535 worship songs available. Lyrics in Roman and Telugu script.
నమ్మకు ఇలలో ఎవరిని / సాయం చేస్తారనుకొని (2) / నమ్ముకో రక్షకుడేసుని (2) / కార్యం చూడు నిలుచొని (2) ||నమ్మకు|| / సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు / చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు / అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు (2) / శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు (2) ||నమ్మకు|| / నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనే / మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే / నీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు (2) / దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు (2) ||నమ్మకు|| / నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి / జవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటి / సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు (2) / రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు (2) ||నమ్మకు||
యేసు రాజా నీకే / ఈ స్తుతి ఆరాధన / నా యేసు రాజా నీకే / నా స్తుతి సంకీర్తన / ఆరాధన స్తుతి ఆరాధన / సంకీర్తన స్తుతి స్తోత్రార్పణ (2) ||యేసు|| / నీ మాటలో కరుణ / నీ చూపులో ఆదరణ / నీ ప్రేమలో రక్షణ / నీ కుడి చేతిలో దీవెన (2) / నీతోనే నిత్యానుబంధము / నీవే నా జీవిత గమ్యము (2) ||ఆరాధన|| / జలములలో నే వెళ్లినా / అగ్నిలో నడిచినా / సుడి గాలులే ఎదురైనా / పెను తుఫానే చెలరేగినా (2) / నీ నామమే నను ధైర్యపరచును / నీ మాటలే నన్నాదరించును (2) ||ఆరాధన||
నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4) / తన ప్రేమనే మాకు చూపి / తన వారసులుగా మము చేసెను / నాలో సంతోషం నాలో ఉత్సాహం / యేసయ్య నింపాడు (4) / లాలించును నను పాలించును / ఏ కీడు రాకుండా నను కాపాడును (2) / తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను / ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును ||నాలో|| / హత్తుకొనును నను ఓదార్చును / ఎల్లప్పుడూ నాకు తోడుండును (2) / అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా / మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము ||నాలో||
గిర గిర తిరిగి తిరిగి తిరిగి / తిరిగి తిరిగి తిరిగి తిరిగి / నెమలి వలె నే ఆడెద / గల గల పారే పారే పారే / పారే పారే పారే పారే / అలల వలె నే పొంగెద / తెల్లని వస్త్రము ధరియించెద / దేవుని మహిమకై జీవించెద / ఈ సౌందర్యము నా దేవునిదే / నా దేవుని మహిమకే నే వాడెద / గిర గిర తిరిగి తిరిగి తిరిగి / తిరిగి తిరిగి తిరిగి తిరిగి / నెమలి వలె నే ఆడెద / గల గల పారే పారే పారే / పారే పారే పారే పారే / అలల వలె నే పొంగెద / యేసుని శిష్యునిగా ఉండెద / ఆయన సువార్తనే చాటెద / పరలోకముకై వేచియుండెదా / జీవ కిరీటము నే పొందెద ||గిర||
యవ్వనా జనమా / ప్రభు యేసులో త్వరపడుమా (2) / సమర్పించుము నీ యవ్వనము (2) / ప్రభు యేసుని పాదములో (2) ||యవ్వనా|| / యవ్వనమనునది విలువైనది / కదలిపోతే తిరిగి రాదు / యవ్వనమందే మన కర్తను / స్మరించుమూ కీర్తించుమూ / ప్రభు యేసులో జీవమును పొందుమూ ||యవ్వనా|| / ఈ లోకము వైపు మనసు ఉంచకు / క్షనికమైనదీ దాని మెరుపులు / నీ మనసా వాచా క్రియలందును / ప్రభు యేసును మది నిలుపుకో / పరలోకపు ఆనందమును పొందుమూ ||యవ్వనా||
తన రక్తంతో కడిగి / నీ ఆత్మతో నింపావు (2) / యేసయ్యా… నీవే శుద్ధుడా / తన రక్తంతో కడిగి / నీ ఆత్మతో నింపావు (2) / హోసన్నా నా యేసు రాజా / హల్లెలూయా నా జీవన దాతా (4) / యేసయ్యా / సిలువపై వేళాడితివా / నీ కలువరి ప్రేమ చూపించితివి (2) / సిలువపై వేళాడితివా / నా పాపమునంతా కడిగితివి / సిలువపై వేళాడితివా / నీ కలువరి ప్రేమ చూపించితివే ||హోసన్నా||
దేవా నీ ఆత్మను నా నుండి / నువ్వు తీసివేయకుమా / నీ సన్నిధిలో నుండి నన్ను / నువ్వు త్రోసివేయకుమా (2) / నీ దృష్టి యెదుటనే / చెడుతనము చేసియున్నాను / పాపిని అని ఒప్పుకొని / క్షమాపణ కోరుచున్నాను / నీవే నీవే కరుణామయుడవు నీవే / నీవే నీవే ప్రేమామయుడవు నీవే / నీ వెలుగుతో నను నింపిననూ / చీకటినే కోరుకున్నాను (2) / నా కళ్ళు నీవు తెరిచిననూ / గ్రుడ్డివాడిలా నడుచుకున్నాను / నీ ఆత్మతో నను నింపిననూ / శరీరమునే తృప్తిపరిచాను (2) / ఆత్మచేత నడిపించబడక / శరీరాశలలో మునిగాను
