రక్షణ | Salvation Telugu Songs

255 salvation songs available. Lyrics in Roman and Telugu script.

ప్రేమ లేనివాడు పరలోకానికి|Prema Lenivaadu Paralokaaniki

ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు / ప్రేమించలేని నాడు – తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు (2) / ప్రేమ నేర్పించాలని నిన్ను – ఈ లోకానికి పంపించెను ఆ దేవుడు / ప్రేమ చూపించాలని నీకు – తన ప్రాణాన్ని అర్పించెను ప్రియ కుమారుడు / ప్రేమే జీవన వేదం – ప్రేమే సృష్టికి మూలం / ప్రేమే జగతికి దీపం – ప్రేమలోనే నిత్య జీవితం / ప్రేమే అంతిమ తీరం – ప్రేమే వాక్యపు సారం / ప్రేమే సత్య స్వరూపం – ప్రేమ ఒకటే నిలుచు శాశ్వతం ||ప్రేమ లేనివాడు|| / మంచి వాని కొరకు సహితము – ఒకడు మరణించుట అరుదు / పాపులకై ప్రాణమిచ్చిన – ప్రేమకు కట్టలేము ఖరీదు / ద్రోహియైన యూదానే ఆయన – కడవరకు విడువలేదు / అప్పగించువాడని తెలిసి – బయటకు నెట్టివేయలేదు / దొంగ అని తెలిసే ఉద్యోగం ఇచ్చాడురా / ధనము సంచి యూదా దగ్గరనే ఉంచాడురా / వెండి కొరకు తనను అమ్ముకోకూడదనేరా / చివరి వరకు వాడిని మార్చాలని చూసాడురా / ఇంత గొప్ప క్రీస్తు ప్రేమ కలిగియున్నవాడే / నిజ క్రైస్తవుడౌతాడురా / ప్రేమే దేవుని రూపం – ప్రేమే క్రీస్తు స్వరూపం / ప్రేమే కడిగెను పాపం – ప్రేమ జీవ నదీ ప్రవాహం ||ప్రేమ లేనివాడు|| / కాలు ఎదిగిపోతుందని – ఓర్వలేక కన్ను బాధపడదు / కంటిలోని నలుసు పడితే – సంబరంతో కాలు నాట్యమాడదు / చేయి లేచి చెవిని నరుకదు – పేగు గుండెను ఉరి తీయదు / వేలు తెగితే నోరు నవ్వదు – అసూయ అవయవాలకుండదు / సంఘమంటే యేసు క్రీస్తు శరీరమే సోదరా / మీరంతా అవయవాలు అతికి ఉండాలిరా / ఏ భాగం పాటుపడిన శిరస్సుకే మహిమరా / ఈ భావం బాధపడితే అభ్యంతర పరచకురా / ఇంత గొప్ప దైవ ప్రేమ కనుపరచిననాడే / క్రీస్తు నీలో ఉంటాడురా / ప్రేమే ఆత్మకు ఫలము – ప్రేమే తరగని ధనము / ప్రేమే పరముకు మార్గము – ప్రేమ వరము నిత్యజీవము ||ప్రేమ లేనివాడు|| / ఎంత గొప్పవాడైనా ప్రేమ లేకపోతే – లేదు ఏ ప్రయోజనం / ఎంత సేవ చేస్తున్నా ప్రేమ చూపకుంటే – గణ గణలాడే తాళం / వర్గాలుగా విడిపోయి విభజన చేస్తామంటే – ఒప్పుకోదు వాక్యం / పౌలెవరు పేతురెవరు పరిచారకులే కదా – క్రీస్తు యేసు ముఖ్యం / మారాలని మార్చాలని కోరేది ప్రేమరా / నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించరా / ప్రేమించే వారినే ప్రేమిస్తే ఏం గొప్పరా / శత్రువులను సైతం ప్రేమించమన్నాడురా / ప్రేమ పొడవు లోతు ఎత్తు గ్రహియించినవాడే / పరలోకం వెళతాడురా / స్వార్ధ్యం లేనిది ప్రేమ – అన్నీ ఓర్చును ప్రేమ / డంభం లేనిది ప్రేమ – అపకారములే మరచును ప్రేమ / ఉప్పొంగని గుణమే ప్రేమ – కోపం నిలుపదు ప్రేమ / అన్నీ తాలును ప్రేమ – మత్సరమే పడనిది ప్రేమ / దయనే చూపును ప్రేమ – దరికే చేర్చును ప్రేమ / సహనం చూపును ప్రేమ – నిరీక్షణతో నిలుచును ప్రేమ / క్షమనే కోరును ప్రేమ – ద్వేషం చూపదు ప్రేమ / ప్రాణం నిచ్చిన ప్రేమ – దోషములే కప్పును ప్రేమ

