ఆరాధన | Worship Telugu Songs

535 worship songs available. Lyrics in Roman and Telugu script.

రావయ్యా యేసయ్యా|Raavayyaa Yesayyaa

రావయ్యా యేసయ్యా నా ఇంటికి / నీ రాకకై నే వేచియుంటిని… / రావయ్యా యేసయ్యా నా ఇంటికి / నీ రాకకై నే వేచియుంటిని (2) / కన్నులార నిన్ను చూడాలని (2) / కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా|| / యదార్థ హృదయముతో నడచుకొందును / ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2) / భక్తిహీనుల క్రియలు నాకంటనీయను / మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) ||రావయ్యా|| / దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను / నా పొరుగు వారిని దూషింపను (2) / అహంకారము గర్వము నంటనీయను / నమ్మకస్థునిగా నే నడచుకొందును (2) ||రావయ్యా|| / నిర్దోష మార్గముల నడచుకొందును / మోసము నా ఇంట నిలువనీయను (2) / అబద్ధికులెవ్వరిని ఆదరింపను / భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2) ||రావయ్యా||

ఎంతో సుందరుడమ్మ తాను|Entho Sundarudamma Thaanu

ఎంతో సుందరుడమ్మ తాను / నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో|| / ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2) / అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2) / ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు / అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – (2) / ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2) / అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో|| / కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2) / మరులు మనసున నింపు మహనీయుడాతండు (2) / కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు / మరులు మనసున నింపు మహనీయుడాతండు – (2) / సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2) / విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో|| / పాలతో కడిగిన నయనాలు గలవాడు (2) / విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2) / పాలతో కడిగిన నయనాలు గలవాడు / విలువగు రతనాల వలె పొదిగిన కనులు – (2) / కలుషము కడిగిన కమలాల కనుదోయి (2) / విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో|| / మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2) / చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2) / మేలిమి బంగారు స్థలమందు నిలిచినా / చలువ రాతిని బోలు బలమైన పాదాలు – (2) / ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2) / బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో|| / అతడతికాంక్షానీయుండు తనయుండు (2) / అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2) / అతడతికాంక్షానీయుండు తనయుండు / అతడే నా ప్రియుడు అతడే నా హితుడు – (2) / ఆతని నొరతి మధురంబు మధురంబు (2) / ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||

సీయోనులో స్థిరమైన|Seeyonulo Sthiramaina

నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే / సౌందర్య సీయోనులో / నీ మనోహరమైన ముఖము దర్శింతును / నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే / సీయోనులో స్థిరమైన పునాది నీవు / నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2) / సూర్యుడు లేని చంద్రుడు లేని / చీకటి రాత్రులు లేనే లేని (2) / ఆ దివ్య నగరిలో కాంతులను / విరజిమ్మెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| / కడలి లేని కడగండ్లు లేని / కల్లోల స్థితి గతులు దరికే రాని (2) / సువర్ణ వీధులలో / నడిపించెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| / సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2) / సౌందర్య సీయోనులో / నీ మనోహరమైన ముఖము దర్శింతును (2) / నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3) / ఆనందమే పరమానందమే (10)

రాజాధి రాజ|Raajaadhi raaja

రాజాధి రాజ రవి కోటి తేజ / రమణీయ సామ్రాజ్య పరిపాలక (2) / విడువని కృప నాలో స్థాపించెనే / సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2) ||రాజాధి|| / వర్ణనకందని పరిపూర్ణమైన నీ / మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2) / కృపా సత్యములతో కాపాడుచున్నావు / దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2) ||రాజాధి|| / ఊహలకందని ఉన్నతమైన నీ / ఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2) / ఊరేగించుచున్నావు విజయోత్సవముతో / యేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో (2) ||రాజాధి|| / మకుటము ధరించిన మహారాజువై నీ / సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి (2) / నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి / నీ సాక్షినై కాంక్షతో పాడెద – స్తోత్ర సంకీర్తనలే (2) ||రాజాధి||

ఏ రీతి స్తుతియింతును|Ae Reethi Sthuthiyinthunu

ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా / ఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబును / నీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యా / నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి|| / ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకు / ఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్ను / ఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యా / ఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి|| / ఈ మనుష్యులు ఈ వైరులు – ఎన్నెన్నో చేసిన గాని / నా ప్రాణము నా దేహము – నీ స్వాధీనంభేగదయ్యా / నా స్వామి నాతోనే ఉంటూ – నా కాపరిగ నిలిచావయ్యా / నాకేమి స్పృహ లేని వేళ – ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి|| / నీ ప్రేమను నీ పేరును – నేనెన్నడూ మరువలేను / నీ కరుణను నీ జాలిని – ఏ మనిషిలో చూడలేను / నిజ దైవము నీవే యనుచు – నీ వైపే నే చూచానయ్యా / యెహోవా రాఫా నేననుచు – ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||

నీ పాదాలే నాకు శరణం|Nee paadaale naaku sharanam

నీ పాదాలే నాకు శరణం / యేసయ్యా నీవే ఆధారము (2) / నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా (2) / నా దాగు చాటు నీవే యేసయ్యా (2) ||నీ పాదాలే|| / అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి (2) / నా ఆశ్రయుడా నీ కన్నా నాకు / కనిపించదు వేరొక ఆశ్రయము (2) / కనిపించదు వేరొక ఆశ్రయము / శరణం శరణం శరణం / నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే|| / ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను (2) / నా పోషకుడా నీ కన్న నాకు / కనిపించరే వేరొక పోషకుడు (2) / కనిపించరే వేరొక పోషకుడు / శరణం శరణం శరణం / నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే|| / సాతాను శోధనలో పరుగెత్తితిని నీ వాక్కు కొరకు (2) / నా జయశీలుడా నీకన్న నాకు / కనిపించరే జయమును ఇచ్చే వేరొకరు (2) / కనిపించరే జయమునిచ్చే వేరొకరు / శరణం శరణం శరణం / నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే||

మహోన్నతుడా నీ చాటున|Mahonnathuda Nee Chaatuna

మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను / సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను / బలవంతుడా నీ సన్నిధినే / నే ఆశ్రయించెదా అనుదినము / యేసయ్యా యేసయ్యా / రాత్రివేళ కలుగు భయముకైనా / పగటిలో ఎగిరే బాణముకైనా / చీకటిలో సంచరించు తెగులుకైనా / దినమెల్లా వేధించు వ్యాధికైనా / నే భయపడను నే దిగులు చెందను / యెహోవా రాఫా నా తోడు నీవే / యేసయ్యా యేసయ్యా / వేయిమంది నా ప్రక్క పడిపోయినా / పదివేలు నా చుట్టు కాలినను / అంధకారమే నన్ను చుట్టుముట్టినా / మరణ భయమే నన్ను వేధించినా / నే భయపడను నే దిగులు చెందను / యెహోవా నిస్సి నా తోడు నీవే / యేసయ్యా యేసయ్యా / నిను ప్రేమించువారిని తప్పించువాడా / నిన్నెరిగిన వారిని ఘనపరచువాడా / నా యుద్ధము జయించి లేవనెత్తువాడా / కృప వెంబడి కృప చూపించువాడా / యేసయ్యా యేసయ్యా / నే భయపడను నే దిగులు చెందను / యెహోవా షాలోం నా తోడు నీవే