535 worship songs available. Lyrics in Roman and Telugu script.
హృదయపూర్వక ఆరాధన / మహిమ రాజుకే సమర్పణ (2) / నిత్యనివాసి సత్యస్వరూపి / నీకే దేవా మా స్తుతులు (2) ||హృదయ|| / నా మనసు కదిలించింది నీ ప్రేమ / నా మదిలో నివసించింది నీ కరుణ / ఎంతో ఉన్నతమైన దేవా (2) / క్షేమాధారము రక్షణ మార్గము / మాకు సహాయము నీవేగా (2) ||హృదయ|| / ఆత్మతో సత్యముతో ఆరాధన / నే బ్రతుకు కాలమంతా స్తుతి కీర్తన / నీకై పాడెదను యేసయ్యా (2) / కృపామయుడా కరుణ సంపన్నుడా / నిత్యము నిన్నే పూజింతును (2) ||హృదయ||
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి / ప్రతి సమయములోను… / ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2) / యెహోవా చేసిన మేలుల కొరకై / ఎల్లప్పుడును ఆనందించండి (2) / ఆరాధించండి ||ఎల్లప్పుడును|| / పాపంబు తోడ చింతించుచుండ / నరునిగా ఈ భువిలో ఉదయించెగా / మన పాప భారం తన భుజమున మోసి / మనకై తన ప్రాణం అర్పించెగా (2) / ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి / ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే ||ఎల్లప్పుడును|| / విశ్వాసమునకు కలిగే పరీక్ష / ఓర్పును కలిగించే ఒక సాధనమై / శోధనకు నిలిచి సహించిన వేళ / జీవ కిరీటమును పొందెదము (2) / నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి / సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి ||ఎల్లప్పుడును|| / ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి / మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి / మనతో నివాసమును కలిగి యుండుటకు / త్వరలోనే రారాజుగా రానైయుండె (2) / శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి / సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి ||ఎల్లప్పుడును||
నీ సన్నిధిలో ఈ ఆరాధనను / స్వీకరించుము నా ప్రభువా (2) / నా హృదయములో నీ ఆత్మ బలమును / నింపుము నాపై యేసయ్యా ||నీ సన్నిధిలో|| / ఆవిరివంటి వాడను నేను / మేఘ స్తంభమై నిలిచావు (2) / చల్లని నీ ప్రేమ గాలిని సోకించి (2) / వర్షముగా నను మార్చావు – మార్చావు ||నీ సన్నిధిలో|| / మోడులా మిగిలిన నాకై / సిలువ మ్రానిపై వ్రేళాడి (2) / నీ రక్తముతో నను ప్రోక్షించి (2) / నా మరణ శాపం తొలగించావు – తొలగించావు ||నీ సన్నిధిలో||
మంచిని పంచే దారొకటి / వంచన పెంచే దారొకటి / రెండు దారులలో నీ దారి / ఎంచుకో బాటసారి / సరి చూసుకో ఒక్కసారి (2) / మొదటి దారి బహు ఇరుకు – అయినా యేసయ్యుంటాడు / ప్రేమా శాంతి కరుణ – జనులకు బోధిస్తుంటాడు (2) / పాపికి రక్షణ తెస్తాడు / పరలోక రాజ్యం ఇస్తాడు (2) / అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా / విశాల మార్గం వద్దయ్యా ||మంచిని|| / మరియొక దారి విశాలం – కాని సాతానుంటాడు / కామం క్రోధం లోభం – నరులకు నేర్పిస్తాడు (2) / దేవుని ఎదిరిస్తుంటాడు / నరకాగ్నిలో పడదోస్తాడు (2) / అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా / విశాల మార్గం వద్దయ్యా ||మంచిని||
ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన / నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2) / నా ప్రాణమైన యేసు / నా ప్రాణముతో కలిసి / నా ప్రాణమా.. నే నిన్నే స్తుతియింతున్ – (2) ||నా ప్రాణమైన|| / లోకమంతా మాయెనయ్యా / నీ ప్రేమయే నాకు చాలునయ్యా (2) / (రాజా) నీ నామమునే స్తుతియింతున్ / నా యేసయ్యా.. నా జీవితమంతయు (2) ||నా ప్రాణమైన|| / ఆరాధన ఆరాధన / ఆరాధనా ఆరాధన / ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు… / ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు… / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా / ఆరాధన ఆరాధన / ఆరాధనా ఆరాధన ||నా ప్రాణమైన||
దేవా ఈ జీవితం నీకంకితం (2) / ఎన్ని కష్టాలైనా… ఎన్ని నష్టాలైనా… / నీతోనే నా జీవితం / వ్యాధి బాధలైనా… శోక సంద్రమైనా… / నీతోనే నా జీవితం (2) ||దేవా|| / నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి / నీ మార్గమునే నాకు చూపినావు (2) / నీతోనే నడచి – నీలోనే జీవించి / నీతోనే సాగెదను (2) ||ఎన్ని||
