రక్షణ | Salvation Telugu Songs

255 salvation songs available. Lyrics in Roman and Telugu script.

శిరము మీద ముళ్ల సాక్షిగా|Shiramu Meeda Mulla Saakshigaa

శిరము మీద ముళ్ల సాక్షిగా / కార్చిన కన్నీళ్ల సాక్షిగా / పొందిన గాయాల సాక్షిగా / చిందిన రుధిరంబు సాక్షిగా (2) / యేసు నిన్ను పిలచుచున్నాడు / నీ కొరకే నిలచియున్నాడు (3) / సర్వ పాప పరిహారం కోసం / రక్త ప్రోక్షణం అవశ్యమని (2) / మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని / పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని / ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం / యేసులోనే నెరవేరెనుగా / సర్వ పాప పరిహారో / రక్త ప్రోక్షణం అవశ్యం / తద్ రక్తం పరమాత్మేనా / పుణ్య దాన బలియాగం / ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం / క్రీస్తులోనే నెరవేరెనుగా / యేసే బలియైన పరమాత్మ ||శిరము|| / మహా దేవుడే ఇలకేతెంచి / యజ్ఞ పశువుగా వధ పొందాలని (2) / కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని / శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని / బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం / క్రీస్తులోనే నెరవేరెనుగా / చత్వారః శ్రీద్న త్రయో అస్య పాదాద్రి / శీర్ష్యే సప్త హస్తాసో అస్య త్రిదావద్ధో / వృషభో రోర వీతి మహో దేవో / మద్యామ్ ఆవివేశత్తిథి / బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి / యేసులోనే నెరవేరెనుగా / యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా ||శిరము||

ఆరంభమయ్యింది రెస్టోరేషన్|Aarambhamayyindi Restoration

ఆరంభమయ్యింది రెస్టోరేషన్ / నా జీవితంలోన న్యూ సెన్సేషన్ (2) / నేను పోగొట్టుకున్నవన్ని నా మేలు కోసం / నా ప్రభువు సమకూర్చి దీవించులే / మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు / ఇకముందు నా చేత చేయించులే / మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్ / కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్ / రెండంతలు నాలుగంతలు అయిదంతలు ఏడంతలు / నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి / మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్ / కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్ ||ఆరంభమయ్యింది|| / మేం శ్రమనొందిన దినముల కొలది / ప్రభు సంతోషాన్ని మాకిచ్ఛును / మా కంట కారిన ప్రతి బాష్ప బిందువు / తన బుడ్డిలోన దాచుంచెను / సాయంకాలమున ఏడ్పు వచ్చినను – ఉదయము కలుగును / తోట నవ్వు పుట్టును – మాకు వెలుగు కలుగును / దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు – మామ్మాదరించును / కీడు తొలగజేయును – మేలు కలుగజేయును ||రెండంతలు|| / మా పంట పొలముపై దందా యాత్ర చేసిన / ఆ ముడతలను ప్రభువాపును / చీడ పురుగులెన్నియో తిని పారువేసిన / మా పంట మరలా మాకిచ్చును / నా జనులు ఇక సిగ్గునొందరంటు – మా ప్రభువు చెప్పెను / అది తప్పక జరుగును – కడవరి వర్షమొచ్చును / క్రొత్త ద్రాక్షా రసము ఆహా మంచి ధాన్యములతో – మా కోట్లు నింపును / క్రొత్త తైలమిచ్ఛ్చును – మా కొరత తీర్చును ||రెండంతలు|| / పక్షి రాజు వలెను మా యవ్వనమును / ప్రభు నిత్య నూతనం చేయును / మేం కోల్పోయిన యవ్వన దినములను / మరలా రెట్టింపుగా మాకిచ్చును / అరె..వంద ఏళ్ళు అయినా మా బలము విరుగకుండా – సారమిచ్చును / జీవ ఊటనిచ్చును జీవజలమునిచ్చును / సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు – శక్తినిచ్చును / ఆత్మ వాక్కునిచ్చును – మంచి పుష్టినిచ్చును ||రెండంతలు|| / మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్లిన / మా సొత్తు మాకు విడిపించును / మోసకారి మోసము మేము తిప్పి కొట్టను / ఆత్మ జ్ఞానముతో మేము నింపును / అరె అంధకారమందు రహస్య స్థలములోని – మరుగైన ధనముతో / మమ్ము గొప్ప చేయును – దొంగ దిమ్మ తిరుగును / దొంగిలించలేని పరలోక ధనముతోటి – తృప్తిపరచును / మహిమ కుమ్మరించును – మెప్పు ఘనతనిచ్చును ||రెండంతలు|| / మా జీవితాలలో దైవ చిత్తమంతయు / మేము చేయునట్లు కృపనిచ్చును / సర్వ లోకమంతటా సిలువ వార్త చాటను / గొప్ప ద్వారములు ప్రభు తెరచును / అరె అపవాది క్రియలు మేం లయముచేయునట్లు – అభిషేకమిచ్చును / ఆత్మ రోషమిచ్చును – క్రొత్త ఊపునిచ్చును / మహిమ కలిగినట్టి పరిచర్యచేయునట్లు – దైవోక్తులిచ్చును / సత్య బోధనిచ్చును – రాజ్య మర్మమిచ్చును ||రెండంతలు||

