535 worship songs available. Lyrics in Roman and Telugu script.
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప / అనుక్షణం నను కనుపాపవలె (2) / కాచిన కృప ||శాశ్వతమైనది|| / నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2) / నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత|| / తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2) / నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత|| / పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2) / నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) ||శాశ్వత||
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా / స్తుతులందుకో పూజార్హుడా (2) / ఆకాశమందు నీవు తప్ప / నాకెవరున్నారు నా ప్రభు (2) ||స్తుతి|| / నా శత్రువులు నను తరుముచుండగా / నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2) / నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే / శత్రువుల చేతినుండి విడిపించినావు / కాపాడినావు (2) ||స్తుతి|| / నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి / దూరాన నిలిచేరు నా ప్రభూ (2) / నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై / నను నిల్పెను నీ సన్నిధిలో / నీ సంఘములో (2) ||స్తుతి||
స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా / ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా / స్వంతమేది నాది లేదు నిజాము నా దేవా / నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు ||స్వీకరించుమయా|| / నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు / నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని (2) / జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి / ప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా ||స్వీకరించుమయా|| / సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతు / ఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి (2) / అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా / పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా ||స్వీకరించుమయా||
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే / నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా ||నీ ధనము|| / ధరలోన ధన ధాన్యముల నీయగా / కరుణించి కాపాడి రక్షింపగా (2) / పరలోక నాధుండు నీకీయగా / మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీ ధనము|| / పాడిపంటలు ప్రభువు నీకీయగా / కూడు గుడ్డలు నీకు దయచేయగా (2) / వేడంగ ప్రభు యేసు నామంబును / గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా ||నీ ధనము|| / వెలుగు నీడలు గాలి వర్షంబులు / కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2) / వెలిగించ ధర పైని ప్రభు నామము / కలిమి కొలది ప్రభున కర్పింపవా ||నీ ధనము|| / కలిగించె సకలంబు సమృద్దిగా / తొలగించె పలుభాధ భరితంబులు (2) / బలియాయె నీ పాపముల కేసువే / చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||నీ ధనము||
మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2) / స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2) / ఆరాధనా… ఆరాధనా… (2) / ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే ||మహిమ|| / సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే / శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా|| / ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే / విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే (2) ||ఆరాధనా|| / ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే / నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే (2) ||ఆరాధనా||
యేసు పరిశుద్ధ నామమునకు / ఎప్పుడు అధిక స్తోత్రము (2) / ఇహపరమున మేలైన నామము / శక్తి గల్గినట్టి నామమిది (2) / పరిశుద్దులు స్తుతించు నామమిది (2) ||యేసు|| / సైతానున్ పాతాళమును జయించు / వీరత్వము గల నామమిది (2) / జయమొందెదము ఈ నామమున (2) ||యేసు|| / నశించు పాపుల రక్షించు లోక / మున కేతెంచిన నామమిది (2) / పరలోకమున చేర్చు నామమిది (2) ||యేసు|| / ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు / ఉన్నత దేవుని నామమిది (2) / లోకమంతా ప్రకాశించే నామమిది (2) ||యేసు|| / శోధన, బాధల, కష్ట సమయాన / ఓదార్చి నడుపు నామమిది (2) / ఆటంకము తొలగించు నామమిది (2) ||యేసు||
మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు / మహితోటలో నర మొక్కలు నాటించాడు (2) / తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడు / తన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు (2) / కాయవే తోటా – కమ్మని కాయలు / పండవే చెట్టా – తియ్యని ఫలములు (2) ||మహిమ|| / నీతి పూత జాతి కర్త – ఆత్మ సుతా ఫలములు / నీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ ఫలములు (2) / అనంతమైన ఆత్మ బంధ – అమర సుధా కాంతులు (2) / అనుకూల సమయమయ్యె – పూయు పరమ పూతలు (2) ||కాయవే|| / అపవాది కంటబడి – కుంటుబడి పోకు / కాపుకొచ్చి చేదు పండ్లు – గంపలుగా కాయకు (2) / అదిగో గొడ్డలి వేరు – పదును పెట్టియున్నది (2) / వెర్రిగా చుక్కలనంటి – ఎదిగి విర్రవీగకు (2) ||కాయవే|| / కలువరి కొండలో పుట్టి – పారిన కరుణా నిధి / కలుషమైన చీడ పీడ – కడిగిన ప్రేమానిధి (2) / నిజముగాను నీవు – నీ సొత్తు కావు (2) / యజమాని వస్తాడు – ఏమి ఫలములిస్తావు (2) ||కాయవే|| / ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు / మోదమెంతో ఉంచాడు – మోడుబారి పోకు (2) / ముండ్ల పొదలలో కృంగి – మెత్తబడి పోకు (2) / పండ్లు కోయ వచ్చువాడు – అగ్నివేసి పోతాడు (2) ||కాయవే||
నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ / నావన్ని కృపచేత నీవలన నొందిన (2) / భావంబునను నేను బహుదైర్యమొందెద ||నావన్ని|| / నీకు నా ప్రాణము నిజముగా నర్పించి (2) / నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని|| / సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని (2) / నిత్యంబు గరముల నీ సేవ జేసెద ||నావన్ని|| / నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు (2) / ఆశచే నడిపించు మరల నా పదములు ||నావన్ని|| / పెదవులతో నేను బెంపుగ నీ వార్త (2) / గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి ||నావన్ని|| / నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ (2) / యావంత యైనను నాశింప మదిలోన ||నావన్ని|| / నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే (2) / సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు ||నావన్ని|| / చిత్తము నీ కృపా యత్తంబు గావించి (2) / మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము ||నావన్ని|| / హృదయంబు నీకిత్తు సదనంబు గావించి (2) / పదిలంబుగా దాని బట్టి కాపాడుము ||నావన్ని||
దేవునియందు నిరీక్షణ నుంచి / ఆయనను స్తుతించు నా ప్రాణమా (2) / ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2) / ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2) ||దేవుని|| / చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2) / సత్యమగు – జీవమగు – మార్గమేసే (2) ||దేవుని|| / నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2) / ఆధారము – ఆదరణ – ఆయనలో (2) ||దేవుని|| / తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2) / తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2) ||దేవుని|| / నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2) / శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2) ||దేవుని|| / పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2) / కనికర – సంపన్నుడు – నా దేవుడు (2) ||దేవుని|| / స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2) / హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2) ||దేవుని||
దావీదు వలె నాట్యమాడి / తండ్రీని స్తుతించెదము (2) / యేసయ్యా స్తోత్రముల్ (4) ||దావీదు|| / తంబురతోను సితారతోను / తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా|| / కష్టము కలిగినా – నష్టము కలిగినా / తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా|| / పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన / తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా|| / క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన / తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
మనసారా పూజించి నిన్నారాధిస్తా / భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా / చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను / సంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా|| / నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2) / ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2) / పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు (2) / నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2) ||మనసారా|| / రక్షణ కొరకై లోకానికి వచ్చావు (2) / సాతాన్ని ఓడించిన విజయశీలుడవు (2) / మరణము గెలిచి తిరిగి లేచావు (2) / నీవే మర్గము సత్యము జీవము (2) ||మనసారా||
చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును / చిన్ని బిడ్డనేసయ్య స్వీకరించుము (2) / నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము (2) / నీవే నా ధ్యానము (2) ||చిన్ని|| / తండ్రి మాటను ధిక్కరించక / తలవంచిన ఇస్సాకు వలే (2) / విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము (2) / వినయముగల మనసివ్వుము (2) ||చిన్ని||