535 worship songs available. Lyrics in Roman and Telugu script.
సృష్టి కర్తా యేసు దేవా / సర్వ లోకం నీ మాట వినును (2) / సర్వ లోక నాథా సకలం నీవేగా / సర్వ లోక రాజా సర్వము నీవేగా / సన్నుతింతును అను నిత్యము ||సృష్టి|| / కానాన్ వివాహములో అద్భుతముగా / నీటిని ద్రాక్షా రసము చేసి / కనలేని అంధులకు చూపు నొసగి / చెవిటి మూగల బాగు పరచితివి / నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో / ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ|| / మృతుల సహితము జీవింపజేసి / మృతిని గెలిచి తిరిగి లేచితివి / నీ రాజ్యములో నీతో వసింప / కొనిపోవ త్వరలో రానుంటివే / నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో / ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ||
యేసు రాజ నాలో నిన్ను చూడనీ / త్వరలో నీలో నన్ను సాగనీ (2) / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా / యేసయ్యా నా యేసయ్యా – (2) ||యేసు రాజ|| / తరిమే తరతరాల ఒరవడిలో / ఉరికే పరిసరాల సవ్వడిలో (2) / నీ తోడే చాలని – నీ నీడే మేలని / నా కోట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా|| / పెరిగే అన్యాయపు చీకటిలో / కరిగే అనురాగపు వాకిటలో (2) / నీ మాట చాలని – నీ బాట మేలని / నా పాట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా||
నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును / నా ఊహ చాలదు ఊపిరి చాలదు / ఎంతో ఎంతో మధురం / నీ ప్రేమ ఎంతో మధురం / ప్రభు యేసు ప్రేమ మధురం / నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో / నా పూర్ణ మనస్సుతో / నిను పూజింతును నా ప్రభువా (2) ||నీ ప్రేమ|| / దేవదూతలు రేయింబవలు / కొనియాడుచుందురు నీ ప్రేమను (2) / కృపామయుడా కరుణించువాడా / ప్రేమస్వరూపా ప్రణుతింతునయ్యా (2) ||నా పూర్ణ|| / సృష్టికర్తవు సర్వలోకమును / కాపాడువాడవు పాలించువాడవు (2) / సర్వమానవులను పరమున చేర్చెడి / అద్వితీయుడా ఆరాధ్యదైవమా (2) ||నా పూర్ణ||
జీవ నాథ ముక్తి దాత / శాంతి దాత పరమాత్మ / పావనాత్మ పరుగిడి రావా / నా హృదిలో నివసింప రావా / నీ రాక కోసం వేచియున్నాను / వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) / ముక్తి ప్రసాదించుము / భక్తిని నేర్పించుము / నీ ఆనందముతో నను నింపుము – (2) / వేంచేయు మా ఆత్మ దేవా / వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ||జీవ నాథ|| / నీ శాంతి నింపంగ రావా / నీ శక్తి నింపంగ రావా (2) / నీ పరమ వారములతో నింపేవా (2) / వేంచేయు మా ఆత్మ దేవా / వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ||జీవ నాథ||
పునరుత్థానుడా నా యేసయ్యా (2) / మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2) / స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు / ఆరాధించెద నీలో జీవించుచు (2) / నీ కృప చేతనే నాకు / నీ రక్షణ భాగ్యము కలిగిందనీ (2) / పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు (2) / నా విమోచకుడవు నీవేనని / రక్షణానందం నీ ద్వార కలిగిందనీ (2) ||స్తుతి|| / నే ముందెన్నడు వెళ్ళని / తెలియని మార్గం నాకు ఎదురాయెనే (2) / సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా (2) / నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే / పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే (2) ||స్తుతి|| / చెరలోనైన స్తుతి పాడుచు / మరణము వరకు నిను ప్రకటించెదా (2) / ప్రాణమా … కృ౦గిపోకే ఇంకొంత కాలం (2) / యేసు మేఘాలపై త్వరగా రానుండగా / నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా (2) ||స్తుతి||
సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు (2) / సర్వము నెరిగిన సర్వేశ్వరునికి / సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2) ||సరి|| / నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే (2) / నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే (2) / నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2) ||సరి|| / ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే (2) / ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే (2) / నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2) ||సరి|| / పునరుత్థానుడే జయశీలి మృతిని గెలిచి లేచినాడే (2) / శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే (2) / నాకై అతి త్వరలో మహిమతో రానైయున్నవాడే (2) ||సరి||
