535 worship songs available. Lyrics in Roman and Telugu script.
బాల యేసుని జన్మ దినం / వేడుకైన శుభ దినము / సేవింప రారే జనులారా / ముద్దుల బాలకు ముద్దులిడ ||బాల|| / మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని / చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని (2) / చేకొని లాలింప రారే / జో జోల పాటలు పాడి ||బాల|| / పాపికి పరమ మార్గము జూప / ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు (2) / పశుశాలయందు పవళించే / తమ ప్రేమను జూపింప మనకు ||బాల|| / మన జోల పాటలు ఆలించు బాలుడు / దేవాది దేవుని తనయుడు గనుక (2) / వరముల నొసగి మనకు / దేవుని ప్రియులుగా జేయు ||బాల||
ప్రియ సంఘస్థులారా / ప్రార్థనలోన సరిగ కూర్చోండి / మీరు చక్కగా కూర్చోండి (2) ||ప్రియ|| / ప్రార్థనలోన మాట్లాడువారిని / ప్రభువు ఇష్టపడరండీ (2) / చప్పట్లు మీరు కొట్టండి / దేవుని మీరు స్తుతించండి ||ప్రియ|| / తలపై ముసుగు వేయకపోతే / ప్రభువు ఇష్టపడరండీ (2) / తలపై ముసుగు కష్టమైతే / ప్రభువుకు ఇష్టులు కారండి ||ప్రియ|| / ఎగాదిగా చూపులు మానకపోతే / ప్రభువు ఇష్టపడరండీ (2) / క్రీస్తు చూపు కలిగి మీరు / భక్తిగా జీవించండి ||ప్రియ||
యేసు నామం సుందర నామం / యేసు నామం మధురం మధురం / జుంటి తేనెల కంటె మధురం / పాపములను క్షమియించు నామం / పాపములను తొలగించు నామం / స్వస్థపరచును యేసు నామము / అన్ని నామముల కన్న పై నామము / నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము (2) / సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం|| / అద్వితీయ నామం – అతిశయ నామం / ఆరాధించు నామం – ఆర్భాటించు నామం (4) / సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం||
సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ.. / వసీయించువాడ నా దైవమా (2) / రాజులకు రారాజా / సమస్తమునకు జీవధారకుడా (2) / పరిశుద్ధుడా ఆ.. ఆ.. ఆ.. పరిశుద్ధుడా ||సమీపింపరాని|| / పాపులలో… ప్రధానుడనైన నను రక్షించుటకు / క్రీస్తేసువై లోకమునకు అరుదెంచినావు (2) / దూషకుడను హానికరుడైన నన్ను (2) / కరుణించి మార్చివేసితివి (2) ||సమీపింపరాని|| / నా దేవా… నా యవ్వనమును బట్టి / తృణీకరింప బడకుండ నన్ను కాపాడుము (2) / నా పవిత్రత ప్రేమ ప్రవర్తనములో (2) / నీ స్వరూపములోకి నను మార్చుము (2) ||సమీపింపరాని||
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2) / నీవే నా ఆరాధన యేసయ్యా / నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా / నీవే నా ఆత్మలో ఆనందమయ్యా / నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి|| / గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా / అగాధ జలములలోన మార్గము చూపించినావా (2) / అనుదినము మన్నాను పంపి / ప్రజలను పోషించినావా (2) / నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి|| / అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు / సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2) / ప్రతి క్షణము నీవు తోడుగా నుండి / ప్రజలను రక్షించినావు (2) / నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి|| / పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే / మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2) / అనుదినము మాతో నీవుండి / మమ్ము నడిపించు దేవా (2) / మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||
శుభవేళ – స్తోత్రబలి / తండ్రీ దేవా – నీకేనయ్యా / ఆరాధన – స్తోత్రబలి / తండ్రీ దేవా – నీకేనయ్యా / తండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ|| / ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2) / సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ|| / ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2) / నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ|| / యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా (2) / మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా (2) ||శుభవేళ|| / యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా (2) / శాంతి నొసగువాడా – యెహోవా షాలోం (2) ||శుభవేళ||
కీర్తి హల్లెలూయా / గానం యేసు నామం మధురమిదే / నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2) / స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం / స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకే / స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం / స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే / ప్రయాసే లేదుగా – యేసే తోడుగా / మాతో నడువగా – భయమే లేదుగా ||స్తుతి|| / క్రీస్తుని వేడగా – మార్గం తానేగా / సత్యం రూఢిగా – జీవం నీయగా ||స్తుతి||
