535 worship songs available. Lyrics in Roman and Telugu script.
ప్రభువా ఈ ఆనందం / నాలో కలిగిన వైనం / వర్ణింపలేనిది ఈ అద్భుతం (2) / నీలో నేను ఉండగా / నాలో నీవు నిలువగా / నీకై నేను పాడగా ఆనందం (2) / ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్ / ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్ / ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ (2) ||ప్రభువా|| / ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం / అంతమే లేనిది ఆ ప్రేమ మకరందం (2) / వర్ణింపలేనిది సరిపోల్చలేనిది / నా ప్రభునిలో ఆనందం (2) ||ప్రెయసెస్|| / స్వాతంత్య్రం ఇచ్చునదే యేసులో ఆనందం / ఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం (2) / పరలోకపు మార్గములో నను నడువ చేయునది / ప్రభు యేసుని వాక్యాహారం (2) ||ప్రభువా||
రాజులకు రాజైన ఈ మన విభుని / పూజ చేయుటకు రండి / ఈ జయశాలి కన్నా / మనకింకా రాజెవ్వరును లేరని ||రాజులకు|| / కరుణ గల సోదరుండై ఈయన / ధరణికేతెంచెనయ్యా (2) / స్థిరముగా నమ్ముకొనిన / మనకొసగు పరలోక రాజ్యమును ||రాజులకు|| / నక్కలకు బొరియలుండే నాకాశ / పక్షులకు గూళ్లుండెను (2) / ఒక్కింత స్థలమైనను / మన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు|| / త్వరపడి రండి రండి ఈ పరమ / గురుని యొద్దకు మీరలు (2) / దరికి జేరిన వారిని / ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము ||రాజులకు||
ఆడెదన్ పాడెదన్.. యేసుని సన్నిధిలో / నను బలపరచిన దేవుని సన్నిధిలో / స్తుతింతును ఆరాధింతును.. యేసుని సన్నిధిలో / ఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో ||ఆడెదన్|| / నను దర్శించి నూతన జీవం… ఇచ్చిన సన్నిధిలో / నను బలపరచి ఆదరించిన.. యేసుని సన్నిధిలో (2) / ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో / స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్|| / పరిశుద్ధాత్మ జ్వాలలో రగిలించి నన్ను… మండించిన సన్నిధిలో / పరిశుద్ధాత్మలో నను అభిషేకించిన.. యేసుని సన్నిధిలో (2) / ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో / స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్||
నీవే నీవే / నా తోడున్న దేవుడవు (2) / నీ వెంటే వస్తానయ్యా (2) ||నీవే|| / కష్టాల కడలిలోనైనా / కన్నీటి బాధలోనైనా (2) / యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును (3) ||నీవే|| / ఏ ఘోర పాపము అయినా / మరణకర వ్యాధి అయినా (2) / యెహోవా రాఫా స్వస్థపరచును (3) ||నీవే||
నీతోనే నే నడవాలని / నీలోనే నే నిలవాలని / నీవలె నే మారాలని / నీ సాక్షిగా నే బ్రతకాలని (2) / (నా) మదిలోని కోరిక నా యేసయ్యా / నే నీతోనే ఉండాలని (2) / నీతో నీతో నీతో నీతో / నీతో నీతో నీతో (2) ||నీతోనే|| / దవళవర్ణుడా రత్న వర్ణుడా / పదివేల మందిలో అతి సుందరుడా (2) / సువర్ణ వీధులలో నీతోనే నడవాలని / నా మనసు కోరెను నజరేయుడా (2) ||నీతో|| / కీర్తనీయుడా పూజ్యనీయుడా / స్తుతుల మధ్యలో స్తోత్రార్హుడా (2) / ఆ దివ్య నగరిలో నీతోనే నిలవాలని / నా హృది కోరెను నా యేసయ్యా (2) ||నీతో||
ఎల్లవేళలందు – కష్టకాలమందు / వల్లభుండా యేసున్ స్తుతింతున్ / ఎల్లను నీవే నా కెల్లెడల / వల్లపడదే వివరింపన్ (2) / విమోచకుడా – విమోచన నీవే / రక్షకుడవు – నా రక్షణ నీవే (2) ||ఎల్లవేళలందు|| / సృష్టికర్తవు – సహాయము నీవే / ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2) ||ఎల్లవేళలందు|| / జ్ఞానము నీవే – నా పానము నీవే / దానము నీవే – నా గానము నీవే (2) ||ఎల్లవేళలందు|| / జ్యోతివి నీవే – నా నీతివి నీవే / ఆదియు నీవే – నా అంతము నీవే (2) ||ఎల్లవేళలందు|| / నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే / స్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2) ||ఎల్లవేళలందు|| / జీవము నీవే – నా దేవుడవు నీవే / పావన నీవే – నా కావలి నీవే (2) ||ఎల్లవేళలందు|| / కాంతియు నీవే – నా శాంతియు నీవే / సంతస నీవే – నాకంతయు నీవే (2) ||ఎల్లవేళలందు||
