Songs sorted by number of likes. 1604 songs total.
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే / సౌందర్య సీయోనులో / నీ మనోహరమైన ముఖము దర్శింతును / నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే / సీయోనులో స్థిరమైన పునాది నీవు / నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2) / సూర్యుడు లేని చంద్రుడు లేని / చీకటి రాత్రులు లేనే లేని (2) / ఆ దివ్య నగరిలో కాంతులను / విరజిమ్మెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| / కడలి లేని కడగండ్లు లేని / కల్లోల స్థితి గతులు దరికే రాని (2) / సువర్ణ వీధులలో / నడిపించెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| / సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2) / సౌందర్య సీయోనులో / నీ మనోహరమైన ముఖము దర్శింతును (2) / నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3) / ఆనందమే పరమానందమే (10)
సేవకులారా సువార్తికులారా / యేసయ్య కోరుకున్న శ్రామికులారా / సేవకులారా సువార్తికులారా / మీ మాదిరికై వందనము / ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా / మా కొరకై నీ ప్రాణం అర్పించితివి / నీలో నిలిచి యుండుటే మా భాగ్యము / నీ కొరకై జీవించెదము ||సేవకులారా|| / మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే / మనము గొప్పవారము కాదు / మనము మంచివారము కాదు / మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు / దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారు / ప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారు / మా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారు / నీతి కిరీటము పొందుటకు – అర్హులుగా మీరున్నారు ||ఉన్నత|| / ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి / మీ శరీరము దేవుని ఆలయమిది / మీరు విలువ పెట్టి కొనబడిన వారు / సంఘమును కాపాడుటలో – కాపరులుగ మీరున్నారు / సువార్తకై పోరాడుటలో – సిద్ధపడిన సైన్యం మీరు / మీ ప్రేమను ఎరుగని వారు – అన్యాయముగ మిము చంపారు / మీ త్యాగం మేము – ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా|| / హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్, / దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్ / షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ / సువార్తను అందించుటకు – ఎన్నో హింసలు పొందారు / ఆకలితో మోకాళ్లూని – సంఘమును పోషించారు / మాకు మాదిరి చూపించుటకు – క్రీస్తుని పోలి జీవించారు / మీ జత పని వారమే మేము – మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||
షారోను పొలములో పూసిన పుష్పమా / అగాధ లోయలో దాగిన పద్మమా (2) / ప్రియ సంఘమా – ప్రియ సంఘమా (2) ||షారోను|| / ఆనందభరితం నీ హృదయం / నీ ప్రేమ అపారము (2) / యేసు నాథుడు నిన్ను పిలువగా / సిద్ధపడుమా ఓ సంఘమా / ఓ సంఘమా నా సంఘమా – (2) ||షారోను|| / కొండలు దాటి బండలు దాటి / యేసు నాథుడు నిను చేరగా (2) / నీదు హృదయమున నివసింపనీయుమా / సిద్ధపడుమా ఓ సంఘమా / ఓ సంఘమా నా సంఘమా – (2) ||షారోను||
షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు (2) / ప్రేమ మూర్తియని – ఆదరించు వాడని / ప్రాణప్రియుని కనుగొంటిని (2) / అడవులైనా లోయలైనా / ప్రభు వెంట నేను వెళ్ళెదను (2) ||షారోను|| / యేసుని ఎరుగని వారెందరో / వాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2) / దప్పికతో ఉన్న ప్రభువునకే (2) / సిలువను మోసే వారెవ్వరు (2) ||అడవులైనా|| / సీయోను వాసి జడియకుము / పిలిచిన వాడు నమ్మదగినవాడు (2) / చేసిన సేవను మరువకా (2) / ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును (2) ||అడవులైనా||
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా / కృప చూపి నన్ను రక్షించవయ్యా (2) / నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది / నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2) / అనాథనైనా నన్ను వెదకి వచ్చావు / ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2) ||నీ ప్రేమ|| / అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా / సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2) ||నీ ప్రేమ|| / తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి / తల్లిలా ఆదరించి నడిపించితివి (2) ||నీ ప్రేమ|| / నడుచుచున్న మర్గమంత యోచించగా / కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2) ||నీ ప్రేమ|| / ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు / సమస్తము మేలుకై చేసిన దేవా (2) ||నీ ప్రేమ||
