535 worship songs available. Lyrics in Roman and Telugu script.
గుర్తుండిపోయే ఈ క్షణాలలో / ప్రతి గుండె నిండా ఆనందమే / ఘనమైన ఈ వివాహ వేడుక / చేసావు మాకు తీపి జ్ఞాపిక / దేవా నీకు వందనం (4) / చిన్ని మొగ్గలా లేత సిగ్గులా / చిరునవ్వుల ఈ నవ వధువు / నింగి చుక్కలా కాంతి రేఖలా / సుందరుడు ఈ నవ వరుడు (2) / దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2) / దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని / దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని / నీ బాటలో నీ మాటలో / సాగనీ అనురాగమై / నీ ధ్యాసలో నీ ఊసులో / ఎదగనీ అనుబంధమై (2) / దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2) / దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని / దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని
అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా / నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా (2) / నీ ప్రేమ కొదువ లేనిది / ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది (2) / ఓ తల్లి తన బిడ్డను మరచునా / వారైనా మరచినా నేను మరువను / అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా – (2)
ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా / నిరంతరము స్తోత్రములకు పూజార్హుడా (2) / ఏమని నిన్ను నేను కీర్తింతును / ఏమని నిన్ను నేను పూజింతును (2) / ఏమని నిన్ను నేను ఆరాధింతును (2) / ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా / ఆరాధనా నీకు ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా / ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా / నా పితరులెందరో నిన్ను ఘనపరచి / దహనబలులు నీకు అర్పించగా (2) / ఇంపైన సువాసనగా అంగీకరించి / దీవెన వర్షము కురిపించితివే (2) / నా హృదయ క్షేత్రములో నిన్నారాధించి / స్తుతుల సింహాసనము నీకు వేయగా (2) / ఆనంద తైలముతో నన్నభిషేకించి / స్తోత్రగీతముతో నన్ను నింపితివే (2) / నా కొరకు సీయోనును సిద్ధపరచి / మహిమతో తిరిగి రానైయుంటివే (2) / ఆనంద ధ్వనులతో నన్నూరేగించి / శాశ్వత జీవము నాకిచ్చితివే (2)
చీకటులే నన్ను కమ్ముకొనంగా / దుఃఖంబు నాకాహారంబు కాగా / ఏకాకినై లోకంబులోన / కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) / మేఘములు నన్ను ముసుగుకొనంగా / ఉరుములు నాపై దొరలుచుండంగా / వడగండ్ల వాన కురియుచుండంగా / కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) / అన్యాయ క్రియలు అధికంబు కాగా / మోసంబులే నాకు వ్యసనంబు కలుగ / ఆకాశ శక్తులు కదలించబడగా / కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) / త్వరలోనే రమ్ము పరలోక వరుడా / వరమేని తనయా ఓ గొర్రెపిల్లా (2) / కడబూర మ్రోగన్ తడవేల ప్రభువా (2) / కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2)
నీ జ్ఞాపకం అనేకులను – ప్రభు వైపుకు త్రిప్పుచుండెనా / నీ జ్ఞాపకం ఆత్మీయులకు – క్షేమాభివృద్ధి నిచ్చుఁచుండెనా (2) / నీ జ్ఞాపకం నీవు మరణించినా / మరణాంతర పరిచర్య చేయునా (2) / మరణాంతర పరిచర్య చేయునా ||నీ జ్ఞాపకం|| / పేతురన్న జ్ఞాపకం – పశ్చాత్తాప పరిమళం / పౌలన్న జ్ఞాపకం – పోరాటపు ప్రోత్సాహం (2) / నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా / క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం|| / బర్నబాన్న జ్ఞాపకం – ఆదరణానందము / తిమోతన్న జ్ఞాపకం – విశ్వాస విజయము (2) / నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా / క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం|| / ఫిలిప్పన్న జ్ఞాపకం – సువార్త సునాదము / స్తెఫనన్న జ్ఞాపకం – క్రీస్తుని స్వారూప్యము (2) / నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా / క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం||
యేసు రాజా… / అర్పించెదనయ్యా నా జీవితం (2) ||యేసు రాజా|| / పాపములో చిక్కిన నన్ను / శిక్షకు పాత్రగా నిలచిన నన్ను (2) / విడిపించెనయ్యా నీ ప్రేమ బంధం (2) / రమ్మని పిలిచావు / అయ్యా.. నీ సన్నిధిలో నిలిపావు ||యేసు రాజా|| / నీ ఆత్మతో ఆకర్షించి / నీ కృపతో నను వెంబడించి (2) / ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను (2) / ఎలుగెత్తి చాటెదను / అయ్యా.. నీ ఆత్మలో సాగెదను ||యేసు రాజా|| / అర్పించెదనయ్యా నీకే / నా ఈ శేష జీవితం
