535 worship songs available. Lyrics in Roman and Telugu script.
నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా / వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2) / యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా / యేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2) ||నిబ్బరముతో|| / కష్టకాలమందు నాకు – కనికరము చూపెను / కాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను (2) / కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెను / కన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెను / కఠినమైన కాలములో – నా చెంత నిలిచెను ||యేసయ్యా|| / దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెను / ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను (2) / దిక్కుతోచని వేళ – నా దిక్కై నిలిచెను / దుష్ట శక్తులన్నిటిని – నాకు దూరపరచెను / దీవెనలు కుమ్మరించి – ధన్యునిగా చేసెను ||యేసయ్యా||
స్తుతి పాడెద నే ప్రతి దినము / స్తుతి పాడుటే నా అతిశయము / దవళవర్ణుడా మనోహరుడా / రత్నవర్ణుడా నా ప్రియుడా / ఆరాధించెద అరుణోదయమున / అమరుడా నిన్నే ఆశ తీరా / ఆశ్రిత జనపాలకా / అందుకో నా స్తుతి మాలికా / గురి లేని నన్ను ఉరి నుండి లాగి / దరి చేర్చినావే పరిశుద్దుడా / ఏమని పాడెద దేవా / ఏమని పొగడెద ప్రభువా / మతి లేని నన్ను శృతి చేసినావే / మృతి నుండి నన్ను బ్రతికించినావే / నీ లతనై పాడెద దేవా / నా పతివని పొగడెద ప్రభువా
జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో దేవా / ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో (2) / సర్వ సమయములలో నీ స్తుతి గానం / ఎల్లవేళలయందు నీ నామ ధ్యానం (2) / మాకదియే మేలు ఈ జీవితమున / స్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా|| / సృష్టినంతటిని నీ మాట చేత / సృజియించితివిగా మా దేవ దేవా (2) / నీ ఘనమగు మహిమం వర్ణింప తరమా / స్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా|| / కలుషాత్ములమైన మా కొరకు నీ / విలువైన ప్రాణంబు నర్పించితివిగా (2) / కల్వరి గిరిపై చూపిన ప్రేమన్ / స్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా||
ఆలోచనలో గొప్పవాడా / ఆరాధనా ఆరాధనా / క్రియలయందు శక్తిమంతుడా / ఆరాధనా ఆరాధనా / హోసన్నా ఉన్నత దైవమా / హోసన్నా హోసన్నా హోసన్నా / కనుపాపలా కాచువాడా / ఆరాధనా ఆరాధనా / గరుడవలె మోయువాడా / ఆరాధనా ఆరాధనా / హోసన్నా ఉన్నత దైవమా / హోసన్నా హోసన్నా హోసన్నా / సిలువ చేత రక్షించువాడా / ఆరాధనా ఆరాధనా / రెక్కల క్రింద కప్పువాడా / ఆరాధనా ఆరాధనా / హోసన్నా ఉన్నత దైవమా / హోసన్నా హోసన్నా హోసన్నా / వెదకి నన్ను చూచువాడా / ఆరాధనా ఆరాధనా / దినదినము ఓదార్చువాడా / ఆరాధనా ఆరాధనా / హోసన్నా ఉన్నత దైవమా / హోసన్నా హోసన్నా హోసన్నా
లేచినాడయ్యా / మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా (2) / పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు / మహిమా స్వరూపుడై లేచినాడయ్యా / విజయుడై జయశీలుడై / సజీవుడై పరిశుద్ధాత్ముడై (2) / క్రీస్తు లేచెను హల్లెలూయా / సాతాను ఓడెను హల్లేలూయా / క్రీస్తు లేచెను హల్లెలూయా / మరణాన్ని గెలిచెను హల్లేలూయా ||లేచినాడయ్యా|| / శ్రమలనొందెను సిలువ మరణమొందెను / లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను (2) / విజయుడై జయశీలుడై / సజీవుడై పరిశుద్ధాత్ముడై (2) ||క్రీస్తు|| / జీవ మార్గము మనకు అనుగ్రహించెను / మన పాపములన్ని తుడిచివేసెను (2) / ప్రేమయై మనకు జీవమై / వెలుగునై మంచి కాపరియై (2) ||క్రీస్తు||
నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా) / ఇలలో నీవే ఏకైక దేవుడవు (2) / ఆత్మతో సత్యముతో ఆరాధింతును / నీదు క్రియలు కొనియాడెదను (2) / అత్యున్నతుడా నా యేసయ్యా / నీవే నాకు నిజ రక్షకుడవు (2) ||నీకు|| / పరమందు దూతలు నిను పొగడుచుందురు / నీవే ప్రభువుల ప్రభువని (2) / నీ ఘన కీర్తిని వివరించగలనా / నా ప్రియుడా నా యేసయ్యా (2) ||అత్యున్నతుడా|| / ఆకాశమనాడు ఆసీనుడైనవాడా / నీ తట్టు కన్నులెత్తుచున్నాను (2) / ఊహించువాటి కంటే అత్యధికముగా / దయచేయువాడవు నీకే స్తోత్రం (2) ||అత్యున్నతుడా||
