తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

ప్రేమగల యేసయ్యా|Premagala Yesayyaa

ప్రేమగల యేసయ్యా / జీవ వృక్షమా యేసయ్యా (2) / సిలువలో బలి అయిన యేసయ్యా / తులువలో వెలి అయిన యేసయ్యా (2) / పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా / పరిశుద్ధుడా నా ప్రాణేశ్వరా / పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా / పరిశుద్ధుడా నా ప్రాణ ప్రియుడా ||ప్రేమగల|| / యేసయ్య నీ శిరముపై మూళ్ళ కిరీటం మొత్తగా / రక్తమంత నీ కణతలపై ధారలుగా కారుచుండగా / కొరడాల దెబ్బలు చెళ్లుమనెను / శరీరపు కండలే వేలాడేను (2) / నలిగిపోతివా నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడా|| / యేసయ్యను కొట్టిరి జాలిలేని ఆ మనుష్యులు / ముఖానపై ఉమ్మి వేసిరి కరుణ లేని కక్షకులు / గడ్డము పట్టాయనను లాగుచుండగా / నాగటి వలె సిలువలో దున్నబడగా (2) / ఒరిగిపోతివా నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడా|| / యేసయ్య ఆ కల్వరిలో దాహముకై తపియించగా / మధురమైన ఆ నోటికి చేదు చిరకను ఇచ్చిరే / తనువంత రుధిరముతో తడిసిపోయెనే / తండ్రీ అని కేక వేసి మరణించెనే (2) / మూడవ దినాన తిరిగి లేచెను (2) ||పరిశుద్ధుడా||

ప్రేమలో పడ్డాను|Premalo Paddaanu

ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను… / ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను / నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను / ప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నాను / నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను / స్వార్ధ్యం కలిగిన ప్రేమ కాదు – లాభం కోరే ప్రేమ కాదు / కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు – ఆహ శాశ్వతమైన యేసుని ప్రేమ / మోహం కలిగిన ప్రేమ కాదు – మోసం చేసే ప్రేమ కాదు / పై అందం చూసే ప్రేమ కాదు – పరిశుద్ధమైన ప్రేమ / ఇదే కదా ప్రేమంటే – (2) / ఈ లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ / దేవుని ప్రేమ ఇది ||ప్రేమలో|| / మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు / నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే / మొదటగా ప్రేమించింది నేను కాదు / నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే / కోరినాడు పిలిచినాడు – నేను ఎదో మంచి వ్యక్తినైనట్టు / కుమ్మరించే ప్రేమ మొత్తం – నేను తప్ప ఎవ్వరు లేనట్టు / ఆకశాన తనలో తాను – పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు / భువిలో నాపై ప్రేమ ఎందుకో / ఏమి తిరిగి ఇవ్వలేని – ఈ చిన్న జీవి పైన / ప్రభువుకు అంత ప్రేమ దేనికో / హే… ఇంత గొప్ప ప్రేమ రుచి చూసాక / నేను ప్రేమించకుండ ఎట్లా ఉంటాను / అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి / ఐ లవ్ యు చెప్పకుండ ఎట్లగుంటాను ||ఇదే కదా|| / తన ప్రేమకు ఋజువేంటని నేనడుగక ముందే / నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచె / ప్రేమకు ఋజువేంటని నేనడగక మునుపే / నా యేసు తన ప్రేమ రుజువు పరిచె / పాపమనే కూపమందు – నేను బంధీనైయుండఁగా / పాపమనే అప్పు చేత – బానిసై నేను అలసియుండగా / గగనపు దూరము దాటి వచ్చి – సిలువలో చేతులు పార చాపి / నువ్వంటే నాకింత ప్రేమనే / రక్తముతో నను సంపాదించి – నా కళ్ళల్లో కళ్ళు పెట్టి / నీపై పిచ్చి ప్రేమ నాకనే / హే… నన్ను తన సొత్తు చేసుకున్నాడు / నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు / మరల వచ్చి పెళ్లి చేసుకుంటాడు / అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు ||ఇదే కదా|| / ప్రేమతో నా ప్రియుడు రాసెను ప్రేమ లేఖ / వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ / ప్రేమతో నా యేసు రాసెను ప్రేమ లేఖ / వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ / ఆ లేఖ చదువుతుంటే – నా ప్రియుని తలపులు నాలో నిండే / ప్రభుని ప్రేమ లోతు తెలిసి – నా యేసుపై పొంగి పొరలే / రేయింబవలు ప్రభు కావాలని – తనతో ఎప్పుడు కలిసుండాలని / నా ప్రాణము పరి తపియించెనే / యుగయుగములు నన్నేలేడివాడు – అని త్వరలోనే రానున్నాడని / ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే / హే… వింత అయిన ఆ యేసు ప్రేమ గూర్చి / నేను సర్వ లోకమునకు చాటి చెబుతాను / యేసు రక్తమందు శుద్ధులైన వారే / ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను ||ఇదే కదా||