చిట్టి పొట్టి పాపను నేను / చిన్నారి పాపను నేను (2) / యేసయ్యా నిన్ను చూడాలని / నాకున్న చిన్ని ఆశ / యేసయ్యా నిన్ను చేరాలని / నాకున్న చిన్ని ఆశ ||చిట్టి|| / నీ సన్నిధిలోనే ఉండాలని / నాకున్న చిన్ని ఆశ / నీ సన్నిధిలో పాట పాడాలని / నాకున్న చిన్ని ఆశ ||చిట్టి|| / నీకై నేను జీవించాలని / నాకున్న చిన్ని ఆశ / నిన్నే నేను సేవించాలని / నాకున్న చిన్ని ఆశ ||చిట్టి||
ముఖ దర్శనం చాలయ్యా / నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2) / సమీపించని తేజస్సులో / నివసించు నా దైవమా (2) / నీ ముఖ దర్శనం చాలయ్యా (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) / అన్న పానములు మరచి నీతో గడుపుట / పరలోక అనుభవమే / నాకది ఉన్నత భాగ్యమే (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) / పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది / మహిమలో చేరుటయే / అది నా హృదయ వాంఛయే (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) / కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి / గానము చేసెదను / ప్రభువా నిత్యము స్తుతియింతును (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
యేసు ప్రభువా నీవే / మహిమా నిరీక్షణా (2) / హల్లెలూయా హల్లెలూయా / మహిమా నిరీక్షణా నీవే (2) ||యేసు|| / గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి (2) / మహిమా నిరీక్షణా నీవే / నిశ్చయముగా నిన్ను చూతును (2) / యేసు ప్రభో జయహో (4) ||యేసు|| / నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి (2) / ఎనలేని ధనము నీవేగా / నిశ్చయముగా నే పొందుదును (2) / యేసు ప్రభో జయహో (4) ||యేసు|| / ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ (2) / పరలోకమే నా దేశము / మహిమలోనచ్చట నుందును (2) / యేసు నీతో సదా / యేసు ప్రభో జయహో (2) ||యేసు||
యేసే నా ఊపిరి – యేసే నా కాపరి / నీ సేవే నాకు భాగ్యం / నీ సన్నిధే నాకు శరణం (2) / ఆరాధన ఆరాధన / ఆరాధన ఆరాధన / పాపపు ఊబి నుండి / పైకెత్తిన నా ప్రభువా / చీకటి బ్రతుకునకు / వెలుగైన నా దేవా (2) / నీ ఆత్మయే నాకాదరణ / నిత్య జీవం నా నిరీక్షణ (2) ||ఆరాధన|| / పక్షి రాజు యవ్వనం వలె / నన్ను బలపరచిన దేవా / నూతన దర్శనము / నాకు కనపరచిన ప్రభువా (2) / విశ్వాసమే నాదు సూత్రం / ప్రార్ధనే నాకు విజయం (2) ||ఆరాధన||
పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు / బలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2) / దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా / ఆరాధన నీకే నా యేసయ్యా / స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడవై|| / నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు / నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2) / శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి / నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి ||ఆరాధన|| / నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు / నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి (2) / నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి / నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి ||ఆరాధన|| / ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు / నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి (2) / మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసము / నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు ||ఆరాధన||
పరమ తండ్రి కుమారుడా / పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం / నీతిమంతుడా మేఘారూఢుడా / స్తుతి పాత్రుడా నీకే మహిమ / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా (2) / నీ స్వస్థతల కన్నా / నీ సన్నిధియే మిన్న / నీ అద్భుతములు కన్నా / నీ కృపయే మిన్న (2) / నను నే ఉపేక్షించి / నిను నేను హెచ్చించి / కొనియాడి కీర్తింతును (2) / పరిశుద్ధుడా పరమాత్ముడా / పునరుత్తానుడా నీకే ఘనత / సృష్టికర్త బలియాగమా / స్తోత్రార్హుడా నీకే ఆరాధన / ఆరాధన ఆరాధన / ఆరాధన ఆరాధన (2)