ఆరాధన | Worship Telugu Songs

535 worship songs available. Lyrics in Roman and Telugu script.

యేసు రక్షకా|Yesu Rakshakaa

యేసు రక్షకా శతకోటి స్తోత్రం / జీవన దాత కోటి కోటి స్తోత్రం / యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2) / నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2) / యేసు ఆరాధించెదను – ఆరాధించెదను / శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు / నన్ను రక్షింప నర రూపమెత్తాడు (2) / నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2) / చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2) ||యేసు రక్షకా|| / పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు / ఎన్నటికిని ఎడబాయనన్నాడు (2) / తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2) / నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు (2) ||యేసు రక్షకా|| / యేసు ఆరాధించెదను – ఆరాధించెదను / నా సమస్తము అర్పించి – ఆరాధించెదను / నా సర్వము అర్పించి – ఆరాధించెదను / శరణం శరణం యేసు స్వామి శరణం (3) ||యేసు ఆరాధించెదను||

ఘనమైన నా యేసయ్యా|Ghanamaina naa yesayyaa

ఘనమైన నా యేసయ్యా / బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు (2) / (నా) శిరము వంచి స్తుతియింతును / నీ – కృపా సత్యములను ప్రకటింతును (2) ||ఘనమైన|| / నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము / నీ – ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము (2) / ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా (2) / తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా (2) / ఏమని వర్ణించెదను నీ ప్రేమను / నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2) ||ఘనమైన|| / మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము / నీ – శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము (2) / మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా (2) / మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా (2) / ఏమని వర్ణించెదను నీ ప్రేమను / నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2) ||ఘనమైన|| / సంఘ క్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము / అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు (2) / పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా (2) / స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా (2) / ఏమని వర్ణించెదను నీ ప్రేమను / నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2) ||ఘనమైన||

మెల్లని చల్లని|Mellani Challani

మెల్లని చల్లని స్వరము యేసయ్యదే / ఉల్లమంతటిని నింపు ఆనందము / అల్లకల్లోలము బాపి శాంతి నిచ్చుఁన్ ||మెల్లని|| / శూన్యము నుండి సర్వం – సృష్టి చేసెనుగా / మంచిదంతటిని మాటతో చేసెను / పాపులను పిలిచిన ప్రేమ గల స్వరము / పావనపరచెడి పరిశుద్ధుని స్వరము ||మెల్లని|| / స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున / దీనులను ఆదరించు దివ్య కరుణ స్వరం / కుళ్ళిన శవమునందు జీవమును పోసెను / పునరుత్తాన బలం కలదు ఆ స్వరములో ||మెల్లని|| / గాలి తుఫానులన్ అణచిన స్వరమది / భీతి భయములన్ని బాపెడి స్వరమది / అంత్య దినమందున మృతుల లేపునుగా / అందరికి తీర్పును తీర్చి పాలించును ||మెల్లని|| / మహిమ గల ఆ స్వరం పిలుచుచుండె నిన్ను / మహిమ నాథుండేసు కోరుచుండె నిన్ను / మహిమ గల ఆ స్వరం వినెడి చెవులున్నావా / మహిమ నాథుండేసున్ కోరు హృది ఉన్నదా ||మెల్లని||

నీతో స్నేహం చేయాలని|Neetho Sneham Cheyaalani

నీతో స్నేహం చేయాలని / నీ సహవాసం కావాలని (2) / నీ లాగే నేను ఉండాలని / నిను పోలి ఇలలో నడవాలని (2) / యేసయ్యా… యేసయ్యా… / నీ స్నేహం నాకు కావాలయ్యా (2) ||నీతో|| / శాశ్వతమైన నీ కృపతో నింపి / నీ రక్షణ నాకు ఇచ్చావయ్యా (2) / ఏమివ్వగలను నీ కృపకు నేను / నన్ను నీకు అర్పింతును (2) / యేసయ్యా… యేసయ్యా… / నీ కృపయే నాకు చాలునయ్యా (2) / మధురమైన నీ ప్రేమతో నన్ను పిలచి / నీ సేవకై నన్ను ఏర్పరచుకున్నావా (2) / ఏమివ్వగలను నీ ప్రేమకు యేసు / నన్ను నీకు అర్పింతును (2) / యేసయ్యా… యేసయ్యా… / నీ ప్రేమే నాకు చాలునయ్యా (2) / బలమైన నీ ఆత్మతో నన్ను నింపి / నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2) / ఏమివ్వగలను నీ కొరకు నేను / నన్ను నీకు అర్పింతును (2) / యేసయ్యా… యేసయ్యా… / నీ తోడే నాకు చాలునయ్యా (2) ||నీతో||

దేవ దాసపాలక|Deva Daasapaalaka

దేవ దాసపాలక రాజా రావే / జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా / దేవా దేవా దీన పోషకా ||దేవ|| / లోక బాధ ఇరుకు శోధన నుండి / స్వీకరించినావు త్రియేక దేవుడా / స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ ||దేవ|| / దిక్కులేని పాపి కొరకు నీ దేహం / మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా / జయం జయం జయము నొందగా ||దేవ|| / కఠినులంత కుటిలము జేసి నిన్ను / గట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య నెత్తిరా / యిదే నా యెడ బ్రేమ జూపితి ||దేవ|| / ఇంత యొర్పు యింత శాంతమా నాకై / పంతముతో బాపికొరకు బ్రాణమియ్యగా / పాపి నీదగు దాపు జేర్చవే ||దేవ|| / కలువరి గిరి వరంబున నాకై / తులువను నా కొరకు నిలను సిల్వ మోయగా / హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ||దేవ||

Worship Telugu Songs — Page 19 | UEC Telugu Church