535 worship songs available. Lyrics in Roman and Telugu script.
నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా / నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) / నీ వాక్యమే నా పరవశము / నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2) / నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి పాత్రుడా|| / నీ కృపయే నా ఆశ్రయము / నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2) / నీ కృపయే నా జీవన ఆధారము (3) ||నా స్తుతి పాత్రుడా|| / నీ సౌందర్యము యెరూషలేము / నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2) / నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3) ||నా స్తుతి పాత్రుడా||
నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ / నిను చాటనీ – నిను ఘనపరచనీ / నీ రాకకై వేచియుండనీ ||నా చిన్ని|| / కావలివారూ వేకువకై చూచునట్లు / నా ప్రాణము నీకై యెదురు చూడనీ (2) / నా ప్రాణము నీకై యెదురు చూడనీ ||నా చిన్ని|| / దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా / నా ప్రాణము నిన్నే ఆశింపనీ (2) / నా ప్రాణము నిన్నే ఆశింపనీ ||నా చిన్ని|| / పనివారు యజమాని చేతివైపు చూచునట్లు / నా కన్నులు నీపైనే నిలచియుండనీ (2) / నా కన్నులు నీపైనే నిలచియుండనీ ||నా చిన్ని||
యెహోవా మా కాపరి / యేసయ్య మా ఊపిరి / మాకు లేనిది లేదు లేమి కలుగదు (2) ||యెహోవా|| / వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను / ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2) / మా ప్రాణములు సేదదీర్చేను / నీతి మార్గమున నడిపించెను ||యెహోవా|| / కారు చీకటిలో కన్నీరు తుడిచెను / మరణ పడకలో ఊపిరి పోసెను (2) / మా తోడు నీడై నిలిచి నడచెను / శత్రు పీఠమున విందు చేసెను ||యెహోవా|| / పరిశుద్ధాత్మలో ముంచి వేసెను / పరమానందము పొంగిపోయెను (2) / పరలోకములో గొరియపిల్లను / నిరతము మేము కీర్తింతుము ||యెహోవా||
దేవ సంస్తుతి చేయవే మనసా / శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా / దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని / పావన నామము నుతించుమా – నా యంతరంగము / లో వసించు నో సమస్తమా ||దేవ|| / జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2) / నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు / లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే ||దేవ|| / చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2) / జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద / జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే ||దేవ|| / యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2) / యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు / భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే ||దేవ|| / ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ (2) / విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను / విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే ||దేవ|| / అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2) / నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు / నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే ||దేవ|| / పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు (2) / భూమి కన్న నాకాసంబున్న – ఎత్తుండు దైవ / ప్రేమ భక్తి జనులయందున – ఆ కారణముచే ||దేవ|| / పడమటికి తూర్పెంత ఎడమో – పాపములను మనకు నంత (2) / ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములను / ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే ||దేవ|| / కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల (2) / యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల / యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే ||దేవ|| / మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి (2) / మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసి / కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే ||దేవ|| / పూసి గాలి వీవ నెగిరి – పోయి బసను దెలియని వన (2) / వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ / ప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే ||దేవ|| / పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2) / నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి / తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే ||దేవ||
తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ / దినములు క్షణములు – దీసికొని యవి నీదు / వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ ||తనువు|| / ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో / యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు / దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో ||తనువు|| / స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ము / మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ / పరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు ||తనువు|| / వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరను / నిండైన నీ యిష్ట – నియమంబు చొప్పున / మెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో ||తనువు|| / నా యిష్ట మిదిగో యిది – నీ యిషముగ జేయ – నా యిష్ట మిక గాదది / నా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో నీ / కే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ ||తనువు|| / ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధార వోయన్ / నన్ను నీ వానిగ – నాథా గైకొను మెపుడు / చెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద ||తనువు||
కీర్తింతు నీ నామమున్ / నా ప్రభువా… సన్నుతింతు నీ నామమున్ (2) / మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో (2) / నిను నే కొనియాడెదన్ (4) ||కీర్తింతు|| / ప్రతి ఉదయం నీ స్తుతి గానం / దినమంతయు నీ ధ్యానం (2) / ప్రతి కార్యం నీ మహిమార్ధం (2) / సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం (2) ||కీర్తింతు|| / నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ / వేలాది స్తుతులన్ చెల్లిస్తూ (2) / ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ (2) / నిన్నే నేను ఆరాధిస్తూ (2) ||కీర్తింతు|| / అమూల్యమైనది నీ నామం / ఇలలో శ్రేష్టమైనది నీ నామం (2) / ఉన్నతమైనది నీ నామం (2) / నాకై నిలచిన మోక్ష మార్గం (2) ||కీర్తింతు||
తంబుర సితార నాదముతో / క్రీస్తును వేడగ రారండి / ఇద్దరు ముగ్గురు కూడిన చోట / ఉంటాననిన స్వామికే (2) ||తంబుర|| / పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని / పాపుల పంక్తిని కూర్చొని (2) / విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే ||తంబుర|| / ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి / నీ శోధనలను సమిధలుగా (2) / నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా ||తంబుర||
ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన (4) / యేసయ్య ఆరాధన… / ఆరాధన ఆరాధన మెస్సయ్య ఆరాధన (4) / మెస్సయ్య ఆరాధన… / ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన (4) / పరిశుద్ధుని ఆరాధన… / ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన (4) / పరలోక ఆరాధన…
దేవా మహోన్నతుడా / మహిమా ప్రకాశితుడా (2) / పదివేలలో అతి సుందరుడా / కీర్తింతు మనసారా (2) ||దేవా|| / వెలిసావు భువిలో మెస్సయ్యగా / ఎడారి బ్రతుకులో సెలయేరుగా (2) / నిస్సారమైన నా జీవితములో / చిగురించె ఆనందము (2) ||దేవా|| / లేచాను ఒంటరి విశ్వాసినై / వెదికాను నీ దారి అన్వేషినై (2) / నీ దివ్య మార్గము దర్శించినా / ఫలియించె నా జన్మము (2) ||దేవా||
స్తుతి సింహాసనాసీనుడా / యేసు రాజా దివ్య తేజా (2) / అద్వితీయుడవు పరిశుద్ధుడవు / అతి సుందరుడవు నీవే ప్రభూ (2) / నీతి న్యాయములు నీ సింహాసనాధారం (2) / కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2) ||స్తుతి|| / బలియు అర్పణ కోరవు నీవు / బలియైతివి నా దోషముకై (2) / నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2) / స్తుతియాగమునే చేసెద నిరతం (2) ||స్తుతి|| / బూరధ్వనులే నింగిలో మ్రోగగా / రాజధిరాజ నీవే వచ్చువేళ (2) / సంసిద్ధతతో వెలిగే సిద్దెతో (2) / పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును (2) ||స్తుతి||
ఆనందమానందమే / ఈ భువిలో యేసయ్య నీ జననము (2) / సర్వోన్నతమైన స్థలములలోన / దేవునికి మహిమ ప్రభావము / భూమి మీద తనకిష్టులకు / సమాధానము కలుగును గాక / హల్లెలూయా ||ఆనంద|| / తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుట / కొరకై యేసు భువికి దిగి వచ్చెను / తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు / దేవుని జ్ఞానమై వచ్చెను ||సర్వోన్నత|| / మరణ ఛాయలు చీకటిలోను కూర్చున్నవారికి / యేసు అరుణోదయమిచ్చెను / పాప శాపము నుండి ప్రజలకు విడుదలనిచ్చుటకు / క్రీస్తు నర రూపము దాల్చెను ||సర్వోన్నత||
నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడి / మీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతిని / దాల్చుకొని సేవించుడి ||నీతి|| / చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా / సదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును ||నీతి|| / సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియు / గర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయను ||నీతి|| / గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతో / పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి ||నీతి|| / పరమ దూతలు నరులు పుడమిని – మొరలుబెట్టుచు దేవుని / పరము నందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు ||నీతి|| / ఇలను భక్తులు గూడుకొనియా – బలము గల్గిన దేవుని / వెలయు స్తుతి వే నోళ్ళతోడను – విసుగు జెందక జేయుడి ||నీతి|| / ఆత్మ నీవిక మేలుకొని శు – ధ్ధాత్మ యేసుని దండ్రిని / త్రిత్వమగునా యేక దేవుని – హర్షమున సేవింపవే ||నీతి||