535 worship songs available. Lyrics in Roman and Telugu script.
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే / నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2) ||నా గీతా|| / నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే / చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2) / నీ కృప నాలో అత్యున్నతమై / నీతో నన్ను అంటు కట్టెనే (2) ||నా గీతా|| / చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా / సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే (2) / నిశ్చలమైన రాజ్యము కొరకే / ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) ||నా గీతా|| / ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే / ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే (2) / ఆత్మతో సత్యముతో ఆరాధించుచు / నే వేచియుందునే నీ రాకడకై (2) ||నా గీతా||
హల్లెలూయా ఆరాధన / రాజాధి రాజు యేసునకే / మహిమయు ఘనతయు / సర్వాధికారి క్రీస్తునకే (2) / చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ / ఆ ప్రభుని కీర్తించెదం / నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో / స్తోత్రార్పణ చేసెదం ||హల్లెలూయా|| / రూపింప బడక ముందే / నన్ను ఎరిగితివి / నా పాదములు జారకుండా / రక్షించి నడిపితివి (2) ||చప్పట్లు|| / అభిషేక వస్త్రము నిచ్చి / వీరులుగా చేసితివి / అపవాది క్రియలను జయించే / ప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు||
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా / ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా / దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా / భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ (2) ||ఏ బాధ|| / ఎర్ర సంద్రం ఎదురొచ్చినా / యెరికో గోడలు అడ్డొచ్చినా / సాతాను శోధించినా / శత్రువులే శాసించినా / పడకు భయపడకు బలవంతుడే నీకుండగా / నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా ||దిగులేల|| / పర్వతాలు తొలగినా / మెట్టలు తత్తరిల్లినా / తుఫానులు చెలరేగినా / వరదలు ఉప్పొంగినా / కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగా / నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే కదా ||దిగులేల||
ప్రకాశించే ఆ దివ్య సీయోనులో / ఘనుడా నిన్ను దర్శింతును (2) / కలలోనైనా అనుకోలేదు / నాకింత భాగ్యము కలదని (2) / ఆరాధన ఆరాధన / ఆరాధన నీకే ఆరాధన (2) / ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే|| / వేవేల దూతలతో నిత్యము / పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2) / నా తండ్రీ నీ సన్నిధిలో / దీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన|| / నను దాటిపోని సౌందర్యుడా / నా తట్టు తిరిగిన సమరయుడా (2) / నా తండ్రీ నీ సన్నిధిలో / నీవలె ప్రకాశింతును (2) ||ఆరాధన||
నోరారగా చేతును / దైవారాధనను (2) / ధారాళముగా పాడెదను / స్తోత్ర గీతమును (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హాల్లేలూయా (2) ||నోరారగా|| / భరియించితివి నా పాపపు శిక్షన్ / జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2) ||హల్లెలూయా|| / విడిపించితివి పాప శిక్ష నుండి / నడిపించితివి జీవ మార్గము నందు (2) ||హల్లెలూయా|| / దయచేసితివి మోక్ష భాగ్యము నాకు / క్రయమిచ్చితివి నా విమోచనకై (2) ||హల్లెలూయా|| / వెలిగించితివి నా మనోనేత్రములు / తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు (2) ||హల్లెలూయా||
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త / బలవంతుడైన దేవుడా / నిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతి / మనకై జన్మించెను (2) / వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ (2) / హోసన్నా హల్లలూయా / క్రిస్మస్ బాలునికే (2) ||ఆశ్చర్యకరుడా|| / ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై / స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్ / అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై / ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్ / ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకు / దరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు (2) / దొంగలను మార్చి దయచూపినావు (2) / ధవళ వస్త్రములు ధరింప చేసి / ధన్యుని చేసావు ||వి విష్|| / నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకు / నీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు (2) / నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు (2) / నీతో నిరతం జీవించుటకు / నిత్య జీవమియ్య అరుదెంచినావు ||వి విష్||