దేవా నీ నామం / బలమైనది నీ నామం (2) / స్తుతియింతును నీ నామం / ఘనపరతును నీ నామం (2) / అన్నిటి కన్న పై నామం / యేసయ్యా నీ నామం (2) / ఆశ్రయ దుర్గము నీ నామం / నా కొండా నా కోట (2) / స్తుతియింతును నీ నామం / ఘనపరతును నీ నామం (2) / అన్నిటి కన్న పై నామం / యేసయ్యా నీ నామం (4)
నీకే నా ఆరాధన / నీకే నా ఆలాపన (2) / నిన్ను కీర్తింతును నా హృదయముతో / నిన్ను సేవింతును నా మనసుతో (2) / ఆరాధన ఆరాధన / ఆరాధన నీకే (2) / క్రీస్తే నా నిరీక్షణ / క్రీస్తే నా రక్షణ (2) / నిన్ను స్తుతియింతును నా స్వరముతో / నిన్ను ప్రేమింతును నా హృదయముతో (2) ||ఆరాధన|| / యేసే నా విశ్వాసము / యేసే నా విమోచన (2) / నిన్ను పూజింతును నా హృదయముతో / నిన్ను ప్రణుతింతును నా పూర్ణాత్మతో (2) ||ఆరాధన||
నేనున్నా నీతో అంటూ / నా చెంతకు చేరావు / యేసయ్యా.. యేసయ్యా… / కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ / ఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళ / నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు / నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు (2) / మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా / బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా (2) / పని పూర్తి చేయగ బలము లేని వేళ (2) / నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు / నా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు (2) / శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా / చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా (2) / స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ (2) / నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు / నా నోటను నూతన గీతం యేసూ పలికించావు (2) / కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా / సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా (2) / అడుగేసి సాగగ అనువుకాని వేళ (2) / నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు / నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు (2) ||కనుచూపు||
అమూల్యమైన ఆణిముత్యమా / యెహోవ దేవుని హస్తకృతమా (2) / అపురూప సౌందర్య రాశివి నీవు / ఆత్మీయ సుగుణశీలివి నీవు (2) ||అమూల్యమైన|| / జ్ఞానము కలిగి నోరు తెరచుదువు / కృపగల ఉపదేశమును చేయుదువు (2) / ఇంటివారిని బాగుగ నడుపుచూ / వారి మన్ననలను పొందుచుందువు (2) ||అమూల్యమైన|| / చేతులతో బలముగా పనిచేయుదువు / బలమును ఘనతను ధరించుకొందువు (2) / రాత్రివేళ నీ దీపము ఆరదు / కాంతికిరణమై మాదిరి చూపుదువు (2) ||అమూల్యమైన|| / దీనులకు నీ చేతులు పంచును / దరిద్రులను నీవు ఆదుకొందువు (2) / దూరము నుండి ఆహారము కొనుచు / మంచి భోజనముతో తృప్తిపరచుదువు (2) ||అమూల్యమైన||
నడవాలని యేసు నడవాలని / నడవాలని నీతో నడవాలని / నాకున్న ఆశ నీపైనే ధ్యాస (2) / నిరంతరం నీతోనే నడవాలని (2) / హానోకు నీతో నడిచాడు దేవ / పరలోకపు నడకతో చేరాడు నిన్ను ||నడవా|| / నోవాహు నీతో నడిచాడు దేవ / రక్షణనే ఓడలో రక్షింప బడెను ||నడవా|| / అబ్రాహాము నీతో నడిచాడు దేవ / విశ్వాసపు యాత్రలో సాగాడు నీతో ||నడవా|| / నా జీవితమంతా నీతో నడవాలని / నా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా ||నడవా||
మధురం ఈ శుభ సమయం / అతి మధురం వివాహ బంధం (2) / ఆనందమే ఇరువురి హృదయం (2) / జత కలిసె ఈ తరుణంలో (2) / నవ దంపతులకు స్వాగతం ||మధురం|| / ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా మీకుండగా / అబ్రహాము శారా వాలే ఏ క్షణమైనా వీడక (2) / మీ జీవిత సంద్రాన – ఎన్ని కష్టాలు ఎదురైనా (2) / ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి ||మధురం|| / ప్రేమకు ప్రతి రూపమే మీ పరిణయము / మనసులో వెలియగ మమతలు విరబూయగా (2) / అనురాగ పూవులే మీ ఇంట పూయగా (2) / మీ దాంపత్యం అందరికి కలకాలం నిలవాలి ||మధురం||