535 worship songs available. Lyrics in Roman and Telugu script.
స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా / ఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్ / స్తుతుల సింహాసనం మీదాసీనుడా / మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము (2) ||స్తుతించి|| / గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావు / వ్యధలన్ని తీసావు (2) / గతి లేని మాపై నీవు / మితిలేని ప్రేమ చూపి (2) / శత సంఖ్యగా మమ్ము దీవించావు ||స్తుతించి|| / కరుణా కటాక్షములను కిరీటములగాను / ఉంచావు మా తలపై (2) / పక్షి రాజు యవ్వనమువలె / మా యవ్వనమునంతా (2) / ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు ||స్తుతించి||
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం / ఆత్మీయ అనుబంధం (2) / ఆరాధన నీకే యేసయ్యా (2) / నా చేయిపట్టి నన్ను నడిపి / చేరదీసిన దేవా (2) ||నన్నాకర్షించిన|| / మహా ఎండకు కాలిన అరణ్యములో / స్నేహించిన దేవుడవు నీవు (2) / సహాయకర్తగ తోడు నిలచి / తృప్తి పరచిన దేవా / సేదదీర్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన|| / చెడిన స్థితిలో లోకంలో పడియుండగా / ప్రేమించిన నాథుడవు నీవు (2) / సదాకాలము రక్షణ నిచ్చి / శక్తినిచ్చిన దేవా / జీవమిచ్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన||
నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో / నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2) / ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా / నీ సన్నిధిలో… / నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను|| / స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా / స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) / నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| / ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా / స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) / నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| / ఆరాధ్య దైవము నీవేనయ్యా / ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2) / నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| / ఆదిసంభూతుడవు నీవేనయ్యా / ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2) / నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||
స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా / యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా (2) / నీవే మార్గం నీవే జీవం / నీవే సత్యం నీవే సర్వం (2) ||స్తోత్రము|| / మరణమైననూ ఎర్ర సంద్రమైననూ / నీ తోడు నాకుండ భయము లేదుగా / శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా / బలమైన కోట నీవేగా (2) / నా దుర్గమా నా శైలమా / నా అతిశయమా ఆనందమా (2) ||నీవే|| / హింసలైననూ పలు నిందలైననూ / నీ చల్లని రెక్కలే నాకాశ్రయం / చీకటైననూ అగాధమైననూ / నీ క్షమా కిరణమే వెలుగు మార్గము (2) / నీతి సూర్యుడా నా పోషకుడా / నా వైద్యుడా మంచి కాపరి (2) ||నీవే||
ప్రభు యేసుని పూజించెదం / అనుదినము ఘనపరచెదం (2) / కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2) / సంతోషముగా ఉండెదం (4) / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||ప్రభు|| / జీవమైన యేసు మనకు ఉన్నాడు / జీవజల రుచులు మనకు చూపాడు (2) / మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2) ||హల్లెలూయా|| / ఆరిపోయిన దివిటీలు వెలగాలి / అందరూ ఆత్మతో నిండాలి (2) / ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2) ||హల్లెలూయా||
పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసు / బలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు క్రీస్తు (2) / గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ / అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2) / ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా / ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా ||పరిశుద్ధుడు|| / నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును / కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2) / ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా / ఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా ||పరిశుద్ధుడు||
భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో / గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2) / కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4) ||భజియింతుము|| / రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి / ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2) / సుందరుడగు యేసు నామం (2) / స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము|| / పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు / పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2) / పాపముల వీడి యేసుని (2) / స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము||
అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా (2) / నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా (2) / మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా / నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా / నీ కృపలో బహుగా ఫలించుటకు / ఫలింపని వారికి ప్రకటించుటకు (2) / అంగీకరించుము నా సమర్పణ ||అంకితం|| / కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా / చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా / నీ సన్నిధిలో ప్రకాశించుటకు / అంధకార ఛాయలను తొలగించుటకు (2) / అంగీకరించుము నా సమర్పణ ||అంకితం||
కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం / ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2) / నిరంతరం నీ నామమునే గానము చేసెదను / ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును|| / ప్రతి విషయం నీకర్పించెదా / నీ చిత్తముకై నే వేచెదా (2) / నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2) / నీ నామమునే హెచ్చించెదా (2) / నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే / నా ఆనందము నీవే – నా ఆధారము నీవే / యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును|| / ప్రతి దినము నీ ముఖ కాంతితో / నా హృదయ దీపం వెలిగించెదా (2) / నీ వాక్యానుసారము జీవించెదా (2) / నీ ఘన కీర్తిని వివరించెదా (2) / నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే / నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే / యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||
భజియింతుము నిను జగదీశా శ్రీ / యేసా మా రక్షణ కర్తా (2) / శరణు శరణు మా దేవా యెహోవా / మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము|| / విమల సెరాపులు దూత గణంబులు / చూడగ లేని తేజోనిధివే (2) / మా యధములకై సిలువ మ్రానుపై / దీనుడవై మరణించితివే (2) ||శరణు|| / ప్రప్రధముడ మరి కడపటి వాడా / మృతుడై బ్రతికిన నిరత నివాసి (2) / నీ భజనలు మా జీవనాధారం / చేకొనవే మా స్తుతి గీతం (2) ||శరణు||
యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు / ఆయన కృప నిత్యముండును (2) / ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2) / యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు / యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు / జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4) ||యెహోవా|| / సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే / మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే (2) ||యెహోవా నాకు|| / దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే / విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే (2) ||యెహోవా నాకు||
ప్రేమగల మా ప్రభువా / ప్రేమయై యున్నావయా (2) ||ప్రేమగల|| / నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె (2) / నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే (2) ||ప్రేమగల|| / అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2) / అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2) ||ప్రేమగల|| / బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2) / వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను (2) ||ప్రేమగల|| / తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2) / తండ్రి ప్రేమ మారదు – మార్పుచెందని ప్రేమయే (2) ||ప్రేమగల|| / మరణమంత బలముగలది నీదు ప్రేమ ప్రభువా (2) / వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను (2) ||ప్రేమగల||