Songs sorted by number of likes. 1604 songs total.
ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు / నీదు పొలములో కూలివానిగా / కావాలి నేను నీదు తోటకు కావలివానిగా / అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే / అంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికే / స్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవను / మెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2) / మరువకు నా ప్రాణమా / నీ ప్రయాస వ్యర్ధము కాదు (2) ||ప్రియ యేసు|| / ఏక భావము సేవ భారము / యేసు మనసుతో సాగిపోదును (2) / విసుగక విడువక / కష్టించి పని చేసెదన్ (2) ||ప్రియ యేసు||
ప్రియ యేసు నిర్మించితివి / ప్రియమార నా హృదయం / ముదమార వసియించునా / హృదయాంతరంగమున / నీ రక్త ప్రభావమున / నా రోత హృదయంబును (2) / పవిత్రపరచుము తండ్రి / ప్రతి పాపమును కడిగి (2) ||ప్రియ యేసు|| / అజాగరూకుడనైతి / నిజాశ్రయమును విడచి (2) / కరుణారసముతో నాకై / కనిపెట్టితివి తండ్రి (2) ||ప్రియ యేసు|| / వికసించె విశ్వాసంబు / వాక్యంబును చదువగనే (2) / చేరితి నీదు దారి / కోరి నడిపించుము (2) ||ప్రియ యేసు|| / ప్రతి చోట నీ సాక్షిగా / ప్రభువా నేనుండునట్లు (2) / ఆత్మాభిషేకమునిమ్ము / ఆత్మీయ రూపుండా (2) ||ప్రియ యేసు||
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు / మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2) / నిత్యమైన మోక్షగృహము నందు చేరి / భక్తుల గుంపులో హర్షించిన చాలు (2) ||ప్రియ యేసు|| / యేసుని రక్తమందు కడుగబడి / వాక్యంచే నిత్యం భద్రపరచబడి (2) / నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2) / బంగారు వీదులలో తిరిగెదను (2) ||ప్రియ యేసు|| / ముండ్ల మకుటంబైన తలను జూచి / స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2) / కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2) / ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2) ||ప్రియ యేసు|| / హృదయము స్తుతులతో నింపబడెను / నా భాగ్య గృహమును స్మరించుచు (2) / హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (2) / వర్ణింప నా నాలుక చాలదయ్యా (2) ||ప్రియ యేసు|| / ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో / ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో (2) / తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో (2) / ఆశతో వేచియుండే నా హృదయం (2) ||ప్రియ యేసు||
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా / ప్రియమార నిన్ను చూడనీ / ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా / ప్రియమైన నీతో ఉండనీ / నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2) / ఆనందము సంతోషము నీవేనయ్యా / ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2) ||ప్రియమైన|| / జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ / అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2) ||నా ప్రియుడా|| / ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై / ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2) ||నా ప్రియుడా|| / ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా / పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2) ||నా ప్రియుడా||
ప్రియతమ బంధమా – నా హృదయపు ఆశ్రయ దుర్గమా / అనుదినం అనుక్షణం – నీ ఒడిలో జీవితం ధన్యము / కృతజ్ఞతతో పాడెదను / నిరంతరము స్తుతించెదను ||ప్రియతమ|| / అంధకారపు సమయములోన – నీతి సూర్యుడై ఉదయించావు / గమ్యమెరుగని పయనములోన – సత్య సంధుడై నడిపించావు (2) / నా నిరీక్షణ ఆధారం నీవు / నమ్మదగిన దేవుడవు నీవు (2) / కరుణ చూపి రక్షించినావు / కరుణామూర్తి యేసు నాథా (2) / వందనం వందనం దేవా – వందనం వందనం / అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం ||కృతజ్ఞతతో|| / పరమ తండ్రివి నీవేనని – పూర్ణ మనసుతో ప్రణుతించెదను / పరిశుద్ధుడవు నీవేనని – ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను (2) / విశ్వసించిన వారందరికి / నిత్య జీవము నొసగె దేవా (2) / కరుణ చూపి రక్షించినావు / కరుణామూర్తి యేసు నాథా (2) / వందనం వందనం దేవా – వందనం వందనం / అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం ||కృతజ్ఞతతో||
పునరుత్థానుడా నా యేసయ్యా (2) / మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2) / స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు / ఆరాధించెద నీలో జీవించుచు (2) / నీ కృప చేతనే నాకు / నీ రక్షణ భాగ్యము కలిగిందనీ (2) / పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు (2) / నా విమోచకుడవు నీవేనని / రక్షణానందం నీ ద్వార కలిగిందనీ (2) ||స్తుతి|| / నే ముందెన్నడు వెళ్ళని / తెలియని మార్గం నాకు ఎదురాయెనే (2) / సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా (2) / నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే / పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే (2) ||స్తుతి|| / చెరలోనైన స్తుతి పాడుచు / మరణము వరకు నిను ప్రకటించెదా (2) / ప్రాణమా … కృ౦గిపోకే ఇంకొంత కాలం (2) / యేసు మేఘాలపై త్వరగా రానుండగా / నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా (2) ||స్తుతి||
