ఆరాధన | Worship Telugu Songs

535 worship songs available. Lyrics in Roman and Telugu script.

ఆశ్రయదుర్గమా నా యేసయ్యా|Aashraya Durgamaa Naa Yesayyaa

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా / నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా / ఊహించలేనే నీ కృపలేని క్షణమును / కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ|| / లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే / ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2) / అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| / నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే / నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2) / అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| / పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను / నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద (2) / అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| / నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే / ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది (2) / స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా / హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా (2) ||ఆశ్రయ||

ఇదిగో దేవుని గొర్రెపిల్లా|Idigo Devuni Gorrepilla

ఇదిగో దేవుని గొర్రెపిల్లా / ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2) / అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు / గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు / రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి / నీదు ప్రజలను కొనినావు / అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు / గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు / మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు / నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో|| / పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి (2) / సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను (2) ||అర్హుడవు|| / దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా (2) / యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను (2) ||అర్హుడవు|| / దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి (2) / క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను (2) ||అర్హుడవు||

యేసయ్యా నా యేసయ్యా|Yesayyaa Naa Yesayyaa

యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ / రమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ము / ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ / చూచుటకెన్నో వింతలున్నవి ఈ భువిలోన / చూడగా ఎందరో ఘనులున్నారు ఈ ధరలోన / ఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమి / నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా ||రమ్ము|| / నా రూపమే మారునంట నిన్ను చూచువేళ / నిన్ను పోలి ఉండెదనంట నీవు వచ్చు వేళ / అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా / అందుండు సర్వ సంపదలన్నీ నా స్వంతమయ్యా ||రమ్ము|| / అమూల్యమైన రత్నములతో అలంకరించబడి / గొర్రెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్న / అంధకారమే లేని ఆ దివ్యనగరమందు / అవధులు లేని ఆనందముతో నీతో నుండెదను ||రమ్ము||

దేవా మా కుటుంబము|Devaa Maa Kutumbamu

దేవా మా కుటుంబము – నీ సేవకే అంకితము (2) / ఈ శాప లోకాన – నీ సాక్షులుగా నిలువ / నీ ఆత్మతో నింపుమా (2) ||దేవా|| / కాపరి మా యేసు ప్రభువే – కొదువేమి లేదు మాకు / మాకేమి భయము – మాకేమి దిగులు / నీకే వందనములయ్యా / లోబడి జీవింతుము – లోపంబులు సవరించుము / లోకాశలు వీడి – లోకంబులోన / నీ మందగా ఉందుము ||దేవా|| / సమృద్ధి జీవంబును – సమృద్ధిగా మాకిమ్ము / నెమ్మది గల ఇల్లు – నిమ్మళమగు మనస్సు / ఇమ్మహిలో మాకిమ్మయ్యా / ఇమ్ముగ దయచేయుము – గిన్నె నిండిన అనుభవము / ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగా / మమ్ములను బలపరచుము ||దేవా|| / ఏ కీడు రాకుండగా – కాపాడుము మా పిల్లలను / లోక దురు వ్యసనంలా – తాకుడు లేకుండా / దాచుము నీ చేతులలో / ఒలీవ మొక్కల వలెను ద్రాక్షా తీగెలను పోలి / ఫల సంపదలతోను – కలకాలము జీవించ / కురుపించుము నీ దీవెనలన్ ||దేవా|| / పెంపారు జేయుము మాలో – సొంపుగ నీ ఘన ప్రేమన్ / నింపుమా హృదయములు – శాంతి భాగ్యంబులతో / సంతసంబుగ సాగెదము / వింతైన నీ ప్రేమను – అంతట ప్రకటింతుము / కొంత కాలమే మేము – ఉందుము లోకాన / చెంత చేరగ కోరెదము / నీ చెంత చేరగ కోరెదము ||దేవా||