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడు / కన్య మరియ గర్భాన జన్మించిన రక్షకుడు (2) ||హల్లెలూయా|| / దేవుని చెంతనున్న ఆదిలోన వాక్యము / ఈ భువిలో వెలసిన మానవ రూపము (2) ||హల్లెలూయా||
యేసు పరిశుద్ధ నామమునకు / ఎప్పుడు అధిక స్తోత్రము (2) / ఇహపరమున మేలైన నామము / శక్తి గల్గినట్టి నామమిది (2) / పరిశుద్దులు స్తుతించు నామమిది (2) ||యేసు|| / సైతానున్ పాతాళమును జయించు / వీరత్వము గల నామమిది (2) / జయమొందెదము ఈ నామమున (2) ||యేసు|| / నశించు పాపుల రక్షించు లోక / మున కేతెంచిన నామమిది (2) / పరలోకమున చేర్చు నామమిది (2) ||యేసు|| / ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు / ఉన్నత దేవుని నామమిది (2) / లోకమంతా ప్రకాశించే నామమిది (2) ||యేసు|| / శోధన, బాధల, కష్ట సమయాన / ఓదార్చి నడుపు నామమిది (2) / ఆటంకము తొలగించు నామమిది (2) ||యేసు||
యేసూ ప్రభుని స్తుతించుట / ఎంతో ఎంతో మంచిది (2) / మహోన్నతుడా నీ నామమును / స్తుతించుటయే బహు మంచిది (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / విలువైన రక్తము సిలువలో కార్చి / కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / ఎంతో గొప్ప రక్షణనిచ్చి / వింతైన జనముగా మేము చేసెను (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / మా శైలము మా కేడెము / మా కోటయు మా ప్రభువే (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / ఉన్నత దుర్గము రక్షణ శృంగము / రక్షించువాడు మన దేవుడు (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / అతిసుందరుడు అందరిలోన / అతికాంక్షనీయుడు అతి ప్రియుడు (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / రాత్రింబవళ్లు వేనోళ్లతోను / స్తుతించుటయే బహుమంచిది (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||