ఏ గుంపులో నున్నావో / ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2) / జాగు చేయక వేగ మేలుకో (2) / మరణమనెడి మొదటి గుంపు / మారని గుంపు – నిర్జీవపు గుంపు (2) / దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2) / మెచ్చుఁకొనుట కిచ్చకంబు / లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు (2) / చచ్చియుండిన సమాధుల గుంపు (2) / కరుణ లేక కఠినమైన / కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు (2) / కరకు కల్గిన కఠోరపు గుంపు (2) / యేసు వాక్యమనగ నేమో / ఎరుగని గుంపు – విననియ్యని గుంపు (2) / ముద్ర వేసిన మూర్ఖుల గుంపు (2) / ధరణి నరుల తరిమి కొట్టు / దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు (2) / పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు (2) / పరమ తండ్రి కడకు జేర / పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు (2) / కావలి కాయు కఠినాత్ముల గుంపు (2) / సర్వ లోక మోసగాడు / ఆది సర్పము – అదే ఘట సర్పము (2) / సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు (2) / వధువు మంద మేయు మర్మ / మనగ గమనిక – గమనించి తెలుసుకో (2) / గదిలో చేరుకో పదిలపర్చుకో (2)
నేనంటే నీకు ఎంతిష్టమో / నా మంచి యేసయ్యా (2) / నా మీద నీకు ఎనలేని ప్రేమ (2) / ప్రతి క్షణము నీకే నా ఆరాధనా (2) / ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా / ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా (2) / నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో / మరి దేనిని ప్రేమించలేదు / నాకిచ్చిన స్థానం పరమందున / దూతలకు ఇవ్వలేదు (2) / ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి / మదిలో నిలచిన మంచి దేవుడా (2) / నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే / క్రయ ధనముగా ఇచ్చి / బంధింపబడిన నా బంధకాలు / సిలువ యాగముతో తెంచి (2) / మరణించవలసిన నాకై నిత్య జీవం / ప్రసాదించిన మంచి దేవుడా (2)
నీ కృప చాలును / నీ ప్రేమ చాలును / నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) / నీవు లేని జీవితం అంధకార బంధురం (2) / నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) / శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో / నన్ను కృంగదీయు సంకటములెన్నియో (2) / నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా (2) / నా జీవితాంతము నీలోనే నిలిచెదన్ / నా జీవితాంతము నీతోనే నడిచెదన్ / నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) / నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన / నా హృదయ ఆలాపన అందుకో దేవా (2) / నిను పోలి నేను ఈ లోకమందు / నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్ (2) / నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్ / నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా (2) / నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన / నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)
ఏ భాషకందని భావం నీవు / వెలకట్టలేని ముత్యం నీవు / దేవుడిచ్చిన వరమే నీవు – తీర్చలేని ఓ ఋణం / ఎదలో దాగిన పలుకే నీవు – నా ప్రేమకు తొలిరూపం / అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరాలేదే / నవ మాసాలు నీలో నన్ను దాచావు / నా ఊపిరికై నీ ప్రాణం పణంగా పెట్టావు / రేయి పగలంతా నాకై శ్రమపడినా / తీరని అనురాగం నీలో చూసానే / నీ సుఖ సంతోషం విడచిన నాకై / తరగని మమకారం నీలో దాచావే / యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే / అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరానే లేదే / భయ భక్తులే ఉగ్గి పాలగ పోసావు / దేవుని మాటలే గోరు ముద్దగ చేసావు / తప్పటడుగులే నాలో సరి చేసి / ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగ నిలిపావు / ప్రతి వేకువలో నాకై నీవు / చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే / నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే / అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరానే లేదే
మనసులొకటాయే భువిలో / ఇరువురొకటాయే హృదిలో (2) / మనసు పరవశమై మధుర లాహిరిలో (2) / మనసులోని భావాలు / ఉరకలు వేసే ఈ వేళా / ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట / దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా (2) / ఈ మధురమైన శుభవేళ (2) / ఒకరికొకరు తోడు నీడగా / సాగే ఈ తరుణం / అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై / జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా (2) / ఘన యేసుని దివ్య ఆశీస్సు (2) / జీవితాంతం నిండుగ మెండుగ / నీతో నిలిచే ఈ తరుణం