అన్నీ సాధ్యమే యేసుకు|Anni Saadhyame

అన్నీ సాధ్యమే / యేసుకు అన్నీ సాధ్యమే (2) / అద్భుత శక్తిని నెరపుటకైనా / ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2) / ఆ యేసు రక్తానికి / సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ సాధ్యమే|| / మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను / మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2) / మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను / మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2) ||అన్నీ సాధ్యమే|| / బండనే చీల్చగా – జలములే పొంగెను / ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2) / బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని / మెండైన తన కృపలో – నీకండగా నిలచును (2) ||అన్నీ సాధ్యమే|| / ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము / ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2) / యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును / ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2) ||అన్నీ సాధ్యమే|| / కష్టాల కడలిలో – కన్నీటి లోయలో / కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2) / కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము / క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2) ||అన్నీ సాధ్యమే||

వీనులకు విందులు చేసే|Veenulaku Vindulu Chese

వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర / వేగిరమే వినుటకు రారండి / ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు|| / రండి… విన రారండి / యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2) / నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి / మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2) / రండి… ||వీనులకు|| / రండి… వచ్చి చూడండి / యేసయ్య చేసే కార్యములు చూడండి (2) / నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి / శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2) / రండి… ||వీనులకు|| / సృష్టి కర్తను మరచావు నీవు / సృష్టిని నీవు పూజింప దగునా (2) / భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి / నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2) / రండి… ||వీనులకు||

మధురం మధురం|Madhuram Madhuram

మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం / శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2) / దీన మనస్సు – దయ గల మాటలు / సుందర వదనం – తేజోమయుని రాజసం (2) ||మధురం|| / ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని / బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2) / నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు / యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| / పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు / ప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2) / ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు / యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| / కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను / ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా (2) / జడియకు నీవు మహిమలో నిలుపుటకు / యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||

ఎంత జాలి యేసువా|Entha Jaali Yesuvaa

ఎంత జాలి యేసువా / యింతయని యూహించలేను ||ఎంత|| / హానికరుడ హింసకుడను / దేవదూషకుడను నేను (2) / అవిశ్వాసినైన నన్ను (2) / ఆదరించినావుగా ||ఎంత|| / రక్షకుండ నాకు బదులు / శిక్ష ననుభవించినావు (2) / సిలువయందు సొమ్మసిల్లి (2) / చావొందితివి నాకై ||ఎంత|| / ఏమి నీ కర్పించగలను / ఏమి లేమి వాడనయ్యా (2) / రక్షణంపు పాత్రనెత్తి (2) / స్తొత్రమంచు పాడెద ||ఎంత|| / నీదు నామమునకు యిలలో / భయపడెడు వారి కొరకై (2) / నాథుడా నీ విచ్చు మేలు (2) / ఎంత గొప్పదేసువా ||ఎంత|| / నేను బ్రతుకు దినములన్ని / క్షేమమెల్ల వేళలందు (2) / నిశ్చయముగ నీవు నాకు (2) / ఇచ్చువాడా ప్రభువా ||ఎంత|| / నాదు ప్రాణమునకు ప్రభువా / సేద దీర్చు వాడ వీవు (2) / నాదు కాపరివి నీవు (2) / నాకు లేమి లేదుగా ||ఎంత|| / అందరిలో అతి శ్రేష్ఠుండా / అద్వితీయుడగు యేసయ్యా (2) / హల్లెలూయ స్తోత్రములను (2) / హర్షముతో పాడెద ||ఎంత||