యేసయ్యా కనికరపూర్ణుడా / మనోహర ప్రేమకు నిలయుడా (2) / నీవే నా సంతోష గానము / సర్వ సంపదలకు ఆధారము (2) ||యేసయ్యా|| / నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి / నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2) / సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి / శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2) ||యేసయ్యా|| / నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు / దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2) / అలసిన వారి ఆశను తృప్తిపరచితివి / అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2) ||యేసయ్యా|| / నీ వలన బలమునొందిన వారే ధన్యులు / నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2) / నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు / నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2) ||యేసయ్యా|| / ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4) / ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)
ఎవరూ సమీపించలేని / తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2) / నీ మహిమను ధరించిన పరిశుద్ధులు / నా కంటబడగానే (2) / ఏమౌదునో నేనేమౌదునో (2) / ఇహలోక బంధాలు మరచి / నీ యెదుటే నేను నిలిచి (2) / నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి / నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| / పరలోక మహిమను తలచి / నీ పాద పద్మములపై ఒరిగి (2) / పరలోక సైన్య సమూహాలతో కలసి / నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో|| / జయించిన వారితో కలిసి / నీ సింహాసనము నే చేరగా (2) / ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో / నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||
పరిశుద్ధుడా పావనుడా / అత్యున్నతుడా నీవే (2) / నీ నామమునే స్తుతియించెదా / నీ నామమునే ఘనపరచెదా (2) / నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ / నీలోనే విజయము నీలోనే సంతోషం / ఆరాధన నీకే (6) / నా అడుగులో అడుగై – నా శ్వాసలో శ్వాసై / నే నడచిన వేళలో ప్రతి అడుగై (2) / నా ఊపిరి నా గానము / నా సర్వము నీవే నా యేసయ్యా / నీకేనయ్యా ఆరాధన ||ఆరాధన|| / నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా / నీ శక్తితో నను నింపు బలవంతుడా (2) ||ఆరాధన||
నీ నామం నా గానం / నీ స్మరణే నా సర్వం (2) / నా కాపరి నీవే యేసయ్యా / నా ఊపిరి నీవే మెస్సయ్యా (2) ||నీ నామం|| / నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా / నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా (2) / సంగీత స్వరములతో స్తుతియి౦తును (2) / స్తుతుల౦దుకో నా యేసురాజా (2) ||నీ నామం|| / ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే / నన్నిలలో కాపాడే కాపరి నీవే (2) / నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా (2) / బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా (2) ||నీ నామం||
స్తుతులపై ఆసీనుడా / అత్యున్నత నా దేవుడా (2) / నీ ప్రేమలో నీ ప్రేమలో / నను నేను మరిచాను నీ ప్రేమలో / నీ నీడలో నీ జాడలో / మైమరచిపోయాను నేను ||స్తుతులపై|| / నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు / నీవు పొందిన గాయాలకు బదులు (2) / బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు / వెండినడుగలేదు నీవు / విరిగి నలిగి – కరిగి వెలిగే / హృదయాన్నే కోరావు నీవు (2) / ఓ మాట సెలవియ్యి దేవా / నీ పాద ధూళిని కానా ప్రభువా / నీ పాదం స్పర్శించగానే / నా సంతోషానికి హద్దుండునా ||స్తుతులపై|| / నీవు లేచిన పునరుథ్తానా దినము మొదలు / మా బ్రతుకులో విజయము మొదలు (2) / మరణం అనేటి ముల్లును విరచి / తిరిగి లేచావు నీవు / చీకటి నిండిన మాదు బ్రతుకులో / వెలుగులు నింపావు నీవు (2) / నీకోసం ఏదైనా దేవా / నే వెచ్చింప సంసిద్ధమయ్యా / ఆఖరికి నా ప్రాణమైనా / చిందులు వేస్తూ అర్పిస్తా ||స్తుతులపై||
మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2) / న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2) / ధనవంతులను అణచేవాడవు / జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2) / దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2) / యుద్ధవీరుడా శూరుడా / లోకాన్ని గెలిచిన యేసయ్యా (2) / మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు / నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు ||దరిద్రులను|| / గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు / నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు ||దరిద్రులను||