ఆకాశ మహా-కాశంబులు / పట్టని ఆశ్చర్యకరుడా (2) / కృప జూపి నిబంధనను / నెరవేర్చిన ఉపకారి (2) / కాపాడితివి నడిపితివి (2) / నీ యింటికి మమ్ములను (2) ||ఆకాశ|| / నీ దాసునికి నీ ప్రజలకు / నీ క్షమను కనుపరచు (2) / నీదు కల్వరి రక్తమున (2) / నీవే కడుగు కరుణామయా (2) ||ఆకాశ|| / నీతి న్యాయముల కర్త / ప్రీతి తోడ నీ ప్రజలకు (2) / నీతి న్యాయముల నిమ్ము (2) / స్తుతియింప నిరతంబు (2) ||ఆకాశ|| / రాజులనుగా యాజకులనుగా / మమ్ము చేసిన మహారాజ (2) / విజయమిమ్ము మా విజయుండా (2) / నిజమైన నీ ప్రజలకు (2) ||ఆకాశ|| / బలపరచు నీ భక్తులను / బలము తోడ ప్రవేశించి (2) / విలువైన నీ రక్షణను (2) / ధరింప చేయుము హల్లెలూయా (2) ||ఆకాశ||
సిలువను గెలిచిన సజీవుని త్యాగము / విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2) / ముందే తెలియును – తన బలియాగము / తెలిసే చేసెను స్వ బలిదానము / తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము / తననే వంచెను తనువే అర్పించెను / దేవా నీ త్యాగము మము రక్షించెను / పాపము నుండి విడిపించెను / దేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెను / ఇల సజీవులుగా మేము నిలిపెను ||సిలువను||
చిరుగాలి వీచినా ప్రభూ / అది నిన్నె చాటదా / పెనుగాలి రేగినా ప్రభూ / అది నిన్నె చూపదా / పడే చినుకు జల్లు కూడా / నిన్నే చూపునే (2) ||చిరు|| / దూరానున్న నింగిలో / మేఘాలెన్ని కమ్మెనో (2) / పదాలల్లి నా హృదిలో / అవి వివరించే నీ ప్రేమనే (2) ||చిరు|| / దేవా నీదు ధ్యానమే / జీవాధార మాయెగా (2) / పదే పాడి నీ కృపలన్ / నే వివరింతున్ నా యేసువా (2) ||చిరు||
నీవు చేసిన మేళ్లకు / నీవు చూపిన కృపలకు (2) / వందనం యేసయ్యా (4) / ఏపాటివాడనని నేను / నన్నెంతగానో ప్రేమించావు / అంచెలంచెలుగా హెచ్చించి / నన్నెంతగానో దీవించావు (2) ||వందనం|| / బలహీనుడనైన నన్ను / నీవెంతగానో బలపరచావు / క్రీస్తేసు మహిమైశ్వర్యములో / ప్రతి అవసరమును తీర్చావు (2) ||వందనం||
నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా / ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా / నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా / నా యేసు రాజా రాజా – రాజా – రాజా… / రాజా రాజా యేసు రాజా / రాజా రాజా యేసు రాజా / రాజా యేసు రాజా (2) / నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము / నన్ను బంధించెనా (2) / నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా (2) ||నా యేసు|| / వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన / కనికర స్వరూపుడా (2) / నా కన్నీటిని నాట్యముగా మార్చితివా (2) ||నా యేసు|| / అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే / నా నీటి ఊట నీవే (2) / అతి కాంక్షనీయుడా ఆనుకొనెద నీ మీద (2) ||నా యేసు||
నీ నామమే ఎద కొలిచెదను / నీ వాక్యమునే సదా తలచెదను (2) / సైన్యములకధిపతియగు దేవా / ఆది దేవుడవయిన యెహోవా (2) ||నీ నామమే|| / దోష రహితుడ – సృష్టి కారుడ / నేరమెంచని నిర్ణయకుడా / సిలువ దరుడ – మరణ విజయుడ / లోక రక్షక యేసు నాథుడా (2) ||సైన్యము|| / నిన్ను మరచిన – మిగులు శూన్యము / నీతో అణకువ పెంచు జ్ఞానము / నాదు లోకము – బహు కలవరము / నీదు వాక్యము తెలుపు మార్గము (2) ||సైన్యము|| / క్షణము వీడని – నీడ నీవని / నమ్మి నిరతము నిన్ను వేడెద / నీదు పాత్రగ – యాత్ర సాగెద / నీదు ఘనతను ఎలిగి చాటెద (2) ||సైన్యము||