కలవంటిది నీ జీవితము|Kalavantidi Nee Jeevithamu

కలవంటిది నీ జీవితము / కడు స్వల్ప కాలము / యువకా అది ఎంతో స్వల్పము (2) / విలువైనది నీ జీవితం / వ్యర్ధము చేయకుము / యువకా వ్యర్ధము చేయకుము / బహు విలువైనది నీ జీవితం / వ్యర్ధము చేయకుము / యువతీ వ్యర్ధము చేయకుము ||కలవంటిది|| / నిన్ను ఆకర్షించే ఈ లోకము / కాటు వేసే విష సర్పము / యువకా అది కాలు జారే స్థలము (2) / ఉన్నావు పాపపు పడగ నీడలో / నీ అంతము ఘోర నరకము / యువకా అదియే నిత్య మరణము (2) ||కలవంటిది|| / నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం / నూతన సృష్టిగా మార్చును / పాపం క్షమియించి రక్షించును (2) / ఆ మోక్షమందు నీవుందువు / యుగయుగములు జీవింతువు / నీవు నిత్యము ఆనందింతువు (2) ||కలవంటిది||

పైలం కొడుకా|Pailam Kodukaa

పైలం కొడుకా పాపం చేయకురా / యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా / పైలం కొడుకా పైలం కొడుకా / పైలం కొడుకా పైలం కొడుకా / పైలం కొడుకా పాపం చేయకురా / యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా / నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా / ఉడుకు రక్తము ఉరుకలు పెడ్తది / పాపం చెయ్యమని ఒత్తిడి చేస్తది / పాపమన్నది పాములాంటిది / పగ పడ్తది ప్రాణం తీస్తది ||పైలం|| / మనిషి జీవితం విలువయ్యింది / మరువకు కొడుకా మరణమున్నదని / బ్రతికింది ఇది బ్రతుకు కాదురా / సచ్చినంక అసలాట ఉంటది ||పైలం|| / కత్తి కన్న పదునెక్కువ కొడుకా / మనిషి కోపము మంచిది కాదు / కాలు జారితే తీసుకోవచ్చురా / నోరు జారితే తీసుకోలేము ||పైలం|| / క్రైస్తవ జీవితం విలువయ్యింది / నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా / నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా / నిందలన్ని మొయ్యాలిరా కొడుకా ||పైలం|| / విచ్చలవిడిగా తిరుగుతున్నావు / ఎవరు చూడరని ఎగురుతున్నావు / చూసే దేవుడేసయ్య ఉన్నడు / తోలు తీస్తడు జాగ్రత్త కొడుకా ||పైలం|| / గుట్కలు తినకురా గుటుక్కున చస్తావు / పొగాకు తినకురా పోతవు నరకం / సినిమా చూడకు చింతలు తప్పవు / ఫోజులు కొట్టకు పోతవు నరకం ||పైలం|| / కుమ్మరి పురుగు గుణం చూడరా / బురదల ఉంటది బురదే అంటదు / తామెర పువ్వు బురుదల ఉంటది / వరదొస్తే తల వంచుకుంటది ||పైలం|| / ఎన్నో ఆశలు పెట్టుకున్నరా / సేవ చేస్తే నిను చూడాలని / నా కలలను కల్ల చెయ్యకు కొడుకా / కాళ్ళు మొక్కుతా మయ్యగానిరా ||పైలం|| / పొందుకున్నవు రక్షణ నీవు / పోగొట్టుకోకు పోతవు నరకం / నరకమంటే ఆషామాషీ కాదురో / అగ్ని ఆరదు పురుగు చావదు ||పైలం|| / ప్రపంచమంతటా పాపమున్నది / మందులేని మాయ రోగమున్నది / నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు ఓ కొడకా / నీవు మంచిగా బ్రతికేసయ్యను మహిమపరచు నా కొడకా / నీవు సి ఎం అయితే సంతోషముండదు పి ఎం అయితే సంతోషముండదు / యాక్టర్ అయితే సంతోషముండదు డాక్టర్ అయితే సంతోషముండదు / నీవు సేవ చేస్తే నేను చూడాలి కొడుకా / నువ్వు శ్రమలు అనుభవించాలిరా నా కొడుకా ||పైలం||