పూరబ్ దిశా మే చమ్కా ఏక్ తారా / జగ్ సారా రోషన్ హువా / భక్తో కె సాగర్ దేఖే తో ఉస్కో / ఖుషియాయే ఝూమ్ ఉఁటే (2) / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) / బేతలెహెమ్ మే జబ్ జియా యా / ఈశు జో జనమ్ లియా / ఆకాష్ మే దూర్ చమ్కా తో సారా / ఆలం భీ రోషన్ హువా (2) ||పూరబ్|| / పండిత్ పూజారి ఏక్ సాత్ మిల్ కర్ / గుడియా కే అందర్ చలే / ప్రభూ కి దర్శన్ పాతే హీ అప్నే / సర్ కో ఝుకాకే ఖడే (2) ||పూరబ్|| / మసీహా కే పావన్ చరనో మే ఆకర్ / భక్తో నే ఐసా కియా / ధన్ దౌ-లత్ ఔర్ అప్నా సబ్ కుచ్ / ప్రభు కో నిచ్చావర్ కియా (2) ||పూరబ్||
పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను / పట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు ||పుట్టె|| / ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యా / పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు (2) ||పుట్టె|| / యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామమున / నాదరింప నుద్భవించెను – అధములమైన మనలను (2) ||పుట్టె|| / తూర్పు దేశపు జ్ఞానులు – పూర్వ – దిక్కు చుక్కను గాంచి / సర్వోన్నతుని మరియ తనయుని – మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి (2) ||పుట్టె||
తూరుపు దిక్కున చుక్క బుట్టె / దూతలు పాటలు పాడ వచ్చె (2) / చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2) / చల్లని రాతిరి కబురే తెచ్చె (2) / పుట్టినాడంట యేసునాథుడు / పాపములు తీసే పరమాత్ముడు (2) ||తూరుపు|| / గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి / కొలిచినారు తనకు కానుకలిచ్చి / పశుల పాక మనము చేరుదాము / కాపరిని కలిసి వేడుదాము (2) ||పుట్టినాడంట|| / చిన్నా పెద్దా తనకు తేడా లేదు / పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు / తానొక్కడే అందరికీ రక్షకుడు / మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2) ||పుట్టినాడంట|| / మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు / చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు / నమ్మి నీవు యేసును అడిగి చూడు / తన ప్రేమను నీకు అందిస్తాడు (2) ||పుట్టినాడంట||
పువ్వు విరిసి రాలినా / పరిమళంబు మిగులును (2) / జీవ నీవే తెలుసుకో / నీ జీవితం ఏపాటిదో ||పువ్వు|| / ధరలో కలిమి లేములు / దరి చేరగానే కరగిపోవును (2) / దూరపర్చుమా లౌకికం / చేరు యేసును శీఘ్రమే ||పువ్వు|| / పుడమిలో ఫలియించుమా / ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా (2) / నేల రాలిన పువ్వులా / తేలిపోకుమా గాలిలోన ||పువ్వు|| / భువిలో బ్రతుకుట కన్నను / భగవంత సన్నిధి పెన్నిధి (2) / భారమనక పిలువవే / కోరుకో నువ్వు క్రైస్తవా ||పువ్వు||
పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది / గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2) / ఏ దినమందైనా ఏ క్షణమైనా (2) / రాలిపోతుంది నేస్తమా / ఆ.. వాడిపోతుంది నేస్తమా (2) / పాల రాతపైన నడిచినా గాని / పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2) / అందలము పైన కూర్చున్నా గాని / అందనంత స్థితిలో నీవున్నా గాని / కన్ను మూయడం ఖాయం / నిన్ను మోయడం ఖాయం (2) / కళ్ళు తెరచుకో నేస్తమా / ఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2) ||పువ్వు|| / జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని / డబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2) / జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా / డబ్బు నిన్ను రక్షించదు తెలుసా / మరణము రాకముందే / అది నిన్ను చేరకముందే (2) / పాపాలు విడువు నేస్తమా / ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు|| / ఇలలో నీవు నేను స్థిరము కాదుగా / ధరలో మనకేది స్థిరము కాదుగా (2) / ఎంత సంపాదించినా వ్యర్ధము తెలుసా / ఏది నీతో రాదనీ తెలుసా / వాడిపోయి రాలకముందే / ఎత్తి పారవేయక ముందే (2) / పాపాలు విడువు నేస్తమా / ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు||
(యేసు) రాజా నీ భవనములో / రేయి పగలు వేచియుందును (2) / (నిన్ను) స్తుతించి ఆనందింతును / చింతలు మరచెదను (2) ||రాజా|| / నా బలమా నా కోట / ఆరాధన నీకే (2) / నా దుర్గమా ఆశ్రయమా / ఆరాధన నీకే (2) / ఆరాధనా ఆరాధనా / అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| / అంతట నివసించు యెహోవా ఎలోహిం / ఆరాధన నీకే (2) / మా యొక్క నీతి యెహోవా సిద్కేను / ఆరాధన నీకే (2) / ఆరాధనా ఆరాధనా / అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| / పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ / ఆరాధన నీకే (2) / రూపించు దైవం యెహోవా హోషేను / ఆరాధన నీకే (2) / ఆరాధనా ఆరాధనా / అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||