క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన / క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ (2) / హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) / క్రీస్తులోనే విశ్వాసం / క్రీస్తులోనే ఉల్లాసం / క్రీస్తులోనే అభిషేకం / క్రీస్తులోనే సమస్తం (2) / హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) ||క్రిస్మస్|| / యేసులోనే రక్షణ / యేసులోనే స్వస్థత / యేసులోనే విడుదల / నమ్మితే నిత్య జీవం (2) / హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) ||క్రిస్మస్||
ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా / యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా / ఓ సంఘమా వినుమా / రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో / వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో / ఆనంద తైల సుగంధాభిషేకము (2) / పొందితినే యేసునందు (2) ||ఓ సంఘమా|| / క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెనని / స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ / మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2) / సహియింతువా తీర్పునాడు (2) ||ఓ సంఘమా|| / చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు / శ్రీకర గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని / గుర్తించుచుంటివా క్రియలను గంటివా (2) / సజీవముగా నున్నావా (2) ||ఓ సంఘమా|| / చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగును / నులివెచ్చని స్థితి నీకుండిన – బయటకు ఉమ్మి వేయబడుదువేమో / నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో (2) / ఆసక్తితో రక్షణ పొందుమా (2) ||ఓ సంఘమా||
వర్ణించలేను వివరించలేను / అతి శ్రేష్టమైన నీ నామమున్ / యేసు నీ నామమున్ – (2) / కొనియాడెదన్ కీర్తించెదన్ (2) / అత్యంతమైన నీ ప్రేమను / యేసు నీ ప్రేమను (2) ||వర్ణించలేను|| / మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే / పాపినేని చూడక ప్రేమించితివే (2) / హల్లెలూయా హల్లెలూయా (2) / అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| / సర్వాధికారి సర్వోన్నతుడా (2) / హీనుడైన నన్ను కరుణించితివే (2) / హల్లెలూయా హల్లెలూయా (2) / అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| / రత్న వర్ణుడవు అతి సుందరుడవు (2) / నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే (2) / హల్లెలూయా హల్లెలూయా (2) / అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను||
సిలువలో నాకై చేసిన యాగము / మరువలేనయ్యా మరచిపోనయ్యా / నీ ప్రేమను… నీ త్యాగము… / మరువలేనయ్యా నీ ప్రేమను / మరచిపోనయ్యా నీ త్యాగము (2) / సిలువలో నాకై చేసిన యాగము (2) ||మరువలేనయ్యా|| / నా కోసమే నీవు జన్మించితివి / నా కోసమే నీవు సిలువనెక్కితివి (2) / నా కోసమే నీవు మరణించితివి (2) / నా కోసమే నీవు తిరిగి లేచితివి (2) ||మరువలేనయ్యా|| / ఎవరూ చూపని ప్రేమను చూపి / ఎవరూ చేయని త్యాగము చేసి (2) / విడువను ఎడబాయను అన్నావు (2) / నీ నిత్యజీవమును నాకివ్వగోరి (2) ||మరువలేనయ్యా||
నిను పాడాలని కీర్తించాలని / ఆశ.. యేసు నా ఆశ / ఆశ.. యేసు నా ఆశ (2) / ఆరాధింతును ఆనందింతును (2) / నీలో.. యేసు నీలో (2) ||నిను|| / నిరాశపడిన వేళలో / నా ఆశ నీవైతివే / నా ఆశ నీవైతివే (2) / నా సంతోషమా నా ఆనందమా (2) / నా ఆధారమా నీవే (2) ||నిను|| / నిత్యుడవు నీవే సృష్టికర్త నీవే / నను చేసినది నీవే / నను చేసినది నీవే (2) / స్తుతియింతును ఘనపరతును (2) / నా దైవం నీవే అని (2) ||నిను||
సకలము చేయు సర్వాధికారి / సర్వ జగతికి ఆధారుడా / నా హృదిలో వసియింప వచ్చినవాడా (2) / ఆరాధ్యుడా నా యేసయ్యా / ఆరాధన నీకే (2) ||సకలము|| / జగద్రక్షకుడా విశ్వవిదాత / సర్వ కృపలకు దాతవు నీవే (2) / బలియైతివా మా రక్షణకై / సర్వ ఘనతలు నీకే ప్రభువా (2) / సర్వ ఘనతలు నీకే ప్రభువా ||సకలము|| / బల శౌర్యము గల యుద్ధ శూరుడవు / సైన్యములకు అధిపతి నీవే (2) / నా జయములన్ని నీవే ప్రభువా / నా ఘనతలన్ని నీకే ప్రభువా (2) / నా ఘనతలన్ని నీకే ప్రభువా ||సకలము|| / కోటి సూర్య కాంతితో వెలుగొందుతున్న / మహిమ గలిగిన రారాజువు నీవే (2) / చీకటి ఎరుగని రాజ్యము నీది / అంతమే లేదు నీ మహిమకు (2) / అంతమే లేదు నీ మహిమకు ||సకలము||