ప్రేమతో యేసు|Prematho Yesu

ప్రేమతో యేసు – పిలచుచున్నాడు రమ్ము (2) / రక్షణను పొంది – లక్షణముగా వెళ్ళుము (2) ||ప్రేమతో|| / పాపమెరుగని ప్రభు నీ కొరకు / పాపముగను చేయబడెను (2) / శాపగ్రాహియాయె సిలువలో / శాపగ్రాహియాయె సిలువలో పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో|| / ముండ్ల కిరీటమును ధరించి / ముఖముపై నుమ్మి వేయబడె (2) / ప్రాణమిడె నేసు సిలువలో / ప్రాణమిడె నేసు సిలువలో పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో|| / సిలువలో నీకై దప్పిగొని / కలుష నీ క్షమకై ప్రార్థించి (2) / సహించి ప్రాణమిడె నీ కొరకు / సహించి ప్రాణమిడె నీ కొరకు పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో|| / తప్పిన గొర్రెను రక్షింప / తనదు రక్తమును చిందించె (2) / కాపరి స్వరము ధ్వనించె / కాపరి స్వరము ధ్వనించె పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో|| / తామసించ తగదిక ప్రియుడా / త్వరపడుము నీ రక్షణ కొరకు (2) / నేడే నీ రక్షణ దినము / నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో|| / తానే కడుగును తన రక్తముతో / తండ్రివలె నీ పాపమునంత (2) / తనయుడవై పోదు విపుడే / తనయుడవై పోదు విపుడే పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో|| / ప్రేమవార్త ప్రకటింపబడె / ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము (2) / కృపాకాలమిదే జాగేల / కృపాకాలమిదే జాగేల పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||

ప్రేమించెద యేసు రాజా|Premincheda Yesu Raajaa

ప్రేమించెద యేసు రాజా / నిన్నే ప్రేమించెద (2) / ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ / ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు / నే మట్టిలో చేరే వరకు / నా ప్రాణమున్నంతవరకు / నే మహిమలో చేరే వరకు / ఆరాధించెద యేసు రాజా / నిన్నే ఆరాధించెద (2) / ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ / ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు / నే మట్టిలో చేరే వరకు / నా ప్రాణమున్నంతవరకు / నే మహిమలో చేరే వరకు / ప్రార్ధించెద యేసు రాజా / నిన్నే ప్రార్ధించెద (2) / ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ / ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు / నే మట్టిలో చేరే వరకు / నా ప్రాణమున్నంతవరకు / నే మహిమలో చేరే వరకు / సేవించెద యేసు రాజా / నిన్నే సేవించెద (2) / సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ / సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు / నే మట్టిలో చేరే వరకు / నా ప్రాణమున్నంతవరకు / నే మహిమలో చేరే వరకు / జీవించెద యేసు రాజా / నీకై జీవించెద (2) / జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ / జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు / నే మట్టిలో చేరే వరకు / నా ప్రాణమున్నంతవరకు / నే మహిమలో చేరే వరకు

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు|Preminchu Devudu Rakshinchu Devudu

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు / పాలించు దేవుడు – యేసు దేవుడు / పాటలు పాడి ఆనందించెదం / ఆహా ఎంతో ఆనందమే (2) ||ప్రేమించు|| / తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు / ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2) / హల్లెలూయా ఆనందమే / సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| / నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు / తోడు నీడగా నన్ను కాపాడును (2) / హల్లెలూయా ఆనందమే / సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| / నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు / సర్వ కాలమందు జయమిచ్చును (2) / హల్లెలూయా ఆనందమే / సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| / ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు / అంతము వరకు చేయి విడువడు (2) / హల్లెలూయా ఆనందమే / సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు||

ప్రేమిస్తా నిన్నే|Premisthaa Ninne

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా / పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2) / చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా / యేసయ్యా నీ సన్నిధి చాలయా (2) ||ప్రేమిస్తా|| / నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ / సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ (2) / ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు / నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా|| / కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ / కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ (2) / ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు / నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా|| / నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ / నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ (2) / ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు / నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా||

Most Popular Telugu Songs — Page 100 | UEC Telugu Church