పేద నరుని రూపము|Pedha Naruni Roopamu

పేద నరుని రూపము ధరించి / యేసు రాజు నీ చెంత నిలచె / అంగీకరించు-మాయనను (2) ||పేద నరుని|| / కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్ / ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2) / నింద వేదన శ్రమలను సహించెనేసు / చిందే తనదు రక్తము నీ పాపముకై / దీనుడై నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని|| / తల వాల్చుటకు ఇల స్థలమే లేదు / దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2) / తన్ను ఆదరించు వారెవరు లేరు / ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే / పాట్లుపడే నిన్ను విడిపింపను (2) ||పేద నరుని|| / ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్ / పాప డాగులన్ రక్తముతో కడిగెన్ (2) / నీ వ్యాధిని వేదన తొలగించ / నీ శాపము నుండి విడిపింప / సిలువలో విజయము పొందే (2) ||పేద నరుని|| / మాయ లోకమును నీవు నమ్మకుము / మనుష్యుల మనస్సు మారిపోవునిల (2) / నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు / నిశ్చయముగా ప్రభువులో ఆనందింప / నేడే రమ్ము విశ్వాసముతో (2) ||పేద నరుని|| / తామసించెదవేల ఓ ప్రియుడా / ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము (2) / ఈ లోకము నీకివ్వని శాంతిని / ఈ దినమే ప్రభువు నీకొసగ / ప్రేమతో నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని||

యేసయ్య నామంలో|Yesayya Naamamlo

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా / శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా / నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2) ||యేసయ్య|| / పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం / పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| / రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం / మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| / దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం / దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| / సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం / మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| / పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం / పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||

నేనున్నా నేనున్నా|Nenunnaa Nenunnaa

పాపానికి నాకు ఏ సంబంధము లేదు / పాపానికి నాపై ఏ అధికారము లేదు / పాపానికి నాకు ఏ సంబంధము లేదు / పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు / నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా / మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట ఇచ్చాడుగా / నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింద / నే లేను నే లేను ధర్మ శాస్త్రం క్రింద (2) ||పాపానికి|| / కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు / కృప ఉందని నీతిని విడువొచ్చా – అట్లనరాదు / కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు / కృప ఉందని నీతిని విడువొచ్చా – నో / కృప అంటే లైసెన్స్ కాదు / కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు / కృప అంటే దేవుని శక్తి / కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు / గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్ / ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4) ||నేనున్నా|| / కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా / కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం – నే పొందితినయ్యా / కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా / కృప వలెనే క్రీస్తులో స్వాతంత్య్రం / క్రియల మూలముగా కాదు / కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది / కృప నను మార్చేసినది / నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది / గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి / అండ్ టాట్ టు మి లివ్ రైటియస్లీ (4) ||నేనున్నా|| / పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా / కృప వలెనె ఇది నాకు సాధ్యం – అయ్యిందిరా భయ్యా / పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా / కృప వలెనె ఇది నాకు సాధ్యం / కృపను రుచి చూచిన నేను / దేవునికే లోబడుతాను – పాపానికి చోటివ్వను / పరిశుద్ధత పొందిన నేను / నీతి సాధనములుగానే – దేహం ప్రభుకర్పింతును / యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్ / యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2) / యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్ / యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2) ||నేనున్నా|| / ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు / ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – అట్లనరాదు / ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు / ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – నో / ధర్మశాస్త్రం కొంత కాలమేగా / ధర్మశాస్త్రం బాలశిక్షయేగా – ప్రభు నొద్దకు నడిపేందుకు / క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా / ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా – మనలను విడిపించేందుకు / లా హాస్ లెడ్ ది పీపుల్ టు క్రైస్ట్ / నౌ గ్రేస్ విల్ మేక్ హిస్ కాన్క్వరర్స్ (4) ||నేనున్నా||