535 worship songs available. Lyrics in Roman and Telugu script.
మంచి దేవుడు నా యేసయ్యా / చింతలన్ని బాపునయ్యా / హృదయ వాంఛతో చేరిన వారికి / శాంతి జీవము ఇచ్చునయ్యా (2) / మహిమా ఘనత ప్రభావము నీకే (2) / కృపల వెనక కృపను చూపి / విడువక నీ కృపలను చూపిన (2) / కృపగల నా యేసు రాజా / నీ కృప నాకు చాలునయ్యా (2) ||మహిమా|| / మహిమ వెంట మహిమ నొసగి / నీ రూపమున నన్ను మార్చి (2) / మహిమతో నీవుండు చోటుకి / మమ్ము ప్రేమతో పిలచితివి (2) ||మహిమా|| / జయము వెంట జయమునిచ్చి / జయ జీవితము మాకు ఇచ్చి (2) / జయశీలుడు నా యేసు ప్రభువని / జయము జయమని పాడెదను (2) ||మహిమా||
ఇరువది నలుగురు పెద్దలతో / పరిశుద్ధ దూతల సమూహముతో (2) / నాలుగు జీవుల గానముతో (2) / స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది|| / భూమ్యాకాశములన్నియును / పర్వత సముద్ర జల చరముల్ (2) / ఆకాశ పక్షులు అనుదినము (2) / గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది|| / కరుణారసమగు హృదయుడవు / పరిశుద్ధ దేవ తనయుడవు (2) / మనుజుల రక్షణ కారకుడా (2) / మహిమ కలిగిన మా ప్రభువా ||ఇరువది|| / గుప్పిలి విప్పి కూర్మితోను / గొప్పగ దీవెనలిచ్చెదవు (2) / గొర్రెల కాపరి దావీదు (2) / అయ్యెను ఎంతో మహారాజు ||ఇరువది||
చిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగా / కనరాని దేవుడు కనిపించెనా / తన ప్రేమ నా పైన కురిపించెనా… కురిపించెనా / జో.. లాలిజో.. జో… లాలిజో… / పరలోక భోగాలు వర దూత గానాలు / తనకున్న భాగ్యాలు విడనాడెనా (2) / పాపాలు భరియించెనా – శాపాలు భరియించెనా / ఆనందమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే ||జో లాలిజో|| / దావీదు తనయుండై మహిమా స్వరూపుండై / మానుజావతారుండై పవళించెనా (2) / గాఢాంధకారంబున ఒక తార ఉదయించెనా / ప్రభు బాలుడై ప్రభు యేసుడు మరియమ్మ ఒడిలోన నిదురించెనా ||జో లాలిజో|| / శాంతి స్వరూపుండు కరుణా సముద్రుండు / కడు శక్తిమంతుడు కమనీయుడు (2) / ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కర్తాయనే / అభిషిక్తుడు ఆరాధ్యుడు ప్రేమామయుడు ప్రియుడేసుడు ||జో లాలిజో||
విధేయత కలిగి జీవించుటకు / జీవమిచ్చాడు యేసు జీవమిచ్చాడు / ప్రతి ఉదయము యేసయ్యతో మాటలాడుటకు / ప్రార్ధన నేర్పాడు యేసు ప్రార్ధన నేర్పాడు / యేసయ్యతో ఉంటే సంతోషమే / యేసయ్యతో ఉంటే ఆనందమే / సాతానుతో ఉంటే కష్టాలు / సాతానుతో ఉంటే నష్టాలూ / అందుకని / ప్రతి రోజు మనం, దేవుణ్ణి ప్రార్ధించి / దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండి / మన సొంత ఇల్లైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యి / మన అమ్మ నాన్నలను కూడా పరలోక రాజ్యానికి తీసుకు వెళదామా / సరే ఇప్పుడు ఏం చేయాలంటే / ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి / యేసయ్యను ఆరాధించెదము / ఏం చెయ్యాలంటే / ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి / యేసయ్యను ఆరాధించెదము / బుడి బుడి బుడి అడుగులతో / చిట్టి చిట్టి చిట్టి చేతులెత్తి (2) / యేసయ్యను ఆరాధించెదము / యేసయ్యా ఈ రోజు నుండి / నీ వాక్యమనే మార్గములో నడిపించు యేసయ్యా
ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ / ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతియించుడీ…హల్లేలూయ ||ఆకాశ|| / ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా / సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడీ..హల్లేలూయ ||ఆకాశ|| / సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా / వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతియించుడీ హల్లేలూయ ||ఆకాశ||
యేసు చాలును యేసు చాలును / యే సమయమైన యే స్థితికైన / నా జీవితములో యేసు చాలును / పరమజీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ / నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును ||యేసు|| / సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను / లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ||యేసు|| / పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును / అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు|| / నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్లి కృశించినను / హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను ||యేసు||