ప్రేమింతును నిన్నే – జీవింతును నీకై / ధ్యానింతును నిన్నే – ప్రకటింతును నీకై / యేసూ… నీవే… / అతి సుందరుడా – అతి శ్రేష్టుడా / నీవే… అతి కాంక్షనీయుడా / నా ప్రాణ ప్రియుడా – నా యేసయ్యా ||ప్రేమింతును|| / నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యా / ప్రతి దినము నీ రాకడకై నేనెదురు చూచెదనయ్యా (2) / నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు / నా జీవిత కాలమంతా నిన్నే కీర్తింతునయ్యా (2) ||యేసూ|| / నీ ముఖము అతి మనోహరం సూర్య కాంతి మించినది / నీ స్వరము అతి మధురం తేనె కంటె తీయనిది (2) / షాలేము రాజా సమాధాన కర్తా / రక్షణ పాత్ర చేత బూని ఆరాధింతునయ్యా (2) ||యేసూ||
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4) / యేసయ్యా నీవే నా రక్షకుడవు / యేసయ్యా నీవే నా సృష్టికర్తవు / దరి చేర్చి ఆదరించుమా / ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా / వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు / ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు / హాల్లేలూయా ఆమెన్ / ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా / పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి / సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2) / కరుణించి కాపాడుమా / ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2) ||హల్లెలూయా|| / స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్ / కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా (2) / కృప చూపి నడిపించుమా / ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా (2) ||హల్లెలూయా||
స్తుతి మహిమ యేసు నీకే / స్తుతి ఘనత ప్రభు నీకే (2) / ఆరాధన స్తుతి ఆరాధన (8) ||స్తుతి|| / కళ్ళల్లో కన్నీరు తుడిచావు / గుండె బరువును దింపావు (2) / వ్యధలో ఆదరించావు / హృదిలో నెమ్మదినిచ్చావు (2) / యెహోవా షాలోమ్ ఆరాధన (8) ||స్తుతి|| / నీవొక్కడవే దేవుడవు / మిక్కిలిగా ప్రేమించావు (2) / రక్తము నాకై కార్చావు / రక్షణ భాగ్యమునిచ్చావు (2) / యెహోవా రూహీ ఆరాధన (8) ||స్తుతి|| / నను బ్రతికించిన దేవుడవు / నాకు స్వస్థత నిచ్చావు (2) / నా తలను పైకెత్తావు / నీ చిత్తము నెరవేర్చావు (2) / యెహోవా రాఫా ఆరాధన (8) ||స్తుతి||
హోలీ హోలీ హోలీ / హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ / హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2) / ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం / బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – (2) / శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము / సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం / అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు – (2) / నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు / నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ / పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు – (2) / రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా / నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / అడోనై అడోనై అడోనై అడోనై / ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు – (2) / సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు / నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / యావే యావే యావే యావే / యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి – (2) / పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు / ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)
నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో (2) / ఎంతో సంతోషం – ఎంతో ఆనందం (2) / నా యేసుని నివాసములో (2) ||నా దేవుని|| / సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదా / రాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా (2) / నా కొండ నీవేగా – నా కోట నీవేగా (2) / నా యేసు రక్షకా నీవే కదా (2) ||నా దేవుని|| / నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదను / నా యేసు స్వరమును వినుచు – నేను కాలము మరచెదను (2) / నా గానమాయెనే – నా ధ్యానమాయెనే (2) / నాదు స్వరము నా ప్రభువే (2) ||నా దేవుని|| / ఆనంద తైలము నందు – నన్ను అభిషేకించెనుగా / నాదు వస్త్రము నందు – అగరు వాసన నింపెనుగా (2) / నా ప్రాణ నాథుడా – నా ప్రేమ పాత్రుడా (2) / నా యేసు నాథుడా నీవే కదా (2) ||నా దేవుని||