స్తుతించెదను స్తుతించెదను / నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము ||స్తుతించెదను|| / ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక (2) / ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని (2) / ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను (2) ||స్తుతించెదను|| / నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి (2) / నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప (2) / నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి (2) ||స్తుతించెదను|| / పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి (2) / పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన (2) / పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా (2) ||స్తుతించెదను|| / తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును (2) / దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా (2) / దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి (2) ||స్తుతించెదను|| / సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన (2) / స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా (2) / శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా (2) ||స్తుతించెదను||
దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా / అణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా (2) / ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా (2) / పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2) ||దినదినంబు|| / మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా (2) / మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2) ||దినదినంబు|| / ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము (2) / ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము (2) ||దినదినంబు|| / దైవ వాక్యం జీవ వాక్యం అనుదినంబు చదువుతా (2) / ప్రభువు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా (2) ||దినదినంబు|| / పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా (2) / సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా (2) ||దినదినంబు||
గత కాలమంత నిను కాచిన దేవుడు / ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను / ఇయ్యి నీ మనసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యి / ఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి / మట్టి కుండగా పుట్టించి నిన్ను / కంటి పాపగా కాపాడినాడు (2) / అందాలాలెన్నో ఎక్కించువాడు / అందరిలో నిన్ను మెప్పించుతాడు (2) ||ఇయ్యి|| / యేసుని హత్తుకో ఈ లోకమందు / ఓపిక తెచ్చుకో యేసు రాక ముందు (2) / తలను ఎత్తుకొని పైకెత్తి చూడు / మరలా యేసు రాజు దిగి వస్తున్నాడు (2) ||ఇయ్యి|| / కష్టాలలో నిన్ను కాపాడినాడు / నష్టాలలో నిన్ను కాపాడినాడు (2) / నీవు నమ్ముకుంటే నిను వదులలేడు / నిన్ను ఎప్పుడూ ఎడబాసి పోడు (2) ||ఇయ్యి||
స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా / శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2) / నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2) / నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| / రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2) / మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| / నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2) / ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| / వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2) / యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
నా ప్రాణమా సన్నుతించుమా / పరిశుద్ధ నామమున్ / ఎన్నడూ లేని రీతిగా / ఆరాధించు ఆయనను / వేకువ వెలుగు తేజరిల్లును / మరలా నిన్ను కీర్తించే తరుణం / గతించినదేమైనా ముందున్నది ఏదైనా / స్తుతించనేల సర్వ సిద్ధమే ||నా ప్రాణమా|| / ఉన్నత ప్రేమతో విసుగు చెందక / గొప్పవాడవు దయగల దేవా / నీ మంచితనముకై స్తుతియింతును / ఎన్నెన్నో మేలుల్ కనుగొనగలను ||నా ప్రాణమా|| / నా శరీరము కృశించు ఆ దినము / జీవిత గడువు సమీపించినా / కొనసాగించి కీర్తించుచుండ / నిత్యము నిత్యము కీర్తింతును ||నా ప్రాణమా||
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను / నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2) / నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2) / నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా|| / లేక లేక వృద్ధాప్యమందు / ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2) / ఇచ్చిన నీవే బలి కోరగా (2) / తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా|| / సర్వము పోయి శరీరము కుళ్ళిన / నా అనువారే వెలివేసినా (2) / ఆప్తులంతా శత్రువులైనా (2) / అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా|| / నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే / చావైనా అది నాకెంతో మేలే (2) / ఇదిగో నేను ఉన్నానయ్యా (2) / దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||