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2) / విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా|| / నీవు కనిపించని రోజున / ఒక క్షణమొక యుగముగా మారెనే (2) / నీవు నడిపించిన రోజున / యుగయుగాల తలపు మది నిండెనే (2) / యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా|| / నీవు మాట్లాడని రోజున / నా కనులకు నిద్దుర కరువాయెనే (2) / నీవు పెదవిప్పిన రోజున / నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2) / నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా|| / నీవు వరునిగా విచ్చేయి వేళ / నా తలపుల పంట పండునే (2) / వధువునై నేను నిను చేరగా / యుగయుగాలు నన్నేలు కొందువనే (2) / యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||
అన్నయ్య… తెల్లారింది లేరా.. / తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా / మనమంతా ఆయన సృష్టే రా / పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా / వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2) / అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ / యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2) / వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను / రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2) / మరచిపోవునా ||తెల్లారింది|| / చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ / విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా (2) / వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని / నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా (2) / నీకు తెలియునా ||తెల్లారింది||
మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం / శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2) / దీన మనస్సు – దయ గల మాటలు / సుందర వదనం – తేజోమయుని రాజసం (2) ||మధురం|| / ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని / బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2) / నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు / యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| / పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు / ప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2) / ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు / యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| / కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను / ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా (2) / జడియకు నీవు మహిమలో నిలుపుటకు / యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||
ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను (2) / నీ ఋణము నే తీర్చగలనా / తగిన కానుక నీకు అర్పింపగలనా (2) / ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునా / దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా (2) / ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను (2) / నీ ఋణము నే తీర్చగలనా / తగిన కానుక నీకు అర్పించగలనా (2) ||ప్రభువా|| / కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి / నా గుడారమునే విశాల పరచి (2) / ఇంతగ నను హెచ్చించుటకు / నే తగుదునా… నే తగుదునా… / వింతగ నను దీవించుటకు / నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా|| / నీ నోటి మాట నా ఊటగ నుంచి / నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి (2) / ఇంతగ నను వాడుకొనుటకు / నే తగుదునా… నే తగుదునా… / వింతగ నను హెచ్చించుటకు / నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా||
యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా / మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా (2) / పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై / నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు (2) / పూజనీయుడా నీతి సూర్యుడా / నిత్యము నా కనుల మెదలుచున్నవాడా ||యేసయ్యా|| / ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో / మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా (2) / విజయశీలుడా పరిశుద్ధాత్ముడా / నిత్యము నాలోనే నిలచియున్నవాడా ||యేసయ్యా||
నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా (2) / నా ఆశ నీవే కదా / ఓ.. నా అండ నీవే కదా (2) / యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2) / నాకై జన్మించితివే – సిలువలో మరణించితివే / నీ ఋణము తీర్చేదెలా / నిను తృప్తి పరచేదెలా (2) / నా మనస్సు నీకిచ్చా – నా ప్రాణమర్పించా (2) / విలువైనదేది నీకన్నా ||యేసయ్యా|| / నీ చేతితో చెక్కావే – నీ రూపులో చేసావే / నిను పోలి జీవించగా / నీ ఆత్మ నాకివ్వుమా (2) / నా జీవితము నీకై – నా జన్మ తరియింప (2) / పరిశుద్ధాత్మను ప్రోక్షించు ||యేసయ్యా||