క్రైస్తవుడా సైనికుడా|Kraisthavudaa Sainikudaa

క్రైస్తవుడా సైనికుడా / బలవంతుడా పరిశుద్ధుడా / కదలిరావోయ్ నీవు కదలిరా (4) / జాలరీ మనుషులు పట్టు జాలరి / ఆత్మలు పట్టు కాపరి / అమృతమందించే ఆచారి / యేసుకై జీవించే పూజారి ||క్రైస్తవుడా|| / సిలువే నీ స్థావరము / శ్రమలే నీ సైన్యము (2) / సహనమే నీ ధైర్యము / వాక్యమే నీ విజయము (2) ||క్రైస్తవుడా|| / సత్యమే నీ గమ్యము / సమర్పణే నీ శీలము (2) / యేసే నీ కార్యక్రమం / ప్రేమే నీ పరాక్రమం (2) ||క్రైస్తవుడా|| / దేశంలో విదేశంలో / గ్రామంలో కుగ్రామంలో (2) / అడవులలో కొండలలో / పని ఎంతో ఫలమెంతో (2) ||క్రైస్తవుడా|| / సిద్ధాంతపు గట్టు దుమికి రా / వాగులనే మెట్టును దిగిరా (2) / దీనుడా ధన్యుడా / విజేయుడా అజేయుడా (2) ||క్రైస్తవుడా|| / వాగ్ధాన భూమి స్వతంత్రించుకో / అద్వానపు అడవి దాటి ముందుకుపో (2) / నీ ఇల్లు పెనూయేలు / నీ పేరే ఇశ్రాయేలు (2) ||క్రైస్తవుడా||

నా ప్రియుడు యేసు|Naa Priyudu Yesu

నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు / వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల (2) ||నా ప్రియుడు|| / మెల్లని చల్లని స్వరమే వినబడెను (2) / తండ్రీ వీరేమి చేయుచున్నారో (2) / ఎరుగరు గనుక క్షమించుమనెన్ / ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే ||నా ప్రియుడు|| / అతని ప్రేమ మధురం మధురం / ఎన్నటికీ నే మరువలేను (2) / ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం / శాపమంతా బాపి నను దీవించెనుగా ||నా ప్రియుడు|| / వీపంతా దున్నబడె నాగలితో / కారె రక్త వరదల్ కనుమా (2) / యేసు రక్తంలో రక్షణ – యేసు రక్తంలో స్వస్థత / నాకై మరణించి తిరిగి లేచె సజీవునిగా ||నా ప్రియుడు|| / తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి / నాకై విన్నతి చేయుచున్నాడు (2) / రానైయున్నాడు వేగ – మేఘముపై విభుడే / నన్ను పరమ గృహమునకు తోడ్కొని వెళ్ళును ||నా ప్రియుడు||