ఆరాధన | Worship Telugu Songs

535 worship songs available. Lyrics in Roman and Telugu script.

హల్లేలూయా యని పాడి|Hallelooyaa Yani Paadi

హల్లేలూయా యని పాడి స్తుతింపను / రారే జనులారా మనసారా ఊరూరా / రారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా|| / పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2) / కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2) / తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2) / పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| / బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2) / అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2) / కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2) / పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| / రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2) / నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2) / నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2) / పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||

బాలుడు కాదమ్మో|Baaludu Kaadammo

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు / పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2) / పరమును విడచి పాకలో పుట్టిన / పాపుల రక్షకుడు మన యేసయ్యా (2) ||బాలుడు|| / కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు / ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా / ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి / పరుగు పరుగున పాకను చేరామే (2) / మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2) / మా మంచి కాపరని సంతోషించామే / సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు|| / చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము / పరిశుద్ధుని చూసి పరవశించామే / రాజుల రాజని యూదుల రాజని / ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2) / బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2) / ఇమ్మానుయేలని పూజించామమ్మో / సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు||

దొరకును సమస్తము|Dorakunu samasthamu

దొరకును సమస్తము యేసు పాదాల చెంత / వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2) / యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా / యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా ||దొరకును|| / మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి / కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2) / పాదాలను ముద్దు పెట్టుకొని / పూసెను విలువైన అత్తరు (2) / చేసెను శ్రేష్టారాధన / దొరికెను పాప క్షమాపణ (2) ||దొరకును|| / యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి / బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2) / చిన్నదాన లెమ్మని చెప్పి / బ్రతికించెను యేసు దేవుడు (2) / కలిగెను మహదానందం / దొరికెను రక్షణ భాగ్యము (2) ||దొరకును|| / పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి / పాదాలపై పడెను పరవశుడై యుండెను (2) / పరలోక దర్శనం / చూచెను తానే స్వయముగా (2) / దొరికెను ప్రభు ముఖ దర్శనం / దొరికెను ఇల మహా భాగ్యం (2) ||దొరకును||

నాలోని ఆశ నాలోని కోరిక|Naaloni Aasha Naaloni Korika

నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని / నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని / దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని / దేవా… యేసయ్యా నిన్ను చేరాలని / జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ / జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2) / మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ / మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్ / శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప / వేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి (2) / ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా / తరతరాలు మారినా మారని దేవుడా ||జీసస్|| / విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా / మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2) / తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద / నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును ||జీసస్||

అత్యున్నతమైనది యేసు నామం|Athyunnathamainadi Yesu Naamam

అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం / అత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామం / ఉన్నత నామం – సుందర నామం / ఉన్నత నామం – శ్రీ యేసు నామం / అన్ని నామములకు పై నామం – పై నామం – పై నామం / యేసు నామం – యేసు నామం (2) / ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగును / ప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును (2) / పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా / పరలోక దీవెనలు పొందగ చేరుము / హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||అత్యున్నత|| / పరిశుద్ధుడైన యేసు నామంలో సాతాను పారిపోవున్ / మృతిని గెల్చిన యేసు నామంలో స్వస్థత దొరుకును (2) / పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా / పరలోక దీవెనలు పొందగ చేరుము / హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||అత్యున్నత||

రాజా నీ సన్నిధిలోనే|Raajaa Nee Sannidhilone

రాజా నీ సన్నిధి-లోనే / దొరికెనే ఆనందమానందమే / జీవా జలముతో పొంగే హృదయమే / పాడే స్తుతియు స్తోత్రమే / శ్రమల వేళా నీ ధ్యానమే / నా గానం ఆధారం ఆనందమే / నిలువని సిరుల కన్ననూ / క్షయమౌ ప్రేమ కన్ననూ / విలువౌ కృపను పొందగన్ – భాగ్యమే / నిలువని సిరుల కన్ననూ / క్షయమౌ ప్రేమ కన్ననూ / విలువౌ కృపను పొందితిన్ – స్తోత్రమే ||రాజా|| / మరల రాని కాలమల్లె – తరలిపోయే నాదు దోషం / నిలువదాయె పాప శాపాల భారం (2) / నీలో నిలిచి ఫలియించు తీగనై / ఆత్మ ఫలము పొందితినే ||నిలువని|| / తెలియరాని నీదు ప్రేమ – నాలో నింపే ఆత్మ ధైర్యం / జీవ జలమై తీర్చెనే ఆత్మ దాహం (2) / నీకై నిలిచి ఇలలోన జీవింప / ఆత్మ ఫలము పొందితినే ||నిలువని||

Worship Telugu Songs — Page 30 | UEC Telugu Church