శాశ్వత కృపను నేను తలంచగా / కానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత|| / నా హృదయమెంతో జీవముగల దేవుని / దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2) / నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత|| / దూతలు చేయని నీ దివ్య సేవను / ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2) / ధూపార్తిని చేపట్టి చేసెద (2) ||శాశ్వత|| / భక్తిహీనులతో నివసించుటకంటెను / నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2) / వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2) ||శాశ్వత|| / సీయోను శిఖరాన సిలువ సితారతో / సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2) / సీయోను రారాజువు నీవేగా (2) ||శాశ్వత|| / నూతనమైన ఈ జీవ మార్గమందున / నూతన జీవము ఆత్మాభిషేకమే (2) / నూతన సృష్టిగా నన్ను మార్చెను (2) ||శాశ్వత||
శాశ్వతమా ఈ దేహం / త్వరపడకే ఓ మనసా… / శాశ్వతమా ఈ దేహం / త్వరపడకే ఓ మనసా (2) / క్షణికమైన ఈ మనుగడలో / పరుగులేలనో అనుక్షణము / నీటిపైన చిరు బుడగ వోలె – (2) / దేహము ఏ వేళా చితికిపోవునో ||శాశ్వతమా|| / ఈ లోకములో భోగములెన్నో / అనుభవించగా తనవి తీరేనా / నీ తనువే రాలిపోయినా – (2) / నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా|| / దేహ వాంఛలను దూరము చేసి / ఆ ప్రభు యేసుని శరణము కోరి / నీతి మార్గమున నడుచుకొందువో – (2) / చిరజీవముతో తరియించేవు ||శాశ్వతమా||
శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా / నీ ప్రేమే నను గెల్చెను / విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా / నీ కృపయే నను మార్చెను / నీ ప్రేమ ఉన్నతం – నీ ప్రేమ అమృతం / నీ ప్రేమ తేనె కంటే మధురము / నీ ప్రేమ లోతులో – నను నడుపు యేసయ్యా / నీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినా / ప్రేమతో… ప్రేమతో… / యేసయ్యా నిను వెంబడింతును / ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… / యేసయ్యా నిను ఆరాధింతును ||శాశ్వతమైన|| / నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగా / దృష్టించి నిర్మించిన ప్రేమ / నా దినములలో ఒకటైన ఆరంభము కాకమునుపే / గ్రంధములో లిఖియించిన ప్రేమ / నా ఎముకలను నా అవయములను / వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ / తల్లి ఒడిలో నేను పాలు త్రాగుచున్నప్పుడు / నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ / తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ / ప్రేమతో… ప్రేమతో… / నీ కోసం సృజియించావయ్యా / ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… / నను మురిపెంగా లాలించావయ్యా ||శాశ్వతమైన|| / నే ప్రభువును ఎరుగక యుండి అజ్ఞానముతో ఉన్నప్పుడు / నను విడువక వెంటాడిన ప్రేమ / నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనప్పుడు / నా కోసం వేచిచూచిన ప్రేమ / బాల్య దినముల నుండి నను సంరక్షించి / కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ / యవ్వన కాలమున కృపతో నను కలిసి / సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ / నే వెదకకున్నను నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ / ప్రేమతో… ప్రేమతో… / యేసయ్యా నను దర్శించినావయ్యా / ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… / నను ప్రత్యేకపరిచావేసయ్యా ||శాశ్వతమైన|| / నే పాపినై యుండగానే నాకై మరణించిన ప్రేమ / తన సొత్తుగా చేసుకున్న ప్రేమ / విలువే లేనట్టి నాకై తన ప్రాణపు విలువని చెల్లించి / నా విలువని పెంచేసిన ప్రేమ / లోకమే నను గూర్చి చులకన చేసినను / తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ / ఎవరూ లేకున్నా నేను నీకు సరిపోనా / నీవు బహు ప్రియుడవని బలపరచిన ప్రేమ / నా ముద్దు బిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ / యేసయ్యా… యేసయ్యా… / నాపై ఇంత ప్రేమ ఏంటయ్యా / యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… / నను నీలా మార్చేందులకేనయ్యా ||శాశ్వతమైన|| / పలు మార్లు నే పాడినప్పుడు బహు చిక్కులలోనున్నప్పుడు / కరుణించి పైకి లేపిన ప్రేమ / నేనే నిను చేసానంటూ నేనే భరియిస్తానంటూ / నను చంకన ఎత్తుకున్న ప్రేమ / నా తప్పటడుగులు తప్పకుండ సరి చేసి / తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ / నన్ను బట్టి మారదుగా నన్ను చేరదీసెనుగా / షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ / తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ / ప్రేమతో… ప్రేమతో… / నను మరలా సమకూర్చావేసయ్యా / ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… / నీ సాక్ష్యంగా నిలబెట్టావయ్యా ||శాశ్వతమైన|| / కష్టాల కొలుముల్లోన కన్నీటి లోయల్లోన / నా తోడై ధైర్యపరచిన ప్రేమ / చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో / తన మాటతో శాంతినిచ్చింది ప్రేమ / లోకమే మారిననూ మనుషులే మరచిననూ / మరువనే మరువదుగా నా యేసు ప్రేమ / తల్లిలా ప్రేమించి తండ్రిలా బోధించి / ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ / క్షణమాత్రమైన నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ / ప్రేమతో… ప్రేమతో… / నా విశ్వాసం కాపాడవయ్యా / ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… / బంగారంలా మెరిపించావయ్యా ||శాశ్వతమైన|| / ఊహించలేనటువంటి కృపాలని నాపై కురిపించి / నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ / నా సొంత శక్తితో నేను ఎన్నడును పొందగలేని / అందలమును ఎక్కించిన ప్రేమ / పక్షి రాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ / శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ / పర్వతాలపై ఎప్పుడు క్రీస్తు వార్త చాటించే / సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ / తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ / ప్రేమతో… ప్రేమతో… / శాశ్వత జీవం నాకిచ్చావయ్యా / ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… / నను చిరకాలం ప్రేమిస్తావయ్యా ||శాశ్వతమైన||
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప / అనుక్షణం నను కనుపాపవలె (2) / కాచిన కృప ||శాశ్వతమైనది|| / నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2) / నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత|| / తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2) / నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత|| / పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2) / నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) ||శాశ్వత||
శక్తి చేత కాదనెను / బలముతోనిది కాదనెను (2) / నా ఆత్మ ద్వారా దీని చేతునని / యెహోవ సెలవిచ్చెను (2) ||శక్తి|| / ఓ గొప్ప పర్వతమా / జెరుబ్బాబెలు నడ్డగింపను (2) / ఎంత మాత్రపు దానవు నీవనెను / చదును భూమిగా మారెదవు (2) ||శక్తి|| / ఓ ఇశ్రాయేలు విను / నీ భాగ్యమెంత గొప్పది (2) / యెహొవా రక్షించిన నిన్ను / బోలిన వారెవరు (2) ||శక్తి||
శక్తి చేత కాదు / బలము చేత కాదు / దేవుని ఆత్మచే / సమస్తము సాధ్యము (2) ||శక్తి|| / నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని / చేసెను దేవుడు శూన్యము నుండి (2) / తన రూపులో తన పోలికలో (2) / నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి (2) ||శక్తి|| / కౄరమైన సింహాల బోనైననూ / విశ్వాసముతో సాగెను దానియేలు (2) / అగ్ని గుండములో మరణ శాసనములో (2) / ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా (2) ||శక్తి|| / ఘోరమైన పాపాల బానిసైననూ / భారమైన బ్రతుకును గడుపుచున్ననూ (2) / ప్రియమార నిన్నే పిలువంగ యేసు (2) / దరి చేర రావా ఆ ప్రేమ నాథుని (2) ||శక్తి||
శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా (2) / కరుణ నాథుడా – ఈ తరుణమే ప్రభో (2) ||శరణం|| / పాపరహిత దేవకుమారా – శాపవాహకా (2) / శాపవాహకా – నిత్య కోప రహితుడా (2) ||శరణం|| / పరిపూర్ణ దేవుడా – నరావతారుడా (2) / నరావతారుడా – మా యేసు నాథుడా (2) ||శరణం|| / దయామయుండ క్రీస్తు యేసు – దాక్షిణ్య ప్రభువా (2) / దాక్షిణ్య ప్రభువా – బాహుళ్య దేవుడా (2) ||శరణం|| / నమ్మదగిన లోకరక్షకా – సర్వోపకారుడా (2) / సర్వోపకారుడా – సర్వశక్తిమంతుడా (2) ||శరణం|| / సాత్వికుండా – సర్వజనుల కాంక్షణీయుడా (2) / కాంక్షణీయుడా – వాత్సల్య దేవుడా (2) ||శరణం|| / రిక్తుడై తగ్గించుకొనిన – వినయపూర్ణుడా (2) / వినయపూర్ణుడా – మముగాచు దేవుడా (2) ||శరణం|| / సత్యవంతుడవు – మాదు నిత్యదేవుడా (2) / నిత్యదేవుడా – మా మంచి బోధకుడా (2) ||శరణం|| / సర్వలోక సృష్టికర్త – సత్యదేవుడా (2) / సత్యదేవుడా – మా నిత్యజీవమా (2) ||శరణం|| / ఎల్లరిలో శ్రేష్ఠుడా – మా వల్లభుండవు (2) / వల్లభుండవు హల్లెలూయ పాడెదం (2) ||శరణం||